పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, దానిమ్మ పండ్లు, డ్రై ఫ్రూట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..
పాలకూర, బచ్చలి కూర తింటే
►పాలకూర, బచ్చలికూర లాంటి ఆకు కూరలు మీ కంటి చూపును మెరుగుపరుస్తాయి.
►పాలకూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
►ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలపై పోరాడటంతో ప్రముఖపాత్ర పోషిస్తాయి.
►ఆకుకూరలు.. మాక్యులర్ డీజెనరేషన్, కంటిశుక్లం లాంటి సమస్యల నుంచి రక్షించి కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతాయి.
దానిమ్మ
►దానిమ్మ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
►రక్తహీనతతో బాధపడేవారిని దానిమ్మ తినమని సలహా ఇస్తారు.
►ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తికి పెంచుతాయి.
►అంతేనా దానిమ్మని రెగ్యులర్‌గా తింటే ప్లేట్‌లెట్స్ కౌంట్ పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది.
►కాబట్టి ప్లేట్‌లెట్స్‌ని పెంచుకునేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది.
డ్రై ఫ్రూట్స్
►డ్రై ఫ్రూట్స్... శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి.
►దీంతోపాటు కంటిచూపును మెరుగు పర్చి నేత్ర సంబంధ సమస్యలను దూరం చేస్తాయి.
►వీటి లో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.
చదవండి: Antibiotic Overuse: యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా..? పొంచి ఉన్న మరో ముప్పు..!
Comments
Please login to add a commentAdd a comment