cardamom
-
యాలకుల వాటర్‌తో ఎన్ని లాభాలో తెలుసా..!
జీరా వాటర్, మెంతి వాటర్ తాగడం గురించి విని ఉంటారు. యాలకుల వాటర్ గురించి విని ఉండరు. ఈ యాలకులను స్వీట్స్ తయారీలో మంచి ఘుమ ఘుమలాడే సువాసన కోసం ఉపయోగిస్తుంటారు. అలాగే స్పైసీ కర్రీల్లో కూడా వాడుతుంటారు. అలాంటి యాలకుల వేసి మరిగించిన నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. యాలకుల సుగంధభరతమైన వాసనకి కచ్చితంగా.. ఈ నీళ్లను సులభంగా తాగగలం కూడా. అందులో ఆరోగ్యం కోసం అంటే ఎవరైనా ఎందుకు మిస్ చేసుకుంటారు..?. మరీ ఈ యాలకుల వాటర్‌తో కలిగే ప్రయోజనాలేంటో సవివరంగా చూద్దామా..!యాలకులు ఫినోలిక్ సమ్మేళనాలు, అస్థిర నూనెలు, ఫిక్స్డ్ ఆయిల్స్‌తో నిండి ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగ్గా ఉంచాయి. ముఖ్యంగా ప్రేగుల ఆరోగ్యం బాగుంటుంది. శరీరంలో ఉన్న అదనపు గ్యాస్‌ను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.యాలుకుల్లో యాంటీమైక్రోబయాల్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. యాలుకుల్లోని నూనెలు శిలీంధ్రాలను, బ్యాక్టీరియాలను సమర్థవంతంగా పోరాడతాయి. ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నిరోధిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.యాలకుల్లో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగిన టెర్పెనెస్, ఫినోలిక్ సమ్మెళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని కలిగించే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు యాలకుల నీటిని తాగితే పెద్ద మొత్తంలో శరీరానికి యాంటీఆక్సిడెంట్లు అందడమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.రక్తపోటును నియంత్రించి లిపిడ్ ప్రొఫైల్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అనేక జంతు పరిశోధనలు యాలకుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేగాదు 2015లో జరిపిన అధ్యయనంలో యాలకులలోని యాంటిఆక్సిడెంట్లు గుండెపోటు నుంచి రక్షిస్తాయని తేలింది. అలాగే కొస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయిని వెల్లడయ్యింది.ముఖ్యంగా నోటి ఆరోగ్యం కోసం యాలకులను వినియోగిస్తే దుర్వాసన, కావిటీస్, చిగుళ్ల వ్యాధులు దూరం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.(చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..) -
యాలకులు, బిర్యానీ ఆకులతో కోరుకున్నది నెరవేరుతుందా? బ్యాగుల్లో.. జేబుల్లో పెట్టుకుంటే..
సుమ రెండేళ్ల కిందట బ్యూటీ పార్లర్ మొదలు పెట్టింది. కానీ తాను ఊహించినంత గొప్పగా సాగడంలేదు. దాంతో ఫ్రస్ట్రేషన్‌కి లోనయ్యింది. అదే సమయంలో పర్స్‌లో ప్రతి శుక్రవారం ఆరు యాలకులు పెట్టుకుంటే కోరుకున్నది జరుగుతుందని యూట్యూబ్‌లో ఒక వీడియో చూసింది. రెండు మూడు నెలల పాటు దాన్ని ఫాలో అయ్యింది. కానీ తన బిజినెస్‌లో ఎలాంటి మార్పూ రాలేదు. ఆ సమయంలోనే యూట్యూబ్‌లో మరో వీడియో కనిపించింది.. మీకేం కావాలనుకున్నారో అది బిర్యానీ ఆకుపై రాసి, కాల్చి బూడిద చేసి, ఆ బూడిదను ఆకాశంలోకి ఊదుతూ మీకేం కావాలో కోరుకుంటే అది జరుగుతుంది అని! చాలా ఆశగా ఆ పని చేసింది. ఒకసారి కాదు, పలుసార్లు. ఫలితం శూన్యం. పది వేల రూపాయలు ఖర్చుపెట్టి ఒక వర్క్‌షాప్‌కి హాజరయ్యింది. విజన్ బోర్డ్ తయారు చేసుకుంది. తనకేం కావాలో అఫర్మేషన్స్ రూపంలో రోజూ క్రమం తప్పకుండా రాసింది. కానీ తన బ్యూటీ పార్లర్ బిజినెస్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలానే ఉంది. ఏం చేయాలో అర్థం కాక తీవ్రమైన ఒత్తిడికి లోనయింది. ఆ ఒత్తిడిని భర్తపై, పిల్లలపై చూపించింది. వీటన్నింటినీ గమనించిన భర్త.. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చాడు. అశాస్త్రీయం.. అభూత కల్పనలు.. సుమలానే చాలామంది సక్సెస్ కోసం, సంతోషం కోసం, కోరుకున్నది జరగడం కోసం షార్ట్ కట్స్ వెతుకుతుంటారు. అలాంటివారికి సులువైన చిట్కాలిస్తూ యూట్యూబ్‌లో వందలు, వేల వీడియోలు కనిపిస్తాయి. ఆ మార్గాలు సులువుగా ఉండటం వల్ల వాటిని పాటిస్తూ, ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వీటన్నింటికీ మూలం ‘లా ఆఫ్ అట్రాక్షన్’ అనే సిద్ధాంతం. ‘ప్రతికూల ఆలోచనల వల్ల ప్రతికూల ఫలితాలే వస్తాయి. సానుకూల ఆలోచనల వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు సానుకూలంగా ఆలోచిస్తుంటే అవి నెరవేరేలా విశ్వం మీకు సహాయపడుతుంది. విశ్వంలోని శక్తులన్నింటినీ మీవైపు ఆకర్షించి మీ ఆలోచనలు సాకారమయ్యేలా చేస్తుంది’ అనేదే లా ఆఫ్ అట్రాక్షన్. ఆలోచనలకు విశ్వం ప్రతిస్పందిస్తుందని దీన్ని నమ్మేవారు చెప్తారు. ఎనర్జీ, ఎలక్ట్రాన్స్, ఫ్రీక్వెన్సీ, క్వాంటమ్ ఫిజిక్స్ లాంటి సైన్స్‌కి సంబంధించిన పదాలను వాడుతుంటారు. కానీ నిజానికి సైన్స్‌కి ‘లా ఆఫ్ అట్రాక్షన్’కి ఎలాంటి సంబంధమూ లేదు. ఇది అశాస్త్రీయమైన అభూత కల్పనలతో నిండిన ఒక మెటాఫిజికల్ సూడోసైన్స్ మాత్రమే. మీకు ఎప్పుడేది ఇవ్వాలో విశ్వానికి తెలుసునని, దాన్ని నమ్ముకుని లక్ష్యాన్ని సాధించినట్లు విశ్వసిస్తే చాలని ప్రబోధిస్తారు. కన్ఫర్మేషన్ బయాస్ వల్ల చాలామంది ఈ మాటలను, సిద్ధాంతాన్ని నమ్ముతారు. అఫర్మేషన్స్ రాసుకుంటూ, జపిస్తూ సుమలానే కాలాన్ని వృథా చేస్తుంటారు. తాము కోరుకున్నది ఎప్పటికీ జరక్క ఫ్రస్ట్రేషన్‌కి, ఒత్తిడికి లోనవుతారు. యూనివర్సిటీల అధ్యయనం లా ఆఫ్ అట్రాక్షన్, విజన్ బోర్డ్‌ల ప్రభావాన్ని అధ్యయనం చేయడం కోసం కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఒక ప్రయోగం జరిగింది. అక్కడ చదువుతున్న కొందరు విద్యార్థులను మూడు గ్రూపులుగా విభజించారు. టాప్ గ్రేడ్స్ సాధిస్తే ఎలా ఉంటుందో మొదటి గ్రూప్‌ని ఊహించమన్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చదువుకోవాలో ఊహించమని రెండో గ్రూప్‌కి చెప్పారు. మూడో గ్రూప్‌కి ఎలాంటి సలహాలూ ఇవ్వలేదు. మొదటి గ్రూప్ విద్యార్థులు ఎక్కువ విజువలైజ్ చేసి, తక్కువ చదివి, తక్కువ గ్రేడ్లు సాధించారు. చదువుతున్నట్లు ఊహించుకుని చదివిన రెండో గ్రూప్ విద్యార్థులు తక్కువ వత్తిడితో ఎక్కువ మార్కులు సాధించారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో జరిగిన అధ్యయనంలో కూడా ఇలాంటి ఫలితాలే వెలువడ్డాయి. పని చేయాల్సిందే.. ►గాలిలో దీపం పెట్టి ఆరిపోకూడదని కోరుకున్నట్లుగా.. లవంగాలు, యాలకులను బ్యాగుల్లో.. జేబుల్లో పెట్టుకోవడం వల్ల, బిర్యానీ ఆకులను కాల్చి గాలిలో ఊదడం లాంటి చిట్కాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తించాలి. ►అఫర్మేషన్స్, విజన్ బోర్డ్ లాంటివి లక్ష్యం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడటానికి ఉపయోగపడతాయి. వాటి ప్రయోజనం అంతవరకేనని గుర్తించాలి. ►విశ్వం ఒక వ్యక్తి కాదని, అది మన ఆలోచనలు, మాటలు వినదని అర్థం చేసుకోవాలి. ►‘‘కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి’’ అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పారు. అంటే కలలు కనడంతోనే సంతృప్తిపడితే సరిపోదు. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకుని తదనుగుణంగా శ్రమించాలి. ►లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకుని, అంచెలంచెలుగా దాన్ని పూర్తి చేసుకుంటూ కలలను సాకారం చేసుకోవాలి. -సైకాలజిస్ట్ విశేష్ -
Kitchen Tips: కిచెన్‌లో దుర్వాసనా? యాలకులు, లవంగాలు నీటిలో వేసి వేడి చేసి
కొన్ని రకాల వంటకాలు చేసినపుడు వంట గదిలో వాసనలు అలాగే ఉండిపోతాయి. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి సులువైన చిట్కాలు మీకోసం.. చేపల వాసన పోవాలంటే కిచెన్‌లో చేపల వాసనను పోగట్టడానికి నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుంది. గిన్నెలో వేడి నీరు తీసుకుని.. దానిలో నిమ్మరసం పిండండి. మీగిలిన తొక్కలను కూడా నీటిలోనే వేయండి. దీన్ని ఒక స్ప్రే డబ్బాలో పోసి వంటగదిలో స్ప్రే చేస్తే వాసన పోతుంది. నిమ్మకాయతో ఇలా మీ వంట గదిలో ఏదైనా ఘాటైన వాసన వస్తుంటే. నీటిలో నిమ్మకాయను సగం కట్ చేసి వేయండి. దీన్ని పది నిమిషాలు మరగనివ్వండి. తర్వతా గ్యాస్ కట్టేసి అలా వదిలేయండి. ఇలా చేస్తే మీ వంట గదిలోని ఘాటైన వాసన నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. దానిలో టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. సుగంధ ద్రవ్యాలతో.. యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క.. లాంటి సువాసన వెదజల్లే మసాలా దినుసులను తీసుకొని వాటిని నీటిలో వేసి బాగా వేడిచేయాలి. ఇవి నీటిలో వేసి వేడి చేస్తే వంటగదిలో సువాసనలు వ్యాపిస్తాయి. వంటగదిలోని దుర్వాసన పోతుంది. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో వేసి మీ ఇంట్లో స్ప్రే చేస్తే మంచి వాసన వస్తుంది. ఇది రూమ్ ఫ్రెష్నర్గా కూడా పనికొస్తుంది. వెనిగర్ ►ఇంట్లో నాన్‌వెజ్ వండినప్పుడు వచ్చే నీచు వాసనను వెనిగర్ ఈజీగా పొగొడుతుంది. ►దీనికోసం మూడు గిన్నెల్లో వెనిగర్‌ని పోసి కిచెన్‌లో మూడు చోట్ల ఉంచాలి. ►10 నుంచి 15 నిమిషాల్లో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ►అయితే ఈ వాసన మరీ ఎక్కువగా ఉంటే.. వెడల్పాటి గిన్నెలో నీరు, వెనిగర్ తీసుకుని, దానిలో నిమ్మతొక్కలు వేయాలి. ►తర్వాత ఈ నీటిని గ్యాస్ ఉంచి సువాసనలు వెదజల్లేంత వరకు సిమ్‌లో పెట్టి వేడి చేయాలి. ►తర్వాత స్టౌ ఆఫ్ చేసి అలా ఉంచేస్తే కాసేపటికి కిచెన్‌లో దుర్వాసన పోతుంది. కమలా తొక్కలతో.. ►డస్ట్బిన్లోని చెత్త కారణంగా కొన్ని సార్లు వంటగదిలో దుర్వాసన వస్తుంది. ►ఈ సమయంలో ఒక గిన్నెలో నీరు పోసి దానిలో కాస్త దాల్చినచెక్క, కొన్ని కమలా తొక్కలు వేసి సన్నని సెగపై ఐదు నిమిషాలు మరిగించండి. ►గిన్నెను అలాగే ఉంచేస్తే.. దుర్వాసన పోయి.. సువాసన వస్తుంది. ►ఇక మీ వంటగదిలో కూర మాడిన వాసనలు పోగొట్టుకోవాలంటే... వంట గది తలుపులు, కిటికీలు తెరిచి ఉంచితే సరి! చదవండి: Psychology: అక్కలకు ఇంకా పెళ్లి కాలేదు! కుటుంబం ఇలా.. ఒత్తిడిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. పరిష్కారం? మెదడులో కలవరం.. ఫిట్స్‌తో తస్మాత్ జాగ్రత్త -
Summer Drinks: ఈ డ్రింక్ తాగితే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి!
Summer Drinks- Elaichi Sharbat: ఇలాచి షర్బత్ తాగితే వేసవి కాలంలో ఎదురయ్యే గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. అధిక రక్తపోటును నియంత్రించే గుణాలు ఈ డ్రింక్‌లో పుష్కలంగా ఉన్నాయి. యాలకుల్లో ఉన్న ఔషధ గుణాలు మహిళల్లో తరచూ ఎదురయ్యే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి. ఈ డ్రింక్ తాగడం వల్ల క్యాల్షియం, పీచుపదార్థం శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇలాచి షర్బత్ తయారీకి కావలసినవి: యాలక్కాయలు – కప్పు, పంచదార – కేజీ, రోజ్ వాటర్ – పావు కప్పు, గ్రీన్ ఫుడ్ కలర్ – పావు టీస్పూను, నిమ్మకాయలు – రెండు. ఇలాచి షర్బత్ తయారీ విధానం: ►యాలక్కాయలను శుభ్రంగా కడిగి, రెండు కప్పుల నీళ్లుపోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ►నానిన యాలక్కాయలను నీటితోపాటు మిక్సీజార్‌లో వేసి బరకగా గ్రైండ్ చేయాలి. ►స్టవ్‌మీద పాత్రను పెట్టి లీటరు నీళ్లు, గ్రైండ్ చేసిన యాలక్కాయల మిశ్రమాన్ని వేసి సన్నని మంట మీద ఇరవై నిమిషాలపాటు మరిగించాలి. ►మరిగిన మిశ్రమాన్ని పలుచటి వస్త్రంలో వడగట్టి నీటిని తీసుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద మరో పాత్రను పెట్టి వడగట్టిన నీటిని అందులో పోయాలి. ►దీనిలో పంచదార వేసి సన్నని మంటమీద పదిహేను నిమిషాలపాటు మరిగించాలి. ►తరువాత రోజ్‌వాటర్, గ్రీన్ ఫుడ్ కలర్, నిమ్మకాయల రసం పిండి, చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమం సిరప్‌లా చిక్కబడేంత వరకు మరిగించి దించేయాలి ∙మిశ్రమం చల్లారాక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో వేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి. ►రెండు నెలలపాటు నిల్వ ఉండే ఈ ఇలాచీ షర్బత్‌ను కప్పు పాలు, లేదా గ్లాస్ నీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల చొప్పున కలుపుకుని తాగాలి. చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి.. -
లవంగాలు, యాలకులు, జీలకర్ర.. ఈ టీ తాగి చూడండి!
