మీకు తెలుసా! వేడి నీళ్ల‌లో నెయ్యి క‌లిపి తాగితే ఏమౌతుందో!? | What Happens If You Drink Ghee Mixed With Hot Water!? | Sakshi
Sakshi News home page

మీకు తెలుసా! వేడి నీళ్ల‌లో నెయ్యి క‌లిపి తాగితే ఏమౌతుందో!?

Published Sat, Dec 23 2023 1:20 PM | Last Updated on Sat, Dec 23 2023 1:20 PM

What Happens If You Drink Ghee Mixed With Hot Water!? - Sakshi

'సాధారణంగా కొందరు ఉదయం నిద్రలేచిన వెంటనే వేడినీరు తాగుతారు. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. అయితే వేడినీటిలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు మరింత మేలు జరుగుతుందని మీకు తెలుసా!?'

  • ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్‌ గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇది కాకుండా, కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఎ, ఇ మొదలైనవి నెయ్యిలో లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది.
  • చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. చర్మం ఆరోగ్యంగా... ప్రకాశవంతంగా మారుతుంది. కొవ్వు కరిగిపోతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇది వెచ్చని నీటితో లేదా ఆహారంతో ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు.
  • ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో 2 టేబుల్‌ స్పూన్ల నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి.

ఇవి కూడా చ‌ద‌వండి: రక్తహీనతతో బాధ ప‌డుతున్నారా.. అయితే ఇవి తీసుకోండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement