Summer Care
-
తలలో మల్లెపూలు పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసా? వీటిలోని ‘ఆర్సిటిన్’ అనే రసాయనం
వేసవి అంటే సూర్యుడు చండ్రనిప్పులు కురిపించే మండుటెండలు. వేసవి అంటే మనుషులను ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోతలు. వేసవి అంటే మామిడి రుచులు, తాటిముంజెల చవులు. వేసవి అంటే నసాళానికెక్కే ఘాటైన ఆవకాయల కారాలు. వేసవి అంటే ఇవే కాదు, మల్లెల పరిమళాలు కూడా! మల్లెలు వేసవిలోనే విరగబూస్తాయి. వీథి వీథినా బుట్టలు బుట్టలుగా అమ్మకానికొస్తాయి. బజారుల్లో గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి. పరిసరాలను పరిమళభరితం చేస్తాయి. ఎండ చల్లబడిన సాయంవేళ చక్కగా స్నానం చేసి, కొప్పున మూరెడు మల్లెలు ముడుచుకుంటేనే తెలుగు పడతులకు అదో తృప్తి! ఇదివరకటి కాలంలో ఆడా మగా తేడా లేకుండా అందరూ తలలో మల్లెలను అలకరించుకునే వారు. శరవేగంగా పరుగులు తీసే కాలం తెచ్చిన పెనుమార్పులతో పురుషుల అలంకరణ నుంచి మల్లెలు తప్పుకున్నాయి. అలాగని, పురుషులకు మల్లెలంటే మొహంమొత్తినట్లు కాదు. మల్లెల పరిమళాన్ని ఇష్టపడటం వల్లనే ఉద్యోగాలు చేసే పురుషులు చాలామంది విధులు ముగించుకుని ఇళ్లకు మళ్లేటప్పుడు తోవలో భార్యల కోసం మల్లెలు కొనుక్కుని మరీ పోతారు. చిరకాలంగా మల్లెలు మన సంస్కృతిలో భాగం. మల్లెలను మాలలుగా అల్లడం ఒక ప్రత్యేకమైన కళ. మల్లెల పరిమళమే లేకపోతే వేసవులు మరింత దుర్భరంగా ఉండేవి. మండుటెండా కాలంలో మల్లెల పరిమళమే మనుషులకు ఊరట! మగువల అలంకరణల్లోనే కాదు, పూజ పురస్కారాల్లోనూ మల్లెలకు విశేషమైన స్థానం ఉంది. మన సాహిత్యంలో మల్లెల ప్రస్తావన కనిపిస్తుంది. మన సాహిత్యంలో మల్లెలను ఆరాధించని కవులు దాదాపుగా లేరు. శంకరంబాడి సుందరాచారి ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అంటూ తెలుగుతల్లికి మల్లెపూల దండతోనే పదాలంకరణ చేశారు. మల్లెలను సంస్కృతంలో ‘మల్ల’, ‘మల్లి’, ‘మల్లిక’ అంటారు. వేసవి మొదలయ్యే వసంత రుతువులో మల్లెలు పూయడం ప్రారంభిస్తాయి. అందువల్ల వీటిని ‘వార్షికి’ అంటారు. శీతాకాలంలో చలి పెరిగే సమయంలో మల్లెలు కనుమరుగైపోతాయి. అందువల్ల మల్లెలను ‘శీతభీరువు’ అని కూడా అంటారు. మల్లెల్లో వాటి రేకులు, పరిమాణాన్ని బట్టి ఎన్నో రకాలు ఉన్నాయి. బొండు మల్లెలు, కాడ మల్లెలు, అడవి మల్లెలు, విడి మల్లెలు, దొంతర మల్లెలు, బొడ్డు మల్లెలు వంటివి మన దేశంలో విరివిగా కనిపిస్తాయి. మన దేశంలో కనిపించే అన్ని రకాల మల్లెలు తెల్లగానే ఉంటాయి. వీటి పరిమళంలో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. ఇతర దేశాల్లో కొన్ని చోట్ల అరుదుగా పసుపు రంగులోను, గులాబి రంగులోను పూచే మల్లెలు కూడా కనిపిస్తాయి. మల్లెల ఉత్పాదనలో భారత్, ఈజిప్టు దేశాలే అగ్రస్థానంలో ఉంటాయి. మల్లెలు సహజంగా పూచే పరిస్థితులు లేని చలి దేశాలు ఈ దేశాల నుంచి భారీ ఎత్తున మల్లెలను దిగుమతి చేసుకుంటాయి. కేవలం మల్లెలనే ఉపాధి చేసుకుని బతికేవారు మన దేశంలో కోకొల్లలుగా కనిపిస్తారు. మల్లెలు పరిమళించే దేశాలు ప్రపంచంలోని ఉష్ణమండల దేశాల్లోని వాతావరణం మల్లెలకు అనుకూలంగా ఉంటుంది. భారత్‌తో పాటు దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లోను; ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల్లో రకరకాల మల్లెలు ఏటా వేసవిలో విరివిగా కనిపిస్తాయి. అలాగే కొన్ని యూరోపియన్ దేశాల్లో కూడా మల్లెల సాగు జరుగుతోంది. మల్లెల్లో దాదాపు మూడువందల రకాలు ఉన్నాయి. వీటిలో 75 రకాలు భారత్‌లో పూస్తాయి. మల్లె మొక్కలను చాలామంది పెరటితోటల్లోను, కుండీల్లోను పెంచుకుంటారు. భూవసతి కలిగిన ఉద్యాన రైతులు వాణిజ్యపరంగా కూడా మల్లెలను సాగు చేస్తారు. మన దేశంలో వాణిజ్యపరంగా మల్లెల సాగు చేయడంలో తమిళనాడు అగ్రస్థానంలో నిలుస్తుంది. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోను మల్లెల సాగు గణనీయంగానే జరుగుతోంది. ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్‌లో వాణిజ్యపరంగా మల్లెల సాగు జరుగుతోంది. మల్లెలను సాగుచేసే రైతులు టోకు వర్తకులకు పెద్దమొత్తంలో మల్లెలను విక్రయిస్తారు. వీటిని టోకు వర్తకులు వినియోగం ఎక్కువగా ఉండే నగరాలు, పట్టణాలకు తరలిస్తారు. వివిధ దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు కూడా మల్లెలను పెద్ద ఎత్తున తరలిస్తుంటారు. వాణిజ్యపరంగా మల్లెల సాగు మన దేశంలో చిరకాలంగా సాగుతున్నప్పటికీ, మల్లెల సాగు విస్తీర్ణం, ఏటా స్థానికంగా జరిగే మల్లెల వ్యాపారం విలువ, మల్లెల ఎగుమతులు వంటి వివరాలపై గణాంకాలేవీ అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యకరం. పూల రారాణి మల్లెపువ్వును ‘పూల రారాణి’ అంటారు. ఇంగ్లిష్‌లో దీనికి ‘బెల్ ఆఫ్ ఇండియా’– అంటే ‘భారత సుందరి’ అనే పేరు, ‘క్వీన్ ఆఫ్ ఫ్రాగ్రన్స్’– ‘సుగంధ రాణి’ అనే పేరు కూడా ఉన్నాయి. మల్లెకు పర్షియన్ భాషలో ‘యాస్మిన్’ అనే పేరు ఉంది. దాదాపు పశ్చిమాసియా దేశాల్లోని అన్ని భాషల్లోనూ మల్లెను ‘యాస్మిన్’ అనే పిలుస్తారు. ఇంగ్లిష్ సహా పలు యూరోపియన్ భాషల్లో ‘జాస్మిన్’ అంటారు. హిందీలో మల్లెను మోగ్రా, చమేలీ, జూహీ అనే పేర్లతో పిలుస్తారు. భారత దేశంలోను, ఇతర దక్షిణాసియా దేశాల్లోను మల్లెలను మహిళలు సిగలలో అలంకరించుకుంటారు. శుభకార్యాల సమయంలో చేసే పుష్పాలంకరణలలోను, దేవాలయాల్లోను భారీ పరిమాణంలోని మల్లెమాలలను ఉపయోగిస్తారు. మల్లెలకు అనేక ఆధ్యాత్మిక విశేషాలు కూడా ఉన్నాయి. మల్లెలతో దేవతార్చన చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మల్లెల మహిమ గురించి ‘పుష్పచింతామణి’ ఇలా చెబుతోంది: ‘మల్లికాజ్ఞా నకర్మార్థ మర్చయంతో మహేశ్వరమ్ లభంతే పరమం జ్ఞానం సంసార భయనాశనం’ ఎలాంటి కోరికలు లేకుండా మల్లెలతో ఈశ్వరార్చన చేసినట్లయితే సంసార భయాలు తొలగి, పరమజ్ఞానం కలుగుతుంది. ‘మల్లికా కుసుమై రేవం వసంతే గరుడధ్వజమ్ యోర్చయే పరయా భక్త్యా దహేత్ పాపం త్రిధార్జితమ్’ వసంత రుతువులో శ్రీమహావిష్ణువును మల్లెలతో అర్చిస్తే, మనో వాక్కాయ కర్మల వల్ల ప్రాప్తించిన పాపాలన్నీ తొలగిపోతాయి. భక్తులకు గల ఈ విశ్వాసం కారణంగానే వైష్ణవాలయాల్లో జరిగే పూజార్చనల్లో మల్లెలను విశేషంగా ఉపయోగిస్తారు. తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుని ఇతర పుష్పాలతో పాటు భారీస్థాయిలో మల్లెలను అలంకరిస్తారు. భాషా సాహిత్యాల్లో మల్లెలు మన భాషా సాహిత్యాల్లో మల్లెల ప్రస్తావన కనిపిస్తుంది. మన సామెతలు, జాతీయాల్లోనూ మల్లెల మాటలు వినిపిస్తాయి. ఉదాహరణ చెప్పుకోవాలంటే, ‘బోడితలకు బొడ్డు మల్లెలు ముడిచినట్లు’ అనే సామెత ఉంది. ఒకదానికొకటి ఏమాత్రం పొసగని వాటిని బోడితలకు బొడ్డు మల్లెలతో పోలుస్తారు. ‘జిల్లేళ్లకు మల్లెలు పూస్తాయా?’ అని మరో సామెత ఉంది. దుర్మార్గుల సంతానం దుర్మార్గులే అవుతారు గాని సన్మార్గులు కాలేరనే అర్థంతో ఈ సామెతను ఉపయోగిస్తారు. అలాగే, ‘ఉల్లి మల్లె కాదు, కాకి కోకిల కాదు’ అనే సామెత కూడా మనకు వాడుకలో ఉంది. మల్లెపూల గురించి చలం అద్భుతమైన కవిత రాశాడు. ‘మల్లెపూలు, తెల్లని మల్లెపూలు!/ విచ్చిన మల్లెపూలు! ఆ పరిమళం నాకిచ్చే సందేశం యే మాటలతో తెలపగలను!’ అంటూనే మల్లెల గురించి ఆయన ఈ కవితలో చాలా విశేషాలే చెబుతాడు. ‘ఒక్క స్వర్గంలో తప్ప/ ఇలాంటి వెలుగు తెలుపు/ లేదేమో– అనిపించే మల్లెపూలు’ అని పరవశించిపోతాడు. ఎంతైనా మల్లెలను అలంకరించుకునే అలవాటు ఉన్న మహానుభావుడాయన! మల్లెల పరిమళాలు కేవలం మన సాహిత్యంలోనే కాదు, పాశ్చాత్య సాహిత్యంలోనూ అక్కడక్కడా గుబాళింపులు వెదజల్లుతూనే ఉంటాయి. ‘అద్భుతమైన మల్లె మళ్లీ పరిమళిస్తుంది/ తన సుమనోహర సుగంధంతో ఈ బీడునేల మళ్లీ వికసిస్తుంది’ అంటూ మల్లెల సౌరభాన్ని అమెరికన్ కవయిత్రి సిల్వియా ఫ్రాన్సిస్ చాన్ తన ‘వండర్ జాస్మిన్’ కవితలో వర్ణించింది. ఇక మన తెలుగు సినీ సాహిత్యంలోనైతే మల్లెల పాటలు కొల్లలుగా వినిపిస్తాయి. మల్లెలూ కొన్ని రకాలూ... వివిధ దేశాల్లో వేసవిలో సర్వసాధారణంగా కనిపించే మల్లెల్లో ‘పోయెట్స్ జాస్మిన్’ ఒక రకం. వీటి పూలు చూడటానికి నందివర్ధనం పూలలా కనిపించినా, మంచి పరిమళాన్ని వెదజల్లుతాయి. ఈ జాతి మల్లెల మొక్కలు గుబురుగా పొదలుగా ఎదుగుతాయి. ఇవి దాదాపు నలభై అడుగుల వరకు విస్తరిస్తాయి. మన దేశంలో సర్వసాధారణంగా కనిపించే మల్లెలను ‘ఇండియన్ జాస్మిన్’ అంటారు. వీటినే సాదా మల్లెలు అంటారు. పశ్చిమాసియా, ఈజిప్టు ప్రాంతాల్లో చిన్న గులాబీల్లా కనిపించే మల్లెలను ‘అరేబియన్ జాస్మిన్’ అంటారు. విడివిడి రేకులతో వివిధ పరిమాణాల్లో కనిపించే మల్లెల్లో స్పానిష్ జాస్మిన్, ఏంజెల్ వింగ్ జాస్మిన్, అజోరియన్ జాస్మిన్ వంటివి ప్రధానమైన రకాలు. మల్లెల్లో ఎక్కువ రకాలు తెల్లగానే ఉంటాయి. అయితే, ఇటాలియన్ జాస్మిన్, షోయీ జాస్మిన్ వంటి అరుదైన రకాలు పసుపు రంగులోను; పింక్ జాస్మిన్, ఫ్రాగ్రంట్ ఫైనరీ జాస్మిన్, స్టీఫాన్ జాస్మిన్ వంటివి గులాబి రంగులోను కనిపిస్తాయి. ఆకారాలు, రంగులు ఎలా ఉన్నా, చక్కని పరిమళాన్ని వెదజల్లడం మల్లెల ప్రత్యేకత. చరిత్రలో మల్లెల సౌరభం భారత్, చైనా, ఈజిప్టు, అరేబియా ప్రాంతాల్లో పరిమళ ద్రవ్యాల తయారీలో మల్లెలను చిరకాలంగా ఉపయోగిస్తున్నారు. క్రీస్తుపూర్వం తొలి సహస్రాబ్దిలోనే ఈజిప్టు, భారత్ ప్రాంతాల్లో తాజా మల్లెలను వేడినీటిలో వేసి, స్నానానికి ఉపయోగించేవారు. భారత్‌లో క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది నుంచే మల్లెలను ప్రత్యేకంగా సాగుచేయడం మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి. చైనాలో క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నాటి నుంచి మల్లెల సాగు మొదలైంది. చైనాను అప్పట్లో పరిపాలించిన హాన్ వంశస్థులు మల్లెల సాగును బాగా ప్రోత్సహించినట్లు ఆధారాలు ఉన్నాయి. యూరోప్‌కు మల్లెలు చాలా ఆలస్యంగా పరిచయమయ్యాయి. అరబ్బుల ద్వారా క్రీస్తుశకం పదహారో శతాబ్దంలో గ్రీస్, ఫ్రాన్స్ ప్రాంతాలకు తొలిసారిగా మల్లెలు చేరాయి. ఫిలిప్పీన్స్‌కు పదిహేడో శతాబ్దిలో మల్లెలు పరిచయమయ్యాయి. మల్లెలపై మనసు పారేసుకున్న ఫిలిప్పీన్స్ మల్లెపూవును తన జాతీయపుష్పంగా ప్రకటించుకుంది. ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండోనేసియా, టునీసియా దేశాలకు కూడా మల్లెపూవే జాతీయపుష్పం కావడం విశేషం. పరిమళ ద్రవ్యాల తయారీలో... పరిమళ ద్రవ్యాల తయారీలో మల్లెల వినియోగం శతాబ్దాలుగా సాగుతోంది. మల్లెల నుంచి అత్తరులు, సెంట్లు వంటివి తయారు చేస్తారు. సబ్బులు, అగరొత్తుల తయారీలోనూ మల్లెల నుంచి సేకరించిన పరిమళ తైలాన్ని వినియోగిస్తారు. మల్లెల నుంచి ఒక కిలో సుగంధతైలం సేకరించాలంటే, వెయ్యి కిలోల మల్లెలు అవసరమవుతాయి. మిగిలిన పూల నుంచి సుగంధ తైలాన్ని సేకరించడానికి వాటిని నీటిలో ఉడికించి, ఆవిరిని సేకరించడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఇది ఒకే దశలో జరిగే ప్రక్రియ. మల్లెల నుంచి సుగంధతైలాన్ని సేకరించడం ఒకే దశలో సాధ్యమయ్యే పని కాదు. మొదటగా తాజాగా సేకరించిన మల్లెలను వాటిని సేకరించిన చోటనే నీటిలో ఉడికించి, ఆవిరి పడతారు. తొలిదశలో పరిమళాలు వెదజల్లే మైనం వంటి పదార్థం తయారవుతుంది. దీనిని ‘జాస్మిన్ కాంక్రీట్’ అంటారు. రెండో దశలో ఈ ‘జాస్మిన్ కాంక్రీట్’ను శుద్ధి చేయడం ద్వారా దీని సుగంధ తైలాన్ని సేకరిస్తారు. ఇంతగా ఎంతో శ్రమించి సేకరించిన సుగంధ తైలాన్నే అత్తరులు, సెంట్లు వంటి పరిమళ ద్రవ్యాల తయారీలోను, సబ్బులు, అగరొత్తులు వంటి ఉత్పత్తుల కోసం వినియోగిస్తారు. మల్లెల నుంచి సుగంధతైలం సేకరణ చాలా క్లిష్టమైన ప్రక్రియ కావడం వల్ల మల్లెల పరిమళాన్ని వెదజల్లే అత్తరులు, సెంట్లు వంటి ఉత్పత్తుల ధరలు కళ్లు చెదిరే స్థాయిలో ఉంటాయి. సంప్రదాయ వైద్యంలో... ►మల్లెలను మన ప్రాచీన ఆయుర్వేద వైద్యంలోను, చైనా సంప్రదాయ వైద్యంలోను చిరకాలంగా వినియోగిస్తున్నారు. మల్లెపూలను తలలో ధరించడం వల్ల వెంట్రుకలకు, కళ్లకు మేలు జరుగుతుందని; ►మల్లె ఆకులను దట్టంగా తలపైవేసి కట్టు కట్టినట్లయితే, కళ్లు ఎర్రబారడం, కళ్లకలకలు వంటి నేత్రవ్యాధులు నయమవుతాయని, ►మల్లె ఆకులను నూనెలో వేసి కాచిన తైలాన్ని తలకు పట్టించినట్లయినా నేత్రవ్యాధులు నయమవుతాయని; ►మల్లెల వేరు నుంచి తయారు చేసిన కషాయం వాత పైత్య దోషాలను హరిస్తుందని, రక్తదోషాలను తొలగిస్తుందని ‘వస్తుగుణ దీపిక’ చెబుతోంది. ►ఒత్తిడిని తగ్గించడంలోను, మానసిక ప్రశాంతతను కలిగించడంలోను మల్లెల సుగంధం బాగా పనిచేస్తుందని పలు ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ►చైనా సంప్రదాయ వైద్యంలో మల్లెపూవును ‘మో లి హువా’ అంటారు. ►దీనిని చర్మవ్యాధులు నయం చేయడానికి, మానసిక ఆందోళనను తగ్గించడానికి విరివిగా ఉపయోగిస్తారు. ►మల్లెల ఆకులతో తయారు చేసిన కషాయాన్ని జీర్ణకోశ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ►మల్లెపూలలో ఉండే ‘ఆర్సిటిన్’ అనే రసాయనం రక్తపోటును అదుపు చేస్తుందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. -
కర్బూజ జ్యూస్ తాగుతున్నారా? అధిక మోతాదులో పొటాషియం ఉండటం వల్ల..
వేసవిలో మనకు అధికంగా దొరికే పండు ఖర్బూజ పండు. ఈ పండులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కర్బూజలో దాదాపు తొంబై శాతం నీరు ఉంటుంది. కాబట్టి వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి, వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో కర్బూజపండు బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. ఈ పండులో ఉన్న పోషక విలువలేంటో తెలుసుకుందాం. తెల్ల రక్తకణాల వృద్ధి ►కర్బూజ పండులో ఎక్కువ శాతంగా ఉండే బీటాకెరోటిన్, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరంలోని తెల్ల రక్తకణాలను వృద్ధి చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. ►కర్బూజలో విటమిన్ ఎ ఎక్కువగా ఉండటం వల్ల కంటి సంబంధిత సమస్యలను దూరం చేసి కంటిచూపు బాగా ఉండేలా చేస్తుంది. వడదెబ్బ నుండి రక్షిస్తుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరు.. ►కర్బూజ పండులో విటమిన్ కె, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. దీనివలన ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ చక్కగా పని చేసేలా ఉపయోగపడుతుంది. అధిక మోతాదులో పొటాషియం ఉండటం వలన ►ఈ పండులో అధిక మోతాదులో పొటాషియం ఉండటం వలన గుండెకు మంచి న్యూట్రియంట్స్‌ని అందజేస్తుంది. దీనిలో ఫోలెట్ ఉండటం వలన అది హార్ట్ ఎటాక్ నుండి, గుండె జబ్బుల నుండి కాపాడుతుంది. ►తక్కువ క్యాలరీస్, ఎక్కువ పీచు పదార్థం ఉండటం వలన అధిక బరువుని తగ్గిస్తుంది. ►ఖర్బూజ జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. కిడ్నీలో రాళ్లను సైతం ►ఈ జ్యూస్‌ని క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ►ఈ పండు కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. గర్బిణులకు ఎంతో మేలు ►ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండడం గర్బిణులకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ►కంటి ఆరోగ్యం, శ్లేష్మాన్ని తగ్గించడానికి కర్బూజా సహాయపడుతుంది. వేసవిలో కర్బూజ పండు ముక్కలతో పాటు జ్యూస్ తాగటం వల్ల మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: ఇలా చేస్తే పురుగులు పడిపోతాయి! అప్పుడు ఎంచక్కా... -
ఎండలో బండి నడుపుతున్నారా? జాగ్రత్త.. ప్రమాదం పొంచి ఉన్నట్టే
రాత్రికి వంద రూపాయల పెట్రోల్ వేయించా... మాములుగా అయితే బండి రోజులు నడుస్తుంది. అలాంటిది ఒక్క రోజుకే పెట్రోల్ నిల్ అని చూపుతోందని సురేష్ ఆందోళన చెందాడు. ఈ సమస్య సురేష్ ఒక్కడిదే కాదు... జిల్లా వ్యాప్తంగా వాహనాలు వినియోగిస్తున్న అందరి అనుభవం. వేయించున్నా పెట్రోల్ ఏంమైంది? పెట్రోల్ బంకులోనే తక్కువగా వేస్తున్నారా? లేదా ఎవరైనా దొంగలిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవేవి కాదని నిపుణులు చెబుతున్నారు. మండుతున్న ఎండల వేడికి వాహనాల్లోని పెట్రోల్ ఆవిరవుతుండడమే కారణంగా విశ్లేషిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి హిందూపురం: అసలే వేసవికాలం... గతంలో ఎన్నడూ లేనంతగా సూరీడు భగభగ మంటూ నిప్పులు చెరుగుతున్నాడు. ఇలాంటి తరుణంలో వాహనాలను ఎక్కడబడితే అక్కడ ఎండలో ఉంచేస్తే పెట్రోల్ మొత్తం ఖాళీ అయిపోవడం ఖాయం. వాహనదారులు వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే కొత్త సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ నెలాఖరు నుంచి మే మాసం లోపు 43.1 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్క్‌కు చేరుకోవడంతో ఎండ వేడిమికి జనం విలవిల్లాడుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి.. మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉదయం 8 గంటలకే ఎండ వేడిమి ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఒకవేళ తప్పనిసరైతే ద్విచక్ర వాహనాలు లేదా, కార్లలో అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో వాహనాలను ఎండలో ఎక్కడబడితే అక్కడే ఆపేస్తున్నారు. దీంతో ఎండ వేడిమికి ఆయా వాహనాల్లోని ఇంధనం ఆవిరైపోతోంది. ఇది ఒక్కోసారి అగ్నిప్రమాదాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్కింగ్ జోన్లు లేక అవస్థలు.. జిల్లాలోని హిందూపురం, పుట్టపర్తి, కదిరి మున్సిపాల్టీలతో పాటు పంచాయతీ కేంద్రాల్లో పార్కింగ్ జోన్లు లేక వాహదారులు అవస్థలు పడుతున్నారు. కాయగూరలకు ఇతర అవసరాలకు వాహనాల్లో వెళ్లినప్పుడు ఎండలోనే పార్కింగ్ చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఇంధనం ఆవిరై పోతుండడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల 2,77,235 వాహనాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అలాగే వివిధ ప్రాంతాల్లోని 139 పెట్రోలు బంకుల్లో గతంలో రోజు వారీ 139 వేల లీటర్ల పెట్రోలు, డీజిల్ విక్రయాలు సాగేవి. వేసవి ఆరంభం నుంచి ఇది పెరుగుతూ వస్తోంది. తాజాగా 210 వేల లీటర్ల మార్క్‌ను చేరుకుంది.వేసవిలో వాహనదారులు అప్రమత్తంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎండ వేడిమికి పెట్రోల్ ట్యాంకుల్లో గ్యాస్ ఏర్పడి పేలిపోయే ప్రమాదముంది. రాత్రి పూట బైక్‌ను నిలిపి ఉంచినప్డుపు ఓ సారి ట్యాంక్ మూత తీసి మళ్లీ మూసి వేయాలి. మందపాటి సీటు కవర్లు వాడడం మంచిది. పెట్రోల్ ట్యాంకులను సైతం కప్పి ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలను నీడలోనే పార్కింగ్ చేయడం ఉత్తమం. – షాజహాన్, మెకానిక్, హిందూపురం -
ఉదయాన్నే నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటున్నారా? వేసవిలో ఇలా చేస్తే..
ఎండాకాలం కాసేపు బయటికి వెళితే చాలు ముఖచర్మం కమిలిపోతుంది. విపరీతంగా చెమటలు పోస్తాయి. నీరసం, నిస్త్రాణ కలుగుతాయి. కాసేపు పని చేస్తే చాలు శరీరం అలసిపోయి, సొమ్మసిల్లినట్లు అవుతుంది. బయటికి వెళ్లేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే ఎండల్లోనూ అందంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అవేమిటో చూద్దాం... పుదీనా, నిమ్మరసం- తేనెతో ►మంచి నీటిని మించిన ఔషధం లేదు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడేది మంచినీరు మాత్రమే. కాబట్టి ఇప్పటినుంచీ దాహం వేసినా వేయకపోయినా వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగడం అలవాటుగా మార్చుకోండి. ►గుప్పెడు పుదీనా ఆకులను తాగే నీటిలో వేసుకుంటే... శరీరం చల్లగా ఉంటుంది. ఈ కాలంలో పుదీనా టీని ఎంచుకుంటే మరీ మంచిది. ఎండ ప్రభావాన్ని కొంతవరకూ తట్టుకోగలుగుతారు. ►నిమ్మరసం వేసవికి ఔషధం లాంటిది. ఉదయాన్నే గ్లాసు నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. పెరుగు తీసుకుంటే ఉప్పు, కొద్దిగా మసాలాలు జోడించి పెరుగు చిలికి చేసే మజ్జిగ శరీరంలో వేడిని చల్లారుస్తుంది. డీహైడ్రేషన్ ను నివారిస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్ల భరితం. వేసవి తాపంతో పోరాడటానికి మజ్జిగ ఒక మంచి ఆప్షన్. దీనిలో క్యాలరీలు తక్కువ. కాల్షియం, పొటాషియంతో పాటు ప్రొటీన్ కూడా దీని నుంచి దొరుకుతుంది. అసిడిటీని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా పెరుగు తీసుకోవడం కూడా మంచిదే. కొత్తిమీర రసంతో ►గసగసాలను ఎక్కువగా ఆహారపదార్థాల్లో వాడాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు, వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ►కొత్తిమీరను ఆహారంలో అధికంగా తీసుకోవాలి. కొత్తిమీర రసం లేదా వంటకాల్లో దీన్ని వాడినా... శరీరంలోని అధిక ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. సీజనల్ పండ్లు తినడం వల్ల ►వేసవిలో ఆయిల్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఇంటి వంటలలో కూడా నూనె వాడకం తగ్గించాలి. ►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా కూరలు తగ్గించాలి. ►అల్పాహారంగా ఆవిరి కుడుములు, ఇడ్లీ వంటివి తీసుకుంటే మేలు. ►కర్బూజా, పుచ్చకాయలు, ఈత కాయలు, తాటి ముంజలు వంటి సీజనల్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ►వేసవిలో రోజుకోసారి రాగిజావ తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉండటంతోపాటు మరెన్నో లాభాలు ఉన్నాయి. ►రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. చర్మ సంరక్షణ ముఖ్యం ►వేసవిలో సన్‌స్క్రీన్ లోషన్‌ని రాసుకోవడం వల్ల చర్మానికి సమస్యలు తగ్గుతాయి. ఈ సన్ స్క్రీన్ లోషన్‌ని బయటికి వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకోండి. సన్ స్క్రీన్ లోషన్ వాడటం వల్ల చర్మ సమస్యలు ఉండవు. అలాగే చర్మానికి రక్షణ ఉంటుంది. ►ఎండల్లో బయటకు వెళ్ళినప్పుడు చర్మాన్ని కవర్ చేసుకోవడం అవసరం. కాబట్టి మీరు బయటకు వెళ్లేటప్పుడు గొడుగుని తీసుకువెళ్లడం మర్చిపోకండి. అలానే ఎండాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్‌ని ధరించడం, తలకు పెద్ద టోపీ పెట్టుకోవడం పైగా ఎలాంటి సమస్యలూ రావు. చదవండి: ఇరవై మందార పూలు.. మెంతులు.. పచ్చకర్పూరం! ఇలా చేస్తే ఒత్తైన కురులు -
మైక్రోప్లాస్టిక్స్ కలిసిన నీటిని తాగితే కోలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్.. ఇంకా..
Summer Health Tips: అసలే ఎండాకాలం.. దాహం వేస్తుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడంటే కావలసినప్పుడల్లా నీళ్లు తాగుతుంటాం. మరి బయటికి వెళ్లేటప్పుడు? అందులో ఆలోచించేదేముంది... ఒక వాటర్ బాటిల్ తీసుకెళతాం.. అంతేకదా అని సింపుల్‌గా చెప్పేస్తాం. అయితే ఆ బాటిల్ దేనితో తయారు చేసింది... అంటే నూటికి తొంభై పాళ్లు ‘ప్లాస్టిక్ బాటిల్’ అనే సమాధానం వస్తుంది. దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం వల్ల ఎంత ఉపయోగమో, ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగడం అంత ప్రమాదం. అది ఎండాకాలం అయితే కనక ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంతకీ ఏమిటా నష్టాలు అంటారా? అదే చూద్దాం.. ప్లాస్టిక్ వాడకం ఎందుకంటే! ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ముప్పు అని పదే పదే చెబుతున్నా కూడా ప్లాస్టిక్ ఇంకా వాడకంలోనే ఉండటానికి కారణం ఏమిటంటే, దానిని క్యారీ చేయడం చాలా సులువు. నిర్వహించడం ఇంకా సులువు. ఒకవేళ ఎక్కడైనా పెట్టి మరచిపోయినా పెద్ద ఖరీదు ఉండదు కాబట్టి దిగులు పడనక్కరలేదు. అందువల్ల పర్యావరణ ప్రేమికులు ఎంతగా నెత్తీ నోరు బాదుకుంటున్నా, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించే విషయంలో వెనకబడవలసి వస్తోంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయినా, భారీ ప్లాస్టిక్ కంటైనర్లు అయినా వాటి నుంచి నీరు తాగడం ప్రమాదకరం. ముఖ్యంగా ఎండలో ఎక్కువగా ఉంచిన ప్లాస్టిక్ బాటిల్స్‌లోని నీటిని అసలు తాగకూడదు. పరిశోధన ప్రకారం.. ►ప్లాస్టిక్ బాటిల్స్ మీద ఎండ పడితే.. అవి మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ నీటిని తాగితే.. శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడే.. ఎండోక్రైన్ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. ఇలాంటి నీటిని ఎక్కువగా తీసుకుంటే.. ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలేయాన్ని కూడా పాడు చేస్తుంది. ►ఎండలో ఉండే.. ప్లాస్టిక్ బాటిల్ నుంచి డయాక్సిన్ లాంటి టాక్సిన్ నీటిలోకి విడుదల అవుతుంది. ఈ డయాక్సిన్ నీటిని తాగితే.. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగితే.. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. మగవారిలో శుక్ర కణాల సంఖ్య కూడా తగ్గవచ్చు. ►బాటిల్ వాటర్‌లో మైక్రో ప్లాస్టిక్స్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ►మైక్రోప్లాస్టిక్స్ కలిసిన నీటిని తాగితే పొత్తి కడుపునకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యం, పీసీఓఎస్, ఒవేరియన్ సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు రావొచ్చు. ►ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. బయటకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లకు ఎండ తగిలితే.. అస్సలే తాగొద్దు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లను కొంతమంది అలానే ఉపయోగిస్తారు. ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు. ఇది ఇంకా అపాయకరమైనది. ఇలా అస్సలు చేయొద్దు ఎప్పుడూ. ఏం చేయాలి మరి? ►ప్లాస్టిక్ బాటిల్స్ అంతగా వాడుకలోకి రాని రోజుల్లో పెద్దవాళ్లు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు స్టీలు లేదా ఇత్తడి మరచెంబులు తీసుకు వెళ్లేవారు. ఇప్పుడు కూడా అదే మంచిది. అందుకు తగ్గట్టు ఇప్పుడు మార్కెట్లో రకరకాల సైజుల్లో, ఆకారాలలో రాగి, స్టీలు, ఇత్తడి బాటిల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి కాస్తంత ఖరీదు ఎక్కువైనా, ప్లాస్టిక్ వాడకం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలతో పోల్చుకుంటే ఫరవాలేదనిపిస్తుంది. ►ప్లాంట్ బేస్డ్ బాటిల్స్, గాజుసీసాలు, అల్యూమినియం వాటర్ క్యాన్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మనం వాడకం మొదలు పెడితే ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయి. చదవండి: ఆవకాయ.. పచ్చడి తయారీ ఇలా! నూనెను మరిగించకుండా పచ్చిగా వేసినా ఆహారంలో మునగాకు, మునక్కాయలు వారంలో రెండుసార్లైనా తీసుకోవాలి! ఇంకా.. -
Summer Care: టొమాటో జ్యూస్, బీట్రూట్ జ్యూస్ తాగుతున్నారా.. అయితే!