వేసవి కాలంలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలు అతిగా దాహంవేయడం, ఆకలి తక్కువగా ఉండడం. ఇది క్రమేణా ఎసిడిటీకి దారితీస్తుంది. ఏదైనా తిన్నవెంటనే వాంతయ్యేలా అనిపిస్తుంది. అయితే, ఈ టీ తాగడం వల్ల ఈ సమస్యలు రావు. అంతేగాక ఇది డీహైడ్రేషన్‌కు గురి కానియ్యదు. శరీరానికి చలవ చేస్తుంది. కూలింగ్ టీ తయారీకి కావలసినవి: నీళ్లు – కప్పున్నర, లవంగాలు – రెండు, యాలకులు – రెండు, ధనియాలు – టీస్పూను, జీలకర్ర – టీస్పూను, పంచదార – ఒకటిన్నర టీస్పూన్లు. తయారీ విధానం.. ►లవంగాలు, యాలకులను కచ్చాపచ్చాగా దంచి కప్పున్నర నీటిలో వేయాలి. ►వీటితోపాటు ధనియాలు, జీలకర్ర కూడా వేయాలి. ►ఈ నీటిని పదినిమిషాల పాటు సన్నని మంట మీద మరిగించాలి ►పది నిమిషాల తరువాత పంచదార వేసి ఐదు నిమిషాలు మరిగించి దించేయాలి. ►ఈ టీని ఉదయం అల్పాహారం తర్వాత గానీ సాయంత్రం గానీ తాగవచ్చు. చదవండి: Inti Panta: జానెడు జాగా ఖాళీగా ఉంచరు.. అక్కడ కూరగాయలన్నీ ఉచితమే! -
Cardamom Benefits: ఏలకులను పటికబెల్లంతో కలిపి చప్పరిస్తే..
Elaichi Health Benefits: నోటి దుర్వాసనను నివారించడానికి కొన్ని ఏలకులను నోట్లో వేసుకుని చప్పరించడం అనాదిగా మనకు తెలిసిన చిట్కానే. అయితే ఏలకులను పటికబెల్లంతో కలిపి చప్పరిస్తే నోటి దుర్వాసనను ఇంకా సమర్థంగా తగ్గించవచ్చు. అలాగే నీళ్లతో నిమ్మరసం చేసి, అందులో కొద్దిగా ఏలకుల చూర్ణం కలిపి తాగితే వాంతులు కూడా తగ్గుతాయి. పాలమీగడలో ఏలకులను కలుపుకుని, ఆ ముద్దను చప్పరిస్తే నోటిపూత, నాలుక పూత తగ్గుతాయి. ఏలకుల చూర్ణాన్ని బట్టలో పెట్టి కొద్దికొద్దిగా వాసన చూస్తుండం వల్ల తుమ్ములు, తలనొప్పి తగ్గుతాయి. అయితే ఏలకులలో చాలా ఎక్కువగా ఔషధ గుణాలున్నందు వల్ల దాన్ని ఎప్పుడూ కొద్ది కొద్ది మోతాదులో, చాలా పరిమితంగా మాత్రమే వాడాలి. చదవండి: (బరువు తగ్గాలనుకుంటున్నారా? కడుపు నిండా తింటూనే ఆ పనిచేయండి) -
సుగంధ వైద్యం
ఒక సుగంధద్రవ్యంగా యాలుకతో నోటి దుర్వాసనను అరికట్టవచ్చు. శ్వాసలో తాజాదనాన్ని నింపవచ్చు. నోట్లో ఒక యాలకుల పలుకువేసుకుని సాధారణంగా చాలామంది ఆ ప్రయోజనాన్ని పొందుతుంటారు. నిజానికి ఈ చిన్న పనులతో పాటు ఆరోగ్యపరంగా ఎంతో పెద్ద ప్రయోజనాలు ఇస్తాయి యాలకులు. వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని. ♦ యాలకులు జీవక్రియలను వేగవంతం చేస్తాయి. జీర్ణరసాల స్రావాలను ప్రేరేపించడం ద్వారా అవి మంచి జీర్ణక్రియకు తోడ్పడతాయి. ♦ యాలకులు జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక రుగ్మతలను... అంటే యాసిడ్ పైకి తన్నడాన్ని (యాసిడ్ రిఫ్లెక్స్), ఛాతీలో మంట, డయేరియా వంటి వాటిని అరికడతాయి. ♦ వీటిలోని యాంటీఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గిస్తాయి. తద్వారా గుండెకు మేలు చేస్తాయి. ♦ యాలకులలోని యాంటీఆక్సిడెంట్స్ ప్రమాదకరమైన ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. యాలకుల పౌడర్‌ను ఉపయోగిస్తూ చేసిన ఔషధాలు క్యాన్సర్ గడ్డలను కరిగించగలవని కొన్ని అధ్యయనాల్లో స్పష్టంగా తేలింది. ♦ ఆస్తమాలో కనిపించే పిల్లికూతలు, దగ్గు, ఛాతీ పట్టేసినట్లు ఉండటం వంటి ఎన్నో రకాల సమస్యలను యాలకులు తేలిగ్గా పరిష్కరిస్తాయి. ఊపిరితిత్తుల నిండా గాలిని ధారాళంగా పీల్చుకునేందుకు ఇవి దోహదపడతాయి. ఊపిరితిత్తుల్లోని ఇన్ఫ్లమేషన్ను నివారిస్తాయి. ♦ శారీరక సమస్యలకే కాదు... మానసిక సమస్యల పరిష్కారంలోనూ యాలకులు బాగా తోడ్పడతాయి. క్రమం తప్పకుండా యాలకులు వాడితే అవి డిప్రెషన్‌ను దూరం చేస్తాయని అధ్యయనాల్లో తేలింది. ♦ డయాబెటిస్‌ను నివారించడంలో లేదా డయాబెటిస్‌ను ఆలస్యం చేయడంలో యాలకుల భూమిక చాలా విశిష్టమైనది. ♦ యాలకులు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. ♦ రక్తంలోని గడ్డలను (క్లాట్స్‌ను) నివారించడం ద్వారా అవి రక్తప్రసరణ సాఫీగా అయ్యేలా చూస్తాయి. తద్వారా గుండెపోటును, పక్షవాతాన్ని నివారిస్తాయి. ♦ అనేక రకాల చర్మసమస్యలను దూరం చేస్తాయి. మేనిలో మంచి నిగారింపును తెస్తాయి. -
ఏలక్కాయలో ఏముంది?
గుడ్ ఫుడ్ ఏలక్కాయలో పోషకాలు ఏముంటాయి? మంచి వాసన తప్ప... అనుకుంటాం. వంటల్లో సువాసనకోసం వాడే దినుసుగానే పరిగణిస్తాం. కానీ ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఇదొక ఔషధం. ఏలక్కాయ కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. మంట అనిపించినప్పుడు వేడి నీటిలో చిటికెడు ఏలకుల పొడి చల్లుకుని తాగితే ఉపశమనం ఉంటుంది. కడుపులో ఒడుదొడుకులు కూడా అదుపులోకి వస్తాయి. ఏలక్కాయ అజీర్తి, అరుచి, ఆకలవుతున్నా తినాలనిపించకపోవడం వంటి సమస్యలను తొలగిస్తుంది. నోటి దుర్వాసనను తొలగిస్తుంది. తల తిరుగుతున్నప్పుడు ఏలక్కాయను నమిలి తింటే సాంత్వన కలుగుతుంది. కొందరికి ప్రయాణాల్లో తల తిరుగుతుంటుంది. అటువంటి వాళ్లు ఏలక్కాయ దగ్గర పెట్టుకోవడం మంచిది. ప్రయాణం మొదలు పెట్టినప్పుడే ఒక ఏలక్కాయ నోట్లో వేసుకుంటే తల తిరిగే సమస్య రానే రాదు. దాహం కూడా అనిపించదు. రోజుకు ఒక ఏలక్కాయ తింటే, జీర్ణశక్తిని మెరుగుపరిచి అపానవాయువు సమస్యను తొలగిస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్తో బాధపడేవారు రోజూ ఉదయం, సాయంత్రం ఏలకుల పొడిని నీటిలో కలుపుకొని తాగాలి. అలా వారం రోజులు చేస్తే ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గుతుంది. రెండు ఏలకులు, చక్కెర కలుపుకొని తింటే కడుపునొప్పి తగ్గుతుంది. -
ఎసిడిటీని తగ్గించే ఏలక్కాయ
దినుసు ‘ఫలాలు’ ఏలక్కాయను వంటల్లో సువాసన కోసం వాడే దినుసుగానే పరిగణిస్తాం. కానీ ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. వేడి నీటిలో కానీ, టీలలో చిటికెడు ఏలకుల పొడి చల్లుకుని తాగితే కడుపులో ఒడుదొడుకులు అదుపులోకి వస్తాయి. అజీర్తి, అరుచి, ఆకలవుతున్నా తినాలనిపించకపోవడం వంటి సమస్యలను తొలగిస్తుంది. నోటి దుర్వాసనను తొలగిస్తుంది. తల తిరుగుతున్నప్పుడు ఏలక్కాయను నమిలి తింటే సాంత్వన కలుగుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరిచి అపానవాయువు సమస్యను తొలగిస్తుంది. తెల్లరక్తకణాలు ఏం చేస్తాయంటే! హెల్త్ క్విజ్ 1. తెల్లరక్తకణాలు ఏం చేస్తాయి? 2. తెల్లరక్తకణాల్లో ప్రధానమైనవి ఏమిటి? 3. న్యూట్రోఫిల్స్ ఎలా ఉపయోగపడతాయి? 4. లింఫోసైట్స్ ఏం చేస్తాయి? 5. మోనోసైట్స్ ఎందుకు ఉపయోగపడతాయి? 6. ఇజినోఫిల్స్ కలిగించే ప్రయోజనం ఏమిటి? జవాబులు : 1. శరీరాన్ని బ్యాక్టీరియా, వైరస్ల నుంచి కాపాడతాయి. 2. న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, ఈసినోఫిల్స్, బేసోఫిల్స్ 3. శరీరానికి బ్యాక్టీరియా, ఫంగైల నుంచి రక్షణ కలిగిస్తాయి. 4. కొన్ని రకాల వైరస్ల నుంచి క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. 5. ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పిస్తాయి. 6. కొన్ని పరాన్నజీవుల నుంచి, క్యాన్సర్లనుంచి దేహానికి రక్షణ కల్పిస్తాయి. పన్నెండేళ్ల లోపు పిల్లలకు నిమిసులైడ్ వద్దు! నిషేధిత మందులు జ్వరం తగ్గడానికి వాడే మందుల్లో నిమిసులైడ్ ఒకటి. అయితే ఈ ఫార్ములాతో తయారైన మందులను పన్నెండేళ్ల లోపు పిల్లలకు వాడకూడదని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు నిషేధం విధించింది కూడా. పన్నెండేళ్ల లోపు పిల్లలకు ప్రిస్కిప్షన్‌లో ఈ మందులను రాయకూడదని డాక్టర్లకు సూచనలిస్తూ, పిల్లలకు రాసిన ప్రిస్కిప్షన్‌లో ఈ మందులు ఉన్నప్పటికీ వారికి ఆ మందులను అమ్మరాదని దుకాణదారులకు ఆదేశాలిచ్చింది. ఈ మందు గాఢత వల్ల పిల్లల్లో హైపోథెర్మియా, కడుపులో అపసవ్యతలు, పేగుల్లో రక్తస్రావం, కాలేయానికి సంబంధించిన సమస్యల వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు నిర్ధారణ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.