లవంగం అనగానేపురాతన కాలం నుంచి వంటలలో వాడే మసాలాగా మాత్రమే గుర్తొస్తుంది. అలాగే పంటినొప్పులకు వాడే లవంగ తైలం గురొస్తుంది. వాస్తవానికి మసాలా దినుసు లవంగాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఔషధ గుణాలున్న లవంగ మొగ్గను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చలి విపరీతంగా ఉన్న ప్రస్తుతం తరుణంలో లవంగాలు చాలా కీలకంగా పనిచేస్తాయి.
ఆహారానికి మంచి రుచి, వాసన ఇచ్చే లవంగాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా చలికాలంలో వచ్చే అనేక రోగాల బారి నుండి కాపాడుకునేందుకు లవంగాలు ఉపయోపడతాయి. ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తాయి. లవంగాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. రోజుకి రెండు లవంగాలను నమలడం వల్ల బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు.
ప్రధాన ప్రయోజనాలు
లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ
ముఖ్యమైన పోషకాలూ లభిస్తాయి
కడుపులోని అల్సర్‌లను తగ్గిస్తుంది.
కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.
చెడు బ్యాక్టీరియాను మన దరి చేరకుండా కాపాడుతుంది.
రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సాయపడుతుంది.
ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
శీతాకాలంలో
లవంగాలలో ఉండే విటమిన్ ‘సి’ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను లవంగం దూరం చేస్తుంది. శీతాకాలంలో లవంగాల తయారు చేసిన టీ తాగితే జలుబు, గొంతునొప్పి, శ్వాసకోస సమస్యలు, దగ్గ లాంటివాటికి ఉపశమనం లభిస్తుంది. వీటిల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు దరి చేర నీయవు.
ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ గుణాలు పొడిదగ్గు, కఫంతో బాధపడే వారికి చాలామంచిది. కఫం సమస్య బాగా తగ్గుతుంది. ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాలు శరీరంలోని టాక్సిన్లను తొలగించి చర్మం మృదువుగా ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.
లవంగాలలో యుజైనాల్ అనే మూలకం యాంటీసెప్టిక్ లా పనిచేస్తుంది. పళ్ళ చిగుళ్ళను కాపాడుతుంది, పంటి సమస్యల నివారణలో పనిచేస్తుంది. లవంగాలను నమలడం వల్ల పంటినొప్పి తగ్గడంతో పాటు నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది.
ఇతర నొప్పుల నివారణలో కూడా ఇది మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు రెగ్యులర్‌గా లవంగాలను వాడడం వల్ల ఉపశమనం కలుగుతుంది. లవంగాలు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా టైప్ 2 మధుమేహాన్ని తగ్గిస్తుంది.
చర్మ దురదలను తగ్గించడంలో పెట్రోలియం జెల్లీ, ప్లేసిబో కంటే లవంగం నూనె బాగా పనిచేస్తుందని ఒక అధ్యయనం కనుగొంది.
ఇదీ చదవండి: భార్య కోసమే వీఆర్ఎస్, భర్త గుండె పగిలిన వైనం, వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment