Health Tips in Telugu: Top Foods to Improve Blood Count in Body - Sakshi
Sakshi News home page

Health Tips: రోజుకు కప్పు బూడిద గుమ్మడి రసం తాగడం, గుప్పెడు శనగలు నానబెట్టి తింటే

Published Thu, Jan 26 2023 10:22 AM | Last Updated on Thu, Jan 26 2023 11:41 AM

Health Tips: Top Foods To Improve Blood Count In Body - Sakshi

కొంతమంది కొన్ని విటమిన్ల లోపం వల్ల రక్తలేమితో బాధపడుతుంటారు. రక్తలేమి వల్ల నీరసం, శ్వాస ఆడకపోవడం, కళ్లు తిరగటం, నిస్సత్తువగా ఉండటంతోపాటు అనేకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వృద్ధులకు, గర్భిణులకు రక్తహీనత సమస్య ఎక్కువగా ఎదురయ్యే సమస్య.

సాధారణంగా రక్తలేమికి కొన్ని విటమిన్‌ టాబ్లెట్లు వాడమని వైద్యులు సూచిస్తుంటారు. అయితే అలా మందులు వాడటం వల్ల కొన్ని దుష్ఫలితాలు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల సహజంగానే రక్తం పట్టే ఆహారం తీసుకోమని కూడా చెబుతారు. అలాంటి వాటిలో కొన్ని చిట్కాలు మీకోసం...

►సపోటా జ్యూస్‌ తాగటం లేదా సపోటా పండ్లు తినడం వల్ల శరీరానికి తొందరగా రక్తం పడుతుంది.
►దానిమ్మ రసం తాగడం, దానిమ్మ పండ్లు తినడం కూడా చాలా మంచిది.

బూడిద గుమ్మడి రసం తాగితే..
►బూడిద గుమ్మడి శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు కప్పు బూడిద గుమ్మడి రసాన్ని తాగుతూ ఉంటే శరీరంలో మంచి రక్తం వృద్ధి అవుతుంది. బూడిద గుమ్మడి కాయ గుజ్జు తీసి దానిని దళసరి గుడ్డలో వేసి బాగా పిండితే వచ్చే రసాన్ని కప్పులో పోసుకుని తాగాలి.

నెలలోనే రక్తం వృద్ధి!
►కిస్‌మిస్‌ లేదా ద్రాక్షపండ్లు బాగా తింటూ ఉంటే రక్తం వృద్ధి అవుతుంది. పచ్చివి దొరకనప్పుడు ఎండువి తినవచ్చు. రాత్రులు గుప్పెడు ఎండు ద్రాక్ష పళ్ళు గ్లాసెడు నీటిలో నానవేసి ఉదయం వాటిని బాగా పిసికి ఆ పిప్పిని పారవేసి ఆ నీటిని తాగాలి. అలా రోజూ తాగుతుంటే ఒక నెలలోనే రక్తం వృద్ధి అవుతుంది.

లేత కొబ్బరి తింటే కూడా!
►ఎండు ఖర్జూరాలతో కూడా పైన చెప్పిన విధంగా చేసి ఆ నీటిని తాగుతుంటే రక్తం వృద్ధి అవుతుంది.


►రాత్రిపూట గుప్పెడు శనగలు నీటిలో నానవేసి ఉదయం తింటూ ఉంటే రక్తం వృద్ధి అయ్యి శరీరం పుష్టిగా అవుతుంది. వ్యాయామం చేసేవారికి ఈ విధానం చాలా మంచిది.
►అంజీర్‌ పండ్లు తింటున్నా రక్తం వృద్ధి అవుతుంది.
►లేత కొబ్బరి నీరు, లేత కొబ్బరి తింటూ ఉంటే శరీరంలో రక్తం బాగా వృద్ధి అవుతుంది.

నోట్‌: వీటిలో మీ శరీర తత్త్వాన్ని, మీకున్న ఇతర ఆరోగ్య సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకుని మీకు ఏవి బాగా సరిపడతాయో, ఏది సులభమో వాటిని అనుసరిస్తే సరి. ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది.
చదవండి: తులసి ఆకులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో నమిలితే..
ప్లాస్టిక్‌ కవర్లలో వేడి వేడి ఛాయ్‌! పొట్ట కింద ‘టైర్లు’!.. అలారం మోగుతోంది.. వినబడుతోందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement