sapota
-
చికూ ఫెస్టివల్ గురించి విన్నారా?
ఓ పండు కోసం ప్రత్యేకంగా జరుపుకునే పండుగ ఇది. ఓ మారుమూల గ్రామం ఈ పండుగను ఏటా ఘనంగా నిర్వహిస్తుంది. అంతేగాదు అక్కడ ఉత్పత్తి అయ్యే ఆ పండ్లు మంచి నాణ్యత గల పండ్లగా జీఐ ట్యాగ్‌ను కూడా పొందాయి. ఎక్కడ ఈ పండుగ జరుగుతుంది? దేని గురించి నిర్వహిస్తున్నారు? అసలేం జరిగిందంటే..మహారాష్ట్ర నగరానికి 200 కి.మీ దూరంలో ఉండే బోర్డ్ బీచ్ ముంబై వాసులకు మంచి పర్యాటక ప్రాంతంగా అలరారుతుంది. అక్కడకు సమీపంలో ఉండే దహను జిల్లాలోని ఘెల్వాడ అనే చిన్న తీర గ్రామం ఉంది. ఈ గ్రామం చికూ పండ్లకు మహా ప్రసిద్ధి. ఇంతకీ ఏంటీ చికూ పండు అంటే? అదేనండి మనం ఎంతో ఇష్టంగా తినే సపోటానే కొన్ని చోట్ల "చికూ" పండ్లు అని అంటారు. ఈ పండుని దేశ విదేశాల్లో ఒక్కో పేరుతో ప్రసిద్ధి. అయితే ఈ ఘెల్వాడ్ గ్రామం మాత్రం ఈ చికూ పండ్లు(సపోటా పండ్ల)కు మంచి పేరుగాంచింది. అక్కడ ఎటూ చూసిన ఈ పండ్లే కనిపిస్తాయి. పైగా అక్కడ సపోటా మంచి రుచికరంగా ఉంటుంది. అంతేకాదండోయ్ సపోటాల్లో అవే అత్యంత రుచికరమైన నాణ్యతగల పండ్లగా జీఐ ట్యాగ్‌ను కూడా పొందాయి. ఈ పండ్లను నగరీకరణ పేరుతో కనుమరగ్వ్వకుండా కాపాడాలనే ప్రయత్నంలో భాగంగా ఈ చికూ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు. గ్రామీణ పారిశ్రామికవేత్తల సంక్షేమ ఫౌండేషన్ నేతృత్వంలోని స్థానికి సంఘం 2013 నుంచి ఈ చికూ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది. స్థానిక రైతులు ఈ వ్యవసాయం ద్వారా ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించేలా చేయడమే గాక రైతులకు, పట్టణ కేంద్రాల్లోని జనాభా మధ్య అంతరాన్ని తగ్గించేలా చేయడమే ఈ పండుగ ముఖ్యోద్దేశం. ఈ ఏడాది 10వ చికూ ఫెస్టివల్ ఫిబ్రవరి 10, 11 తేదీల్లో బోర్డి తీరాన ఘనంగా జరుగుతోంది. ఈ పండుగను వీక్షించడానికి పెద్ద ఎత్తున పర్యాటకుల తరలి వస్తారు కూడా. ఈ పండుగలో బీచ్ పారాగ్లైడింగ్, చికూ పొలాలు, ఫుడ్ యూనిట్ల పర్యటన, సైక్లింగ్ ఈవెంట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్‌షాప్‌లు(వార్లీ పెయింటింగ్), జానపద నృత్యం, స్థానిక సంగీతం తదితరాలు ఎంతగానో అలరిస్తాయి. ఈ చికూ ఫెస్టివల్లో సంగీత విద్వాంసుడు అష్మిక్ పటేల్, సౌరభ్ సేవ్, కథక్ నృత్యకారిణి యోగిని మ్హత్రేతో వంటి కళకారులు ఈ వేడుకలో తమ ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. ఈ ఫెస్టివల్లో ఆ చికూ పండుతో తయారు చేసే ఐస్‌క్రీంలు, కుల్ఫీలు, చిప్స్ వంటి ఎన్నో రకాల ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ సందడి చేస్తాయి. ఒకర రకంగా ఈ పండుగలో ఆ చికూ పండ్ల వ్యవసాయం, వాటి కోసం రైతులు పడే శ్రమ తదితరాలు కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. ఇక్కడ అత్యంతా బాగా ఆకట్టుకునేది ఉమెరగావ్‌లోని ఉద్యానవనాలు. హిరణ్యకేశి నది సమీపంలోని హిరణ్యకేశ్వర్ ఆలయం, గుహలు, తదితరాలు. ఒక పండు కోసం పండుగ నిర్వహించడమే గాక దాని ద్వారా రైతులకు మరింత ఆదాయం వచ్చేలా చేయాలనుకోవడం ప్రశంసించదగ్గ విషయం కదూ! (చదవండి: ఆ మోటర్ సైకిల్‌కి పాక్ అధ్యక్షుడు ఇప్పటికీ డబ్బు చెల్లించలేదట!పాక్‌గా ఏర్పడక ముందు జరిగిన ఘటన) -
Blood Count: టాబ్లెట్లు అక్కర్లేదు! రోజుకు కప్పు బూడిద గుమ్మడి రసం తాగితే
కొంతమంది కొన్ని విటమిన్ల లోపం వల్ల రక్తలేమితో బాధపడుతుంటారు. రక్తలేమి వల్ల నీరసం, శ్వాస ఆడకపోవడం, కళ్లు తిరగటం, నిస్సత్తువగా ఉండటంతోపాటు అనేకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వృద్ధులకు, గర్భిణులకు రక్తహీనత సమస్య ఎక్కువగా ఎదురయ్యే సమస్య. సాధారణంగా రక్తలేమికి కొన్ని విటమిన్ టాబ్లెట్లు వాడమని వైద్యులు సూచిస్తుంటారు. అయితే అలా మందులు వాడటం వల్ల కొన్ని దుష్ఫలితాలు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల సహజంగానే రక్తం పట్టే ఆహారం తీసుకోమని కూడా చెబుతారు. అలాంటి వాటిలో కొన్ని చిట్కాలు మీకోసం... ►సపోటా జ్యూస్ తాగటం లేదా సపోటా పండ్లు తినడం వల్ల శరీరానికి తొందరగా రక్తం పడుతుంది. ►దానిమ్మ రసం తాగడం, దానిమ్మ పండ్లు తినడం కూడా చాలా మంచిది. బూడిద గుమ్మడి రసం తాగితే.. ►బూడిద గుమ్మడి శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు కప్పు బూడిద గుమ్మడి రసాన్ని తాగుతూ ఉంటే శరీరంలో మంచి రక్తం వృద్ధి అవుతుంది. బూడిద గుమ్మడి కాయ గుజ్జు తీసి దానిని దళసరి గుడ్డలో వేసి బాగా పిండితే వచ్చే రసాన్ని కప్పులో పోసుకుని తాగాలి. నెలలోనే రక్తం వృద్ధి! ►కిస్మిస్ లేదా ద్రాక్షపండ్లు బాగా తింటూ ఉంటే రక్తం వృద్ధి అవుతుంది. పచ్చివి దొరకనప్పుడు ఎండువి తినవచ్చు. రాత్రులు గుప్పెడు ఎండు ద్రాక్ష పళ్ళు గ్లాసెడు నీటిలో నానవేసి ఉదయం వాటిని బాగా పిసికి ఆ పిప్పిని పారవేసి ఆ నీటిని తాగాలి. అలా రోజూ తాగుతుంటే ఒక నెలలోనే రక్తం వృద్ధి అవుతుంది. లేత కొబ్బరి తింటే కూడా! ►ఎండు ఖర్జూరాలతో కూడా పైన చెప్పిన విధంగా చేసి ఆ నీటిని తాగుతుంటే రక్తం వృద్ధి అవుతుంది. ►రాత్రిపూట గుప్పెడు శనగలు నీటిలో నానవేసి ఉదయం తింటూ ఉంటే రక్తం వృద్ధి అయ్యి శరీరం పుష్టిగా అవుతుంది. వ్యాయామం చేసేవారికి ఈ విధానం చాలా మంచిది. ►అంజీర్ పండ్లు తింటున్నా రక్తం వృద్ధి అవుతుంది. ►లేత కొబ్బరి నీరు, లేత కొబ్బరి తింటూ ఉంటే శరీరంలో రక్తం బాగా వృద్ధి అవుతుంది. నోట్: వీటిలో మీ శరీర తత్త్వాన్ని, మీకున్న ఇతర ఆరోగ్య సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకుని మీకు ఏవి బాగా సరిపడతాయో, ఏది సులభమో వాటిని అనుసరిస్తే సరి. ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. చదవండి: తులసి ఆకులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో నమిలితే.. ప్లాస్టిక్ కవర్లలో వేడి వేడి ఛాయ్! పొట్ట కింద ‘టైర్లు’!.. అలారం మోగుతోంది.. వినబడుతోందా? -
రక్తహీనతతో బాధ పడుతున్నారా? ఈ ఫ్రూట్ తిన్నారంటే..
ఎక్కువ మంది ఇష్టంగా తినే పండ్లలో సపోటా పండు కూడా ఒకటి. ఈ సీజనల్ ఫ్రూట్ రుచికే కాకుండా పోషకాలకు కూడా రారాజే. సపోటా చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు ప్రముఖ నూటీషనిస్ట్ పూజ మఖిజా మాటల్లో మీకోసం.. సపోటా పండులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి కీలకంగా వ్యవహరిస్తుంది. కాల్షియంతోపాటు మాగ్నిషియం, పొటాషియం, జింక్, కాపర్, పాస్పరస్, సెలినియం వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే! ఇక రోగనిరోధకతను పెంపుకు ఉపయోగపడే ‘ఎ, బి, సి’విటమిన్లు దీనిలో మెండే. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. కడుపులో చికాకు కలిగించే బొవెల్ సిండ్రోమ్ నివారణకు, మలబద్ధకం సమస్య పరిష్కారానికి దీనిలో ఫైబర్ గుణాలు చక్కగా పనిచేస్తాయి. రక్తపోటును తగ్గించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. సపోటాలోని మాగ్నిషియం రక్తనాళాల పనితీరును క్రమబద్దీకరిస్తుంది. పొటాషియం రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేసి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనిలోని ఐరన్ రక్తహీనతతో బాధపడే వారికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. అంతేకాదు సపోటాపండులో చర్మ, జుట్టు సమస్యలను నివారించి, సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేసే గుణం కూడా కలిగి ఉంటుంది. దీనిలోని పోషకాలు శరీరంలోని హానికారకాలను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి, చర్మంపై ఏర్పడే ముడతల నివారణకు తోడ్పడుతుంది. ఖర్జూరాలను సపోటాల్లో చేర్చి జ్యూస్ రూపంలో తీసుకున్న లేదా సపోటాను నేరుగా తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పూజ మఖిజా సూచిస్తున్నారు. చదవండి: Healthy Food: ఎదిగే పిల్లలకు ఈ పోషకాహారం ఇస్తున్నారా? పాలు, గుడ్డు, పాలకూర.. -
సపోటా పండు తింటే ఇన్ని లాభాలా!
కరోనా సెకండ్ వేవ్ ఎంతో మందిని బలి తీసుకుంటోంది. పైగా వైరస్‌లో కొత్త వేరియంట్స్ వల్ల చాలా మందిని వివిధ లక్షణాలు వేధిస్తున్నాయి. సాధారణంగా శ్వాస ఆడకపోవడం, కొద్దిగా జ్వరం, దగ్గు, తల నొప్పి, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, రుచి ,వాసన తెలియకపోవడం, నీరసం, అలసట వంటి లక్షణాలు కనబడుతున్నాయి. ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీలైనంత వరకు ఇంట్లో ఉండడం, మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించాలి. వీటితోపాటు సరైన పోషకాలు శరీరానికి అందేలా చూసుకోవాలి. అయితే సపోటా అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకరమైన పండే కాకుండా ఎన్నో పోషకాలను కలిగి ఉంది. మరి సపోటా పండులోని పోషకాలు.. ఆరోగ్య లాభాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం. కంటి చూపుకు మెరుగుపరుస్తుంది: సపోటా విటమిన్ ఎ ని అధికంగా కలిగి ఉంటుంది. కొన్ని పరిశోధనల ప్రకారం..విటమిన్ ఎ వృద్ధాప్యంలో కూడా క౦టి చూపును మెరుగుపరుస్తుంది. సపోటాలో విటమిన్ ఏ,సీ లు పుష్కలంగా ఉంటాయి. తక్షణ శక్తిని ఇస్తుంది: సపోటా శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోస్‌ని సమృద్ధిగా కలిగి ఉంటుంది. ముఖ్యంగా క్రీడాకారులకు సపోట పండు తినడం వల్ల వెంటనే శక్తిని పొందవచ్చు. యాంటీ-ఇంఫ్లమేటరీ ఏజెంట్: సపోటా నొప్పులను, మంటను తగ్గించే గుణాన్ని కలిగి ఉంది. టన్నిస్ అధికంగా ఉండడం వల్ల యాంటీ-ఇంఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. కొన్ని రకాల కాన్సర్లను అరికడుతుంది: విటమిన్ ఏ, బి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. సపోటా లోని యాంటీ-ఆక్సిడెంట్లు, పీచు, పోషకాలు కాన్సర్ ను౦చి రక్షణ కల్పిస్తాయి. విటమిన్ ఏ ఊపిరితిత్తులు, నోటి కాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఎముకలు దృఢంగా: కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ అధిక మొత్తంలో ఉండటం వల్ల ఎముకలు గట్టిగా తయారవుతాయి. జలుబు, దగ్గు: చాతీ పట్టేసినపుడు, దీర్ఘకాల దగ్గు తగ్గడానికి సపోటా పండు దోహదం చేస్తుంది. యాంటీ-వైరల్, యాంటీ-బాక్టీరియల్: పాలీఫెనోలిక్ అనామ్లజనకాలు ఉండడం వల్ల, సపోటా పండు అనేక యాంటీ-వైరల్, యాంటీ-పరాసిటిక్, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఈ యాంటీ-ఆక్సిడెంట్లు బాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. పొటాషియం, ఇనుము, ఫోలేట్, నియాసిన్, పాంతోతేనిక్ జీర్ణ వ్యవస్థకు మెరుగుపచడమే కాకుండా విటమిన్ సి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది: సపోటా రక్తస్రావాన్ని ఆపుతుంది. దెబ్బలు తగిలినపుడు, మొలల సందర్భంలో రక్తస్రావాన్ని నివారిస్తుంది. మానసిక ఆరోగ్యం: ఈ పండు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడుతుంది. ఇది నిద్రలేమి, ఆందోళన, వ్యాకులతతో బాధపడుతున్న వ్యక్తులకు మంచిది. బరువు తగ్గిస్తుంది: గ్యాస్ట్రిక్ ఎంజైమ్ స్రావాన్ని నియంత్రించడం ద్వారా ఊబకాయాన్ని నిరోధించడమే కాక..జీవక్రియను నియంత్రిస్తుంది. (చదవండి: ‘కోవిడ్ మరణాలు , కేసులను ప్రభుత్వం తగ్గించి చూపిస్తోంది’) -
మామిడి మధురం.. చేదు నిజం..!
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : మామిడి, అరటి, బొప్పాయి, సపోట, ద్రాక్ష, దానిమ్మ ఇలా అనేక రకాల పండ్లు కాలాలకు అనుగుణంగా ఆరగిస్తే ఆరోగ్యానికి మంచిది. శరీర ఎదుగుదలకు, పరిపుష్టికి దోహదపడుతాయి. అన్ని కాలాలలో దొరికేది అరటి. వేసవి కాలంలో దొరికేది మాత్రం మామిడి. అయితే పండ్ల వ్యాపారులు కాసులకు కక్కుర్తి పడి చెట్టుమీద కాయలు పండకుండానే కోసి మాగపెడుతున్నారు. తొందరగా పండటం కోసం కాల్షియం కార్భైట్, పొగబెట్టి మాగబెట్టడం వంటి చర్యలతో కాయలను పండ్లుగా మారుస్తున్నారు. అనంతరం బహిరంగ మర్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సహజ సిద్ధంగా పండిన పండ్లలో ప్రక్టోజ్, గ్లూకోజ్, కొవ్వు, ప్రొటీన్లు ఉంటాయి. శరీరం నీరసించిపోయినప్పుడు ఇవి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మలబద్ధకం, ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడుతాయి. కృత్రిమంగా మాగబెట్టిన పండ్లలో ఇవి ఉండవు. కాగా, ఆరోగ్యానికి హానికరం. జిల్లాలో ప్రధానంగా మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, చెన్నూర్, కాగజ్‌నగర్ ప్రాంతాల్లో మామిడి వ్యాపారం జరుగుతాయి. ఏటా రూ.11 కోట్ల మామడి పండ్ల వ్యాపారం జరుగుతుంది. మామిడిని ఎలా మాగ పెడతారంటే.. మామిడి పండ్లను కొనుగోలు చేయడం వ్యాపారులకు ఆర్థికంగా పెట్టుబడి ఎక్కువ కావడంతో కాయలను ఎంచుకుంటున్నారు. మామిడి తోటల్లో కాయలు, గాలి దుమారంకు కింద పడిన కాయలను తక్కువ ధరకు కొనుగోలు చేసి గోదాములకు తరలిస్తారు. గ్యాస్ వెల్డింగ్‌కు వినియోగించే కాల్షియం కార్బైట్‌ను కొనుగోలు చేస్తారు. ఈ రసాయనాన్ని పొట్లాలుగా మారుస్తారు. 20 కిలోల మామిడి కాయల బాక్స్‌లలో, నేలపై రాశులుగా వేసిన కాయల మధ్య ఐదు నుంచి 50 వరకు కార్బైట్ పొట్లాలను మధ్య మధ్యన పెడతారు. ఆ కార్బైట్ గుళికలు పౌడర్‌గా మారి వేడి పుట్టిస్తుంది. ఆ రసాయనాల ప్రతిచర్యతో ఉష్ణోగ్రత పెరిగి కాయలు పండ్లుగా మారుతాయి. నాలుగు రోజులపాటు బాక్స్‌లలో, నేల మీద రాశులుగా ఉన్న మామిడికాయలు పండ్లుగా మారతాయి. పూర్తి పచ్చదనంలోకి వచ్చి మామిడి ప్రియుల నోర్లు ఊరించేలాగా మారుతాయి. అలా తయారైన మామిడి పండ్లను మార్కెట్లోకి రిటైల్ అమ్మకం దారులకు విక్రయిస్తారు. అలా చేతులు మారిన మామిడి పండ్లు మామిడి ప్రియుల చేతికి చేరి కడుపులోకి వెళ్లి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. గ్యాస్ ద్వారా పండ్లుగా మార్చడం మరో పద్ధతి గ్యాస్ ద్వారా కూడా మామిడి కాయలను పండ్లుగా మార్చడం కొత్త పద్ధతి. గతేడాది మంచిర్యాలలో ప్రారంభమైంది. కాల్షియం కార్బైట్ తక్కువ ఖర్చుతో పండ్లుగా మార్చే వీలున్నప్పటికి పెద్ద మొత్తంలో పండ్లుగా మారడం సాధ్యం కాదు. దాంతో కూలింగ్ స్టోర్ విధానం ద్వారా కాయలను పండ్లుగా మారుస్తున్నారు. ఒకేసారి 8 వేల కిలోల వరకు కాయలను పండ్లుగా మార్చే సౌలభ్యం కూలింగ్ స్టోర్‌లో ఉంటుంది. ఇథిలేన్ అనే గ్యాస్‌ని కూలింగ్ స్టోరేజ్‌లోకి పంపుతారు. పగలంతా కూలింగ్, రాత్రి వేళ మాత్రమే గ్యాస్‌ను స్టోర్‌లోకి విడుదల చేస్తారు. అలా రసాయనాల ప్రభావంతో నాలుగు రోజుల్లోనే కాయలు పండ్లుగా మారతాయి. ఒక మామిడిపండే కాకుండా అరటికాయలను కూడా పండ్లుగా మారుస్తున్నారు. పండ్లను మాగ పెట్టడానికి కూలింగ్ స్టోరేజ్‌లు పెట్టడానికి రూ.25 లక్షల నుంచి రూ.30 వరకు వ్యయం చేస్తున్నారంటే లాభాలు ఎలా ఉన్నాయో తేట తెల్లం అవుతుంది. అమలు కాని నిషేధం బహిరంగ మార్కెట్లో కార్బైట్ విచ్చలవిడిగా దొరుకుతోంది. కిలో విలువ రూ.80 ఉంటుంది. దీనిని స్టీలు రంగు మార్చేందుకు, వెల్డింగ్ కోసం ఉపయోగిస్తారు. పండ్లపై వీటి వాడకాన్ని నిషేధించిన అమలుకావడం లేదు. వ్యాపారులు గోదాముల్లో కార్బైన్‌ను వినియోగించి మాగబెడుతున్నా పట్టించుకోవడం లేదు. వీటి వాడకాన్ని తగ్గిస్తే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వారు అవుతారు. అధికారుల నిర్లిప్తతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఏటా రూ.కోట్ల వ్యాపారం చేస్తున్నారు. -
ఏటా.. నష్టమే!
- భువనగిరి డివిజన్‌ను వీడని వడగండ్ల బీభత్సం - శని, ఆదివారాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం - వరి, మామిడి, నిమ్మతోటలకు తీవ్రనష్టం - సకాలంలో ఆదుకోని ప్రభుత్వం భువనగిరి, న్యూస్‌లైన్ : ప్రకృతి వైపరీత్యానికి భువనగిరి డివిజన్ రైతాంగం కకావికలం అవుతోంది. ఏటేటా రబీ సీజన్ పంట చేతికి వచ్చే ఏప్రిల్, మే నెలలో కురుస్తున్న వడగండ్ల వర్షాలతో వరి, మామిడి, సపోట, నిమ్మతోటలు దెబ్బతింటున్నాయి. ఇన్ని కష్టాలను భరించి పండించిన పంటను అమ్ముకుందామని మార్కెట్‌కు వస్తే.. అక్కడా రక్షణ కరువైంది. వర్షానికి కొట్టుకుపోతుండడంతో రైతులు కోలుకోలేకపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ప్రకటించిన పరిహారం మాత్రం అందడం లేదు. గత నెల 8, 9 తేదీల్లో డివిజన్లోని భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, రామన్నపేట, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, మోత్కూ రు, గుండాల, ఆత్మకూర్.ఎం, ఆలేరు, యాదగిరిగుట్ట మండలాల్లో వడగండ్ల వర్షాలకు సుమారు 17వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. ఈ నెల 2వ తేదీన కురిసిన వడగండ్లతో భువనగిరి పట్ణణం చందుపట్ల తదితర గ్రామాల్లో నష్టం వాటిల్లింది. వరిచేలలో గట్టిగింజ రాలిపోయి తాలు మాత్రమే మిగిలింది. మామిడితోటలదీ ఇదే పరిస్థితి వడగండ్లు, ఈదురుగాలుల ధాటికి డివిజన్లోని 1800 ఎకరాల్లో మామిడితోటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అయితే మొత్తంగా 10 వేల ఎకరాలలో మామిడి తోటలకు నష్టం వాటి ల్లినట్టు రైతులు తెలుపుతున్నారు. ఈదురుగాలులు వీయడం వల్ల పిందెలు, కాయలు రాలిపోయాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన తోటలు కాత రాకముందే నష్టాల పాలు కావడంతో పండ్లు అమ్ముకోవాల్సిన రైతు దిక్కుతోచని స్థితిలో పడుతున్నాడు. తోట లను కౌలుకు తీసుకున్న రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమత మ వుతున్నారు. నిమ్మరైతులదీ ఇదే పరిస్థితి. కాయలు రాలిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. హెక్టార్‌కు రూ.25వేల పెట్టుబడి.. వరిసాగు రైతులకు హెక్టార్‌కు సుమారు రూ. 25వేల వరకు పెట్టుబడి అవుతుంది. తీరా పంట కోతకు వచ్చే సమయంలో వర్షార్పణం కావడంతో తీరని నష్టం మిగులుతోంది. అధికారులు యాభైశాతంపైగా నష్టం వాటిల్లిందని లెక్క రాస్తే హెక్టార్‌కు రూ.10 వేల పరిహారం ఇస్తారు. అది ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు రైతు చేతికందుతుందో తెలి యని పరిస్థితి. రెండేళ్ల క్రితం జరిగిన నష్టానికి ఇంతవరకు పరిహారం అందలేదు. ఇప్పుడు జరిగిన నష్టానికి ఎన్ని నెలలు పడుతుందోనని రైతులు వాపోతున్నారు. రైతులు పంట రుణాలు తీసుకునే సమయంలో పంటల బీమా పథకం కింద ప్రీమియం తీసుకుంటున్నారు. కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా చెల్లించడంలేదు. మార్కెట్లో పరిస్థితులు దారుణం.. ఆరుగాల శ్రమించి అష్టకష్టాలు పడి అమ్ముకుందామని మార్కెట్‌కు తెచ్చిన ధాన్యానికి సరైన రక్షణ లేకుండా పోయింది. ఈనెల 2న భువనగిరి మార్కెట్లో కురిసిన వర్షానికి సుమారు 100 బస్తాల ధాన్యం కొట్టుకుపోయింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి రైతులకు ఎలాంటి అవకాశమూ లేకుండా పోయింది. మార్కెట్ యార్డులో సరైన వసతులు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.