కరివేపాకులు కూరల్లో వేస్తే దాని రుచే వేరు. కరివేపాకుతో పెట్టే పోపు దగ్గర నుంచి పులుసులు వరకు అది ఉంటే ఏ రెసిపీ అయినా ఘమఘమలాడిపోవాల్సిందే. అలాంటి కరివేపాకుని నిల్వ చేసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. ఎలా అయినా కనీసం నాలుగు రోజులు అవ్వంగానే నెమ్మదిగా గోధుమ వర్ణంలోకి వచ్చి వాసన పోయి..క్రమేణ ఆకుపచ్చదనం కూడా తగ్గిపోతుంది. ఎలా అయినా.. అబ్బా..! వీటిని నిల్వ చేయడం కష్టం రా బాబు అనుకుంటారు చాలామంది గృహిణులు. అందుకే చాలమంది వీటిని డ్రైగా చేసి పొడిరూపంలోనూ లేదా ఇతర విధాలుగా నిల్వ చేసుకుని కూరల్లో ఆ ఫ్లేవర్ వచ్చేలా చేస్తారు. అయితే ఆ సమస్యలన్నింటికి చెక్‌పెట్టేలా తాజాగా నిల్వ చేసుకునే సరికొత్త ట్రిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే..
కరివేపాకులు నిల్వ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఈ ట్రిక్ ఫాలో అయితే ఆకులు కలర్ మారకుండా, వాటి వాసన కూడా ఏ మాత్రం పోకుండా చక్కగా తాజాగా ఉంచుకోవచ్చు. ఏకంగా ఇలా ఆరునెలలపాటు నిల్వ చేసుకోవచ్చట. అదేంటంటే..ఒక ఖాళీ ఐస్ ట్రైని తీసుకుని అందులో కరివేపాకు కొమ్మలు నుంచి వేరు చేసిన ఆకులను మూడు లేదా నాలుగు చొప్పున ఆకులను ట్రైలో పెట్టుకుంటూ వచ్చి దానిలో నీళ్లు పోయాలి.
ఆ ట్రైని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి అంతే అవన్నీ గడ్డకట్టేసిన క్యూబ్‌లు మాదిరిగా అయిన తర్వాత బయటకు తీసి జిప్ లాక్ బ్యాగ్‌లో ఆ క్యూబ్‌లు వేసుకుని ఫ్రిడ్జ్‌లో భద్రపర్చుకోవాలి. కావాల్సినప్పడు ఆ బ్యాగ్ ఫ్రిడ్జ్‌లోంచి తీసి ఆ క్యూబ్‌లను ఓ గిన్నెలో వేసి దానిలో కొద్దిగా గోరు వెచ్చిని నీళ్లు వేసి కాసేపటి తరువాత చూస్తే తాజా కరివేపాకులు నీటిపై తేలుతూ కనిపిస్తాయి. అవి జస్ట్ ఇప్పుడే చెట్టునుంచి తెంపిన ఆకుల్లా తాజాగా కనిపిస్తాయి. వాటి వాసన కూడా పోదు.
ఇలా ఆరునెలలపాటు సులభంగా నిల్వ చేసుకోవచ్చట. ఇది ఎక్కువగా శీతాకాలంలో ఉపయోగపడుతుందట. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. ఇలాంటి ట్రిక్ విదేశాల్లో ఉండే వారికి చాలా అద్భుతంగా ఉపయోగపుడుతుందని అంటున్నారు. అంతేగాదు జిప్‌లాక్ బ్యాగ్‌లో పుదీనా, కొత్తిమీర, పార్స్లీ ఆకులు ఉంచితే చాలా కాలం పాటు తాజాగా ఉంటాయని చెబుతున్నారు.
(చదవండి: రూ. 83 లక్షల జీతం వదులుకుని మరీ పేస్ట్రీ చెఫ్‌గా..రీజన్ వింటే షాకవ్వుతారు!)
Comments
Please login to add a commentAdd a comment