మనం తినే ఆహారంలో తీగజాతి, దుంప ఇలా అన్ని రకాల కూరలు, ఆకుకూరలను చేర్చుకోవాలి. ముఖ్యంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో కూరగాయల తోటలు పచ్చగా కళకళలాడుతున్నాయి. బీర, సొరకాయలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. ఈరోజు సొరకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సొరకాయతో శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
సొరకాయలో విటమిన్ బీ, విటమిన్ సీ, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో నీరు ,కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుంది. ఎండాకాలంలో అయితే శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి సొరకాయ ఎంతగానో సహాయపడుతు సొరకాయతో పప్పు చట్నీ, సాంబార్, కర్రీ, ఇలా ఎన్నో వంటలను చేసి తినొచ్చు. ఇంకా సూప్‌లు లేదా స్మూతీ వంటి ఎన్నో రూపాల్లో తీసుకోవచ్చు. సొరకాయ జ్యూస్ న్యాచురల్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది.
సొరకాయతో ప్రయోజనాలు
రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
సొరకాయలో మెండుగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు చాలా మంచిది.
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది.
సొరకాయతో గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉన్న ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.
సొరకాయలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది.
మెగ్నీషియంతో కండరాలు బలపడతాయి. కాల్షియం కూడా మెండుగా ఉంటుంది. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సొరకాయ సహాయపడుతుంది.
సొరకాయలో కూడా విటమిన్ సీి మెండుగా ఉంటుంది. ఎన్నో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు, ఇతర రోగాలను అడ్డుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment