Summer Drinks- Elaichi Sharbat: ఇలాచి షర్బత్ తాగితే వేసవి కాలంలో ఎదురయ్యే గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. అధిక రక్తపోటును నియంత్రించే గుణాలు ఈ డ్రింక్‌లో పుష్కలంగా ఉన్నాయి. యాలకుల్లో ఉన్న ఔషధ గుణాలు మహిళల్లో తరచూ ఎదురయ్యే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి. ఈ డ్రింక్ తాగడం వల్ల క్యాల్షియం, పీచుపదార్థం శరీరానికి పుష్కలంగా అందుతాయి.
ఇలాచి షర్బత్ తయారీకి కావలసినవి: యాలక్కాయలు – కప్పు, పంచదార – కేజీ, రోజ్ వాటర్ – పావు కప్పు, గ్రీన్ ఫుడ్ కలర్ – పావు టీస్పూను, నిమ్మకాయలు – రెండు.
ఇలాచి షర్బత్ తయారీ విధానం:
►యాలక్కాయలను శుభ్రంగా కడిగి, రెండు కప్పుల నీళ్లుపోసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
►నానిన యాలక్కాయలను నీటితోపాటు మిక్సీజార్‌లో వేసి బరకగా గ్రైండ్ చేయాలి.
►స్టవ్‌మీద పాత్రను పెట్టి లీటరు నీళ్లు, గ్రైండ్ చేసిన యాలక్కాయల మిశ్రమాన్ని వేసి సన్నని మంట మీద ఇరవై నిమిషాలపాటు మరిగించాలి.
►మరిగిన మిశ్రమాన్ని పలుచటి వస్త్రంలో వడగట్టి నీటిని తీసుకోవాలి.
►ఇప్పుడు స్టవ్ మీద మరో పాత్రను పెట్టి వడగట్టిన నీటిని అందులో పోయాలి.
►దీనిలో పంచదార వేసి సన్నని మంటమీద పదిహేను నిమిషాలపాటు మరిగించాలి.
►తరువాత రోజ్‌వాటర్, గ్రీన్ ఫుడ్ కలర్, నిమ్మకాయల రసం పిండి, చక్కగా కలపాలి.
►ఈ మిశ్రమం సిరప్‌లా చిక్కబడేంత వరకు మరిగించి దించేయాలి ∙మిశ్రమం చల్లారాక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో వేసి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకోవాలి.
►రెండు నెలలపాటు నిల్వ ఉండే ఈ ఇలాచీ షర్బత్‌ను కప్పు పాలు, లేదా గ్లాస్ నీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల చొప్పున కలుపుకుని తాగాలి.
చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి..
Comments
Please login to add a commentAdd a comment