లవంగాలు, యాలకులు, జీలకర్ర.. ఈ టీ తాగి చూడండి! | Summer Drinks: Cloves Cardamom Powder Cooling Tea How To Prepare | Sakshi
Sakshi News home page

Summer Drinks: లవంగాలు, యాలకులు, జీలకర్ర.. ఈ టీ గనుక తాగారంటే!

Published Tue, Apr 19 2022 1:54 PM | Last Updated on Tue, Apr 19 2022 2:00 PM

Summer Drinks: Cloves Cardamom Powder Cooling Tea How To Prepare - Sakshi

వేసవి కాలంలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలు అతిగా దాహంవేయడం, ఆకలి తక్కువగా ఉండడం. ఇది క్రమేణా ఎసిడిటీకి దారితీస్తుంది. ఏదైనా తిన్నవెంటనే వాంతయ్యేలా అనిపిస్తుంది. అయితే, ఈ టీ తాగడం వల్ల ఈ సమస్యలు రావు. అంతేగాక ఇది డీహైడ్రేషన్‌కు గురి కానియ్యదు. శరీరానికి చలవ చేస్తుంది.   

కూలిం‍గ్‌ టీ తయారీకి కావలసినవి: నీళ్లు – కప్పున్నర, లవంగాలు – రెండు, యాలకులు – రెండు, ధనియాలు – టీస్పూను, జీలకర్ర – టీస్పూను, పంచదార – ఒకటిన్నర టీస్పూన్లు.

తయారీ విధానం.. 
లవంగాలు, యాలకులను కచ్చాపచ్చాగా దంచి కప్పున్నర నీటిలో వేయాలి.
వీటితోపాటు ధనియాలు, జీలకర్ర కూడా వేయాలి. 
ఈ నీటిని పదినిమిషాల పాటు సన్నని మంట మీద మరిగించాలి 
పది నిమిషాల తరువాత పంచదార వేసి  ఐదు నిమిషాలు మరిగించి దించేయాలి. 
ఈ టీని ఉదయం అల్పాహారం తర్వాత గానీ సాయంత్రం గానీ తాగవచ్చు. 

చదవండి: Inti Panta: జానెడు జాగా ఖాళీగా ఉంచరు.. అక్కడ కూరగాయలన్నీ ఉచితమే!
     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement