pomogranate
-
దానిమ్మతో దీర్ఘాయుష్షు, ఇలా తిన్నారంటే..!
చాలా మంది మనసులో మెదిలే ఆలోచన ‘దీర్ఘకాలం జీవించాలి. ఆ జీవనం కూడా వీలైనంతవరకు ఆరోగ్యంగా, వృద్ధాప్యం దరిచేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ ఆలోచన మీది కూడా అయితే మన శరీర కణాల ఆరోగ్యానికి మేలు చేసే మంచి అలవాట్లతో ఆయుష్షును పెంచుకోవచ్చు.ఎలా అంటే... కాలానుగుణంగా లభించే పండ్లను తినడం వల్ల వాటిలోని పోషకాలు వాతావరణ మార్పులను తట్టుకునేలా శరీరానికి సహజంగా అవసరమైన వాటిని సరఫరా చేస్తాయి. ఈ సీజన్లో దానిమ్మపండ్లు (సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు) విరివిగా లభిస్తాయి. దానిమ్మ పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో తెలిస్తే ప్రతిరోజూ ఆహారంలో వీటిని తప్పక చేరుస్తారు. చర్మానికి మేలు..దానిమ్మపండ్లలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికం. ఇవి మెదడు నుండి చర్మ ఆరోగ్యం వరకు ప్రతిదానికీ మద్దతు ఇస్తాయని పరిశోధనలలో తేలింది. డాక్టర్ విసెంటె మేరా తన ‘యంగ్ ఎట్ ఏ ఏజ్’ అనే పుస్తకంలో ‘దానిమ్మపండు దాని యాంటీఆక్సిడెంట్ శక్తి కారణంగా చర్మానికి మేలు చేసే సూపర్‌ఫుడ్’ అని పేర్కొన్నారు. దానిమ్మపండులో విటమిన్– సి పుష్కలంగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ‘శరీరానికి విటమిన్– సి అందినప్పుడు, కొల్లాజెన్ ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉత్తేజితమవుతుంది. అంతర్గత సన్స్క్రీన్దానిమ్మ జ్యూస్ తాగితే యూవీ కిరణాల వల్ల కలిగే ఆక్సీకరణ నుండి చర్మాన్ని రక్షించవచ్చు. ఇది దాదాపు ‘అంతర్గత సన్‌స్క్రీన్‘ లా పనిచేస్తుంది. మెదడుకు దానిమ్మదానిమ్మలోని విటమిన్ బి5 నాడీ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. దానిమ్మ రసం నుండి వచ్చే ఫైటోన్యూట్రియెంట్లు మెదడుపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలవు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి‘ అని యుసిఎల్ఎ హెల్త్ నోట్ పరిశోధకులు పేర్కొన్నారు.చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‘చెడు‘ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. టిజి, ఎల్డిఎల్ అండ్ సి, హెచ్‌డిఎల్, సి స్థాయిలను మెరుగుపరచడంలో దానిమ్మ వినియోగం ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. నిరంతర ఒత్తిడి వల్ల వృద్ధాప్యం త్వరగా ప్రవేశిస్తుంది. ఒత్తిడి తగ్గించడంలోనూ, నాడీ వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలోనూ కాలానుగుణంగా లభించే దానిమ్మ సరైనది. ఎలా తినాలంటే... దానిమ్మ గింజలు కొన్ని రకాల వంటకాలకు, సలాడ్స్‌కు మంచి రుచిని తీసుకువస్తాయి. ఉదయం టిఫిన్‌తో పాటుగా దానిమ్మ గింజలను తినవచ్చు. అవకాడో, పిస్తాతో కలిపి చేసిన సలాడ్స్‌లోనూ చేర్చవచ్చుఅవిసె గింజలు, పెరుగుతోనూ కలిపి తినవచ్చు. ఉడికించిన కూరగాయలపైన పెరుగు, దానిమ్మ గింజలు వేసుకొని తినవచ్చు. దానిమ్మ పండును కడగాల్సిన అవసరం లేదు. గింజలను వేరు చేసి, తినవచ్చు. -
అల్జీమర్ వ్యాధికి దానిమ్మ చెక్ పెట్టగలదా?
అల్జీమర్స్ వ్యాధిని న్యూరోడిజెనరేటివ్ డిజార్డర్ అని అంటారు. దీని కారణంగా జ్షాపక శక్తి క్షీణించిపోతుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని తీవ్రమైన మతిమరుపుగా పేర్కొనవచ్చు. దీని కారణంగా రోజు వారి కార్యకలాపాలు కూడా సరిగా నిర్వహించలేరు బాధితులు. ఇది ఎక్కువగా 65 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంటుంది. ఈ వ్యాధి ప్రభావాన్ని తగ్గించగలమే గానీ పూర్తిగా నివారించలేం. అయితే తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కోపనహాగన్, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు చేసిన అధ్యయనంలో అల్జీమర్స్ వ్యాధికి చెక్ పెట్టడంలో దానిమ్మపండు ప్రభావవంతంగా ఉంటుందని వెల్లడించారు. వారి అధ్యయనంలో దానిమ్మ పండు గుణాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అల్జీమర్లో వ్యాధిని చికిత్స చేయండంలో 'యురోలిథిన్ ఏ' కీలమకమని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు నుంచి దెబ్బతిన్న మైటోకాండ్రియాను తొలగించడంలో యూరోలిథిన్ ఏ అనేది కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించారు పరిశోధకులు. ఇక్కడ యూరోలిథిన్ ఏ అనేది ఎల్లాజాటానిన్ల సమ్మేళనం. ఈ ఎల్లాజాటానిన్లు సమ్మెళనాలు అధికంగా దానిమ్మలో ఉంటాయి. దీన్ని ఆహారంగా తీసుకున్నప్పుడూ గట్ బ్యాక్టీరియా ద్వారా రూపాంతరం చెంది 'యురోలిథిన్ ఏ'ను ఉత్పత్తి చేస్తాయి. ఇది మైటోకాండ్రియా పనితీరుని మెరుగుపరిచి కండరాల ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధన పేర్కొంది.ఈ దానిమ్మలో పాలీఫైనాల్స్, ప్యూనికాలాజిన్స్, ఆంథోసైనిన్స్పు పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపుని తగ్గిస్తాయి. ముఖ్యంగా అల్జీమర్స్ వంటి న్యూరోడెజనరేటివ్ వ్యాధులను నయం చేయడంలో తోడ్పడతాయని పరిశోధనలో తేలింది. ఈ పండులో సీ, కే, ఫోలేట్ వంటి విటమిన్లు కూడా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ప్రీ రాడికల్స్ , యాంటీ ఆక్సిడెంట్ల మధ్య అసమతుల్యత కారణంగా ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది సెల్ డ్యామేజ్‌కు దారితీస్తుంది. నూర్యాన్ల క్షీణతలో ఆక్సీకరణ ఒత్తిడి ప్రధాన అంశం. ఈ దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్టీకరించి మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుందని పరిశోధకులు తెలిపారు.అల్జీమర్స్‌ను తీవ్రతరం చేసే అమిలాయిడ్ బీటా ఫలకాల నిక్షేపణలను తగ్గించడంలో దానిమ్మపండు ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించారుఅంతేగాదు ఈ దానిమ్మ పండు అల్జీరమర్స్ వ్యాధిపి సమర్థవంతంగా నియంత్రిస్తుందా? లేదా అని చేసిన అధ్యయనంలో మంచి పలితాలు వచ్చాయని చెబుతున్నారు పరిశోధకులు. అందుకోసం తాము వృద్ధుల జ్ఞాపకశక్తిపై అధ్యయనం నిర్వహించగా..వారిలో గణనీయమైన మెరుగదల కనిపించిందని తెలిపారు. ఈ అధ్యయనం న్యూరోబయాలజీ ఆఫ్ ఏజింగ్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది.అంతేగాదు ఈ దానిమ్మలో ఉండే విటమిన్లు ఇన్ఫ్లమేటరీ మార్గాలను నిరోధిస్తాయి. ప్రో-ఇన్ఫ్లమేటరీ సైటోకిన్ల స్థాయిలను తగ్గించి, న్యూరోఇన్‌ఫ్లమేషన్‌ను నివారిస్తాయి.పైగా దీనిలోని సమ్మేళనాలు కొత్త న్యూరాన్ల పెరుగుదలను ప్రోత్సహించి జ్ఞాపకశక్తి పనితీరుని మెరుగ్గా ఉంచుతుంది. అంతేగాదు దీనిలో ఉండే విటమిన్లు, ఫైబర్లు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచేలా చేసి దీర్ఘాయువుని అందిస్తుంది.(చదవండి: కూర్చొని వర్సెస్ నిలబడి: ఎలా తింటే బెటర్?) -
Pomegranate Peel Tea దానిమ్మ తొక్కల టీ, అద్భుత ప్రయోజనాలు
#PomegranatePeelTea దానిమ్మ గింజలతో మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరం అంతటా రక్త ప్రసరణను మెరుగు పరచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే రక్తహీనతతో బాధపడేవారికి దానిమ్మ గింజల జ్యూస్ బాగా ఉపయోగడపతాయి. అలాగే దానిమ్మ తొక్కలతో చేసిన టీ రెగ్యులర్‌గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి దానిమ్మ టీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దానిమ్మ తొక్కల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుతో దానిమ్మ తొక్కలతో తయారు చేసిన టీని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బాడీలోని మలినాల్ని బైటికి పంపించేందుకు, జలుబు దగ్గు, చర్మ సమస్యలు, జుట్టు రాలడానికి చికిత్స చేయడంలో సహాయపడతాయంటున్నారు నిపుణులు ఇంకా మధుమేహం, రక్తపోటు , కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. దానిమ్మ తొక్కల టీ తయారీ: దానిమ్మ కాయనుంచి వలిచిన తొక్కల్ని శుభ్రంగా కడిగి తొక్కలను ఎండబెట్టాలి. ఇతర సందర్భాల్లో, మైక్రోవేవ్ ఉపయోగించి వేడి చేయవచ్చు. ఆ తరువాత, పీల్స్ బాగా చూర్ణం చేయాలి. దీన్ని తడి లేని సీసాలో నిల్వ ఉంచుకోవచ్చు. ఒక కప్పు నీటినిలో టీస్పూన్ దానిమ్మ తొక్కలను వేసి బాగా మరిగించాలి. దీన్ని చక్కగా వడకట్టి, రుచికి తగినట్టుగా తేనె కలుపుకొని తాగాలి. ఈ టీని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బాడీ డీటాక్సిఫై: విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని నెగిటివ్ టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. చర్మాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. వైరల్ జ్వరం, దగ్గు, గొంతు నొప్పి , సాధారణ జలుబు నివారణలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన దంతాలు: దానిమ్మ తొక్కలతో తయారు చేసిన టీ తాగడం వల్ల చిగుళ్లు, దంత సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది: దానిమ్మ తొక్కల్లో టానిన్లుతో పేగుల్లో మంట తగ్గుతుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది. కాబోయే తల్లులకూ మేలు చివరగా, గర్భిణీ స్త్రీలకు దానిమ్మ తొక్క చాలా మంచిదట. ముఖ్యంగా గర్భధారణ ప్రారంభంలో దాని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణం పాలీఫెనోలిక్ సమ్మేళనాలు ఫోలిక్ యాసిడ్ , విటమిన్ సీ ఎదుగుతున్న పిండానికి సరైన పోషకాహారాన్ని అందిస్తుంది. గర్భిణీ స్త్రీలు జీర్ణక్రియ సమస్యలను నివారిస్తుంది. ఇంకా పిగ్మెంటేషన్, జుట్టు రాలడం సమస్య ఉన్నవారు కూడా దానిమ్మతొక్కల టీని సేవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
దానిమ్మ రాత్రిపూట తినకూడదా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
దానిమ్మ పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఇందులో ఉంటాయి. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు దానిమ్మ పండులో మెండుగా ఉంటాయి. సంవత్సరం పొడవునా ఈ పండ్లు మనకు లభిస్తాయి. రక్తహీనతతో బాధపడేవాళ్లు ప్రతిరోజూ దానిమ్మ పండ్లను తీసుకోవడం వల్ల సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు.వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు ఈజీగా పెరుగుతాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచే దానిమ్మ పండ్లు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అన్నది ఇప్పుడు చూద్దాం. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే దానిమ్మ గింజల్లో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. మీకు తెలుసా? ఒక దానిమ్మ పండులో సుమారు 600 వరకు గింజలు ఉంటాయట. క దానిమ్మ పండులో 7 గ్రాముల ఫైబర్, 3 గ్రాముల ప్రోటీన్, 30 శాతం విటమిన్ సి, 16 శాతం ఫోలేట్ మరియు 12 శాతం పొటాషియం ఉంటాయి. ఒక కప్పు దానిమ్మపండులో 24 గ్రాముల చక్కెర మరియు 144 కేలరీల శక్తి కూడా ఉంటుంది. రెండు వారాల పాటు రోజూ 150 మి.లీ దానిమ్మ రసాన్ని తాగడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది. రక్తహీనతతో బాధపడేవాళ్లకు దానిమ్మను మించిన ఔషధం లేదు. యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండే దానిమ్మ తింటే రక్తకణాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా దానిమ్మ పండ్లతో జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుందని తేలింది. క్రమం తప్పకుండా దానిమ్మను తీసుకుంటే అల్జీమర్స్ వ్యాధిని నివారించొచ్చని వైద్యులు చెబుతున్నారు. దానిమ్మతో ఆ సమస్యలు దూరం ► చలికాలంలో దానిమ్మ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ► దానిమ్మలో యంటీ ఏజింగ్ గుణాలు మెండుగా ఉంటాయి. ► దానిమ్మ రక్తంలో ఐరన్‌ను డెవలప్ చేస్తుంది. ఇది హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచుతుంది. ► ఇందులోని ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ రాడికల్స్‌ను నివారిస్తుంది. ► నిత్యం దానిమ్మ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ► వృద్దాప్యాన్ని దారితీసే ప్రీ రాడికల్స్ నుంచి కాపాడి, యవ్వనంగా ఉంచేలా చేస్తుంది. ► దానిమ్మ గింజల్లో విటమిన్ బి, సి, కెతో పాటు పొటాషియం, కాల్షియం వంటి పలు రకాల మినరల్స్ మెండుగా ఉంటాయి. ► మలబద్దకం, ఒబెసిటీ వంటి సమస్యలను దానిమ్మ దూరం చేస్తుంది. దానిమ్మతో అందం దానిమ్మ తినడం వల్ల చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. రోజూ కప్పు దానిమ్మ గింజలు తినడం వల్ల స్కిన్‌టోన్ మెరుగవుతుంది విటమిన్స్, పీచు అధికంగా ఉంటుంది. ఇవి చర్మంపై ముడతలు రాకుండా అడ్డుకుంటాయి దానిమ్మ పండులో ఉన్న ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ చర్మం తేమ కోల్పోకుండా నివారిస్తుంది. చర్మంపై ఉండే జిడ్డు, మొటిమలను శక్తివంతంగా తగ్గించడంలో దానిమ్మ సూపర్ ఫ్రూట్. వివిధ చర్మ సమస్యలను దూరం చేయడంలో దానిమ్మ ఎంతో సహాయపడుతుంది. దానిమ్మ రాత్రిపూట తినొచ్చా? చాలామంది రాత్రిపూట దానిమ్మ తింటే జలుబు చేస్తుందని, కఫం ఏర్పడుతుందని అనుకుంటారు. కానీ ఒట్టి అపోహ మాత్రమే. రాత్రి పడుకునే ముందు దానిమ్మ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్‌లో ఒక టీ స్పూన్లో అల్లం వేసుకొని తాగితే కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముకలు కూడా ధృడంగా తయారవుతాయి. నిద్రించే ముందు దానిమ్మను పెరుగు తీసుకుంటే నాణ్యమైన నిద్రపడుతుంది. రాత్రిపూట దానిమ్మను తింటే ఉదయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. -
Health: షుగర్ పేషెంట్లకు ఆరోగ్య ఫలం! ఒక్క గ్లాసు జ్యూస్ తాగితే 15 నిమిషాల్లో..
Health Tips In Telugu- Diabetes: ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని 15 నిమిషాల్లో తగ్గించవచ్చని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న డయాబెటిక్ పేషెంట్లను రెండు గ్రూపులుగా విభజించి, వారిలో ఒక గ్రూప్‌నకు 230 మిల్లీలీటర్ల చక్కెర నీళ్లు, మరో గ్రూప్‌నకు 230 మిల్లీలీటర్ల దానిమ్మ జ్యూస్ ఇచ్చారు. దానిమ్మ జ్యూస్ తీసుకున్న వారిలో 15 నిమిషాల వ్యవధిలోనే షుగర్ లెవల్స్ తగ్గిపోగా, చక్కెర నీళ్లు తీసుకున్న వారి షుగర్ లెవల్స్‌లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆరోగ్య ఫలం దానిమ్మ ►దానిమ్మలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ►ఇది గ్రీన్ టీలో, రెడ్ వైన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కంటే మూడు రెట్లు అధికం. ►ఈ యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటిస్ లేదా ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే వ్యాధులతో పోరాడతాయి. ►దానిమ్మ గింజలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి. ►అందుకే ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రయోజనకరమైన ఫలంగా చెప్పవచ్చు. ►అంతేకాదు... దానిమ్మలో చాలా తక్కువ మొత్తంలో పిండి పదార్థాలుంటాయి. ►100 గ్రాముల దానిమ్మలో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) కేవలం 19 శాతం మాత్రమే. ►కాబట్టి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే దానిమ్మపండు మధుమేహులకు చాలా ప్రయోజనకరమైన పండు అని నిపుణులు చెబుతున్నారు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! చదవండి: Health: పొద్దు పొద్దున్నే ఇబ్బంది.. మలబద్దకానికి కారణం ఏమిటి? పరిష్కారాలు.. ఉడికించిన పప్పు తింటే What Is Epilepsy: దేహం రంగు మారిందో ప్రాణాపాయం తప్పదు.. ఫిట్స్‌కి కారణాలివే! Diabetes- Best Diet: షుగర్ అదుపులో ఉండాలంటే ఏం చేయాలి? ఉత్తమమైన ఆహారం ఇదే!.. దేశీ ఫలాలు తింటే -
Health: మానసిక దృఢత్వం కోసం.. ముడి పెసలు, ఉసిరి.. ఇంకా! ఇవి మాత్రం తినొద్దు!
ఇటీవలి కాలంలో మానసిక వ్యాధులు అధికం అవుతున్నాయి. అతి సున్నితమైన మనస్తత్వం వల్ల, చిన్నప్పటినుంచి ఎక్కువ గారాబంగా పెరగడం వల్ల, జీవితంలో ఏదయినా అనుకోని సంఘటనలు ఎదుర్కొనవలసి రావడం వల్ల మానసిక వ్యాధులు కలుగుతాయి. అలా మానసిక వ్యాధులు రాకుండా ఉండాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి.... మానసికంగా దృఢంగా ఉండాలంటే మన జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఏయే పదార్థాలు తీసుకోవాలి, ఏయే పదార్థాలు తీసుకోకూడదో చూద్దాం. Foods That Boost Mental Health: ఇవి తీసుకోవాలి ►ఎక్కువ పాలిష్ చేయని బియ్యం ►ముడి పెసలు ►తాజా పాలు ►నెయ్యి ►గోధుమలు ►వెన్న ►బూడిద గుమ్మడికాయ ►పరిశుభ్రమైన ఆహారం ► సీజనల్ పండ్లు, కూరగాయలు ►ద్రాక్ష ►దానిమ్మ ►ఉసిరి ►చేపలు ►కొవ్వు ఎక్కువగా ఉండని మాంసం ►యాపిల్ ►ఆర్గానిక్ ఎగ్స్. మానేయవలసినవి ►కలుషిత ఆహారం అంటే రోడ్డు వెంట దొరికే అపరిశుభ్రమైన ఆహారం తినడం ►రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాల్ ►కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం (దీనివల్ల న్యూరోట్రాన్స్మిటర్స్ పనితీరుపై ప్రభావం పడుతుంది) ►స్మోకింగ్, గుట్కాలు తినడం ►ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడటం ►ఊరగాయలు, కారాలు, మసాలాలు అధికంగా ఉన్న ఆహారం ►డీప్ ఫ్రీజర్‌లో నిల్వ ఉంచిన కోల్డ్ ఫుడ్ ►అధికంగా పుల్లగా ఉండే పదార్థాలు (పులియబెట్టినవి, వెనిగర్ లాంటివి) ►అతి కష్టంమీద జీర్ణమయ్యే ఆహారం ►బూజు పట్టిన, పాడైన, కుళ్లిన ఆహారం తీసుకోవడం ►అధికంగా తినడం, తీసుకున్న ఆహారం అరగకముందే మళ్లీ తినడం ►పాలు–గుడ్డు లేదా చేపలు, వేడి–చల్లని పదార్థాలు కలిపి తీసుకోవడం, పండ్లు–పాలు కలిపి తీసుకోవడం. చదవండి: Benefits Of Onion Juice: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! నల్లని, ఒత్తైన కురులు..! Health Tips: కాలీఫ్లవర్, క్యారెట్లు, బీట్రూట్, పుట్టగొడుగులు అతిగా తింటే అంతే సంగతులు! కాస్త.. -
దానిమ్మ వల్ల కలిగే ఆరోగ్య ప్రయెజనాలెన్నో..!
ఒక రకరమైన ఇబ్బందికరమైన ఇనుము రుచితో ఉండే ఐరన్ ట్యాబ్లెట్లు వాడటం కంటే హాయిగా తినాలనిపించే రుచికరమైన దానిమ్మతో ఒంట్లో ఐరన్ మోతాదులు పెరుగుతాయి. అలా ఈ పండు రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తనాళాలనూ శుభ్రపరుస్తుంది. ఒంటికి మంచి ఆరోగ్యకరమైన రక్తం పట్టడం వల్ల మనిషి చురుగ్గానూ మారుతారు. ఇక ఇదే దానిమ్మ బరువు పెరగకుండా కూడా నివారిస్తుంది. ఇలా దానిమ్మతో బరువు తగ్గడానికి కారణం... ఇందులో ఉండే దాదాపు 7 గ్రాముల పీచు. ఇలా బరువు తగ్గించడం ద్వారా ఇది గుండెజబ్బులనూ నివారిస్తుంది. ఇక ఇందులో ఉండే విటమిన్ కె, విటమిన్ సీ వంటి విటమిన్ల వల్ల రోగనిరోధకSశక్తిని పెంపొందిస్తుంది. ఇందులోని పొటాషియమ్ రక్తపోటును అదుపులో పెడుతుంది. దాదాపు 25 గ్రాముల చక్కెర కారణంగా తక్షణం 144 క్యాలరీల శక్తి సమకూరుతుంది. తక్కువ చక్కెర, ఎక్కువ పీచు ఉండటం అన్న అంశం కూడా వేగంగా బరువు తగ్గడానికి/పెరగకుండా నివారించడానికి తోడ్పడతాయి. అన్ని రకాల పండ్లూ ఆరోగ్యానికి మంచివే అయినా... ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను ఒక పండే ఇవ్వడం అన్నది చాలా కొద్ది పండ్ల విషయంలోనే ఉంటుంది. అందుకే రక్తహీనత తగ్గడం, బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపరచుకోవడం, వ్యాధినిరోధకతను పెంచుకోవడం లాంటి బహుళ ప్రయోజనాలను పొందాలంటే దానిమ్మ పండు తినడం రుచికరమైన ఓ మంచి మార్గం. -
Health Tips: ఇవి తరచూ తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది! అంతేకాదు..
పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, దానిమ్మ పండ్లు, డ్రై ఫ్రూట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం.. పాలకూర, బచ్చలి కూర తింటే ►పాలకూర, బచ్చలికూర లాంటి ఆకు కూరలు మీ కంటి చూపును మెరుగుపరుస్తాయి. ►పాలకూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ►ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలపై పోరాడటంతో ప్రముఖపాత్ర పోషిస్తాయి. ►ఆకుకూరలు.. మాక్యులర్ డీజెనరేషన్, కంటిశుక్లం లాంటి సమస్యల నుంచి రక్షించి కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతాయి. దానిమ్మ ►దానిమ్మ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ►రక్తహీనతతో బాధపడేవారిని దానిమ్మ తినమని సలహా ఇస్తారు. ►ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తికి పెంచుతాయి. ►అంతేనా దానిమ్మని రెగ్యులర్‌గా తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది. ►కాబట్టి ప్లేట్లెట్స్ని పెంచుకునేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. డ్రై ఫ్రూట్స్ ►డ్రై ఫ్రూట్స్... శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. ►దీంతోపాటు కంటిచూపును మెరుగు పర్చి నేత్ర సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. ►వీటి లో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. చదవండి: Antibiotic Overuse: యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా..? పొంచి ఉన్న మరో ముప్పు..! -
నాగ పడగ ఆకారంలో దానిమ్మ
రొళ్ల (మడకశిర) : రొళ్ల మండలం జీజీ హట్టి గ్రామానికి చెందిన ఈరన్న సాగు చేసిన దానిమ్మ తోటలో ఓ చెట్టుకు కాసిన దానిమ్మ పండుపై నాగుపాము పడగ విప్పినట్లు ఆకారం ఉంది. ఈ విషయం చుట్టుపక్కల రైతులకు తెలియడంతో తండోపతండాలుగా తోటలోకి చేరుకుని ఆ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. ఇంకొందరైతే ఏకంగా పూజలు చేశారు.