Curry leaves
-
పచ్చి కరివేపాకు నములుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి?
సోషల్ మీడియాలో రెసిపీలు, చిట్కాలకు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతూ ఉంటాయి. కానీ నిజానిజాలు తెలుసుకుని వాటిని పాటిస్తూ ఉండాలి.ఇటీవలి కాలంలో పచ్చి కరివేపాకు ఆకులను నమలడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని బాగుపడుతుందనే వార్త హల్చల్ చేస్తుంది. దీంట్లోని నిజానిజాలేంటో చూద్దాం రండి.కరివేపాకుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కరివేపాకులో విటమిన్లు ఎ, బి, సి , డి వంటి ముఖ్యమైన పోషకాలు, అలాగే కాల్షియం, ఐరన్ ,ఫాస్పరస్ వంటి కొన్ని ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.అందుకే రోజువారీ కూరల్లో ప్రతీ దాంట్లోనూ కరివేపాకును విధిగా వాడుతూ ఉంటాం. దీంతో వంటకాలకు మంచి వాసన రావడం మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కరివేపాకులో అవసరమైన పోషకాలతో పాటు కొన్ని ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పచ్చి కరివేపాకును నమలడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ ఆకులు వెంట్రుకలకు పోషణ , జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కానీ దుష్ప్రభావాలు కూడా ఉంటాయినేది గమనించాలి.బరువును నియంత్రిస్తుంది, చుట్టు మెరిసేలా చేస్తుందిచెడు కొలస్ట్రాల్‌కు చెక్ చెప్పాలన్నా కరివేపాకు బాగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు, ఎక్కువ ఫ్యాట్ తో ఇబ్బంది పడేవారు రోజూ కరివేపాకును అనేక రూపాల్లో తింటూ ఉండాలి బ్లడ్ లోని షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. రోజూ కరివేపాకు తీసుకునే వారికి షుగర్ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ కరివేపాకులో ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కంటిచూపు మెరుగుపడుతుంది. కొల్లాజెన్‌ను పెంచడానికి తోడ్పడుతుంది. చుండ్రు, జుట్టు రాలిపోవడంలాంటి సమస్యలను అధిగమించొచ్చు. ఇందులో లభించే కెరోటిన్‌తో జుట్టు నిగనిగలాడుతూ బాగా పెరుగుతుంది. జుట్టు తెల్లగా అవ్వకుండా కాపాడుతుంది. మూత్రంలో మంట, మూత్రం సరిగ్గా రాకపోవడంలాంటి సమస్యలు ఏమీ కూడా ఉండవు. కిడ్నీల్లో రాళ్లతో బాధపడేవారు కరివేపాకులను ఎక్కువగా తీసుకోవాలి. అజీర్తిని తగ్గించి, ఆకలిని పెంచుతుంది కరివేపాకు ఆకలిని బాగా పెంచుతుంది. అందుకే జబ్బు పడిన వారికి, జ్వరం వచ్చితగ్గిన వారికి ధనియాలు, కరివేపాకుతో చేసిన కారప్పొడిని తినిపిస్తారు. విరేచనాలు విరేచనాలతో బాధపడేవారు కరివేపాకును బాగా ఎండబెట్టి దాన్ని పొడిగా చేసుకుని కాస్త తేనె కలుపుకుని తాగుతారు.రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకులనుతినవచ్చు. అయితే దానిమీద పురుగుమందుల అవశేషాలు లేకుండా జాగ్రత్తపడాలి. శుభ్రంగా కడిగి తింటే చాలా రకాల అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు. మరీ అతిగా తీసుకోకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు పచ్చివి తినకుండా ఉంటే మంచిది. ఎలా తినాలి?కరివేపాకు పొడి, కరివేపాకు పచ్చడి, అన్ని రకాల కూరల్లో వాడటం ద్వారా దీని ప్రయోజనాలు పొందవచ్చు. -
కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
కరివేపాకులు కూరల్లో వేస్తే దాని రుచే వేరు. కరివేపాకుతో పెట్టే పోపు దగ్గర నుంచి పులుసులు వరకు అది ఉంటే ఏ రెసిపీ అయినా ఘమఘమలాడిపోవాల్సిందే. అలాంటి కరివేపాకుని నిల్వ చేసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. ఎలా అయినా కనీసం నాలుగు రోజులు అవ్వంగానే నెమ్మదిగా గోధుమ వర్ణంలోకి వచ్చి వాసన పోయి..క్రమేణ ఆకుపచ్చదనం కూడా తగ్గిపోతుంది. ఎలా అయినా.. అబ్బా..! వీటిని నిల్వ చేయడం కష్టం రా బాబు అనుకుంటారు చాలామంది గృహిణులు. అందుకే చాలమంది వీటిని డ్రైగా చేసి పొడిరూపంలోనూ లేదా ఇతర విధాలుగా నిల్వ చేసుకుని కూరల్లో ఆ ఫ్లేవర్ వచ్చేలా చేస్తారు. అయితే ఆ సమస్యలన్నింటికి చెక్‌పెట్టేలా తాజాగా నిల్వ చేసుకునే సరికొత్త ట్రిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే..కరివేపాకులు నిల్వ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఈ ట్రిక్ ఫాలో అయితే ఆకులు కలర్ మారకుండా, వాటి వాసన కూడా ఏ మాత్రం పోకుండా చక్కగా తాజాగా ఉంచుకోవచ్చు. ఏకంగా ఇలా ఆరునెలలపాటు నిల్వ చేసుకోవచ్చట. అదేంటంటే..ఒక ఖాళీ ఐస్ ట్రైని తీసుకుని అందులో కరివేపాకు కొమ్మలు నుంచి వేరు చేసిన ఆకులను మూడు లేదా నాలుగు చొప్పున ఆకులను ట్రైలో పెట్టుకుంటూ వచ్చి దానిలో నీళ్లు పోయాలి. ఆ ట్రైని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి అంతే అవన్నీ గడ్డకట్టేసిన క్యూబ్‌లు మాదిరిగా అయిన తర్వాత బయటకు తీసి జిప్ లాక్ బ్యాగ్‌లో ఆ క్యూబ్‌లు వేసుకుని ఫ్రిడ్జ్‌లో భద్రపర్చుకోవాలి. కావాల్సినప్పడు ఆ బ్యాగ్ ఫ్రిడ్జ్‌లోంచి తీసి ఆ క్యూబ్‌లను ఓ గిన్నెలో వేసి దానిలో కొద్దిగా గోరు వెచ్చిని నీళ్లు వేసి కాసేపటి తరువాత చూస్తే తాజా కరివేపాకులు నీటిపై తేలుతూ కనిపిస్తాయి. అవి జస్ట్ ఇప్పుడే చెట్టునుంచి తెంపిన ఆకుల్లా తాజాగా కనిపిస్తాయి. వాటి వాసన కూడా పోదు. ఇలా ఆరునెలలపాటు సులభంగా నిల్వ చేసుకోవచ్చట. ఇది ఎక్కువగా శీతాకాలంలో ఉపయోగపడుతుందట. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. ఇలాంటి ట్రిక్ విదేశాల్లో ఉండే వారికి చాలా అద్భుతంగా ఉపయోగపుడుతుందని అంటున్నారు. అంతేగాదు జిప్‌లాక్ బ్యాగ్‌లో పుదీనా, కొత్తిమీర, పార్స్లీ ఆకులు ఉంచితే చాలా కాలం పాటు తాజాగా ఉంటాయని చెబుతున్నారు. View this post on Instagram A post shared by Dhara (@twinsbymyside) (చదవండి: రూ. 83 లక్షల జీతం వదులుకుని మరీ పేస్ట్రీ చెఫ్‌గా..రీజన్ వింటే షాకవ్వుతారు!) -
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
భారతీయ వంటల్లో కరివేపాకుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దీని వల్ల వంటలకు సువాసనను, రుచిని అందించడమే కాదు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.ఉదయాన్నే శుభ్రమైన కరివేపాకును నమిలి తినవచ్చు. లేదా కరివేపాకు నీటిని తాగవచ్చు.కరివేపాకు డీటాక్స్ వాటర్ గ్లాసుడు నీళ్లలో కొంచెం కరివేపాకులు వేసి మరిగించాలి. అలాగే పుదీనా ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి కొన్ని నిమిషాలు మరిగించాలి. దీనికి కొద్దిగా తేనె లేదా, నిమ్మరసం కలపు కొని తాగవచ్చు.జీర్ణక్రియలో సహాయపడుతుందిఫైబర్ నిండిన కరివేపాకు జీర్ణవ్యవస్థకు మంచిది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. కరివేపాకు నీటిని ఉదయాన్నే మోతాదుగా తీసుకుంటే మంచిది.రక్తాన్ని శుద్ధి చేస్తుంది: కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్ లక్షణం శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేస్తుంది. ముఖ్యంగా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.జుట్టు పెరుగుదలకు గ్రేట్: జుట్టుకు సహాయపడే గుణాలకు ప్రసిద్ధి చెందిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఆరోగ్యానికి సాయపడుతుంది.చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది: యాంటీఆక్సిడెంట్లతో నిండిన కరివేపాకు చర్మానికి హాని కలిగించే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అల్పాహారానికి ముందు క్రమం తప్పకుండా ఈ నీటిని తాగితే చర్మం ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. సహజమైన, ప్రకాశవంతమైన మెరుపు వస్తుంది.రోగనిరోధకశక్తికి బూస్టర్: కరివేపాకులో పోషకాలు ఎక్కువ. ఫైబర్ ఎక్కువ విటమిన్ సీ, ఇతర శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన కరివేపాకు సహజంగానే రోగనిరోధక శక్తి బూస్టర్‌లా పనిచేస్తుంది. కరివేపాకు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు , వ్యాధులకు వ్యతిరేకంగా శరీర శక్తి పెరుగుతుంది.చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది: కరివేపాకు గుండె ఆరోగ్యానికి చాలామంచిది. అవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఖాళీ కడుపుతో తీసుకున్న కరివేపాకు నీళ్లతో గుండె సంబంధిత సమస్యలును నివారించుకోవచ్చు.బ్లడ్ షుగర్: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరం. హై పోగ్లైసీమిక్ లక్షణాలతో కూడిన కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థ వంతంగా సమతుల్యం చేస్తుంది.అధిక బరువు: ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి కానీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే కరివేపాకును నమిలి తింటే అధిక బరువుతో బాధపడుతున్న వారికి దివ్య ఔషధంగా పని చేస్తుంది. కరివేపాకు వాటర్ ఆకలిని నియంత్రిస్తుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది. నోట్: ఇది అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు డైటీషియన్ లేదా మీ వైద్యుడిని సంప్రదించండి. -
ఎందెందు వెదికినా కరివేపాక్ కలదు
‘కరివేపాకులా తీసేయకు’ అని అంటాంగానీ ‘కరివేపాక్ మైసూర్‌పాక్ కంటే మహాగ్రేట్ సుమీ’ అంటుంది సోషల్ మీడియా ఫేమ్ కుశల కపిల. ఫ్యాషన్ ఎడిటర్, ఎంటర్టైన్మెంట్ రైటర్, కామెడీ కంటెంట్ క్రియేటర్‌గా ప్రతిభ చాటుకున్న కుశల తాజాగా కరివేపాకుపై దృష్టి పెట్టింది. ‘ఇందు గలదు. అందు లేదు అనే సందేహం వలదు’ టైప్‌లో కపిల కరివేపాకు గురించి ఇన్స్టాగ్రామ్ ‘రీల్’ చేసింది. ఈ రీల్ 8 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకోవడమే కాదు ‘కడి పట్ట’ ట్రెండ్‌గా వైరల్ అయింది. -
ఆరోగ్యానికి చాలా మంచిది.. కరివేపాకుతో పచ్చడి, టిఫిన్స్‌లో బావుంటుంది
కరివేపాకు పచ్చడి తయారీకి కావల్సినవి: కరివేపాకులు – రెండు కప్పులు; ఎండుమిర్చి – 10; చింతపండు – పెద్ద ఉసిరికాయ అంత పరిమాణం; పొట్టుతీసిన మినపగుళ్లు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; నువ్వులు – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; పచ్చికొబ్బరి తురుము – ముప్పావు కప్పు; బెల్లం – టేబుల్ స్పూను; ఉప్పు రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►బాణలిలో నూనెవేసి కాగనివ్వాలి. కాగిన నూనెలో మినపగుళ్లు, ఎండు మిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ► ఇదే బాణలిలో నువ్వులు వేసి దోరగా వేయించాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు ఆకులు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి. ► కరివేపాకు వేగిన తరువాత దించేసి, కొబ్బరి తురుము వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ► కరివేపాకు మిశ్రమం వేడి తగ్గిన తరువాత బెల్లం వేసి మెత్తగా నూరుకుంటే కరివేపాకు పచ్చడి రెడీ. అన్నం, చపాతీ, ఇడ్లీ, దోశల్లోకి బావుంటుంది. -
ఇలా సాగు చేస్తే కరివేపాకుతో మంచి ఆదాయం
-
ఖర్చులన్నీ పోగా ఎకరాకు లక్షన్నర ఆదాయం
-
Beauty Tips: ముఖం మీది రంధ్రాలు మాయం చేసే.. మెంతి ప్యాక్!
మెంతి.. ఆరోగ్య లాభాలు మాత్రమే కాదు.. అందాన్ని ఇనుమడింపజేసే గుణాలు కూడా దీని సొంతం. ఈ మెంతి ప్యాక్ ట్రై చేశారంటే ముఖం మీది రంధ్రాలు మాయం కావడం ఖాయం. ఇలా చేయండి 👉🏾రాత్రంతా నానబెట్టుకున్న టీస్పూను మెంతులను, నీళ్లు తీసేసి మిక్సీ జార్లో వేయాలి. 👉🏾దీనికి ఆరు వేపాకులు, రెండు కీరదోసకాయ ముక్కలు జోడించి పేస్టుచేయాలి. 👉🏾ఈ పేస్టులో టీస్పూను ముల్తానీ మట్టి, అరటీస్పూను నిమ్మరసం వేసి చక్కగా కలుపుకోవాలి. 👉🏾ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. 👉🏾తరువాత చేతులని తడిచేసుకుని ఐదు నిమిషాలపాటు మర్దనచేసి చల్లటి నీటితో కడిగేయాలి. 👉🏾వారానికి ఒకసారి క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం మీద కనిపిస్తోన్న రంధ్రాలు, డార్క్ సర్కిల్స్, మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోతాయి. 👉🏾ముఖ చర్మం బిగుతుగా మారి, మృదువైన నిగారింపుని సంతరించుకుంటుంది. 👉🏾మెంతుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ గుణాలు ముఖచర్మానికి తేమనందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. చదవండి👉🏾 Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం! Beauty Tips: ముడతలు, బ్లాక్ హెడ్స్‌కు చెక్.. ఈ డివైజ్ ధర రూ. 2,830 -
Diabetes: తియ్యటి కబురు.. ఈ పొడి ఉదయం, రాత్రి ఒక్కో టీ స్పూన్ తీసుకున్నారంటే
Health Benefits Of Curry Leaves For Sugar Patients: కరివేపాకు పరిశోధనల్లో భాగంగా 43 మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులతో నిర్వహించిన అధ్యయనంలో అనేక మంచి ఫలితాలు నిర్ధారణగా తెలిశాయి. వారందరికీ కరివేపాకు పొడి ఉదయం ఒక టీ స్పూన్, రాత్రి ఒక టీ స్పూన్ ఇచ్చి ఫలితాలను గమనించారు. బ్లడ్ షుగర్ స్థాయులు తగ్గుముఖం పట్టడం మొదలైంది. నెల రోజుల్లో రక్తంలో చక్కెర స్థాయులు (గ్లూకోజ్ స్థాయులు) క్రమబద్ధంగా మారడంతోపాటు జీర్ణక్రియ ఇతర జీవక్రియలు కూడా మెరుగయ్యాయి. మనుషుల మీద ప్రయోగించడానికి ముందు ఎలుకల మీద కూడా ముప్ఫైరోజుల అధ్యయనం చేశారు. మొత్తంగా తెలిసిందేమిటంటే... డయాబెటిస్‌కు ప్రస్తుతం వాడుకలో ఉన్న మందులకంటే కరివేపాకు వైద్యం మెరుగైన ఫలితాలనిస్తోంది అని. అలాగని డాక్టర్ సలహా తీసుకోకుండా మందులు మానేయకూడదు. పైన చెప్పిన విధంగా రోజూ కరివేపాకు తీసుకుంటూ గ్లూకోజ్ స్థాయులను నమోదుచేసుకుంటూ ఉండాలి. ఆ చార్ట్‌ను అనుసరించి మీ దేహంలో ఇతర ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని డాక్టర్లు డయాబెటిస్ మాత్రల మోతాదును నిర్ణయిస్తారు. కాబట్టి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే కరివేపాకును తీసిపడేయకండి! చదవండి: World Sleep Day: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు -
‘కూరలో కరివేపాకు’ అని తీసిపారేయకండి!
సాక్షి, హైదరాబాద్: ‘కూరలో కరివేపాకు’ అని ఇప్పుడు తేలికగా తీసిపారేయకండి. కరివేపాకుకూ ఇప్పుడు డిమాండ్ పెరిగింది. దిగుబడి తగ్గి...కొరత ఏర్పడడంతో నగరంలో కరివేపాకు ధరలకు రెక్కలొచ్చాయి. మునుపెన్నడూ లేనివిధంగా హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.120 పలుకుతోంది. ఇక రిటైల్ మార్కెట్లో ఒక కట్ట రూ. 5-10కి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కరివేపాకుకు సీజన్ కాకపోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో డిమాండ్‌కు తగిన సరఫరా లేక ధరలు పెరిగాయి. గ్రేటర్ పరిధిలోని హోల్‌సేల్, రిటైల్, రైతుబజార్లకు రోజు దాదాపు 10 టన్నుల వరకు దిగుమతి అవుతుంది. కరోనా కారణంగా గత పది నెలలుగా కరివేపాకు వినియోగం కూడా బాగా పెరిగింది. కరివేపాకులో లభించే ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా కాపాడుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీనిలో ఫోలిక్ యాసిడ్, నియాసిన్, బీటా కెరటిన్, ఇనుము, కాల్షియం, పాస్ఫరస్, పీచు, మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుదల పరిచి అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుందని గ్రేటర్ జనం కరివేపాకును ఎక్కువగా వినియోగిస్తున్నారు. కూరల్లో వాడడమే కాకుండా కరివేపాకు పొడిని ప్రత్యేకంగా తయారు చేసి కూడా అన్నంతోపాటు తీసుకుంటున్నారు. మూడింతలైన ధర గ్రేటర్లో కరివేపాకుకు డిమాండ్ పెరిగిందని మీరాలం మండి ఆకుకూరల వ్యాపారి బి.లలిత చెప్పారు. గతంలో కేజీ రూ. 40 ఉండగా ప్రస్తుతం రూ.120 ఉందన్నారు. శివారు జిల్లాల నుంచి నగరానికి కరివేపాకు దిగుమతి అవుతున్నా ప్రస్తుతం డిమాండ్‌కు సరిపోవడం లేదన్నారు. దీంతో విజయవాడ నుంచి కూడా కరివేపాకు దిగుమతి చేసుకుంటున్నారు. చదవండి: ఆక్సిజన్ ఉండేది 100 కోట్ల ఏళ్లే.. 5 అడుగుల విషనాగు.. ఒంటి చేత్తో పట్టుకొంది! -
పరగడుపున కరివేపాకు నమిలారంటే..
కరివేపాకు తెలియని వారుండరు. ఏ వంటకాలలో అయినా కరివేపాకు వేస్తే వచ్చే రుచే వేరు. ఆహారానికి అంత రుచిని అందిస్తున్న కరివేపాకును మాత్రం తినడానికి చాలామంది ఇష్టపడరు. ఇది కూరలో కనిపిస్తే అందరూ ఏరి పారేస్తారు. అయితే ఈ ఆకుల వల్ల వచ్చే లాభాలు తెలిస్తే మాత్రం చక్కగా నమిలేస్తారు. దీనిలో శరీరానికి కావాల్సిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ , బి విటమిన్, కెరోటీన్ పుష్కలంగా ఉంటాయి.. అంతే కాకుండా కంటి చూపును మెరుగుపరుస్తుంది. కరివేపాకును ఖాళీ కడుపుతో నమిలితే బరువు తగ్గడం, జుట్టు పెరగడం, జీర్జ వ్యవస్థ మెరుగు పడటం వటి అద్భుత ఫలితాలను పొందవచ్చు. కరివేపాకును చిన్న చిన్న మార్పులతో తీసుకుంటే మన రోజువారీ డైట్‌ను ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఉదయం పూట లేవగానే కొన్ని కరివేపాకును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మానవ శరీరంలోని అన్ని రకాల ఆరోగ్య ఫలితాలను అందిస్తోంది. కాకపోతే దీనికి కాస్తా అవగాహన ఉంటే చాలు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కరివేపాకు మీ జుట్టు రాలడాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది. ఉదయం ఒక గ్లాస్ నీటిని తాగండి. కొన్ని నిమిషాల తర్వాత కొన్ని తాజా కరివేపాకులను నమలండి. ఆకులను సరిగ్గా నమలాలి. ఇలా చేసాకా కనీసం అరగంట తర్వాతే టిఫిన్ చేయాలి. అలాగే కరివేపాకు వేసి కాచిన నూనెని తలకి మర్ధన చేస్తే కురులు ఆరోగ్యంగా, నల్లగా మెరుస్తాయి. 2. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఖాళీ కడుపుతో కరివేపాకు తీసుకోవడం ముఖ్యంగా జీర్ణ క్రియకు తోడ్పడుతుంది. ఇవి తినేటప్పుడు జీర్జ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. అలాగే పేగు కదలికకు. మలబద్దం నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. 3. ఆనారోగ్య బారీ నుంచి తప్పిస్తోంది. ఉదయం పూట కరివేపాకు తీసుకోవడం వల్ల అనారోగ్యం, వాంతులను తగ్గించడానికి దోహదపడుతుంది. ఈ సమస్యలను రూపుమాపడంలో జీర్జక్రీయను మెరుగుపరుస్తుంది. 4. బరువు తగ్గడంలో దోహదం కరివేపాకు నమలడం వల్ల బరువు తగ్గించే అనేక అంశాలకు సహకరిస్తుంది. మంచి జీర్ణక్రీయ. కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తుంది. కావున ఇక నంచి ‘కూరలో కరివేపాకులా తీసి పారేశారు’ అనే సామెతాలా.. ‘కరివేపాకే కదా’ అంటూ చిన్న చూపు చూడకుండా రోజూ ఏదో ఒక విధంగా కరివేపాకును ఉపయోగించండి. మరి ఇప్పటికైనా కూరల్లో కర్వేపాకును వేరేయకుండా.. ఎంచక్కా తినేసేయండి. -
ఇంటిప్స్
►డైనింగ్ టేబుల్ మీద అందంగా ఫ్లవర్‌వాజ్ పెట్టుకుంటారు. అందులోనే నాలుగైదు కరివేపాకు రెమ్మలు కూడా పెడితే ఈగలు ఆ పరిసరాలకు రావు. ►ఇంట్లో ఇండోర్ ప్లాంట్లు పెడితే చూడడానికి అందంగా ఉంటాయి కాని వాటిలో నీరు నిలువ వుంటే అక్కడ దోమలు వ్యాప్తి చెందుతాయి. ఈ సమస్య ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువ. తరిమినా పోవు సరికదా! ఇల్లంతా చుట్టుకుంటాయి. అలాంటప్పుడు పచ్చిబంగాళాదుంపను చక్రాలుగా కోసి కుండీలో పెడితే దోమలన్నీ ఆ ముక్కల మీదకు చేరతాయి. అప్పుడు ఆ ముక్కలను జాగ్రత్తగా తీసి పారేయాలి. -
సది పెట్టాము సల్లంగ చూడమ్మా
బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి. సల్లంగా చూసే తల్లి. సకల శుభాలనిచ్చే తల్లి. ఆ తల్లికి ప్రీతైన సద్దులు పెట్టడం భక్తుల ఆనవాయితీ. సద్ది పెడదాము. శరణు కోరుదాము. పెరుగు సద్ది కావలసినవి: అన్నం – 1 గ్లాసు; పెరుగు – 1 గ్లాసు; పాలు – 1/2 గ్లాసు; ఎండు మిరపకాయలు – 3; మినప్పప్పు – 1 టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు, జీలకర్ర – టీ స్పూను చొప్పున; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – 3 టీ స్పూన్లు; నెయ్యి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత. తయారీ: ►అన్నం మెత్తగా వండి మెదిపి పెట్టుకోవాలి ►పెరుగు, తగినంత ఉప్పు వేసి కలపాలి ►ఒక చిన్న గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేయాలి ►తర్వాత మినప్పప్పు, సెనగపప్పు వేసి కాస్త వేగాక కరివేపాకు వేసి దింపి, కలిపి ఉంచుకున్న పెరుగన్నంలో కలపాలి ►ఇందులో గోరువెచ్చని పాలు వేసి కలిపి మూతపెట్టి పది నిమిషాల తర్వాత వడ్డించాలి ►పాలు కలపడం వల్ల అన్నం పులుపెక్కకుండా కమ్మగా ఉంటుంది. మలీద కావలసినవి: గోధుమ పిండి – 1 కప్పు; ఉప్పు – చిటికెడు; బెల్లం తురుము – 1/2 కప్పు; ఏలకుల పొడి – 1/2 టీ స్పూను; నెయ్యి – 4 టీ స్పూన్లు. తయారీ: ►గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు వేసి కలిపి తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలిపి మూతపెట్టి ఉంచాలి ►తర్వాత ఉండలు చేసుకుని చపాతీలు చేసి కొద్దిగా నూనె వేసి కాల్చుకోవాలి ►వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని బెల్లం తురుము కలిపి మెత్తగా దంచుకోవాలి లేదా మిక్సీలో వేసి తిప్పాలి ►బయటకు తీసి నెయ్యి, ఏలకుల పొడితో పాటు, ఇష్టముంటే నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి నచ్చిన సైజులో ఉండలు కట్టుకోవాలి ►ఆరిన తర్వాత డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. కొబ్బరి సద్ది కావలసినవి: బియ్యం – 100 గ్రా.; పచ్చి కొబ్బరి పొడి – 100 గ్రా.; ఎండు మిరపకాయలు – 3; జీలకర్ర – 1/4 టీ స్పూను; ఆవాలు – 1/4 టీ స్పూను; మినప్పప్పు– 1 టీ స్పూను; సెనగపప్పు – 1 టీ స్పూను; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత; పల్లీలు – 50 గ్రా.; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – 5 టీ స్పూన్లు. తయారీ: ►అన్నం కాస్త బిరుసుగా వండి వెడల్పాటి పళ్ళెంలో వేసి తగినంత ఉప్పు కలిపి చల్లారనివ్వాలి ►ఒక గిన్నెలో నూనె వేడి చేసి పల్లీలు వేసి కాస్త వేగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి కొద్దిగా వేగాక, కొబ్బరి పొడి వేసి కొద్దిసేపు వేయించాలి ►ఈ పోపునంతా అన్నంలో వేసి కలిపి పది నిమిషాలు మూతపెట్టి ఉంచాక తినాలి (పోపు, కొబ్బరి... దోరగా వేగాలి, ఎర్రబడకూడదు). నిమ్మ సద్ది కావలసినవి: బియ్యం – 2 కప్పులు; నిమ్మకాయలు – 2; ఎండు మిరపకాయలు – 2; పచ్చి మిరపకాయలు – 2; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; ఆవాలు, జీలకర్ర – టీ స్పూన్ చొప్పున; మినప్పప్పు – 1 టీ స్పూన్; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; పల్లీలు – పావు కప్పు; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత; నూనె – 3 టీ స్పూన్లు. తయారి: ►అన్నం పొడిపొడిగా వండి చల్లారాక, తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ►బాణలిలో నూనె వేడి చేసి పల్లీలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత సెనగ పప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి ►ఇందులో నిలువుగా చీల్చిన పచ్చి మిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి కలిపి దింపేసి నిమ్మ రసం పిండాలి ►మొత్తం కలిపి అన్నంలో వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి ►పది నిమిషాల్లో తినడానికి రెడీగా ఉంటుంది. నువ్వుల సద్ది కావలసినవి: బియ్యం – 4 కప్పులు; నువ్వులు – 1/2 కప్పు; ఎండు మిరపకాయలు – 4; పచ్చి మిర్చి – 4; కరివేపాకు – 2 రెబ్బలు; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు, జీలకర్ర – 1/2 టీ స్పూను చొప్పున; పసుపు – 1/4 టీ స్పూను; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత; నూనె – 5 టీ స్పూన్లు. తయారి: ►బియ్యం కడిగి అరగంట నానిన తరవాత కొద్దిగా పలుకుగా (పొడిపొడిగా ఉండేలా) వండి చల్లార్చుకోవాలి ►బాణలిలో ఎండు మిర్చి, నువ్వులు దోరగా వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి ►వెడల్పాటి గిన్నెలో అన్నం తీసుకుని పొడిపొడిగా చేసుకుని చెంచాడు నూనె, పసుపు, తగినంత ఉప్పు, నువ్వుల పొడి వేసి బాగా కలియబెట్టి మూతపెట్టి ఉంచాలి ►మరో గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి ఇంగువ వేయాలి ►ఆవాలు, జీలకర్ర, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేయాలి ►పచ్చి సెనగ పప్పు, కరివేపాకు వేసి దోరగా వేగిన తర్వాత దింపేసి అన్నంలో వేసి కలపాలి ►మొత్తం బాగా కలిపి మూత పెట్టి అరగంట తర్వాత తినొచ్చు చింతపండు సద్ది కావలసినవి: బియ్యం – 2 కప్పులు; చింతపండు పులుసు – సగం కప్పు; ఎండు మిర్చి – 5; జీలకర్ర, ఆవాలు – 1/4 టీ స్పూను; మినప్పప్పు – 1 టీ స్పూను; సెనగ పప్పు – 1 టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పసుపు – 1/4 టీ స్పూను; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెబ్బలు; నూనె – 5 టీ స్పూన్లు. తయారి: ►బియ్యం కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట నానిన తర్వాత కొద్దిగా పలుకుగా వండి చల్లార్చుకోవాలి ►ఒక వెడల్పాటి గిన్నెలో అన్నం చల్లారబెట్టి పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి ►మరో చిన్న గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి ►అది కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి చిటపటలాడాక పల్లీలు, మినప్పప్పు, సెనగ పప్పు, కరివేపాకు వేసి వేగిన చింతపండు పులుసు వేసి చిక్కబడేవరకు ఉడికించాలి ►చివరలో కరివేపాకు, కొంచెం బెల్లం వేసి రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి ►కలిపి ఉంచుకున్న అన్నంలో వేసి బాగా కలియబెట్టి పది నిమిషాలు ఉంచితే చాలు. కర్టెసీ: జ్యోతి వలబోజు, హైదరాబాద్ నాన్–వెజ్ నాటు కోడి ఫ్రై కావలసినవి:నాటుకోడి – అర కేజీ; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; నూనె – 3 టీ స్పూన్లు; ఉల్లి తరుగు–పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 6; మిరియాల పొడి – అర టీ స్పూను; జాజికాయ–చిన్న ముక్క; గరం మసాలా – టీ స్పూను; జీలకర్ర పొడి – టీ స్పూను; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత, జీడిపప్పులు – 50 గ్రా.; టొమాటో తరుగు – కప్పు; పుదీనా – ఒక కట్ట; కొత్తిమీర – చిన్న కట్ట; నిమ్మ రసం–ఒక టీ స్పూను; కరివేపాకు–రెండు రెమ్మలు; జీలకర్ర – అర టీ స్పూను. తయారీ: ►నాటుకోడి ముక్కలను శుభ్రం చేసి నీళ్లతో కడగాలి ►స్టౌ మీద కుకర్ ఉంచి, కొద్దిగా నూనె వేసి కాగాక జీలకర్ర, గరం మసాలా, కరివేపాకు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, టొమాటో తరుగు, జీడి పప్పులు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ►చికెన్ ముక్కలను కూడా వేసి వేయించాలి. ►ఉప్పు, మిరప కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి బాగా కలపాలి ►ఉడికించిన ముక్కలకు మసాలా అంతా బాగా పట్టేలా బాగా కలియబెట్టాలి ►చివరగా నిమ్మ రసం, కొత్తిమీర, పుదీనా తరుగుతో అలంకరించి దింపి, వేడి వేడిగా అందించాలి. పాయా షోర్వా కావలసినవి: పాయా – 4; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 6; టొమాటో తరుగు – అర కప్పు; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – 2 టీ స్పూన్లు; బిర్యానీ ఆకు – 1; గరం మసాలా – టేబుల్ స్పూను; జీలకర్ర పొడి – టీæ స్పూను; ధనియాల పొడి – టీ స్పూను; నూనె – 3 టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; మిరియాల పొడి – టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; పుట్నాల పప్పు – 50 గ్రా.; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; కొత్తిమీర – చిన్న కట్ట; నిమ్మ రసం – ఒక టీ స్పూను; పుదీనాఆకులు – ఒక కట్ట. తయారీ: ►పాయా ముక్కలను ఉప్పు, నిమ్మ రసంతో శుభ్రంగా కడగాలి ►కొద్దిగా ఉప్పు, పసుపు చేసి బాగా కలిపి, మూత పెట్టి కొద్దిసేపు పక్కన ఉంచాలి ►మిక్సీలో పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి తురుము వేసి మెత్తగా ముద్దలా చేసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగిన తరవాత, గరం మసాలా, బిర్యానీ ఆకు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద ఒకదాని తరవాత ఒకటి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ►జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి మరోమారు కలియబెట్టాలి ►టొమాటో తరుగు వేసి బాగా కలిపిన తరవాత, మిక్సీ పట్టిన కొబ్బరి మిశ్రమం జత చేయాలి ►ఊరబెట్టిన పాయాను జత చేసి బాగా కలియబెట్టి, తగినన్ని నీళ్లు పోయాలి ►సుమారు అరగంట సేపు ఉడికించిన తరవాత దింపేసి తరిగిన పుదీనా ఆకులతో అలంకరించాలి. రొయ్యల పులావ్ కావలసినవి: రొయ్యలు – పావు కేజీ; బాస్మతి బియ్యం – అర కేజీ; నెయ్యి – 100 గ్రా.; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 5; గరం మసాలా – ఒక టీ స్పూను; పెరుగు – అర కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు; కారం – ఒక టీ స్పూను; ఉప్పు– తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – చిన్న కట్ట; పుదీనా – చిన్న కట్ట; బిర్యానీ ఆకు – 1; షాజీరా – అర టీ స్పూను; జీడిపప్పులు – 50 గ్రా.; కిస్మిస్ – 50 గ్రా.; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంట సేపు నానబెట్టాలి ►రొయ్యలను శుభ్రం చేసి, ఉప్పు, నిమ్మరసంతో కడగాలి ►మిక్సీలో ఉల్లి తరుగు, పచ్చి మిర్చి వేసి మెత్తగా ముద్ద చేసి పక్కన ఉంచాలి ►టొమాటోలను మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కనుంచాలి ►స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కాగాక, జీడిపప్పులు, కిస్మిస్ వేసి దోరగా వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►మిగిలిన నేతిలో... షాజీరా, బిర్యానీ ఆకు, గరం మసాలా, ఉల్లి + పచ్చి మిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలియబెట్టాలి ►రొయ్యలను జత చేసి బాగా కలిపి మిరప కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, టొమాటో ముద్ద వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు జత చేయాలి ►నీళ్లు బాగా మరిగాక నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి కలియబెట్టాలి ►మూడు వంతులు ఉడికిన తరవాత, మంట బాగా తగ్గించి ఉడికిన తరవాత దింపేసి, ఒక బౌల్లోకి తీసుకుని, జీడిపప్పు, కిస్మిస్, కొత్తిమీర, పుదీనా ఆకులతో అలంకరించాలి. తెలంగాణ చేపల పులుసు కావలసినవి: చేపముక్కలు – అర కేజీ; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 6; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – ఒక కట్ట; నూనె – 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; మిరప కారం – 3 టీ స్పూన్లు; పసుపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; వేయించిన మెంతులు – ఒక టేబుల్ స్పూను; చింతపండు గుజ్జు – ఒక కప్పు; నిమ్మ రసం – ఒక టీ స్పూను; అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►చేప ముక్కలను బాగు చేసి కడిగి పక్కన ఉంచాలి ►ఉప్పు, పసుపు, కారం జత చేసి, కలిపి మూత ఉంచాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాగాక, ఊర బెట్టిన చేపముక్కలను వేసి వేయించి పక్కన ఉంచాలి ►స్టౌ మీద ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడించాలి ►కరివేపాకు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►జీలకర్ర పొడి, మెంతుల పొడి, మిరప కారం, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి ►టొమాటో తరుగు వేసి ఒకసారి కలిపిన తరవాత చింత పండు పులుసు, తగినన్ని నీళ్లు పోయాలి ►చేప ముక్కలను వేసి కలిపి, పైన మూత ఉంచాలి ►ముక్కలను ఉడికిన తరవాత మంట తీసేయాలి ►పైన సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లి మూత ఉంచాలి ►వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి. తవ్వ గ్రిల్డ్ చికెన్ కావలసినవి: బోన్‌లెస్ చికెన్ – అర కేజీ (పెద్ద ముక్కలు); నూనె – కొద్దిగా; ఉప్పు – తగినంత; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; మిరియాల పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – కొద్దిగా; పచ్చి మిర్చి ముద్ద – ఒక టేబుల్ స్పూను; ఆవ నూనె – 2 టీ స్పూన్లు; వాము – అర టీ స్పూను; చాట్ మసాలా – కొద్దిగా; చీజ్ తురుము – కొద్దిగా; సతాయ్ స్టిక్స్ – ఒక ప్యాకెట్; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు; క్యాప్సికమ్ తరుగు – ఒక కప్పు; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కనుంచాలి ►ఒక పెద్ద పాత్రలో చికెన్ ముక్కలు, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి బాగా కలపాలి ►ఉప్పు, పచ్చి మిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు జత చేసి మరోమారు కలిపి మూత పెట్టి సుమారు అర గంట సేపు పక్కన ఉంచాక, మూత తీసి కారం, మిరియాల పొడి, ఏలకుల పొడి, ఇంగువ, ►జీలకర్ర పొడి, నిమ్మ రసం, చీజ్ తురుము, ఆవ నూనె, కొత్తిమీర వేసి బాగా కలియబెట్టి పక్కన ఉంచాలి ►సతాయ్ స్టిక్స్ తీసుకుని చికెన్ ముక్కలను ఒకదాని తరవాత ఒకటి గుచ్చాలి ►స్టౌ మీద తవ్వ ఉంచి వేడి చేయాలి ►కొద్దిగా నూనె వేసి బాగా కాగాక చికెన్ ముక్కలను ఒకదాని పక్కన ఒకటి అమర్చాలి ►బాగా మెత్తబడే వరకు కాలనివ్వాలి (గ్రిల్ మీద ఉంచినప్పుడు మంట సిమ్‌లో మాత్రమే ఉండాలి) ►బాగా కాలిన తరవాత వాటిని ప్లేట్లోకి తీసుకుని, అమర్చాలి ►కొత్తిమీరతో అలంకరించి అందించాలి. చింత చిగురు మాంసం కూర కావలసినవి: మటన్ – అర కేజీ; చింత చిగురు – 150 గ్రా.; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 5; కరివేపాకు – రెండు రెమ్మలు; అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 5; నూనె – 50 మి. లీ.; జీలకర్ర – ఒక టీ స్పూను; కారం – 3 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – తగినంత; నీళ్లు – సరిపడా. తయారీ: ►మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి ►చింత చిగురును శుభ్రంగా కడిగి, సన్నగా తరగాలి ►స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక, జీలకర్ర, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి, కరివేపాకు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి మరోమారు వేయించాలి ►సిద్ధంగా ఉంచిన మటన్ జత చేసి బాగా కలియబెట్టాలి ►పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి గరిటెతో కలపాలి ►టొమాటో తరుగు వేసి బాగా కలిపి, చింత చిగురు కూడా జత చేసి బాగా కలిపి, తగినన్ని నీళ్లు పోసి కుకర్ మూత ఉంచి ఆరేడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►చివరగా సిద్ధంగా ఉంచిన కొత్తిమీరను పైన అలంకరించాలి ►అన్నంలోకి, రోటీలలోకి ఈ కూర రుచిగా ఉంటుంది. – కర్టెసీ: స్వజన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, భువనేశ్వర్ -
హెల్త్ టిప్స్
►ప్రతిరోజూ నాలుగైదు రెమ్మల పచ్చి కరివేపాకు తింటుంటే చిన్న వయసులో జుట్టు తెల్లబడడాన్ని నివారిస్తుంది. ►కరివేపాకు డయాబెటిస్‌ను అరికట్టడంలోసమర్థంగా పనిచేస్తుంది. ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటిస్ ఉన్నట్లయితే తప్పకుండా ప్రతిరోజూ ఉదయం పరగడుపున గుప్పెడు కరివేపాకు (పచ్చిది కాని మరే రూపంలోనైనా)తినాలి. ఇలా క్రమం తప్పకుండా వందరోజులు తింటే మంచి ఫలితం ఉంటుంది. ►హైబీపీ లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లయితేపరగడుపున ఒక పచ్చి వెల్లుల్లి రేకు తినాలి. ►వెల్లుల్లి బ్లడ్‌ప్రెషర్‌ను తగ్గించి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. ►ఓట్మీల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మూడు వారాలపాటు ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్‌మీల్‌ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. -
ఆరోగ్య కారకం
వాతావరణం చల్లబడినట్లే ఉంది. పొడిగా ఉండడం అవసరం. పొడులు తినడమూ అవసరం.వర్షాలు వెళ్లే వరకూరోజూ ఒక ముద్ద కారప్పొడితో తింటే..అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. పేరుకు కారాలే గానీ..రుచికరమైన ఆరోగ్య కారకాలే ఇవన్నీ! కాకరకాయ కారం కావలసినవి: కాకరకాయలు ఒక కిలో; ఎండు మిర్చి: 100 గ్రా‘‘; చింతపండు: 50 గ్రా‘‘; ధనియాలు: 50 గ్రా‘‘; వెల్లుల్లి: 50 గ్రా‘‘; జీలకర్ర: రెండు స్పూన్లు; శనగపప్పు: మినప్పప్పు: ఒక్కొక్కటి ఒక స్పూను; ఉప్పు,నూనె: తగినంత తయారి: దీనికి రెండు రోజులు పని చేయాలి. ముందు రోజు కాకరకాయలను చిన్న ముక్కలు చేసి ఎండబెట్టాలి. మరుసటి రోజు నూనెలో వేయించి పొడి చేయాలి. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నింటినీ వేయించుకుని చింతపండు, వెల్లుల్లి వేసి పొడి చేయాలి. ఈ మిశ్రమంలో కాకరకాయ ముక్కల పొడిని కలుపుకోవాలి. దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడ. కరివేపాకు కారం కావలసినవి: కరివేపాకు: పావుకిలో; ఎండు మిర్చి: 100గ్రా‘‘; చింతపండు: 50గ్రా‘‘; వెల్లుల్లి: 50గ్రా‘‘; జీలకర్ర: రెండు స్పూన్లు; ధనియాలు: 100గ్రా‘‘; పచ్చిశనగపప్పు: రెండు స్పూన్లు; మినప్పప్పు: రెండు స్పూన్లు; నూనె: వేయించడానికి కావలసినంత. తయారి: కరివేపాకును కారం చేయడానికి ముందురోజు కడిగి ఆరబెట్టాలి. ఆరిన కరివేపాకును రెమ్మల నుండి విడదీసి సిద్ధంగా ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత కరివేపాకును వేయించాలి. దానిని పక్కన ఉంచి మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పప్పులు అన్నీ వేయించుకుని పొడి చేసేటప్పుడు చింతపండు, వెల్లుల్లిని చేర్చాలి. ఇది దోశలలోకి బాగుంటుంది. అన్నం లో కలుపుకోవచ్చు. ఏదైనా అనారోగ్యం నుంచి స్వస్థత పొందిన వాళ్లకు దీనితో భోజనం పెడితే నోటి అరుచి పోయి హితవు పుడుతుంది. త్వరగా జీర్ణం కావడంతోపాటు కరివేపాకులో ఉండే ఐరన్ శరీరానికి శక్తినిస్తుంది. కంది కారం కావలసినవి: కందిపప్పు: 100గ్రా‘‘; ఎండు మిరపకాయలు: 50గ్రా‘‘; శనగపప్పు: ఒక స్పూను; పెసరపప్పు: ఒక స్పూను; ఇంగువపొడి: ఒక స్పూను; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు: తగినంత; నూనె: తగినంత. తయారి: కందిపప్పు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు, పెసరపప్పు ఒకదాని తర్వాత మరొకటి వేయించుకుని పొడి చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు, ఇంగువ పొడి వేయాలి. దీనిని అన్నంలోకి కలుపుకోవచ్చు. వేపుడు కూరలలో చివరగా రెండు స్పూన్ల కారం చల్లితే ఆ రుచే వేరు. నల్ల కారం కావలసినవి: ఎండుమిరపకాయలు: 100 గ్రా; చింతపండు: 50 గ్రా‘‘; వెల్లుల్లి: 50 గ్రా; ధనియాలు: 50 గ్రా; పచ్చిశనగపప్పు: ఒక స్పూన్; మినప్పప్పు: ఒక స్పూన్; కరివేపాకు: కొద్దిగా; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు: తగినంత; నూనె: వేయించడానికి కావలసినంత. తయారి: బాణలిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు అన్నింటినీ విడివిడిగా వేయించాలి. వేడి చల్లారిన తర్వాత అన్నింటినీ కలిపి పొడి చేసుకోవాలి. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి బాగుంటుంది. కొబ్బరి కారం కావలసినవి: పచ్చికొబ్బరి: ఒక కాయ నుంచి తీసినది; ఎండు మిర్చి: 50 గ్రా‘‘; ధనియాలు: 50 గ్రా‘‘; మినప్పప్పు: ఒక స్పూను; శనగపప్పు: ఒక స్పూను; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు, నూనె: తగినంత. తయారి: పచ్చికొబ్బరి తురుముకుని పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఎండు మిర్చి వేయించిన తర్వాత కొబ్బరి తురుమును వేయించాలి. ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు కూడ వేయించుకుని అన్నీ కలిపి ఉప్పు చేర్చి పొడి చేసుకోవాలి. ఈ పొడిని వేపుడు కూరలలో వేసుకుంటారు. ఈ కారంపొడిలో నెయ్యి కలిపితే ఇడ్లీకి మంచి కాంబినేషన్. ఇడ్లీ కారం కావలసినవి: వేయించిన శనగపప్పు(పుట్నాలు): 100 గ్రా‘‘; ఎండు కొబ్బరి: 50 గ్రా‘‘; వెల్లుల్లి: 50 గ్రా‘‘; జీలకర్ర: రెండు స్పూన్లు; ఎండు మిర్చి: 50గ్రా‘‘; ఉప్పు: రుచికి తగినంత; నూనె: వేయించడానికి సరిపడినంత. తయారి: నూనె వేడయ్యాక ముందుగా ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకుని శనగపప్పు, జీలకర్ర ఒకదాని తర్వాత మరొకటి వేయించాలి. ముందుగా మిరపకాయలను గ్రైండ్ చేసి దానిలో పుట్నాలు, ఎండుకొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. పేరుకి ఇది ఇడ్లీకారమే అయినా వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ కారం కలిపి తింటే ఇక వేరే కూరలేవీ రుచించవు. కూర కారాలు కూర కారం కావలసినవి:ఎండు మిర్చి: ఒక కిలో; ధనియాలు: పావు కిలో వెల్లుల్లి: పావుకిలో; జీలకర్ర: 150గ్రా‘‘ మెంతులు: 50గ్రా‘‘; ఉప్పు: పావుకిలో తయారి: కూరకారానికి ఎండుమిర్చి వేయించకూడదు. ధనియాలు, జీలకర్ర విడివిడిగా వేయించుకుని చల్లారిన తర్వాత పొడి చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లి, ఉప్పు చేర్చుకోవాలి. దీనిని పులుసుల్లో వేసుకుంటే రుచి పెరగడమే కాక, ఘుమఘుమలాడుతుంది. కూరకారం, ఇగురుకారం ఆరు నెలల పాటు నిలవ ఉంటాయి నువ్వుల పొడి కావలసినవి: తెల్ల నువ్వులు: 100గ్రా‘‘; చింతపండు : 50గ్రా‘‘; ధనియాలు : 50గ్రా‘‘; మినప్పప్పు: ఒక స్పూను; శనగ పప్పు: ఒక స్పూను; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు, నూనె : తగినంత. తయారి: నువ్వులు, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్రలను విడివిడిగా వేయించి అన్నింటినీ కలిపి పొడి చేసుకొని తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇది అన్నంలోకి ఇడ్లీకి మంచి కాంబినేషన్. దీనిని ఎక్కువగా శీతాకాలంలో చేసుకుంటారు. వర్షాకాలంలో కూడ చేసుకోవచ్చు. వాతావరణంలో మార్పులకు అనుగుణంగా శరీరానికి అందించాల్సిన ఔషధాలను ఆహార రూపంలో అందించడమే మన రుచుల ప్రత్యేకత. ఇగురుకారం కావలసినవి: ఎండుమిర్చి: ఒక కిలో జీలకర్ర: పావుకిలో వెల్లుల్లి: పావుకిలో నూనె: వేయించడానికి కావలసినంత తయారి: మిరపకాయలను నూనెలో వేయించి చల్లారిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి వేసి పొడి చేసుకోవాలి. దీనిని కూరలు, వేపుళ్లలో వేసుకుంటే వంటల రుచి మరింత ఇనుమడిస్తుంది. నాన్ వెజ్ రొయ్యల కారం కావలసినవి: ఎండు కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పుఎండు రొయ్యలు– అర కప్పుఉల్లిపాయ ముక్కలు– పావు కప్పుఅల్లం తరుగు – ఒక టీ స్పూనుకరివేపాకు – మూడురెమ్మలుఎండు మిరపకాయలు– ఆరునల్ల మిరియాలు– 15చింతపండు– పెద్ద ఉసిరికాయంతఉప్పు– రుచికి తగినంత తయారి: ఎండు రొయ్యలను పెనంలో వేసి (నూనె లేకుండా) సన్నమంట మీద దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో కొబ్బరి తురుమును, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, మిరియాలు, ఎండుమిర్చిని దోరగా వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత అందులో చింతపండు, ఉప్పు వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. పల్లీ కారం పల్లీకారం: కొబ్బరికారంలో వేసిన దినుసులన్నీ వేసుకుని కొబ్బరికి బదులుగా వందగ్రాముల వేరుశనగ పప్పు వాడాలి. ఇది ఇడ్లీ, దోశ, అన్నం అన్నింటిలోకి మంచి ఆధరువు. కరివేపాకు కారానికి వాడిన దినుసులన్నీ వేసుకుంటూ కరివేపాకు బదులుగా పుదీనా వాడాలి. కొత్తిమీర పొడికి కూడ ఇదే పద్ధతి. -
కరివేపతో కొత్త కాంతి
♦ ఉప్మాలోనే కాదు... కరివేపాకును ఎప్పుడూ తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే కరివేప మంచి సౌందర్య సాధనం కూడా. ♦ కరివేపాకుని శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక స్పూను కరివేపాకు ముద్దలో కొద్దిగా పసుపు కలిపి మోచేతులకు రాసుకుని పావుగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మోచేతుల దగ్గర నలుపు పోతుంది. ♦ వేడినీళ్లలో కరివేప ఆకులు వేసి పావుగంట తర్వాత ఆకుల్ని తీసేసి అందులో చల్లటి నీళ్లు కలుపుకుని వాటితో ముఖాన్ని కడుక్కోవాలి. వర్షాకాలంలో ఇలా చేస్తే మంచిది. తరచూ ఇలా చేయడం వల్ల మొటిమల సమస్యలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. -
జీవితాన్ని మార్చేసిన కరివేపాకు
సాక్షి, ఉరవకొండ: అనంతపురం జిల్లాలో అత్యంత దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఉరవకొండ నియోజకవర్గంలోనే. చుట్టూ ఎటు చూసినా నల్లరేగడి భూములు. వేల అడుగుల లోతున బోరుబావులు తవ్వించినా.. నీటి చెమ్మ తగలని భూములు. వర్షాధారంపైనే పంటల సాగు. సాగునీటి వనరులంటూ ప్రత్యేకించి ఏమీ లేవు. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో ఇటుగా వచ్చిన హంద్రీనీవా కాలువ ద్వారా సాగునీటిని అందించడంలో గత ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం కనబరిచింది. ఫలితంగా దారుణమైన పరిస్థితులను ఈ ప్రాంత రైతులు చవిచూస్తూ వచ్చారు. పంటల సాగు భారమైన ఇలాంటి తరుణంలో నియోజకవర్గంలోని తట్రకల్లు గ్రామ రైతులు నూతన చరిత్ర సృష్టిస్తున్నారు. కరివేపాకు సాగుతో ఏటా తిరుగులేని ఆదాయం గడిస్తున్నారు. వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామ జనాభా 1,800. ఇక్కడ 70 శాతం మంది వ్యవసాయామే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో వంద ఎకరాలు సాగులో ఉండగా.. మొత్తం కరివేపాకు సాగు చేపట్టడం గమనార్హం. ఇక్కడ సాగు చేస్తున్న కరివేపాకును రైతులు ముంబయికి ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నారు. 15 సంవత్సరాలుగా ఒకే పంట తట్రకల్లులో 15 ఏళ్లుగా రైతులు ఒకే రకం పంట సాగు చేపట్టారు. అంతకు ముందు వివిధ రకాల పంటల సాగు చేపట్టి వర్షాభావ పరిస్థితులతో తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నారు. ప్రత్యామ్నాయంగా చేపట్టిన కరివేపాకు సాగు ఆ గ్రామ రైతుల పాలిట కల్పతరువుగా మారింది. గ్రామ రైతులు తమకు చెందిన వంద ఎకరాల్లో కరివేపాకు పంట సాగును బిందు సేద్యం ద్వారా చేపట్టారు. పంట సాగుకు ఎకరాకు రూ.80వేల నుంచి రూ. లక్ష వరకూ పెట్టుబడులు పెడుతూ ఎకరాకు మూడు క్వింటాళ్ల విత్తనం వేస్తున్నారు. ఏడాదిలో మూడు సార్లు పంట కోతకు వస్తోంది. నికర ఆదాయం కచ్చితం కరివేపాకు సాగులో తట్రకల్లు రైతులు ఏనాడూ నష్టపోలేదు. ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి వస్తోంది. మార్కెట్లో టన్ను కరివేపాకు రూ.9,500 నుంచి రూ.10వేల వరకూ అమ్ముడుపోతోంది. పంటను మార్కెట్‌కు తరలించే భారం కూడా లేకుండా ముంబయికి చెందిన పలువురు వ్యాపారులు నేరుగా తట్రకల్లుకు చేరుకుని పంట కోత కోయించి తీసుకెళుతుంటారు. కోత కోసిన పంటను వాహనాల్లో గుంతకల్లుకు తరలించి, అక్కడి నుంచి రైళ్లలో ముంబయికి చేరవేస్తుంటారు. ఏడాదిలో మూడుసార్లు పంట కోత ద్వారా నికర ఆదాయం కచ్చితంగా వస్తుందని స్థానిక రైతులు అంటున్నారు. ఏడాదికి రూ.7 లక్షల ఆదాయం మహిళ రైతు ఓబులమ్మ పదేళ్లుగా తనకున్న అయిదెకరాల్లో కరివేపాకు సాగు చేస్తున్నారు. పొలంలో ఉన్న బోరు ద్వారా అరకొర నీరు వస్తోంది. ఆ నీటినే పొదుపుగా బిందుసేద్యం ద్వారా వాడుకుంటూ పంట సాగుచేస్తూ వస్తున్నారు. ఎకరాకు అయిదు టన్నుల దిగుబడి వస్తోంది. టన్ను పంటను రూ.9,500తో విక్రయించినా... ఐదు ఎకరాల్లో రూ.2,37,500 ఒక కోతకు ఆదాయం గడిస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి మూడు కోతలకు గానూ రూ.7 లక్షలకు పైగా ఆదాయం అందుతోంది. -
క్యాన్సర్లను తరిమేసే కరివేపాకు
గుడ్‌ఫుడ్ కూరలో కరివేపాకు అంటూ దాని పేరిట ఒక సామెతే వెలిసింది. కానీ కరివేపాకు అంత తీసివేయదగినది ఎంతమాత్రమూ కాదు. దానితో ఒనగూరే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కరివేపతో సమకూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే... ►కరివేపాకులో క్యాన్సర్లను తరిమేసే గుణం ఉంది. కాబట్టే ఉత్తరాది వారితో పోలిస్తే... కూరలతో పాటు చాలా వంటకాల్ని తాలింపు పెట్టుకునే అలవాటు ఉన్నందున దక్షిణాది ప్రాంతాలవారికి జీర్ణసంబంధిత క్యాన్సర్ల వంటి కొన్ని రకాల విస్తృతి చాలా తక్కువ. కరివేపాకుతో ల్యూకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్లు సైతం దూరమవుతాయి. కరివేపలో క్యాన్సర్లతో పోరాడే, నివారించే గుణం అందని జపాన్‌లోని మెజియో యూనివర్సిటీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నిపుణులు ఆధారాలతో సహా నిరూపించారు. ►కరివేపలో డయాబెటిస్తో పోరాడే గుణం కూడా ఉంది. ఈ విషయాన్ని చెన్నైలోని యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ మాలెక్యులార్ బయాలజీ విభాగం సైతం తమ అధ్యయనాల్లో నిరూపించింది. ►మన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ పాళ్లను కరివేపాకు గణనీయంగా తగ్గిస్తుందని ‘యూనివర్సిటీ ఆఫ్ కేరళ’లోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ పరిశోధకులు తేల్చి చెప్పారు. ►కరివేపాకులో విటమిన్–ఏ పాళ్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే మన ఆహారాల్లో కరివేప వాడేవారి చూపు చాలాకాలం పాటు బాగుంటుంది. ►కరివేప కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి, సిర్రోసిస్ బారినుంచి కాలేయాన్ని రక్షిస్తుంది. హెపటైటిస్ వంటి సమస్యలను నుంచి కూడా రక్షిస్తుంది. ►చర్మసౌందర్యాన్ని ఇనుమడింపజేయడంలో కరివేపాకు భూమిక చాలా ఉందని తేలింది. జుట్టు బాగా పెరిగేందుకు కూడా దోహదపడుతుంది. ► ఒత్తిడిని అధిగమించడంలోనూ బాగా ఉపయోగపడుతుందని తేలింది. -
విమానమెక్కిన కరివేపాకు
• విదేశాల్లో మంచి గిరాకీ • జిల్లాలో పెరుగుతున్న సాగు విస్తీర్ణం • ముంబయ్, పూణేలకు గుంతకల్లు నుంచి రైళ్లలో తరలింపు • అక్కడి నుంచి విమానాల ద్వారా విదేశాలకు • జిల్లా నుంచి రోజుకు 8 నుంచి 10 టన్నుల వరకు రవాణా గుంతకల్లు: పప్పు, రసం, సాంబారు, తాలింపు, ఉప్మా, పులిహోరా... ఏదైనా సరే కరివేపాకు వేసి వండాల్సిందే. దక్షిణ భారతదేశ వంటకాలతో అంతగా పెనవెసుకుపోయిన కరివేపాకును ఇప్పుడు గల్ఫ్, యూరప్ దేశాల వారు మన నుంచి దిగుమతి చేసుకుని మరీ తమ రోజువారీ వంటల్లో వాడుతున్నారు. కరివేపాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆసియా ఖండంలోనే మొదటిస్థానంలో ఉంది. ముఖ్యంగా అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఈ పంట ఎక్కువగా పండిస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ జిల్లాల్లోనూ ఈ పంట ఎక్కువగా ఉంది. ఈ మూడు జిల్లాల్లో పండే మొత్తం పంటలో 40 శాతం మన జిల్లాలోనే పండుతోంది. గల్ఫ్ దేశాలకు మానవ వనరులు అధికంగా అందిస్తున్న అనంతపురం జిల్లా అపార ఔషధ విలువలున్న కరివేపాకును వారికి అందించడంలోనూ ప్రథమ స్థానంలో నిలుస్తోంది. రోజూ 8 నుంచి 10 టన్నులు దేశ, విదేశాల్లోని పట్టణాలు, నగరాల్లో సూపర్, హైటెక్ మార్కెట్ల సంఖ్య పెరుగుతూ వస్తుండటం వల్ల కరివేపాకు వినియోగం పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో దేశ, విదేశాలకు అనంతపురం జిల్లా నుంచి రోజూ దాదాపు ఎనిమిది నుంచి 10 టన్నుల కరివేపాకు రవాణా అవుతోంది. జిల్లాలో మొత్తం 3 వేల ఎకరాల్లో కరివేపాకు సాగవుతుండగా అందులో ఎక్కువ భాగం గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి నియోజకవర్గాల్లోనే ఉంది. ఇన్నాళ్లు స్థానిక మార్కెట్లకే పరిమితమైన కరివేపాకు నేడు దేశీయ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, ముంబై తదితర నగరాలతోపాటు గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, షార్జా, దుబాయ్, కతార్, ఒమన్ వంటి దేశాలతోపాటు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ తదితర యూరప్ దేశాలకు ఎగుమతి అవుతోంది. హైదరాబాద్, ముంబై, పూనే వ్యాపారులు మన జిల్లాలో టన్నుల లెక్కన కొనుగోలు చేసి రైళ్ల ద్వారా తమ నగరాలకు చేరవేసుకుంటున్నారు. అక్కడి నుంచి కిలోల లెక్కన అట్టపెట్టెల్లో పెట్టి విమానాల్లో విదేశాల్లోని నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. సాధారణంగా కరివేపాకు కోసిన తర్వాత మూడు రోజులు వాడిపోదు. ఆలోగా విదేశాలకు తరలించి అక్కడ శీతల గిడ్డంగుల్లో ఉంచి విక్రయిస్తున్నారు. ఎకరాకు రూ.80 వేల దాకా ఆదాయం కరివేపాకు లాభదాయకమైన వాణిజ్య పంట కావడంతో ఇటీవల ఎక్కువమంది రైతులు దీనివైపు మొగ్గు చూపుతున్నారు. కరివేపాకు పంటను ఏటా మూడు కోతలు కోసుకోవచ్చు. ఒకసారి విత్తు వేస్తే 30 ఏళ్ల వరకు పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. ప్రకృతి తెచ్చే విపత్తుల వల్ల ఈ పంటకు పెద్దగా నష్టం కూడా ఉండదు. పెట్టుబడి, కూలీలు, ఇతర ఖర్చులు పోను ఎకరాకు నికరంగా రూ.60 నుంచి 80వేలు దాకా లాభం వస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం వంటల్లో రుచి, వాసన రావడంతోపాటు ఔషధ గుణాలు కూడా ఉండటం వల్ల భారతీయులు కరివేపాకును వంటల్లో విస్తృతంగా వాడుతున్నారు. ఆయుర్వేదంలో అయితే దీనికి ఒక ప్రత్యేకస్థానం ఉంది. ఏదోక రూపంలో కరివేపాకును రోజూ తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఆకును ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకుని ఎక్కువ కాలం వాడుకున్నా సహజ విలువలు కోల్పోదని చెబుతున్నారు. మంచి మార్కెట్ ఉంటుంది కరివేపాకు పంటకు స్థానికంగానే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ మంచి మార్కెట్ ఉంది. గుంతకల్లు నుంచి సుదూర ప్రాంతాలకు రోజూ రైలు సౌకర్యం ఉండటం వల్ల ఇతర రాష్ట్రాలకు పంపుతున్నాం. రైతులకు మంచి ఆదాయం రావడంతోపాటు మాకూ గిట్టుబాటు అవుతోంది. చాలామంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. - బాషా, వ్యాపారి -
మొటిమలు, మచ్చలను కరివేపలా తీసేయండి!
వేసవిలో ముఖంపైన వచ్చే చిన్న చిన్న గుల్లలను సులువుగా తొలగించుకునేందుకు కరివేపాకు తోడ్పడుతుంది. ► గుప్పెడు కరివేపాకులను మెత్తగా దంచి, దానికి చిటికెడు పసుపు చేర్చాలి. ఆ ముద్దని మొటిమలు ఉన్నచోట రాస్తే అవి తగ్గుతాయి. ► గుప్పెడు కరివేపాకులు మెత్తగా చేసి, దానికి చెంచాడు ముల్తానీమట్టి, చెంచాడు రోజ్‌వాటర్ కలపాలి. దానిని ముఖానికి రాసి పదినిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తుంటే ముఖం మీద ఉండే నల్లటి మచ్చలు, వలయాలు తొలగిపోయి, మన ముఖం మనకే ముచ్చటేసేలా మెరిసిపోతుంది. ► రెండు చెంచాల కరివేపాకు ముద్దకు మూడుచెంచాల ఆలివ్ ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి, మెడకీ రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం మీద, మెడమీద ఉన్న నలుపు విరిగిపోయి, చర్మం మిలమిలలాడుతుంది. ► రెండు చెంచాల కరివేపాకు ముద్దకు కొన్ని చుక్కల నిమ్మరసం చేర్చి నల్లటిమచ్చలు ఉన్న చోట రాయాలి. పదినిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమల తాలూకు మచ్చలు మటుమాయం అవుతాయి. -
గోంగూర పులిహోర
కుకింగ్ తయారి సమయం: 45 నిమిషాలు కావలసినవి: గోంగూర ఆకులు – రెండు కప్పులు బియ్యం – 2 కప్పులు (వండి చల్లార్చుకోవాలి) పసుపు – అర టీ స్పూన్ కరివేపాకు – రెండు రెబ్బలు ఉప్పు – రుచికి సరిపడినంత వేరుశెనగ గుళ్లు – 2 టేబుల్ స్పూన్లు ఆవాలు – టీ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్ ఎండుమిర్చి – 3, నూనె – 3 టేబుల్ స్పూన్లు పోపు కోసం: శనగపప్పు – టేబుల్ స్పూన్, మినప్పప్పు – టేబుల్ స్పూన్, ఆవాలు, జీలకర్ర – టీ స్పూన్ చొప్పున, ఎండుమిర్చి – 2, పచ్చిమిర్చి – 4, ఇంగువ – పావు టీ స్పూన్, పల్లీలు – గుప్పెడు, తయారి: పాత్రలో టీ స్పూన్ నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేయించి దింపి చల్లార్చాలి అర టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి గోంగూర వేసి పచ్చివాసన పోయేలా 8 నిమిషాల పాటు వేయించి దింపేసి చల్లార్చాలి ముందుగా వేయించిన దినుసులు గ్రైండ్ చేసిన తర్వాత గోంగూర వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. (నీరు కలపకూడదు) పాత్రలో మిగతా నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాక, పచ్చిమిర్చి, పసుపు, ఎండుమిర్చి వేసి అర నిమిషం పాటు వేయించాలి. శనగపప్పు, వేరుశెనగ గుళ్లు, మినప్పప్పు వేసి రెండు నిమిషాలు వేయించాక, ఇంగువ, కరివేపాకు వేసి నిమిషం వేయించి దింపేయాలి చల్లారిన అన్నంలో ముందుగా గోంగూర పేస్ట్ వేసి కలపాలి. తర్వాత చల్లార్చిన పోపు, ఉప్పు వేసి కలపాలి అప్పడం కాంబినేషన్‌తో అందిస్తే రుచిగా ఉంటుంది.