వేసవి వచ్చేసింది. చలికాలంలో లాగే వేసవిలో కూడా చర్మ సంరక్షణ చాలా అవసరం. ఎందుకంటే, వేసవిలో చర్మం ట్యానింగ్, నిగారింపు కోల్పోవడం, పొడిగా మారడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందాలంటే రోజూ ఈ డ్రింక్స్ తప్పనిసరిగా తీసుకోవల్సిందే. వీటివల్ల చర్మకాంతి పెరిగి యౌవనంగా కనిపిస్తారు. ఆరెంజ్ జ్యూస్ చర్మకాంతిని పెంచే విటిమిన్ సి సమృద్ధిగా ఉండేవాటిలో నారింజ లేదా కమలా పండ్లు ముందుంటాయి. నారింజ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది కాబట్టి క్రమం తప్పకుండా ఆరంజ్ జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. టొమాటో జ్యూస్ టొమాటోలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధకత శక్తిని కలిగిస్తాయి. రోజూ టొమాటో జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం యౌవనంగా, కాంతిమంతంగా ఉంటుంది. టొమాటోను సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. బీట్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి అద్భుత ఔషధం బీట్రూట్ జ్యూస్. ప్రతిరోజూ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దానిమ్మ జ్యూస్ శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు సమృద్ధిగా ఉండేది దానిమ్మలోనే. అందువల్ల రోజూ దానిమ్మ జ్యూస్ సేవించడం ద్వారా చర్మంలో నిగారింపు వస్తుంది. ముఖంలో కాంతి వస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్థులు కూడా దానిమ్మ జ్యూస్ తీసుకోవచ్చు. అయితే అందులో రుచికి పంచదార కలుపుకోకూడదు. గ్రీన్ టీ కేవలం బరువు తగ్గించేందుకే కాకుండా చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది గ్రీన్ టీ. రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. చదవండి: ఒత్తిడికి దూరంగా ఉండాలంటే..? -
Summer Drinks: కొకుమ్ జ్యూస్.. వేసవిలో భోజనం తర్వాత తాగితే!
Summer Drink- Kokum Solkadhi Juice: కొంకణి కూరల్లో పులుపు కోసం వాడే ప్రధాన పదార్థం కొకుమ్. వేసవిలో భోజనం తరువాత ఈ జ్యూస్‌ను తప్పని సరిగా తాగుతారు . ఇది ఆకలిని నియంత్రించి, అధిక బరువుని తగ్గిస్తుంది జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి, గ్యాస్ ఎసిడిటీ సమస్యలను దరిచేరనియ్యదు. దీనిలోని యాంటీఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఈ జ్యూస్ శరీరానికి సహజ సిద్ధమైన చల్లదనాన్ని అందిస్తుంది. కొకుమ్ (సొల్కది) జ్యూస్ తయారీకి కావలసినవి: ►ఎండు కొకుమ్స్ – 12 ►చిక్కటి కొబ్బరి పాలు – ఒకటిన్నర కప్పులు ►కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా ►నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ►ఆవాలు – టీస్పూను ►జీలకర్ర – టీస్పూను ►కరివేపాకు – ఒక రెమ్మ ►ఇంగువ – చిటికెడు ►వెల్లుల్లి రెబ్బలు – రెండు. తయారీ: ►కొకుమ్స్ను శుభ్రంగా కడిగి, కప్పు నీటిలో అరగంటపాటు నానబెట్టుకోవాలి ►అరగంట తరువాత కొకుమ్స్ను బాగా పిసకాలి. తరువాత వడగట్టి రసాన్ని వేరు చేయాలి ►ఇప్పుడు ఈ రసానికి రెండు కప్పులు నీళ్లు, కొబ్బరి పాలు, రుచికి సరిపడా ఉప్పువేసి కలిపి పక్కనపెట్టుకోవాలి ►బాణలిలో ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి ►ఇప్పుడు ఇంగువ కరివేపాకు, వెల్లుల్లిని దంచి వేయాలి ►ఇవన్నీ వేగాక కొకుమ్ జ్యూస్‌లో కలిపి, రెండు గంటల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ►చల్లబడిన జ్యూస్‌లో చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇది కూడా ట్రై చేయండి: Pineapple- Keera: పైనాపిల్ కీరా జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల! -
Summer Drinks: యాపిల్, నేరేడు.. జ్యూస్ కలిపి తాగితే..
Summer Drinks: Apple Blueberry Juice: యాపిల్ నేరేడు జ్యూస్‌లో పీచుపదార్థంతోపాటు విటమిన్ సి, విటమిన్ ఏ ఇంకా ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, గ్లూకోజ్, ప్రోటిన్ పోషకాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ ఫ్రీ ర్యాడికల్స్‌తో పోరాడి సెల్ డ్యామేజ్‌ను నియంత్రిస్తాయి. ఈ జ్యూస్ జీర్ణవ్యవస్థ, గుండె పనితీరుని క్రమబద్ధీకరిస్తుంది. నోటి ఆరోగ్యాన్ని పెంపొందించడంతోపాటు, చర్మం నిగారింపుకు తోడ్పడుతుంది. తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి సైతం వేసవిలో ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. యాపిల్ నేరేడు జ్యూస్ తయారీకి కావలసినవి: ►గింజలు తీసేసిన నేరేడు పండ్లు – కప్పు ►యాపిల్ ముక్కలు – కప్పు ►బ్లాక్ సాల్ట్ – పావు టీస్పూను ►అల్లం – చిన్న ముక్క ►చాట్ మసాలా – చిటికెడు ►నిమ్మరసం – టేబుల్ స్పూను ►ఐస్ క్యూబ్స్ – ఐదు ►తేనె – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ: ►నేరేడు, యాపిల్ ముక్కలు, అల్లం ముక్కలను బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ►ముక్కలు నలిగాక, కప్పు నీళ్లు, నిమ్మరసం వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఇప్పుడు ఈ జ్యూస్‌ను వడగట్టకుండా గ్లాసులో పోసి, తేనె, చాట్ మసాలా, ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. ∙ వేసవిలో ట్రై చేయండి: Pomegranate Strawberry Juice: దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్.. పోషకాలెన్నో! Banana Milkshake: బరువు తగ్గాలా.. తియ్యటి పెరుగు, చల్లని పాలు.. ఇది తాగితే! -
Summer Drinks: వేసవిలో పుచ్చకాయ, యాపిల్ జ్యూస్ కలిపి తాగితే!
వేసవిలో పుచ్చకాయ యాపిల్ జ్యూస్ మంచి రుచికరమైన రిఫ్రెషింగ్ డ్రింక్. పుచ్చకాయలోని నీరు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. యాపిల్‌లో ఉన్న పోషకాలు శరీరానికి అంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ రెండింటినీ కలిపి తాగడం వల్ల దాహం తీరడంతో పాటు, శరీరానికి కావాల్సిన అనేక ఖనిజ పోషకాలు అందుతాయి. పుచ్చకాయ యాపిల్ జ్యూస్ తయారీకి కావాల్సినవి: ►గింజలు తీసిన పుచ్చకాయ ముక్కలు- రెండు కప్పులు ►పంచదార- రెండు టేబుల్ స్పూన్లు ►యాపిల్- పెద్దది ఒకటి ►రాక్‌సాల్ట్- టీస్పూను ►జీలకర్ర పొడి- అర టీ స్పూను ►ఐస్ క్యూబ్స్- అరకప్పు ►పుదీనా ఆకులు- ఐదు తయారీ: ►పుచ్చకాయ ముక్కల్ని బ్లెండర్లో వేయాలి. ►ముక్కలతో పాటు పంచదార, రాక్‌సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ►ఇవన్నీ నలిగాక జీలకర్ర పొడి, ఐస్‌క్యూబ్స్ వేసి మరోసారి గ్రైండ్ చేయాలి ►గ్రైండ్ అయిన జ్యూస్‌ను ఒక పాత్రలో తీసుకోవాలి ►ఇప్పుడు యాపిల్ తొక్కతీసి గ్రేటర్‌తో సన్నగా తురిమి జ్యూస్‌లో వేసి చక్కగా కలుపుకోవాలి. ►జ్యూస్‌ను గ్లాస్లో పోసి, సన్నగా తరిగిన పుదీనా ఆకులను వేసి సర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Carrot Apple Juice Health Benefits: రోజుకొక గ్లాసు ఈ జ్యూస్ తాగారంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు Mango Mastani: మ్యాంగో మస్తానీ తాగుతున్నారా.. ఇందులోని సెలీనియం వల్ల! -
Summer Drinks: సొరకాయ జ్యూస్ తాగితే అద్భుత ప్రయోజనాలు!
Summer Drink- Sorakaya Juice: సొరకాయలో విటమిన్లు, పొటాషియం, ఐరన్లు, పీచుపదార్థం పుష్కలంగా ఉంటాయి. అందువల్ల సొరకాయ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారు. దీనిలోని పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అదే విధంగా.. పొటాషియం అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రోజూ ఈ డ్రింక్ తాగడం వల్ల కాలేయ సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఐస్‌క్యూబ్స్ వేయకుండా చేసిన సొరకాయ జ్యూస్‌ను పరగడుపున తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. సొరకాయ జ్యూస్ తయారీకి కావలసినవి: ►సొరకాయ – మీడియం సైజుది ఒకటి ►పుదీనా ఆకులు – పది ►అల్లం – అరంగుళం ముక్క ►నిమ్మకాయ – ఒకటి ►బ్లాక్ సాల్ట్ – రుచికి సరిపడా ►ఐస్ క్యూబ్స్ – అరకప్పు. తయారీ విధానం: ►సొరకాయ తొక్కతీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి బ్లెండర్లో వేయాలి. ►దీనిలోనే తొక్కతీసిన అల్లం, పుదీనా, రుచికి సరిపడా బ్లాక్‌సాల్ట్, ఐస్ క్యూబ్స్వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ►గ్రైండ్ అయిన మిశ్రమాన్ని పలుచని వస్త్రంలో వడగట్టి జ్యూస్‌ను తీసుకోవాలి. ►ఈ జ్యూస్‌లో నిమ్మరసం పిండి సర్వ్ చేసుకోవాలి. చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి.. చదవండి👉🏾ప్రెగ్నెన్సీ సమయంలో చేపలు, లివర్‌ను తినొచ్చా? -
Summer Drinks: ఈ డ్రింక్ తాగితే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి!
Summer Drinks- Elaichi Sharbat: ఇలాచి షర్బత్ తాగితే వేసవి కాలంలో ఎదురయ్యే గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. అధిక రక్తపోటును నియంత్రించే గుణాలు ఈ డ్రింక్‌లో పుష్కలంగా ఉన్నాయి. యాలకుల్లో ఉన్న ఔషధ గుణాలు మహిళల్లో తరచూ ఎదురయ్యే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి. ఈ డ్రింక్ తాగడం వల్ల క్యాల్షియం, పీచుపదార్థం శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇలాచి షర్బత్ తయారీకి కావలసినవి: యాలక్కాయలు – కప్పు, పంచదార – కేజీ, రోజ్ వాటర్ – పావు కప్పు, గ్రీన్ ఫుడ్ కలర్ – పావు టీస్పూను, నిమ్మకాయలు – రెండు. ఇలాచి షర్బత్ తయారీ విధానం: ►యాలక్కాయలను శుభ్రంగా కడిగి, రెండు కప్పుల నీళ్లుపోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ►నానిన యాలక్కాయలను నీటితోపాటు మిక్సీజార్‌లో వేసి బరకగా గ్రైండ్ చేయాలి. ►స్టవ్‌మీద పాత్రను పెట్టి లీటరు నీళ్లు, గ్రైండ్ చేసిన యాలక్కాయల మిశ్రమాన్ని వేసి సన్నని మంట మీద ఇరవై నిమిషాలపాటు మరిగించాలి. ►మరిగిన మిశ్రమాన్ని పలుచటి వస్త్రంలో వడగట్టి నీటిని తీసుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద మరో పాత్రను పెట్టి వడగట్టిన నీటిని అందులో పోయాలి. ►దీనిలో పంచదార వేసి సన్నని మంటమీద పదిహేను నిమిషాలపాటు మరిగించాలి. ►తరువాత రోజ్‌వాటర్, గ్రీన్ ఫుడ్ కలర్, నిమ్మకాయల రసం పిండి, చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమం సిరప్‌లా చిక్కబడేంత వరకు మరిగించి దించేయాలి ∙మిశ్రమం చల్లారాక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో వేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి. ►రెండు నెలలపాటు నిల్వ ఉండే ఈ ఇలాచీ షర్బత్‌ను కప్పు పాలు, లేదా గ్లాస్ నీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల చొప్పున కలుపుకుని తాగాలి. చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి.. -
Summer Tips: అల్పాహారంగా ఆవిరి కుడుములు, ఇడ్లీ తీసుకుంటే!
Summer Care- Tips In Telugu: చిన్నారులకు సెలవుల పండుగ వచ్చేసింది... టీచర్లకు కూడా కాస్త విరామం దొరికింది. కాకపోతే ఇంట్లో పెద్దవాళ్లే ఈ సిసింద్రీలతో వేగేదెలాగా... అని తలలు పట్టుకుని కూచుంటున్నారు. ఇంతకీ వేసవి అంటే మండే ఎండలూ, వడగాడ్పులేనా? చల్లటి తాటి ముంజలు, ఘుమ ఘుమలాడే మల్లెపూల పరిమళాలు, తియ్యటి మామిడి పళ్లు కాదా? ఇంకా సీమచింత కాయలు... కుండనీళ్ల చల్లదనం, సుగంధ పానీయాలు, చెరుకు రసాలు... ఊర్లు, టూర్లు... ఇవన్నీ కూడా వేసవి ఆనందాలే కదా! అందువల్ల ఎండలను తిట్టుకోవడం మాని ఎంజాయ్ చెయ్యండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మే లోనూ వేసవి మేలుగానే అనిపిస్తుంది. సమ్మర్‌ను ఎలా గడిపితే బాగుంటుందో అవగాహన కోసం... నిప్పులు కక్కుతున్న సూరీడు పగలంతా ఎంత మండిపోతే మాత్రం.. భయపడేదెవరు? బండెడు హోమ్ వర్కు లేదు, ఇక కొన్ని రోజులపాటు సెలవులేనన్న భావనే.. చిన్నారుల్లో నూతనోత్తేజం కల్పించి ఉత్సాహంతో ఉరకలేయిస్తుంది. వాళ్ల పరుగులు, ఆటలు చూస్తుంటే పెద్దవాళ్లకు ఒక పక్క మురిపెంగానూ, మరోపక్క కాస్తంత గాభరాగానూ ఉంటుంది ఎండల నుంచి వీరిని కాపాడేదెలా అని... అయితే చిన్న జాగ్రత్తలతో సరైన ప్లానింగ్ ఉంటే అంత కంగారేమీ అక్కరలేదు. అప్పట్లో అయితే... వేసవి సెలవులు వస్తున్నాయంటే నెలరోజుల ముందునుంచే పల్లెపట్టుల్లోని పెద్దలు, ఇంటికి వచ్చే బంధువుల కోసం సరంజామా సిద్ధం చేసుకునేవారు. సెలవుల్లో అంతా కలుసుకోవడం, విభిన్న మనస్తత్వాలున్న వారంతా ఒక్కచోటకు చేరడం, ఇష్టాయిష్టాలు పక్కనపెట్టి కష్టసుఖాలు కలబోసుకోవడం, పెద్దలపై గౌరవంతో రాజీపడి సెలవులు గడిపేయడం లో మజాను మాటల్లో చెప్పలేం. పిల్లల ఆటల అల్లరి, వారిని కాపుకాయలేక పెద్దలు పడే అవస్థలు, తాతల ఆంక్షలు, చిన్నారులకు వత్తాసు పలికే అమ్మమ్మ, నానమ్మల మురిపాలు వేసవి ముచ్చట్లే. మండుటెండలు భయపెడుతూంటే మధ్యాహ్నపు వేళ పిల్లల్ని ఇంటిపట్టునే ఉండేట్లు చేయడంలో పెద్దలు తీసుకునే జాగ్రత్తలు వారిపై ఉండే మమతానురాగాలను వెల్లడిస్తాయి. కుండలో నీళ్లు, తరవాణి జలాలు దాహం తీర్చి, వడదెబ్బను ఢీకొట్టడంలో తిరుగులేనివే. ఎండలు తెచ్చే కష్టాలను వల్లెవేసి, వాటి పరిష్కారానికి చిట్కాలు చెప్పే పెద్దలు ఇప్పుడు తగ్గిపోయారు. వినే ఓపికా ఇప్పటి తరానికి లేదు. అలాగని ఈ మార్పును తప్పు బట్టలేం. ఆధునిక వైద్యం, మేలైన విధానాలు అందుబాటులోకి వచ్చాక చిట్కాలకు విలువ తగ్గింది. కానీ, చిట్కా వైద్యంలో అనురాగ బంధం కలగలసి పోవడంవల్ల ఆ రోజుల్లో చికిత్స బ్రహ్మాండమైన ఫలితాన్నిచ్చేది. సెలవుల్లో ఎక్కువమంది ఒకచోట చేరడం వల్ల విభిన్న మనస్తత్వాల గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది. సమస్యలు, చికాకులు, సర్దుబాట్లు, మానవ సంబంధాల పట్ల అవగాహన కలిగేవి. అందరూ కలసి ఉండటానికి కొన్ని కుటుంబాలు సిద్ధమైతే ఎండలు ఎంత వేధించినా అంతా కలసి తీర్థయాత్రలు, విహార యాత్రలకు వెళ్లడం మరికొందరికి అలవాటు. ఆర్థికంగా ఉన్నా లేకపోయినా... అభిమానం ఉన్న కుటుంబాలన్నీ ఇలా వేసవిని వినోదంగా మార్చుకోవడం తెలుగుగడ్డపై కన్పించే వేడుక. కంప్యూటర్లలో గేమ్‌లు, వీడియో ఆటలు, ఫోన్ చాటింగ్‌లు, సోషల్ మీడియాలో ఊసులు కాలక్షేపం కలిగిస్తాయేగానీ అసలు ప్రపంచం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసుకునే వెసులుబాటునివ్వవు. నలుగురితో కలవడం, నలుగురిలో నెగ్గుకురావడం ఈ ప్రపంచం నేర్పదు. అందుకే చిన్నారుల్లో మానసిక పరిపక్వత, మనోనిబ్బరం పెంచేందుకు ఒకప్పుడు సెలవులు ఉపయోగపడేవి. ఇప్పుడంత తీరిక వారికి చిక్కడం లేదు. లోకాన్ని అర్థం చేసుకునే నేర్పు పిల్లలకు కలగాలంటే వారు నలుగురిలోకి వెళ్లాలి. కుటుంబ బాంధవ్యాలు బలపడాలి. చదువుతోపాటు లోకజ్ఞానం ఉంటే ఆ చిన్నారి భవిష్యత్‌కు ఢోకా ఉండదు. ఇవి అవసరం... సెలవుల్లో యాత్రలు చేస్తే మంచిది. ఓ పార్కుకు వెళితే మొక్కల గురించి పిల్లలకు చెప్పాలి. ఓ జంతు ప్రదర్శనశాలకు వెళితే జంతువులు, పక్షులు, ఇతర జీవజాతులను ప్రత్యక్షంగా చూసిన అనుభవం వస్తుంది. పిల్లల్ని జూకు తీసుకువెళ్లాలి. మొక్కలకు నీళ్లుపోయడం, అవి పెరుగుతున్న విషయాన్ని వారికి వారుగా గుర్తించి చెప్పడంలో వాళ్లకి దొరికిన ఆనందం ఏ శిక్షణ శిబిరంలోనూ లభించదు. కొత్తకొత్త ప్రాంతాలకు తీసుకువెళితే ఆయా ప్రాంతాలపై అవగాహన కలుగుతుంది. అదే ఓ ప్లానెటోరియం కు తీసుకువెళితే కళ్లముందు ఖగోళం సాక్షాత్కరిస్తుంది. అక్కడ ఓ గంటసేపు ప్రదర్శన చూస్తే అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాలపై కనీస అవగాహన కలుగుతుంది. మానసిక, వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పేది ఇదే. కొత్తవిద్యలు నేర్పించడం మంచిదే..కానీ ముందు మనసుకు చురుకుదనాన్ని ఇచ్చేదేమిటో కనిపెట్టి, అది పిల్లలకు అందించాలని చెబుతున్నారు. సృజనకు పదును ►చిన్నారులకు ఏం ఇష్టమో కనిపెట్టి వారికి అందులో అవకాశం కల్పించాలి. వారి అభినివేశాన్ని గమనించి సృజనకు పదునుపెట్టాలి. బొమ్మలు వేయడం, పాటలు పాడటం, ఆటలు ఆడటం, కథలు చెప్పడం, కథలు వినడం.., చిన్నచిన్న పక్షులు, జంతువులను పెంచడం వంటివి అలవాటు చేయాలి. పంటపొలాలు, నదులు, సాగరతీరాలకు తీసుకువెళితే పిల్లలకు కలిగే ఆనందం అదుర్సే కదా! ►పిల్లల ఇష్టాలను బట్టి వారికి ఆయా అంశాల్లో ప్రవేశం కల్పించాలి. వారిని స్వేచ్ఛగా వదిలేయాలి. అవసరమైనప్పుడు మాత్రమే జోక్యం చేసుకుని దారికి తెచ్చుకోవాలి. పిల్లలకు ఆటవిడుపునివ్వాలి. ►పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. మహనీయుల జీవిత కథలు చెప్పి వారిలో స్ఫూర్తినింపాలి. నీతికథలు, శతకాలు బోధించాలి. సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం, పరిరక్షణకు తమ వంతు సహకారం అందించడం వంటి అంశాలను వివరించాలి. ఇతరులకు సాయం చేయడంలో ఉన్న ఆనందం గురించి అర్ధమయ్యేలా చెప్పాలి. తమ పనులు తామే చేసుకోవడం, పనుల్లో సాయపడటం, మొక్కల పెంపకం, క్విజ్ వంటి వాటిపై వారి దృష్టి మళ్లించాలి. ఇలా చేస్తే మండే మే ఎండలు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఆహారం విషయంలో జాగ్రత్తలు ►వేసవిలో ఆయిల్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. ►ఇంటి వంటలలో కూడా నూనె వాడకం తగ్గించాలి. ►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా కూరలు తగ్గించాలి. ►అల్పాహారంగా ఆవిరి కుడుములు, ఇడ్లీ వంటివి తీసుకుంటే మేలు. ►కర్భుజా, పుచ్చకాయలు, ఈత కాయలు, తాటి ముంజలు వంటి సీజనల్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ►కాఫీ, టీ లకు బదులు రాగి జావ, కూల్ డ్రింకులు బదులుగా కొబ్బరి నీరు తాగాలి. ►పలచని మజ్జిగలో నిమ్మ రసం, ఉప్పు కలిపి పిల్లలు, పెద్దలు అందరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ►వట్టి వేర్ల తెరలను తడిపి కిటికీలకు, గుమ్మాలకు కట్టుకుంటే వేడిని ఇంట్లోకి రానీయకుండా చల్లగా ఉంచుతుంది. ►పిల్లల చేత కంప్యూటర్ గేమ్స్ కాకుండా చదరంగం, క్యారమ్ బోర్డ్, పరమపద సోపాన పటం, ట్రేడ్, లూడో వంటివి ఆడించాలి. చదవండి👉🏾Barley Water Health Benefits: బార్లీ నీళ్లు.. అద్భుత ప్రయోజనాలు.. రోజూ గ్లాసుడు తాగారంటే! చదవండి👉🏾Oral Health Tips: నోటి దుర్వాసనకు చెక్! లవంగాలను తరచూ చప్పరిస్తున్నారా.. అయితే -
Health Tips: రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే అద్భుత ఫలితాలు!
Summer Care- Health Benefits Of Barley Water: వేసవి వచ్చేసింది... వేడితో అనేక సమస్యలు ఎదురవుతాయి. అన్నం తినాలనిపించదు, తినకపోతే ఆకలి. డీహైడ్రేషన్ సమస్యలు తప్పవు. అయితే వేసవిలో ముడిపడి ఉండే ఇటువంటి సమస్యలకు బార్లీనీళ్లతో చెక్ పెట్టొచ్చు. కేవలం వేసవి సమస్యలకే కాదు... అనేక ఆరోగ్య సమస్యలకు బార్లీ బాగా పని చేస్తుంది. పూర్వం రోజుల్లో ఎవరికైనా జ్వరం వచ్చిందంటే నీరసం నుంచి కోలుకోవడానికానికి బార్లీ నీళ్లు, సగ్గుజావ తాగించేవాళ్లు పెద్దలు. అయితే, కేవలం జ్వరంలోనే కాదు, బార్లీ వాడకం ఎప్పుడూ మంచిదే. వేసవిలో ఇంకా మంచిది. అదెలాగో చూద్దాం. ►వేసవిలో తిన్నది అరగక పోవడం సాధారణ సమస్య. అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది. ►పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ►మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. ఎండప్రభావం పడకుండా ఉండాలన్నా, వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా ఈ నీళ్లు తాగాలి. ►మధుమేహులకు బార్లీ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ కూడా అదుపులోనే ఉంటుంది. ►ఇక గర్భిణులు రోజూ బార్లీనీళ్లు తాగితే మరీ మంచిది. కాళ్ల వాపు సమస్య వారి దరిచేరదు. రోజులో ఉదయం, సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలసట కూడా త్వరగా రాదు. ►బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. ►రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ►మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ►మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగించే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి. ఇకనైనా బార్లీ నీళ్లు ట్రై చేస్తారు కదూ! చదవండి👉🏾Patika Bellam Health Benefits: పటికబెల్లం ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? కానీ ఎక్కువ తిన్నారంటే చదవండి👉🏾Health Tips: గ్యాస్ట్రిక్ నొప్పి వస్తే గుండెనొప్పిలా అనిపిస్తుంది.. తేడా తెలుసుకోవడం ఎలా? చదవండి👉🏾Mango Health Benefits: సీజన్ కదా అని మామిడి పండ్లు లాగించేస్తున్నారా? ఇందులోని క్వార్సెటిన్ వల్ల.. -
Beauty Tips: మామిడి, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం!
Beauty Tips In Telugu- Mango Scrub Benefits: వేసవిలో లభించే పండ్లలో దాదాపు అందరికీ ఇష్టమైనది మామిడి. పండ్లలో రారాజైన మామిడి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, మామిడిలో కేవలం అనారోగ్యాన్ని దూరం చేసే గుణాలే కాదు అందాన్ని ఇనుమడింపజేసే లక్షణాలు కూడా ఉన్నాయి. మామిడితో ఈ స్క్రబ్ ట్రై చేశారంటే మంచి ఫలితం ఉంటుంది. మామిడి స్క్రబ్.. ట్యాన్ మాయం! ►నాలుగు టేబుల్ స్పూన్ల మామిడి పండ్ల గుజ్జులో మూడు టేబుల్ స్పూన్ల ఓట్స్, రెండు టేబుల్ స్పూన్ల బాదం పొడి వేసి చక్కగా కలుపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ►ఆరాక చల్లటి నీటితో కడిగేయాలి. ►ముఖం మీద మచ్చలు, ట్యాన్‌ను ఈ స్క్రబ్ చక్కగా తొలగిస్తుంది. ►మామిడి, ఓట్స్‌ను కలిపిన ఈ స్క్రబ్ ముఖం మీద మృతకణాలు, దుమ్మూధూళిని తొలగించి చర్మానికి నిగారింపునిస్తుంది. ►వారానికి మూడుసార్లు ఈ స్క్రబ్ వాడితే మంచి ఫలితం వస్తుంది. చదవండి👉🏾Vitamin B12: విటమిన్ బి 12 లోపం లక్షణాలివే! వీటిని తిన్నారంటే.. చదవండి👉🏾Hair Care Tips: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల -
Jasmine: మల్లెల్ని మెత్తగా నూరి.. ఇలా చేశారంటే.. ఉపశమనం కలుగుతుంది!
వేసవిలో మల్లెలు పంచే పరిమళం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం అలంకరణకు మాత్రమే కాదు అనారోగ్య సమస్యలను దూరం చేయడంలోనూ ఇవి ఉపయోగపడతాయి. తాజాగా ఉన్న మల్లెల్ని మెత్తగా నూరి.. తడిబట్టపై చుట్టి కళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేస్తే కళ్లలో నీళ్లు కారడం, తడి ఆరడం, కళ్లు మూసినా, తెరిచినా చికాకు ఉండటం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మల్లెపూలు, గులాబీ పూల నుంచి తీసిన రసాన్ని ముఖానికి రాసుకుంటే ఛాయ మెరుగుపడుతుంది. ఇక మీకెప్పుడైనా తలనొప్పి లేదా తలంతా పట్టేసినట్టు ఉంటే మల్లెపూలతో వాసెన కట్టులా కడితే ఉపశమనం కలుగుతుంది. మల్లెల్లోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా తలనొప్పిని తగ్గిస్తుంది. ఇలా మాత్రం చేయకండి! స్నానం చేసేటప్పుడు శరీరానికి సోప్ అప్లై చేశాక లూఫాతో రుద్దుతుంటాం. అయితే చాలాసార్లు స్నానం తర్వాత మనం లూఫాను శుభ్రం చేయకుండా వదిలేస్తాం. మరుసటి రోజు మళ్లీ అదే లూఫాతో ఒంటిని రుద్దుతాం. ఇలా చేయడం వల్ల ఆ లూఫాలో పేరుకు పోయిన బాక్టీరియా శరీరాన్ని చేరి అలర్జీ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి లూఫాను శుభ్రం చేశాకే వాడాలి. మీకు తెలుసా? భారతదేశంలోని అనేక మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే ప్రజలు సరైన నిద్ర పోవడం లేదని ఓ సర్వేలో తేలింది. అంటే ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు నిద్రలేమి వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని 59 శాతం మంది ప్రజలు రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారు. మొబైల్ వాడకమే అందుకు కారణం. చదవండి👉🏾Hair Care Tips: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల -
Health Tips: సీజన్ కదా అని మామిడి పండ్లు లాగించేస్తున్నారా? ఇవి తెలిస్తే..
Summer Tips- Mango Top Health Benefits: పండ్లలో రారాజు మామిడి. మరి వేసవి అంటేనే మామిడి పండ్ల సీజన్ కదా! ప్రతి ఒక్కరు కనీసం ఒక్కసారైనా ఈ పండ్లను టేస్ట్ చేస్తారు. అయితే, కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో మామిడి తనకు తానే సాటి. మామిడి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు తెలుసుకుందామా?! 100 గ్రాముల మామిడి పండులో లభించే పోషకాలు ►ప్రొటిన్- 1.4 గ్రాములు ►కార్బోహైడ్రేట్స్-24.7 గ్రాములు ►షుగర్- 22.5 గ్రాములు ►ఫైబర్- 2.6 గ్రాములు ►కేలరీలు 60 ►విటమిన్ సీ- రోజూ ఓ మామిడి పండు తింటే 67 శాతం లభిస్తుంది. ►వీటితో పాటు కాపర్, థయామిన్, మోగ్నీషియం, నియాసిన్, పొటాషియం, రైబోఫ్లావిన్ కూడా ఉంటాయి. మామిడి ఆరోగ్య ప్రయోజనాలు ►మామిడి పండులో విటమిన్ ఏ, విటమిన్ సీతో పాటు కెరోనాయిడ్స్ ఉంటాయి. ఇవన్నీ రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో తోడ్పడతాయి. ►ఇక ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది. ►ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. మహిళలు మామిడి పండ్లు తినడం వల్ల ఐరన్, కాల్షియం తగు పాళ్లలో లభిస్తాయి. ►మామిడిలోని ఎంజైమ్‌లు ప్రొటిన్‌ను విచ్ఛిన్నం చేస్తాయి. అధిక ఫైబర్‌ను కలిగి ఉంటుంది కాబట్టి ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. ►ఇందులో విటమిన్ ఏ పుష్కలం కాబట్టి కంటి సమస్యలు దూరమవుతాయి. పొడిబారిన కళ్లు, రేచీకటిని నివారించడంలో ఇవి తోడ్పడతాయి. ►మామిడిలో ఉండే పోషకాల కారణంగా ఒక్క పండు తింటే చాలు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేయడమే ►కాకుండా అదనపు కేలరీలను కరిగిస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. ►ఇందులో టార్టారిక్, మాలిక్ యాసిడ్స్ ఎక్కువ. సిట్రిక్ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంలో సాయం చేస్తాయి. ►ఇక మధుమేహంతో బాధపడే వారు మామిడి ఆకులను తింటే మేలు. ఐదు నుంచి ఆరు ఆకులను నీటిలో వేడిచేసి.. రాత్రంతా నానబెట్టి తెల్లవారుజామున వడకట్టి తాగితే మంచి ఫలితం ఉంటుంది. మామిడి గ్లేసెమిక్ ఇండెక్స్ తక్కువ. షుగర్‌ను నియంత్రణలో ఉంచుతుంది. ►చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది. ►యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. క్వార్సెటిన్(కాన్సర్ కణాలను నశింపజేస్తుంది), ఫిసెటిన్, ఐసోక్వెర్సిటిన్, ఆస్ట్రాగాలిన్, గాలిక్ యాసిడ్, మిథైల్ గాలేట్.. ఇవన్నీ కాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. బ్రెస్ట్ కాన్సర్, కొలన్ కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్, లుకేమియాను నివారించడంలో తోడ్పడతాయి. చదవండి👉🏾 Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి.. -
హాట్ అండ్ కూల్ ట్రావెలింగ్ రిఫ్రిజిరేటర్.. ధర 6 వేలు!
Hot And Cool Traveling Refrigerator: ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. దూర ప్రాంతాలకు వెళ్తున్నపుడు నాలుగు జతల బట్టలతో సహా ఆ నాలుగు రోజులకు సరిపడా ఫుడ్ కూడా వెంట తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. పండ్లు, కూరగాయలు, వండుకున్న పదార్థాలను నిలవ ఉంచుకోవాలన్నా.. కాలానికి తగ్గట్టు చల్లటి పానీయాలు, వేడివేడి కాఫీలు అందుబాటులో పెట్టుకోవాలన్నా.. ఇలాంటి మినీ కూలర్ అండ్ వార్మర్‌ను మీ లాగేజ్లో భాగం చేసుకోవాల్సిందే. దీన్ని బెడ్ రూమ్‌లో, ఆఫీస్ క్యాబిన్లో, ప్రయాణాల్లో ఎక్కడైనా చక్కగా వినియోగించుకోవచ్చు. దీని పైభాగంలో ప్రత్యేకమైన హ్యాండిల్ కూడా ఉంటుంది. దాంతో ఎక్కడికైనా సులభంగా మోసుకుని వెళ్లొచ్చు. ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ డివైజ్. దీని కూలింగ్ రేంజ్ 20 డిగ్రీల సెల్సియస్. హీటింగ్ రేంజ్ 60 డిగ్రీల సెల్సియస్. దాంతో వేసవిలో చల్లని శీతలపానీయాలను, శీతాకాలంలో వేడివేడి కాఫీలను అందిస్తుంది. ఇందులో కావాల్సిన టాబ్లెట్స్, బ్యూటీ కాస్మెటిక్స్ ఇలా అన్నింటినీ స్టోర్ చేసుకోవచ్చు. పైగా ఇది స్టైలిష్ టెంపర్డ్ గ్లాస్ ప్యానెల్ కలిగి ఉండటంతో దీన్ని క్లీన్ చేసుకోవడం చాలా తేలిక. అవసరాన్ని బట్టి ఇందులో బాస్కెట్స్‌ను అమర్చి, చిన్న చిన్న విభాగాలుగా మార్చుకుని, చాలా రకాలు స్టోర్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే మధ్యలో పెట్టుకునే ర్యాక్స్ లేదా బాస్కెట్స్‌ను తొలగించి.. పొడవాటి డ్రింక్ బాటిల్స్ వంటివి పెట్టుకోవచ్చు. దీనికి రెండు పవర్ మోడ్స్ లభిస్తాయి. ఒకటి ఇంట్లో పవర్ సాకెట్‌కి అమర్చుకునేది. మరొకటి కారులో కనెక్ట్ చేసుకునేది. భలే ఉంది కదూ! ధర: 80 డాలర్లు (రూ.6,101) చదవండి: Ice Cream Maker: 10 నిమిషాల్లో ఐస్‌క్రీమ్ రెడీ.. ధర రూ.2,215! -
Summer Drinks: బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తాగండి!
Summer Drink- Muskmelon Mojito: కర్బూజాలో శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు, పుష్కలంగా నీరు ఉంటాయి. వేసవిలో దీనితో తయారు చేసే మస్క్ మిలాన్ మొజిటో తాగిన వెంటనే పొట్టనిండిన భావన కలిగి దాహం తీరి ఫ్రెష్‌గా అనిపిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సీ, బీటా కెరోటిన్లు రోగనిరోధక వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేస్తాయి. పీచుపదార్థం అధికంగా ఉండడం, గ్లైసిమిక్స్ ఇండెక్స్, కొవ్వులు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇది బాగా పనిచేస్తుంది. బ్లడ్ సుగర్ స్థాయులను నియంత్రణలో ఉంచుతూ బరువుని అదుపులో ఉంచుతుంది. మస్క్ మిలాన్ మొజిటో తయారీకి కావలసినవి: తొక్కతీసిన కర్బూజా ముక్కలు – కప్పు, పుదీనా ఆకులు – ఆరు, నిమ్మరసం – అరచెక్క రసం, పంచదార – టీస్పూను, సోడా, నీళ్లు, ఐస్ ముక్కలు – మోజిటోకు సరిపడా. మస్క్ మిలాన్ మొజిటో తయారీ విధానం: ►కర్బూజ ముక్కలు, పంచదారను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ►ఇవి గ్రైండ్ అయ్యాక పుదీనా ఆకులు, నిమ్మరసం వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఇప్పుడు గ్లాస్లో ఐస్ ముక్కలు వేయాలి. దీనిలోనే గ్రైండ్ చేసిన మస్క్‌మిలాన్ మిశ్రమం వేయాలి. ►ఈ మిశ్రమంలో సోడా నీళ్లు వేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి👉🏾Maredu Juice: మారేడు జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని టానిన్, పెక్టిన్‌ల వల్ల.. -
Health Tips: పటికబెల్లం ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
Patika Bellam Health Benefits: పటికబెల్లం అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది తియ్యటి రుచిని కలిగి ఉంటుంది. పటికబెల్లం శరీరానికి చలువ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని, వీర్యపుష్టిని ఇస్తుంది. వాత, పిత్త , కఫ దోషాల వల్ల కలిగే అనేక రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది. అయితే తియ్యగా ఉంది కదా అని ఎక్కువ తింటే మాత్రం మలబద్ధకం తప్పదు. ఈ క్రమంలోనే పటిక బెల్లంతో మనకు కలిగే ఇతర ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం. పటికబెల్లం ఆరోగ్య ప్రయోజనాలు ►పంచదారను ప్రాసెస్ చెయ్యడానికి ముందు రూపమే పటికబెల్లం. దీనిని కలకండ అని కూడా అంటారు. మిశ్రీ అంటారు. పటికబెల్లం పంచదార కన్నా మంచిది. ►మూడు, లేదా నాలుగు దొండ పండ్లను పటికబెల్లం పొడిలో అద్దుకొని తింటూ ఉంటే దగ్గు తొందరగా తగ్గిపోతుంది. ►చెంచాడు పటికబెల్లం పొడి, చెంచాడు పచ్చి లేదా ఎండు కొబ్బరి కోరు కలిపి పిల్లలకు తినిపిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి. ►వేడివేడి పాలల్లో పటికబెల్లం పొడి కలిపి రెండు లేక మూడు పూటలు తాగితే స్వరపేటికను ఎక్కువగా ఉపయోగించడం వల్ల వచ్చే గొంతు బొంగురు తగ్గిపోతుంది. ముఖ్యంగా ►ఇది అధ్యాపక, ఉపన్యాస వృత్తిలో ఉండే వారికి, పాటలు పాడే వారికి బాగా ఉపకరిస్తుంది. ►రెండు టేబుల్ స్పూన్ల పటికబెల్లం పొడి, టేబుల్ స్పూన్ల గసగసాలు తీసుకుని ఈ రెండింటినీ కలిపి మెత్తగా నూరి గాలి చొరని గాజు సీసాలో నిల్వ ఉంచుకుని పూటకు చెంచా చొప్పున వెన్నతో కలుపుకుని రెండు పూటలా తింటే గర్భిణులలో వచ్చే పొత్తి కడుపు నొప్పి, కండరాలు బిగదియ్యడం, రక్త విరేచనాలు, జిగట విరేచనాలు వంటివి తగ్గిపోతాయి. ►పటికబెల్లాన్ని, మంచిగంధాన్ని సాన మీద అరగదీసి.. అంతే మొత్తంలో తేనెను తీసుకుని ఈ మూడింటినీ అరగ్లాసు బియ్యం కడిగిన నీటిలో కలిపి పూటకు ఒకసారి తీసుకుంటే రక్తవిరేచనాలు, జిగట విరేచనాలు తగ్గుతాయి. దీంతో శరీరంలో ఏర్పడే మంటలు కుడా తగ్గుతాయి. ►పటికబెల్లం 20 గ్రాములు, ఆవువెన్న 20 గ్రాములు, పొట్టు తీసిన బాదం పప్పులు 7 తీసుకుని ఈ మూడింటినీ కలిపి ఉదయం పూట ఒకేసారి తీసుకుంటే ఉంటే దగ్గు తగ్గుతుంది. ►కనుచూపు మెరుగవుతుంది. ►పాలల్లో పటికబెల్లం పొడి వేసి కలిపి తాగితే దాహం తగ్గుతుంది. ►పటికబెల్లం పొడి అరస్పూను, టీ స్పూన్ పుదీనా ఆకుల రసం కలిపి రోజూ రెండు లేక మూడు పూటలు సేవిస్తూ ఉంటే దద్దుర్లు తగ్గుతాయి. ►వేసవిలో పిల్లలకు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే, పటికబెల్లం పొడి కలిపిన నీటిలో గింజలు తీసేసిన ఎండు కర్జూరాలను వేసి ఉంచాలి. మధ్యాన్నం ఎండగా ఉన్నప్పుడు ఈ నీటిని వడకట్టి పిల్లలకు తాగిస్తే చాలా మంచిది. చదవండి👉🏾Maredu Juice: మారేడు జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని టానిన్, పెక్టిన్‌ల వల్ల.. -
యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్స్ పుష్కలం.. ఒక్కసారి తాగారంటే!
Apple Carrot Orange Juice Recipe Health Benefits- యాపిల్ క్యారట్ ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ సి, ఏ, యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్స్ పుష్కలంగా ఉండి ఫ్రీ రాడికల్స్‌పై పోరాడతాయి. క్యారట్, యాపిల్, ఆరెంజ్‌లు శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మండే ఎండల్లో ఈ జ్యూస్ తియ్యగా, పుల్లని రుచితో ఉండి దాహార్తిని తీరుస్తుంది. కావలసినవి: క్యారట్స్ – రెండు, యాపిల్స్ – రెండు, ఆరెంజెస్ – మూడు, నీళ్లు – కప్పు, అల్లం రసం – అరటీస్పూను, పసుపు – పావు టీస్పూను, మిరియాల పొడి – పావు టీస్పూను, ఐస్ ముక్కలు – నాలుగు. తయారీ: క్యారట్స్, యాపిల్స్‌ను తొక్క, గింజలు తీసి ముక్కలుగా తరగాలి. ఆరెంజ్‌లను తొక్కతీసి జ్యూస్ తీసుకోవాలి. క్యారట్ ముక్కలను బ్లెండర్లో వేయాలి. దీనిలో ఆరెంజ్ జ్యూస్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. క్యారట్ గ్రైండ్ అయ్యాక యాపిల్ ముక్కలు, అల్లం రసం, పసుపు, మిరియాలపొడి, నీళ్లు పోసి మరోసారి చక్కగా గ్రైండ్ చేసుకుని గ్లాసులో పోసుకోవాలి. దీనిలో కొద్దిగా ఐస్ ముక్కలను వేసుకుని తాగితే జ్యూస్ చాలా బావుంటుంది. చదవండి: Poha Banana Shake: ఫైబర్, ఐరన్ అధికం.. బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తాగితే! -
దాహార్తిని ఇట్టే తీర్చే మసాలా ఛాస్.. రుచికి రుచి.. ఇంకా
Summer Drink- Masala Chaas: ఎండాకాలంలో మసాలా చాస్ మంచి రిఫ్రెషింగ్ డ్రింక్‌గా పనిచేస్తుంది. శరీరాన్ని చల్లబరిచి వేడిచేయకుండా చూస్తుంది. కేలరీలు తక్కువగా ఉండి, మంచి రుచితో దాహార్తిని ఇట్టే తీరుస్తుంది. మసాలా చాస్ కావలసిన పదార్థాలు: పెరుగు – కప్పు, పచ్చిమిర్చి – ఒకటి, అల్లం – చిన్నముక్క, పుదీనా ఆకులు – నాలుగు, కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – ఒక రెమ్మ, నెయ్యి – టీస్పూను, జీలకర్ర – అరటీస్పూను, ఉప్పు – రుచికి సరిపడినంత. తయారీ: పెరుగుని బ్లెండర్లో వేయాలి. దీనిలోనే పచ్చిమిర్చి, అల్లం, పుదీనా ఆకులను ముక్కలుగా తరిగి వేయాలి తరువాత కొద్దిగా కరివేపాకు, ఇంగువ, సగం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మూడు కప్పులు నీళ్లుపోసి మరోసారి గ్రైండ్ చేయాలి. బాణలిలో నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తరువాత జీలకర్ర, రెండు కరివేపాకు రెబ్బలు వేసి దోరగా వేయించి గ్రైండ్ చేసిన మజ్జిగను వేయాలి. దీనిలో రెండు మూడు ఐస్‌ముక్కలు వేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి: Health Tips: పాలకూర, టీ, చేపలు.. ఇంకా.. వీటితో బ్రెయిన్ పవర్ పెంచుకోవచ్చు! -
పచ్చి మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి రోజూ తాగితే..
Summer Care- Useful Tips: ఎండలు ముదురుతున్నాయి. ఈ సమయంలో వడదెబ్బ తగిలితే కష్టం. దానికంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ చిట్కాలు పాటిస్తే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. ►వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయను టోపీలో గాని రుమాలులో గాని నడినెత్తిన పెట్టి కట్టుకొని నడిస్తే వడదెబ్బ తగలదు. ►వడడెబ్బ తగిలిందని అనుమానంగా ఉంటే ముఖం మీద, ఒంటిమీదా నీళ్లు చల్లుతూ తలపైన ఐస్‌క్యూబ్స్ ఉంచి నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగించడం వల్ల నష్ట నివారణ జరుగుతుంది. ►ఉడికించిన పచ్చి మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి రోజూ తాగడం వల్ల వడదెబ్బ తగలదు. ►తరువాణి తేటలో ఉప్పు కలిపి తాగుతుండాలి. ►తాటిముంజలను పంచదారతో కలిపి తింటూ ఉంటే వడదెబ్బనుంచి తప్పించుకోవచ్చు. ►వేడి వేడి గంజిలో ఉప్పు వేసి తాగించడం, ఉల్లిపాయ రసాన్ని రెండు కణతలకు, గుండె మీద పూయడం వల్ల వడదెబ్బ తగలడం వలన కలిగిన బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. చదవండి: Inti Panta: జానెడు జాగా ఖాళీగా ఉంచరు.. అక్కడ కూరగాయలన్నీ ఉచితమే! -
ఏసీ గదిలో ఎక్కువసేపు గడుపుతున్నారా.. అయితే!
Summer Care- Health Tips In Telugu: ఇది ఎండాకాలం కాబట్టి మనం పని చేసే లేదా పడుకునే గదులలో ఏసీ లేదా కూలర్ వేసుకోవడం సర్వ సాధారణం. అయితే ఎక్కువసేపు ఏసీ గదిలో గడపడం వల్ల రకరకాల సమస్యలు తలెత్తుతుంటాయి. ఎందుకంటే ఏసీ మన గదిలో ఉన్న గాలిని చల్లబరచడం వల్ల వొంటికి చెమటలు పట్టక దాహం వేయదు. అందువల్ల నీళ్లు సరిగా తాగం. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అదేవిధంగా కొందరికి ఒక్క వేసవిలోనే కాదు, ఇతర కాలాల్లో కూడా ఏసీలోనే గడపడం అలవాటు. ఇలాంటివారు బయటికి వస్తే శరీరం కందిపోతుందేమో అన్నంత సుకుమారంగా ఉండి, ఎండలోకి రాలేరు. దీనిమూలంగా శరీరానికి ఎండ తగలక, డీ విటమిన్ అందదు. ఫలితంగా ఎముకలు దృఢంగా ఉండక ఫెళుసు బారిపోతుంటాయి. చదవండి: పిత్తాశయంలో రాళ్లెందుకు వస్తాయి? పరిష్కారాలేమిటి? -
Summer Food: మామిడి, ఉల్లి, క్యారట్, నెయ్యి.. ఇవీ ఉపయోగాలు!
Summer Care- Superfoods: కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం ఇంటిని, ఒంటినీ ఆరోగ్యంగా ఉంచుతుందనేది పెద్దల మాట. ఈ మాటను అనుసరించి వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మసాలాలు, వేడిచేసే ఆహార పదార్థాలనూ తీసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వేసవిలో తేలిగ్గా జీర్ణమయ్యేవి, శరీరం నిర్జలీకరణ జరగకుండా ఉండే ఆహార పదార్థాలేమిటో తెలుసుకుందాం. వేసవిలో నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరం నిర్జలీకరణ కాకుండా ఉంటుంది. అటువంటి వాటిలో ముఖ్యమైన వాటిని చూద్దాం... పుచ్చకాయ: ఇందులో 80 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. అందుకే వేసవి రాగానే ప్రతి ఒక్కరూ పుచ్చకాయలు తింటూ ఉంటారు. తాటిముంజలు: తాటిముంజలు తినడం వల్ల వేసవిలో దాహార్తి తీరుతుంది. చెమట కాయలు రాకుండా ఉంటాయి. మామిడి: పండ్లకు రాజయిన మామిడిలో అధిక శాతం సి విటమిన్, ఏ విటమిన్ ఉంటాయి. కాస్త ధర ఎక్కువయినా ఆల్ఫోన్సో మామిడి మరీ మంచిది. ఇందులో పీచుపదార్థాలు, రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడిలో ఉండే పొటాషియం చెడుకొవ్వును తగ్గించి రక ్తప్రసరణ వేగాన్ని మెరుగుపరుస్తుంది. దానివల్ల గుండె సంబంధిత ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఉల్లి, క్యారట్: ఎండలో పడి ఇంటికి రాగానే ఉల్లిపాయ, క్యారట్, బీన్స్, వెల్లుల్లి వంటి కూరగాయలను తినాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎండతో వచ్చే చర్మవ్యాధుల నుంచి రక్షిస్తాయి. సలాడ్స్: వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్‌ను తయారు చేసుకోవచ్చు. గ్రిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పాస్తా, నూడుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పనీర్ సలాడ్స్ వంటివి చేసుకోవచ్చు. సూప్స్: దోసకాయతో చేసిన సూప్‌ను భోజనానికి ముందుగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. హోల్ గ్రెయిన్ సలాడ్స్: మొక్కజొన్న, మొలకెత్తిన పెసలు, శనగలు, కూరముక్కలు.. వంటివాటిని కలిపి తీసుకుంటే మంచిది. అలాగే మొలకెత్తిన గింజలు, బీన్స్, తరిగిన కూరముక్కలు, పండ్లతో కలిపి సలాడ్‌లా తీసుకుంటే కాల్షియం, ప్రొటీన్లు వొంటికి అందుతాయి. ఇందులో తక్కువ క్యాలరీలున్న చీజ్‌ను తరిగిన కూరలతో కలపడం వల్ల కాల్షియం, ప్రొటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు. వేసవి పానీయాలు: సాధారణంగా సమ్మర్లో చాలామంది తియ్యగా, చిక్కగా ఉండే శీతల పానీయాలను, సోడాలను, ఐస్‌క్రీమ్‌లను తీసుకుంటూ ఉంటారు. వీటిలో కేలరీలు ఎక్కువ. ఎటువంటి ద్రవపదార్థాన్ని తీసుకున్నా తాత్కాలిక ఉపశమనమే.. అందువల్ల మజ్జిగ, లస్సీ వంటి వాటిని తాగాలి. ఇందులో కొవ్వు లేని పాలు శ్రేష్ఠం. ముఖ్యంగా మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, పళ్ల రసాలు మంచిది. వీటన్నింటికంటే నిమ్మరసం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. పండ్లు, పండ్ల రసాలు: చిక్కగా ఉండే డెజర్ట్స్‌కు బదులుగా పండ్లతో తయారు చేసిన డెజర్ట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. పండ్లు, బెర్రీలు, పుచ్చకాయ వంటి వాటిని తీసుకోవాలి. ఆకుపచ్చని కూరలు, టొమాటోలు, బఠాణీ వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి పోషక పదార్థాలు అందుతాయి. కీరకాయను తినడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది. వేసవిలో లభించే సీజనల్ పండ్లు తప్పకుండా తినాలి. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటితో పాటు అక్రోట్లను తీసుకోవాలి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. మాంసాహారులైతే చేపలను ఎక్కువగా తినడం మంచిది. ఉదయం పూట ఓట్స్ తినడం వల్ల శరీరానికి పీచు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువ గా అందుతాయి. పొట్టు తీయని పప్పు ధాన్యాలు, గింజలను తీసుకుంటే చాలామంచిది. నూనె పదార్థాలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించేస్తాయి. అందువల్ల వేసవిలో జంక్‌ఫుడ్, వేపుళ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో ఉండే గుమ్మడి, బంగాళాదుంప, చిలగడదుంప, బెల్‌పెపర్.. వంటివాటిలో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నీరు: దాహాన్ని తీర్చడానికి నీటిని మించినది లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు గ్లాసుడు మంచినీళ్లు తాగితే మంచిది. మంచినీళ్లు తాగితే శరీరం ఉత్తేజితమవుతుంది. డీహైడ్రేషన్‌కు దూరంగా ఉండచ్చు. వాల్ నట్స్: యాంటీ ఆక్సిడెంట్లు, నిద్రని రప్పించే ట్రిప్టోఫాన్ మూలకం వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. గింజల రాజుగా పేరొందిన వాల్ నట్లలో ఫైబర్, ఒమెగా కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. వాల్నట్లను తీసుకోవడం వల్ల మనం చెమట ద్వారానూ, వాతావరణంలోని ఇతర మార్పుల మూలంగానూ కోల్పోయే ఖనిజ లవణాలను భర్తీ చేసి, శరీరానికి తగినంత శక్తి చేకూరుతుంది. నెయ్యి: బరువు పెరుగుతున్నారని పక్కన పెడుతున్నారు కానీ, ఇందులో విటమిన్ ఏ, విటమిన్ కే2, విటమిన్ ‘ఈ’ లతోపాటూ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే లినోలిక్ ఆమ్లాలు ఉన్నాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణక్రియ మెరుగవుతుంది.. అలాగని అధికంగా తీసుకుంటే దాహం ఎక్కువ కావడం వంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తగిన మోతాదులో నెయ్యి తీసుకోవడం వల్ల వొంటికి తగిన మెరుపు వస్తుంది. తొందరగా అలసట కలగదు. అంజీర( అత్తి పండ్లు): ఆపిల్, ఎండుద్రాక్షల కంటే అంజీరా చాలా మెరుగైనవి. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఈ పండ్లను తినడం వల్ల మలబద్దకం దూరమవుతుంది. చర్మ సమస్యలు రావు. ముఖ్యంగా వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.. వేసవిలో ఎటువంటి ఆహార పానీయాలు తీసుకోవాలి.. వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకున్నాం కదా, ఈ సీజన్లో ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యకరమైన వేసవిని ఆస్వాదించవచ్చు. చదవండి: Muskmelon Juice Health Benefits: కర్బూజా జ్యూస్.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో! -
Health Tips: వేసవిలో ఈ ‘డ్రింక్’ తాగారంటే..
Summer Care- Health Tips: వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి చాలా మంది కూల్డ్రింకులు, ఐస్‌క్రీములు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి అప్పటికప్పుడు దాహార్తిని తీర్చిన ఫీలింగ్ కలిగించినా దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి సహజసిద్ధంగానే ఇంట్లోనే కూల్‌కూల్‌గా.. అదే సమయంలో తక్షణ శక్తిని అందించే ఇలాంటి పవర్ బూస్టర్లు తయారు చేసుకోవడం ఉత్తమం. పైనాపిల్, పుచ్చకాయ, క్యారెట్లతో డ్రింక్‌ను తయారు చేసుకుని చల్లచల్లగా తాగితే ఎండ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎలా తయారు చేసుకోవాలంటే.. పావు కప్పు పైనాపిల్ ముక్కలు, పావు కప్పు పుచ్చకాయ ముక్కలు, రెండు క్యారట్లు, రెండు రెమ్మలు కొత్తిమీర తరుగు, రెండు అంగుళాల అల్లం ముక్క (ముక్కలు తరగాలి)ను తీసుకోవాలి. వీటన్నింటిని జ్యూసర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. వడగట్టి అవసరాన్ని బట్టి రెండు మూడు ఐస్ ముక్కలను వేసుకోని తాగాలి. ఇది ఆటలు ఆడేవారికి తక్షణ శక్తినందించే సహజసిద్ధమైన డ్రింక్‌లా పనిచేస్తుంది. శరీరానికి కావాల్సిన మొత్తంలో కార్బొహైడ్రేట్స్‌ను అందిస్తుంది. పుచ్చకాయ, క్యారట్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కొత్తిమీరలో సోడియం, పైనాపిల్ లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫైటో న్యూట్రియంట్స్, విటమిన్ బీ ఉండడం వల్ల మంచి రిఫ్రెష్మెంట్ డ్రింక్‌గా పనిచేస్తుంది. చదవండి: తల తిరగడం కూడా గుండె వైఫల్యానికి సంకేతమే!