అంజీర్.. వీటినే అత్తిపండ్లు(ఫిగ్స్)అని అంటారు. డైఫ్రూట్స్ రూపంలోనూ లభించే అంజీర్ మార్కెట్లో విరివిగా లభిస్తుంటాయి. తినడానికి రుచిగా ఉండడమే కాదు.. అద్భుతమైన పోషకాలు కూడా వీటిలో ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం,ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలను బలపరిచేందుకు సహాయపడతాయి. ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
అంజీర్‌లో ఉన్న విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-కె వల్ల ఆరోగ్యంతో పాటు అందమూ మెరుగవుతుంది. అధిక రక్తపోటు, అధిక చక్కెర ఉన్నవారు అంజీర్ పండ్లను తీసుకుంటే చాలా మంచిది. ఆయుర్వేదంలో అంజీర్ పండ్లకు ప్రత్యేకమైన స్థానముంది. వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
వంద గ్రాముల అంజీర్‌లో ఉండే పోషకాలివే
- క్యాలరీలు – 74
- ప్రొటీన్లు – 0.75 గ్రాములు
- కొవ్వులు – 0.30 గ్రాములు
- పిండి పదార్థాలు – 19.8 గ్రాములు
- పీచు పదార్థం (ఫైబర్) – 1 గ్రా.
- కాపర్ – రోజులో కావల్సిన దానిలో 3 శాతం
- మెగ్నిషియం – రోజులో కావల్సిన దానిలో 2 శాతం
- పొటాషియం – 2 శాతం
- విటమిన్ బి6 – 8.60 శాతం
- విటమిన్ సి – 2 శాతం
గుండె ఆరోగ్యానికి..
అంజీర్ పండ్లు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇవి గుండె సమస్యలను అదుపులో ఉంచుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్ తగ్గాలనుకునేవారు ఈ పండ్లను ప్రతిరోజూ తీసుకోవాలి.
అధిక బరువు నియంత్రణలో..
బరువు తగ్గడంలో అంజీర్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సమయం వరకు ఆకలి వేయదు. ఫలితంగా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీని ద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
మలబద్దకం దూరం..
అంజీర్ పండ్లలో అధిక స్థాయిలో పీచు పదార్థం కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా మలబద్దకం సమస్య తగ్గుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు ప్రతిరోజూ తమ ఆహారంలో రెండు అంజీరాలను తప్పకుండా తీసుకోవాలి.
షుగర్ పేషెంట్స్ తినొచ్చా?
చక్కెరను అదుపులో ఉంచడంలో అంజీర్ పండ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు అంజీర్ పండ్లను రోజూ తింటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అంజీర్‌లో ఉండే ఫైబర్, విటమిన్-E, ఫ్యాటీ యాసిడ్లు వంటి పోషకాలు చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. డయాబెటిస్ ఉన్న వారు డ్రై అంజీర్ పండ్లను తినరాదు. ఇవి పండ్లతో పోలిస్తే 2-3 శాతం వరకు అధికంగా చక్కెర కలిగి ఉంటుంది.
రక్తహీనత నుంచి దూరం
రక్తహీనత నేడు చాలామందిని బాధిస్తుంది. అలాంటి వారు నిత్యం కనీసం రెండు అంజీర్ పండ్లను తినాలి. వీటివల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు బాగా పెరిగి రక్తం బాగా వృద్ధి చెందుతుంది. దీనిలోని పొటిషియం, ఐరన్ వల్ల రక్తహీనత దూరమవుతుంది.
నిద్రలేమి నుంచి ఉపశమనం
అంజీర్ పండ్లను రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో మూడు- నాలుగు నానబెట్టి మరుసటి రోజు పరగడుపునే తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. లేదా రాత్రి పూట అంజీర్ పండ్లను నేరుగా తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగితే నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుందట.
Comments
Please login to add a commentAdd a comment