బాలీవుడ్ నటి, దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన అందం అభినయంతో వేలాదిగా అభిమానులను సొంతం చేసుకుంది. ఇద్దరు పిల్లలు తల్లి అయినా కూడా అందం, ఫిట్‌నెస్ పరంగా యువహీరోయిన్లకు తీసిపోని వన్నె తరగని అందం అనుష్కాది. ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ రహస్యం, ఫాలో అయ్యే డైట్ గురించి షేర్ చేసుకుంది. తాను ప్రతిరోజు ఒకే రకమైన ఆహారాన్ని తింటానని చెప్పుకొచ్చింది. ఇలా తినడాన్ని మోనోట్రోపిక్ డైట్ అనిపిలుస్తారని చెప్పింది. ప్రతిరోజూ ఒకేరకమైన లేదా ఒకలాంటి ఆహారాన్నే ఈ డైట్‌లో తీసుకుంటారు. ఇలాంటి డైట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ డైట్‌లో ఆహారం సరళంగా, సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు.
ఈ డైట్ ఎక్కువగా తినాలనే ఆసక్తిని తగ్గిస్తుంది. అలసటను కూడా పోగొడుతుంది. అనుష్క కూడా అల్పాహారంలో ఇడ్లీ సాంబార్ తినాలనుకుంటే ఆరునెలలపాటు అదే బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండేలా చూసుకుంటుందట. ఇక్కడ అనుష్క తీసుకనే సాంబార్, ఇడ్లీ పులియబెట్టినది కావడం వల్ల ఇందులోని గట్ స్కిన్‌ని మెరిసేల చేసుంది. దీనిలో ఉండే విటన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల శోషణ మేని ఛాయు ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది.
ఈ మోనోట్రోఫిక్ డైట్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు..
ఈజీగా ఫుడ్ ప్లాన్
భోజన ప్రణాళికను గణనీయంగా సులభతం చేస్తుంది. ప్రతిరోజు ఆహారంలో ఒకరకమైన ఆహారం లేదా ఒకే విధమైన ఆహార తినవల్సి ఉంటుంది. దీనివల్ల ఆహారం ఎక్కువగా తీసుకునే ఆసక్తి తగ్గుతుంది. ఒక విధమైన అలసటను నివారస్తిఉంది. ఒక నియమబద్ధమైన ఆహార నియమావళికి కట్టుబడి ఉండటాన్ని సులభతరం చేస్తంది.
జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది
ఒకేసారి ఒక రకమైన ఆహారాన్ని తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సులభతరం అవుతుంది. శరీరం ఏకకాలంలో బహుళ ఆహార రకాలను నిర్వహించడంలో సంక్లిష్టత లేకుండా ఒకే పోషకాన్ని విచ్ఛిన్నం చేయడం, గ్రహించడంపై దృష్టి పెడుతుంది. ఇది పోషకాల శోషణను మెరుగుపరచడంలో, జీర్ణ అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
కేలరీలు తీసుకోవడం తగ్గిస్తొంది..
భోజనాన్ని ఒకే ఆహారం లేదా ఒక విధమైన ఆహార సమూహానికి పరిమితం చేసినప్పుడు..ఆటోమెటగ్గా కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. అలాగే వివిధ రకాల ఆహార పదార్థాల కొరత ఉన్నప్పుడు అతిగా తినడాన్ని అరికట్టడానికి సహాయపడుతుంది. ఎందుకంటే..? ఒకేరకమైన ఆహారం అతిగా తినాలనే ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. ఇది చివరికి బరువు నిర్వహణలో సహాయపడుతుంది.
మైండ్‌ఫుల్ ఈటింగ్‌లో సహాయపడుతుంది
ఒక మోనోట్రోపిక్ ఆహారం సంపూర్ణతను ప్రోత్సహిస్తుంది. అనేక రుచులు వైప దృష్టిపోనివ్వకుండా, నెమ్మదిగా ఆహారాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. పైగా అతిగా తినడాన్ని నిరోధస్తుంది.
నిర్విషీకరణలో సహాయపడుతుంది
ఒక రకమైన ఆహారంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు శరీరం నిర్విషీకరణ ప్రక్రియలలో సహాయపడుతుంది. పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి టాక్సిన్‌లను తొలగించడంలో, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఆహారం పట్ల అవగాహనను పెంచుతుంది
మోనోట్రోపిక్ డైట్ వల్ల వివిధ ఆహారాలు, శక్తి స్థాయిలు, మానసిక స్థితి, మొత్తం శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై అవగాహనను పెంచుతుంది. ఆహారాన్ని వేరుచేయడం ద్వారా, రీరంపై ప్రతి ఒక్కటి ప్రత్యక్ష ప్రభావాన్ని స్పష్టంగా చూడవచ్చు.
ఆహారంలో సంక్లిష్టతను తొలగిస్తుంది
మోనోట్రోపిక్ డైట్ సరళత ఆహార సున్నితత్వం లేదా అలెర్జీలను గుర్తించడం సులభం చేస్తుంది. ఆహార సమూహాలను వేరుచేసినప్పుడు, ఏ ఆహారాలు ప్రతికూల ప్రతిచర్యలకు కారణమవుతాయో సులభంగా గుర్తించవచ్చు. అలాగే శరీరం ఆహారంలో సర్దుబాట్లు చేసేలా మిమ్మల్ని అనుమతిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment