ప్రతీకాత్మక చిత్రం
Health Tips In Telugu- Diabetes: ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని 15 నిమిషాల్లో తగ్గించవచ్చని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న డయాబెటిక్ పేషెంట్లను రెండు గ్రూపులుగా విభజించి, వారిలో ఒక గ్రూప్‌నకు 230 మిల్లీలీటర్ల చక్కెర నీళ్లు, మరో గ్రూప్‌నకు 230 మిల్లీలీటర్ల దానిమ్మ జ్యూస్ ఇచ్చారు. దానిమ్మ జ్యూస్ తీసుకున్న వారిలో 15 నిమిషాల వ్యవధిలోనే షుగర్ లెవల్స్ తగ్గిపోగా, చక్కెర నీళ్లు తీసుకున్న వారి షుగర్ లెవల్స్‌లో ఎలాంటి మార్పు కనిపించలేదు.
ఆరోగ్య ఫలం దానిమ్మ
►దానిమ్మలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉంటాయి.
►ఇది గ్రీన్ టీలో, రెడ్ వైన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కంటే మూడు రెట్లు అధికం.
►ఈ యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటిస్ లేదా ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే వ్యాధులతో పోరాడతాయి.
►దానిమ్మ గింజలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి.
►అందుకే ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రయోజనకరమైన ఫలంగా చెప్పవచ్చు.
►అంతేకాదు... దానిమ్మలో చాలా తక్కువ మొత్తంలో పిండి పదార్థాలుంటాయి.
►100 గ్రాముల దానిమ్మలో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) కేవలం 19 శాతం మాత్రమే.
►కాబట్టి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే దానిమ్మపండు మధుమేహులకు చాలా ప్రయోజనకరమైన పండు అని నిపుణులు చెబుతున్నారు.
నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే!
చదవండి: Health: పొద్దు పొద్దున్నే ఇబ్బంది.. మలబద్దకానికి కారణం ఏమిటి? పరిష్కారాలు.. ఉడికించిన పప్పు తింటే
What Is Epilepsy: దేహం రంగు మారిందో ప్రాణాపాయం తప్పదు.. ఫిట్స్‌కి కారణాలివే!
Diabetes- Best Diet: షుగర్ అదుపులో ఉండాలంటే ఏం చేయాలి? ఉత్తమమైన ఆహారం ఇదే!.. దేశీ ఫలాలు తింటే
Comments
Please login to add a commentAdd a comment