వీకెండ్ వచ్చిందంటే లేట్‌గా నిద్ర లేవడం, లేజీగా ఉండటం, ఎక్కువ ఫుడ్ లాగించేయడంకాకుండా, రోజంతా సరదాగా సంతోషంగా గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. స్నేహితులు, సన్నిహితులతో ఉత్సాహంగా గడపాలి. దీంతో రాబోయే వారమంతా చురుగ్గా ఉండే శక్తి వస్తుంది.
పచ్చని ప్రకృతిలో ఎంజాయ్ చేయాలి. కాలుష్యానికి తావులేని పార్క్‌లకు వెళితే, మంచి ఆక్సిజన్ లభిస్తుంది. మన చుట్టుపక్కల చిన్నపిల్లలతో గడిపినా, కలిసి పెయింటింగ్ వేసినా, ఆటలాడినా భలే ఉత్సాహం వస్తుంది.
అలాగే రాబోయే వారమంతా యాక్టివ్‌గా ఉండేలా కొన్ని ఆరోగ్య చిట్కాలు ఇవిగో..
♦ వేసవి కాలం వచ్చేసింది.. ఫ్రిజ్ నీరు కంటే కుండ వాటర్ బెటర్. మరీ ఎక్కువ చల్లని పదార్థాలు, డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.
♦ పిల్లలకు ఇంట్లో తయారు చేసిన ఐస్ క్రీ పెడితేమంచిది. ఎక్కువ నీళ్లు తాగేలా జాగ్రత్త పడాలి.
♦ నడక, యోగా లాంటి వ్యాయామాలు, అలాగే బ్మాడ్మింటన్ లాంటి ఔటర్ గేమ్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి.
♦ రోజూ నిద్రపోయే ముందు నానబెట్టిన బాదం, డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే ఆరోగ్యకరమైన కొవ్వులు ,ఇతర పోషకాలు లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ , డైటరీ ఫైబర్ కూడా అధికం.
♦ కొన్ని ఎండు ద్రాక్ష కొన్ని ధనియాలు నీరు పోసి మరిగించి చల్లార్చి ఆ కషాయాన్ని ఉదయం, సాయంకాలం తాగాలి. కీళ్ల వాపులు తగ్గి పోతాయి.
♦ రొటీన్‌కి టీ కి బదులుగా అల్లం టీ తాగితే మంచి ఉత్సాహం వస్తుంది. అలాగే దంత సమస్యలు ఉన్నవారు.. నోటి దుర్వాసనతో బాధపడుతున్న వారు.. అల్లాన్ని ఎండబెట్టి పొడి చేసి దాంట్లో కాస్త నీరు కలిపి పేస్ట్‌లా చేసి దానితో పళ్లు తోముకుంటే చిగుళ్లు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
♦ సీజనల్ వ్యాధులను తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. కాస్త అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని పూటకు ఒక కప్పు మోతాదులో తాగుతుంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
♦ అల్లం , కీరా, నిమ్మకాయ రసం కలిపిన మిశ్రమాన్ని ప్రతి రోజు ఉదయం పూట తాగాలి. నొప్పులు, వాపులు తగ్గి పోతాయి.
Comments
Please login to add a commentAdd a comment