Health Benefits Of Curry Leaves For Sugar Patients: కరివేపాకు పరిశోధనల్లో భాగంగా 43 మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులతో నిర్వహించిన అధ్యయనంలో అనేక మంచి ఫలితాలు నిర్ధారణగా తెలిశాయి. వారందరికీ కరివేపాకు పొడి ఉదయం ఒక టీ స్పూన్, రాత్రి ఒక టీ స్పూన్ ఇచ్చి ఫలితాలను గమనించారు. బ్లడ్ షుగర్ స్థాయులు తగ్గుముఖం పట్టడం మొదలైంది.
నెల రోజుల్లో రక్తంలో చక్కెర స్థాయులు (గ్లూకోజ్ స్థాయులు) క్రమబద్ధంగా మారడంతోపాటు జీర్ణక్రియ ఇతర జీవక్రియలు కూడా మెరుగయ్యాయి. మనుషుల మీద ప్రయోగించడానికి ముందు ఎలుకల మీద కూడా ముప్ఫైరోజుల అధ్యయనం చేశారు. మొత్తంగా తెలిసిందేమిటంటే... డయాబెటిస్‌కు ప్రస్తుతం వాడుకలో ఉన్న మందులకంటే కరివేపాకు వైద్యం మెరుగైన ఫలితాలనిస్తోంది అని. అలాగని డాక్టర్ సలహా తీసుకోకుండా మందులు మానేయకూడదు.
పైన చెప్పిన విధంగా రోజూ కరివేపాకు తీసుకుంటూ గ్లూకోజ్ స్థాయులను నమోదుచేసుకుంటూ ఉండాలి. ఆ చార్ట్‌ను అనుసరించి మీ దేహంలో ఇతర ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని డాక్టర్‌లు డయాబెటిస్ మాత్రల మోతాదును నిర్ణయిస్తారు. కాబట్టి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే కరివేపాకును తీసిపడేయకండి!
చదవండి: World Sleep Day: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు
Comments
Please login to add a commentAdd a comment