మంచి ఆరోగ్యం కోసం ఆహారం అనగానే గుర్తొచ్చే ప్రధాన వాటిల్లో డ్రైఫ్రూట్స్ ఒకటి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభించే డ్రైఫ్రూట్స్ వల్ల మంచి శక్తి లభిస్తుంది. రోజూ కాసిన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే డ్రైఫ్రూట్స్ తినడానికి సరైన సమయం ఏది? ఉదయమే తినాలా? భోజనానికి ముందు తీసుకోవాలా? తర్వాత తీసుకోవాలా? రాత్రి తినడం మంచిదా? ఇలాంటి సందేహాలుంటాయి చాలామందికి.
డ్రైఫ్రూట్స్‌ని ఎపుడు,ఎలా తిన్నా మంచిదే. కొంతమంది నానబెట్టుకుని కూడా తింటారు. మన ఆహారంలో డ్రైఫ్రూట్స్‌ని చేర్చుకుంటే రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, హృదయ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్స్ లో విటమిన్స్, మినరల్స్, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్,ఫైబర్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. వాస్తవానికి ఎపుడు తీసుకున్నా మంచిదే. అయితే ఉదయం అల్పాహారంగానీ, మధ్యాహ్నం భోజనం తరువాత గానీ, సాయంత్నం చిరుతిండిగా కానీ తీసు కోవచ్చు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అని అవసరాన్ని బట్టి మితంగా తీసుకోవాలి అనేది గమనించాలి.
ఉదయాన్నే పరగడుపున డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వలన ఆ రోజంతా కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తి అనేది లభిస్తుంది.బాదం పప్పులను రాత్రి నానబెట్టుకుని ఉదయం లేవగానే తీసుకుంటే మంచిది. పోషకాలతో పాటు, మంచి గ్లోకూడా వస్తుంది.
వర్కవుట్‌కు ముందు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవల్స్‌ను పెంచి, ఫిట్‌నెస్ లక్ష్య సాధనలో తోడ్పడుతుంది. డ్రైఫ్రూట్స్‌లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. కనుక వ్యాయామం తరువాత కూడా తీసుకోవచ్చు. జీడిపప్పు వాల్‌నట్స్‌ను మితంగా తీసుకుంటే గుండె సమస్యలను నియంత్రించవచ్చు.
మధ్యాహ్న ఆకలిని అరికట్టడానిక , శరీరానికి బూస్ట్ అందించడానికి డ్రై ఫ్రూట్స్ సరైన పరిష్కారం. డైటరీ ఫైబర్ ఉంటే ఎండు ద్రాక్ష అంజిర్, ఖర్జూరం తీసుకొంటే మంచిది. రక్తహీనత రాకుండా కాపాడుతాయి. ఎండు ద్రాక్షలో పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది.
ఈవినింగ్ సాక్స్‌లాగా వేయించిన జీడిపప్పు తీసుకోవచ్చు. వీటిల్లో కొలెస్ట్రాల్ అనేది అసలు ఉండదు. దీంతో గుండె పనితీరును పెంచేందుకు ఎంతో సహాయం చేస్తాయి. నిద్రవేళ స్నాక్స్‌కు అద్భుతమైన ఎంపిక డ్రైఫ్రూట్స్. ఎండిన ఆప్రికాట్లు లేదా చెర్రీస్‌తో పాటు బాదం లేదా వాల్‌నట్ లాంటి డ్రై ఫ్రూట్స్‌లో ఉండే పోషకాలు విశ్రాంతినిస్తాయి. వీటిల్లోని మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేస్తుంది. ప్రశాంతంగా నిద్ర పట్టేలా చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment