సోషల్ మీడియాలో రెసిపీలు, చిట్కాలకు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతూ ఉంటాయి. కానీ నిజానిజాలు తెలుసుకుని వాటిని పాటిస్తూ ఉండాలి.ఇటీవలి కాలంలో పచ్చి కరివేపాకు ఆకులను నమలడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని బాగుపడుతుందనే వార్త హల్‌చల్ చేస్తుంది. దీంట్లోని నిజానిజాలేంటో చూద్దాం రండి.
కరివేపాకుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కరివేపాకులో విటమిన్లు ఎ, బి, సి , డి వంటి ముఖ్యమైన పోషకాలు, అలాగే కాల్షియం, ఐరన్ ,ఫాస్పరస్ వంటి కొన్ని ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.అందుకే రోజువారీ కూరల్లో ప్రతీ దాంట్లోనూ కరివేపాకును విధిగా వాడుతూ ఉంటాం. దీంతో వంటకాలకు మంచి వాసన రావడం మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కరివేపాకులో అవసరమైన పోషకాలతో పాటు కొన్ని ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పచ్చి కరివేపాకును నమలడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ ఆకులు వెంట్రుకలకు పోషణ , జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కానీ దుష్ప్రభావాలు కూడా ఉంటాయినేది గమనించాలి.
బరువును నియంత్రిస్తుంది, చుట్టు మెరిసేలా చేస్తుంది
చెడు కొలస్ట్రాల్‌కు చెక్ చెప్పాలన్నా కరివేపాకు బాగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు, ఎక్కువ ఫ్యాట్ తో ఇబ్బంది పడేవారు రోజూ కరివేపాకును అనేక రూపాల్లో తింటూ ఉండాలి బ్లడ్ లోని షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. రోజూ కరివేపాకు తీసుకునే వారికి షుగర్ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ కరివేపాకులో ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కంటిచూపు మెరుగుపడుతుంది. కొల్లాజెన్‌ను పెంచడానికి తోడ్పడుతుంది. చుండ్రు, జుట్టు రాలిపోవడంలాంటి సమస్యలను అధిగమించొచ్చు. ఇందులో లభించే కెరోటిన్‌తో జుట్టు నిగనిగలాడుతూ బాగా పెరుగుతుంది. జుట్టు తెల్లగా అవ్వకుండా కాపాడుతుంది. మూత్రంలో మంట, మూత్రం సరిగ్గా రాకపోవడంలాంటి సమస్యలు ఏమీ కూడా ఉండవు. కిడ్నీల్లో రాళ్లతో బాధపడేవారు కరివేపాకులను ఎక్కువగా తీసుకోవాలి. అజీర్తిని తగ్గించి, ఆకలిని పెంచుతుంది కరివేపాకు ఆకలిని బాగా పెంచుతుంది. అందుకే జబ్బు పడిన వారికి, జ్వరం వచ్చితగ్గిన వారికి ధనియాలు, కరివేపాకుతో చేసిన కారప్పొడిని తినిపిస్తారు. విరేచనాలు విరేచనాలతో బాధపడేవారు కరివేపాకును బాగా ఎండబెట్టి దాన్ని పొడిగా చేసుకుని కాస్త తేనె కలుపుకుని తాగుతారు.
రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకులనుతినవచ్చు. అయితే దానిమీద పురుగుమందుల అవశేషాలు లేకుండా జాగ్రత్తపడాలి. శుభ్రంగా కడిగి తింటే చాలా రకాల అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు. మరీ అతిగా తీసుకోకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు పచ్చివి తినకుండా ఉంటే మంచిది.
ఎలా తినాలి?
కరివేపాకు పొడి, కరివేపాకు పచ్చడి, అన్ని రకాల కూరల్లో వాడటం ద్వారా దీని ప్రయోజనాలు పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment