వేసవిలో చాలామందికి ఎదురయే సమస్యలలో ఫుడ్ పాయిజన్ ఒకటి. దీనికి ప్రధాన కారణం పొడి వాతావరణంలో బ్యాక్టీరియా వృద్ధి చెందడమే. అందువల్ల బయటకు వెళ్లేటప్పుడు ఆహార పరిశుభ్రతపై శ్రద్ధ వహిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
బయట తాగే నీరు శుభ్రంగా లేకపోయినా.. సమస్యలు తప్పవు. అసలు ఫుడ్ పాయిజన్ అయిందీ లేనిదీ ఎలా గుర్తించాలో, దానిని ఎలా నివారించాలో తెలుసుకుందాం. ఆహారం తిన్న తర్వాత వాంతులు, కడుపు నొప్పి, విపరీతమైన అలసట. ఎలా నివారించాలి?
అవి తినొద్దు
►పరిశుభ్రత ఉన్న చోట మాత్రమే తినండి, ఎక్కడ పడితే అక్కడ.. ఏది పడితే అది తినకూడదు.
►బాగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి.
►ఎండలో ఆరుబయట కూర్చుని ఆహారం తినకూడదు.
►ఆహారాన్ని తయారు చేయడానికి శుభ్రమైన నీటిని వాడాలి.
►పండ్లు, కూరగాయలను బాగా కడిగిన తర్వాతే తినాలి.
►కుళ్ళిన కూరగాయలు, పండ్లు ఉపయోగించవద్దు.
ఫుడ్ పాయిజనింగ్ అయితే ఏం చేయాలి?
►ఫుడ్ పాయిజన్ అయినట్లయితే, నీరు ఎక్కువగా తాగాలి.
►మీకు వికారంగా అనిపిస్తున్నందున నీరు తీసుకోవడం తగ్గించవద్దు.
►గంజి, నీరు, పుదీనా టీ, బ్లాక్ టీ వంటివి తీసుకోవాలి.
►ఓఆర్‌ఎస్ వినియోగించండి.
హోం రెమెడీ
►కప్పు వేడి నీటిలో 2–3 చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి, ఆహారానికి ముందు తీసుకోవడం వల్ల ఎసిడిటీ, ఫుడ్ పాయిజనింగ్ ప్రభావం తగ్గుతుంది.
►గ్లాసు వేడినీటిలో అర చెంచా తాజా అల్లం తురుము లేదా శొంఠి పొడి, తేనె కలిపి తాగాలి.
►కప్పు పెరుగులో చెంచా మెంతులు వేసి తినండి. మెంతులు నమలక్కర్లేదు, మింగేయవచ్చు.
►గ్లాసు వేడినీళ్లలో నిమ్మరసం, ఉప్పు, పంచదార కలుపుకొని తాగితే ఉపశమనం ఉంటుంది.
►చల్లని పాలకు అసిడిటీని తగ్గించే గుణం ఉంది. ఎసిడిటీ లేదా ఫుడ్ పాయిజనింగ్ ఉన్నప్పుడు, గ్లాసుడు చల్లని ΄ాలు తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.
►నీళ్లలో జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి 2–3 సార్లు తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది.
►ఇలాంటివి చేసిన తర్వాత కూడా తగ్గకపోతే.. వైద్యుణ్ణి సంప్రదించి మందులు తీసుకోవాలి.
►చేతులు తరచు సబ్బుతో కడుక్కోవాలి. వంటగదిలో శుభ్రత పాటించాలి.
►ఫుడ్ పాయిజన్ బారిన పడి కోలుకుంటున్న వారికి తగినంత విశ్రాంతి, నిద్ర అవసరం.
ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.
చదవండి: అవాంఛిత సంబంధాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు.. కుటుంబాన్ని కాపాడుకోలేమా?
Comments
Please login to add a commentAdd a comment