జీరా వాటర్, మెంతి వాటర్ తాగడం గురించి విని ఉంటారు. యాలకుల వాటర్ గురించి విని ఉండరు. ఈ యాలకులను స్వీట్స్ తయారీలో మంచి ఘుమ ఘుమలాడే సువాసన కోసం ఉపయోగిస్తుంటారు. అలాగే స్పైసీ కర్రీల్లో కూడా వాడుతుంటారు. అలాంటి యాలకుల వేసి మరిగించిన నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. యాలకుల సుగంధభరతమైన వాసనకి కచ్చితంగా.. ఈ నీళ్లను సులభంగా తాగగలం కూడా. అందులో ఆరోగ్యం కోసం అంటే ఎవరైనా ఎందుకు మిస్ చేసుకుంటారు..?. మరీ ఈ యాలకుల వాటర్‌తో కలిగే ప్రయోజనాలేంటో సవివరంగా చూద్దామా..!
యాలకులు ఫినోలిక్ సమ్మేళనాలు, అస్థిర నూనెలు, ఫిక్స్‌డ్ ఆయిల్స్‌తో నిండి ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగ్గా ఉంచాయి. ముఖ్యంగా ప్రేగుల ఆరోగ్యం బాగుంటుంది. శరీరంలో ఉన్న అదనపు గ్యాస్‌ను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
యాలుకుల్లో యాంటీమైక్రోబయాల్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. యాలుకుల్లోని నూనెలు శిలీంధ్రాలను, బ్యాక్టీరియాలను సమర్థవంతంగా పోరాడతాయి. ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నిరోధిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
యాలకుల్లో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగిన టెర్పెనెస్, ఫినోలిక్ సమ్మెళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని కలిగించే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు యాలకుల నీటిని తాగితే పెద్ద మొత్తంలో శరీరానికి యాంటీఆక్సిడెంట్‌లు అందడమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
రక్తపోటును నియంత్రించి లిపిడ్ ప్రొఫైల్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అనేక జంతు పరిశోధనలు యాలకుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేగాదు 2015లో జరిపిన అధ్యయనంలో యాలకులలోని యాంటిఆక్సిడెంట్లు గుండెపోటు నుంచి రక్షిస్తాయని తేలింది. అలాగే కొస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయిని వెల్లడయ్యింది.
ముఖ్యంగా నోటి ఆరోగ్యం కోసం యాలకులను వినియోగిస్తే దుర్వాసన, కావిటీస్, చిగుళ్ల వ్యాధులు దూరం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
(చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..)
Comments
Please login to add a commentAdd a comment