Platelets
-
కూతురి కోసం పంటనే పండించింది
తల్లిగుణం అందరి మేలు కోరుతుంది. కూతురి అనారోగ్య సమయంలో డ్రాగన్ ఫ్రూట్ తినిపించాలని వెతికితే దాని ఖరీదు సామాన్యులకు అందుబాటులో లేదనిపించిందామెకు. తన కూతురు లాంటి వాళ్లు ఎందరో ఈ పండుకు దూరం కావలసిందేనా అని బాధ పడింది. పట్టుదలతో ఏకంగా పంటే పండించింది. డ్రాగన్ ఫ్రూట్ రైతు రేణుక కథ ఇది.‘మీ అమ్మాయికి ప్లేట్లెట్స్ బాగా పడిపోయాయి. ప్లేట్లెట్స్ పెరగడానికి డ్రాగన్ ఫ్రూట్ తినిపించమ్మా’ అని డాక్టర్ చెప్పిన మాట ఆ తల్లిని డ్రాగన్ పంట స్వయంగా సాగు చేసే వరకు తీసుకువెళ్లింది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన రేణుక, పరశురాములు దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు. ఇంటర్ చదువుతున్న కూతురు విజయకు కరోనా కాలంలో సుస్తీ చేసింది. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్లేట్లెట్స్ తగ్గిపోయాయని గుర్తించిన వైద్యులు ప్లేట్లెట్స్ పెర గడానికి డ్రాగన్ ఫ్రూట్ తినిపించమని చె΄్పారు. దాంతో తల్లి రేణుక కామారెడ్డి పట్టణంలో పండ్ల దుకాణాలన్నింటా డ్రాగన్ ఫ్రూట్ కోసం తిరిగితే ఎక్కడా దొరకలేదు. ఆఖరుకు ఒక సూపర్ మార్కెట్లో దొరికాయి. ఒక్కో పండు రూ.180 చె΄్పారు. అంత ఖరీదా అని ఆశ్చర్యపోయింది రేణుక. అంత రేటు పెట్టాల్సి వచ్చినందుకు చిన్నబుచ్చుకుంది. అయినా సరే కొనుగోలు చేసి తీసుకువెళ్లి కూతురికి తినిపించింది. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తరువాత ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లారు.మనం ఎందుకు పండించకూడదు?రేణుకకు చదువు లేదు. కానీ వ్యవసాయం మీద మంచి పట్టు ఉంది. రేణుక భర్త పరశురాములు కూడా చదువుకోకున్నా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలన్న ఆశ ఉంది. అంతవరకూ సంప్రదాయ సేద్యం చేస్తున్న ఆ ఇద్దరూ కూర్చుని ‘డ్రాగన్ ఫ్రూట్’ గురించి చర్చించుకున్నారు. ‘మనం పండించి తక్కువకు అమ్ముదాం’ అంది రేణుక. ఆ తర్వాత భర్తతో కలిసి డ్రాగన్ ఫ్రూట్ సాగు పద్ధతుల గురించి పిల్లలతో కలిసి యూ ట్యూబ్‌లో చూసింది. ఆ పంట పండించాలన్న నిర్ణయానికి వచ్చిన రేణుక, పరశురాములు జగిత్యాల జిల్లాలోని అంతర్గాంలో డ్రాగన్ ఫ్రూట్ కు సంబంధించిన మొలకలు దొరుకుతాయని తెలుసుకున్నారు. ఓ రోజు అక్కడికి వెళ్లి పంట సాగు గురించి వారితో మాట్లాడారు. ఎకరంలో సాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని మొక్కలు అవసరమవుతాయో అడిగి తెలుసుకున్నారు. వాళ్లిచ్చిన సూచనల మేరకు ఇంటికి చేరుకున్న తరువాత ఎకరం పొలం దుక్కి దున్నారు. చుట్టూరా ఇనుపజాలీతో కంచె ఏర్పాటు చేశారు. మొక్కల కోసం స్తంభాలు, కర్రలను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే డ్రిప్ సౌకర్యం కల్పించుకున్నారు. పొలం తనఖా పెట్టి రూ.3 లక్షలు, అలాగే డ్వాక్రా సంఘం నుంచి రూ. 2 లక్షలు అప్పు తీసుకుని పంట సాగు మొదలుపెట్టారు.43 పండ్లు దక్కాయిపంట సాగు చేసిన తొలి ఏడాది నలబై మూడు పండ్లు మాత్రమే చేతికందాయి. దాంతో మరిన్ని మెళకువలు తెలుసుకుని మరింత కష్టపడి సాగు చే యడంతో రెండో ఏడాదికి వచ్చేసరికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దళారులకు అమ్మితే గిట్టుబాటు కాదని భార్య, భర్త ఇద్దరూ గంపల్లో పండ్లను పెట్టుకుని సిద్దిపేట, మెదక్, కామారెడ్డి తదితర పట్టణాలకు తీసుకు వెళ్లి ఒక్కో పండు. వంద నుంచి రూ.150 వరకు అమ్ముకుంటే రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఈసారి రూ.4 లక్షలు ఆదాయం సమకూరుతుందన్న నమ్మకంతో ఉన్నారు. పది పదిహేనేళ్లపాటు పంట వస్తుందని, తాము అనుకున్నదానికన్నా ఎక్కువే సంపాదిస్తామన్న ధీమాతో ఉన్నారు.– ఎస్.వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
రక్తంతో జుట్టు రాలు సమస్యకు చెక్!
రక్తంతో జుట్టు రాలు సమస్యకు చికిత్స చేస్తారట. దీన్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాప్మా థెరపీ అని అంటారు. ఈ కొత్త చికిత్స విధానాన్ని హార్వర్ మెడికల్ వైద్య బృందం అభివృద్ధి చేసింది. దీని వల్ల బట్టతల, ఆడవాళ్ల జుట్టు రాలు సమస్యను తగ్గించొచ్చిన చెబుతున్నారు. ఇక్కడ వైద్యులు బాధితుల సొంత రక్తంతోనే వారి హెయిర్ గ్రోత్‌ని డెవలప్ అయ్యేలా చేస్తారు. ఇదేంటీ అని ఆశ్చర్యపోకండి!. ఎందుకంటే మన రక్తంలోని ప్లాస్మాలో పుష్కలంగా ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవి హెయిర్‌ని పెరిగేలా చేయగలవట. అందుకని రోగి నుంచి తీసుకున్న రక్తంలోని ప్లాస్మాని తీసుకుని దానిని తలలో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా చేయగానే ఆ ప్రదేశంలోని చర్మం ఆకృతి మెరుగపడి తిరిగి జుట్టు పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. చెప్పాలంటే ఈ చికిత్స హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి వివిధ చికిత్సల కంటే సురక్షితమైనది, సమర్థవంతమైనది. ఈ చికిత్స విధానం గురించి నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ప్రచురితమయ్యింది. ఈ థెరఫీని జుట్టు రాలు సమస్యలను, బట్టతల సమస్యను నివారిస్తుందని అన్నారు. ఈ చికిత్స విధానంలో ప్లాస్మాలోని ప్లేట్లెట్స్ ఇంజెక్షన్ రూపంలో తలపై ఇవ్వడంతో వెంట్రుకల కుదుళ్ల దగ్గర జుట్టు పెరిగేలా వృద్ధికారకాలను ఉత్ఫన్నం చేస్తాయి. తద్వారా వంశపారంపర్యంగా వచ్చే ఆండ్రోజెనెటిక్ అలోపేసియా లేదా బట్టతల, ఆడవారిలో వచ్చే జుట్టురాలు సమస్యను నివారిస్తుంది. జుట్టు బాగా కురుల్లా ఉండాలనుకునేవారు ఈ థెరపీని సంవత్సరానికి మూడు నుంచి నాలుగుసార్లు చేయించుకోవచ్చట. అలాగే రోగి రక్తాన్ని సేకరించేటప్పుడూ గడ్డకట్టకుండా, ప్లేట్లెట్స్ యాక్టివ్‌గా ఉండేలా ప్రత్యేకమైన ట్యూబలో సేకరిస్తారు. ఆ తర్వాత ఎర్ర రక్త కణాలను వేరు చేసి ప్లేట్లెట్లను మాత్రమే తీసుకునేలా మొత్తం రక్తాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తారు. ఇలా వేరు చేసిన ప్లేట్లెట్లను సిరంజి ద్వారా నెత్తిపై చర్మానికి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఐదు నుంచి ఏడు రోజుల్లో గ్రోత్ మొదలవుతుంది. ఎవరెవరూ చేయించుకోవచ్చంటే.. ఈ ప్లాస్మా థెరపీ ఆరోగ్యవంతమైన పెద్దలకు చెయ్యొచ్చు. గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలకు సిఫార్సు చెయ్యరు. అలాగే రక్తస్రావం, ప్లేట్లెట్ పనిచేయకపోవడం లేదా ప్లేట్లెట్ సమస్య ఉన్నా, రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నా ఈ ప్లాస్మా థెరపీని సిఫార్సు చెయ్యరు వైద్యులు. దీన్ని ఇంజెక్ట్ రూపంలో ఇవ్వాలి కాబట్టి ప్రీ హెచ్ఐవీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి చెక్-అప్ తదితరాలను చెక్ చేసి గానీ రక్తాన్ని సేకరించారు సురక్షితమా..? ఈ చికిత్స చాలా సురక్షితమైనదని వైద్యులు ధీమాగా చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రోగులు సొంత రక్తంతోనే ఈ ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. ఈ ప్రక్రియ సమయంలో వైద్యులు సరైన స్టెరిలైజేషన్ నిర్వహించకపోతే మాత్రం రోగికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం బాగా ఉంటుంది. తలపైన ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం కాబట్టి ఆ ప్రాంతమంతా కాస్త నొప్పిగా కూడా ఉండొచ్చు, గానీ అది ఒక్కరోజులోనే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీన్ని ఆరోగ్య నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలని సూచించారు. (చదవండి: 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..!) -
Hyderabad: బ్లడ్ బ్యాంకుల అనుమతులు రద్దు..
సాక్షి, హైదరాబాద్: ఎండలు ముదురుతున్నాయి. విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రాకపోవడంతో రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించడం లేదు. ఫలితంగా నగరంలోని పలు రక్తనిధి కేంద్రాల్లో రక్తపు నిల్వలు నిండుకున్నాయి. దీనిని పలు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు అవకాశంగా తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచి్చన రోగులకు హోల్ బ్లడ్ సహా ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బ్లడ్ బ్యాంకుల పేరుతో భారీగా దండుకుంటున్నారు. ఈ రక్తపిశాచులపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ అధికారులు అప్రమత్తమై..అనుమానం ఉన్న బ్లడ్ బ్యాంకులపై దాడులు నిర్వహించారు. స్వచ్ఛంద సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్న పలు బ్లడ్ బ్యాంకులను గుర్తించి, వాటి లైసెన్సులను రద్దు చేశారు. ఫక్తు వ్యాపారం ప్రస్తుతం గ్రేటర్లో ఐపీఎం సహా 76 ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీఓ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్లడ్ బాం్యకుల నిర్వాహకులు ప్రముఖుల బర్త్‌డేల పేరుతో ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ కంపెనీల్లో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఆపదలో ఉన్న రోగులను కాపాడాలనే ఉద్దేశంతో చాలా మంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వస్తుంటారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రాసెస్ చేసి, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగుల కు అందజేయాల్సి ఉంది. కానీ నగరంలోని పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం రక్తాన్ని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్‌జే కేన్సర్ సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అందజేయాలనే నిబంధన ఉంది. దీనిని నగరంలోని పలు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. కృత్రిమ కొరత సృష్టించి రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు అధిక రక్త్రస్తావంతో బాధపడుతుంటారు. గర్భిణుల ప్రసవాలతో పాటు పలు కీలక సర్జరీల్లోనూ రక్త్రస్తావం అధికంగా ఉంటుంది. ఇలాంటి వారికి తక్షణమే ఆయా గ్రూపుల రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. డెంగీ జ్వరంతో బాధపడే వారికి తెల్లరక్తకణాలు ఎక్కించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో రోగుల బంధువులు నమూనాలు తీసుకుని సమీపంలోని రక్తనిధి కేంద్రాలను ఆశ్రయిస్తుంటారు. రోగుల బంధువుల్లో ఉన్న బలహీనతను అక్రమార్కులు అవకాశంగా తీసుకుంటున్నారు. హోల్ బ్లడ్ సహా ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను ఆయా బ్లడ్ బ్యాంకుల సామర్థ్యానికి మించి నిల్వ చేసి, మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. రక్తపు కొరత పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు సాధారణ తనిఖీల్లో భాగంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఫిబ్రవరి 2న మూసాపేటలోని హీమో సరీ్వసెస్ లాబోరేటరీలో తనిఖీలు నిర్వహించారు. సామర్థ్యానికి మించి నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు ఆర్ రాఘవేంద్రనాయక్ అక్రమంగా ప్లాస్మాను నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శ్రీకర, న్యూలైఫ్ బ్లడ్ బ్యాంకుల నుంచి హోల్ బ్లడ్‌ను సేకరించి, ప్లాస్మాను వేరు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ అక్రమాల్లో భాగస్వామిగా ఉన్న మియాపూర్‌లోని శ్రీకర ఆస్పత్రి బ్లడ్ బ్యాంకు సహా, దారుషిఫాలోని న్యూలైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ బ్యాంకు కూడా ఉంది. ఈ రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
CWC 2023: షాకింగ్ న్యూస్.. హాస్పిటల్లో అడ్మిట్ అయిన శుభ్‌మన్ గిల్..?
టీమిండియాకు షాకింగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్.. ప్లేట్లెట్స్ స్వల్పంగా తగ్గిపోవడంతో చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం గిల్ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ కోసం టీమిండియా న్యూఢిల్లీకి బయల్దేరగా గిల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చెన్నైలోనే ఉండిపోయాడు. ప్లేట్లెట్స్ కౌంట్ పెరిగాక అతను తిరిగి భారత శిబిరంలో జాయిన్ కానున్నట్లు సమాచారం. గిల్ పూర్తిగా కోలుకునేంత వరకు టీమిండియాతోనే ఉండాలని నిర్ణయించకున్నాడని, అతను విశ్రాంతి కోసం ఇంటికి వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదని బీసీసీఐకి చెందిన కీలక వ్యక్తి ఒకరు తెలిపారు. గిల్.. అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ సమయానికంతా పూర్తిగా కోలుకుంటాడని సదరు అధికారి ధీమాగా చెప్పాడు. కాగా, డెండ్యూ ఫీవర్ కారణంగా శుభ్‌మన్ గిల్ వరల్డ్‌కప్‌లో ఇప్పటికే ఆసీస్‌తో కీలక మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో అతను రేపు (అక్టోబర్ 11) న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా దూరమయ్యేలా ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ తర్వాత పాక్‌తో మ్యాచ్‌కు ముందు రెండు రోజులు గ్యాప్ ఉండటంతో గిల్ పూర్తిగా కోలుకుంటాడని భారత క్రికెట్ అభిమానులంతా ఆశిస్తున్నారు. ఇటీవలికాలంలో భీకర ఫామ్‌లో ఉన్న గిల్ లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటే అయినప్పటికీ విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ లాంటి స్టార్లు ఆ లోటును పూడుస్తున్నారు. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుపోయిన టీమిండియాను విరాట్, రాహులే గట్టెక్కించారు. ఒక వేళ ఈ మ్యాచ్‌లో గిల్ ఉండివుంటే పరిస్థితి వేరేలా ఉండేది. టీమిండియా స్వల్ప లక్ష్య ఛేదనకు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు. ఏదిఏమైనప్పటకీ గిల్ డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకుని త్వరలో బరిలోకి దిగాలని ఆశిద్దాం. ఇదిలా ఉంటే, ప్రపంచకప్-2023లో ఇవాళ (అక్టోబర్ 10) రెండు మ్యాచ్‌లు జరుగనున్న విషయం తెలిసిందే. ఉదయం 10:30 గంటల నుంచి ఇంగ్లండ్-బంగ్లాదేశ్‌లు ధర్మశాల వేదికగా తలపడనుండగా.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మాధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు పోటీపడతాయి. ‘సాక్షి’ తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి -
ప్లేట్లెట్స్ బదులు బత్తాయి జ్యూస్.. బిగ్ ట్విస్ట్
లక్నో: కలకలం రేపిన ప్లేట్లెట్స్ బదులు పండ్లరసం పేషెంట్‌కు ఎక్కించి.. అతని మరణానికి కారణమయ్యారనే ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పేషెంట్‌కు ఎక్కించింది బత్తాయి రసం కాదని.. అది ప్లేట్లెట్స్ యూనిట్లేనని అధికారులు తేల్చారు. ఈ మేరకు ప్రయాగ్‌రాజ్ కలెక్టర్ సంజయ్ ఖత్రీ మాట్లాడుతూ.. ఆ రోగికి ఇచ్చింది బత్తాయి రసం కాదని చెప్పారు. పేషెంట్‌కు ఎక్కిచ్చింది ప్లేట్లెట్స్. కాకపోతే వాటిని సరిగా నిల్వ చేయలేదని కలెక్టర్ ప్రకటించారు. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందం ఈ విషయాన్ని తమ నివేదికలో వెల్లడించినట్లు ఖత్రీ పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో ఇప్పటికే అధికారులు ఆస్పత్రిని సీల్ చేయడమే గాక వివరణ ఇవ్వకపోవడంతో బుల్డోజర్తో కూల్చివేయాలని అదేశాలు కూడా జారీ చేశారు. (చదవండి: రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్ ఘటన.. ఆసుపత్రికి షాకిచ్చిన అధికారులు) -
ప్లేట్లెట్స్ బదులు పండ్ల రసం.. ఆస్పత్రికి సీల్
లక్నో: డెంగీ రోగికి ప్లేట్లెట్స్ బదులు పండ్ల రసం ఎక్కించి.. అతని మృతికి కారణమైన ఆస్పత్రిపై అధికారిక చర్యలు మొదలయ్యాయి. చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆదేశాలనుసారం.. గురువారం రాత్రి ఆ ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ నిర్లక్ష్యపూరిత ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రయాగ్‌రాజ్‌లోని గ్లోబల్ హస్పిటల్ అండ్ ట్రామా సెంటర్‌ను అధికారులు సీజ్ చేశారు. అంతేకాదు.. బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ప్రయాగ్‌రాజ్ కలెక్టర్ సంజయ్ కుమార్ ఖాత్రి స్పష్టం చేశారు. మరోవైపు పేషెంట్ బంధువులు ప్రభుత్వాసుపత్రి నుంచి తెచ్చిన ప్లేట్లెట్స్ బ్యాగులనే తాము ఉపయోగించామని, విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని ఆస్పత్రి నిర్వాహకులు చెప్తున్నారు. 32 ఏళ్ల వయసున్న బాధితుడిని డెంగీ కారణంగా జీహెచ్‌టీసీలో చేర్పించారు. ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడంతో.. ఐదు యూనిట్ల ప్లేట్లెట్స్ ఎక్కించాలని సిబ్బంది ప్రయత్నించారు. మూడు యూనిట్లు ఎక్కించేసరికి వికటించడంతో.. పేషెంట్‌పై ప్రభావం పడింది. దీంతో మిగతావి ఎక్కించడం ఆపేశారు. ఈలోపు పరిస్థితి విషమించడంతో.. బంధువులు అతన్ని పక్కనే ఉన్న మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ కన్నుమూశాడు. ప్లేట్లెట్స్ బ్యాగు నకిలీదని, బత్తాయిలాంటి జ్యూస్‌లతో నింపేసి ఉన్నారని రెండో ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది బాధిత కుటుంబంతో చెప్పారు. దీంతో జీహెచ్‌టీసీ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. అన్యాయంగా తన సోదరి భర్తను పొగొట్టుకుందని.. యోగి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని సౌరభ్ త్రిపాఠి అనే బంధువు వాపోతున్నాడు. प्रयागराज में मानवता शर्मसार हो गयी। एक परिवार ने आरोप लगाया है कि झलवा स्थित ग्लोबल हॉस्पिटल ने डेंगू के मरीज प्रदीप पांडेय को प्लेटलेट्स की जगह मोसम्मी का जूस चढ़ा दिया। मरीज की मौत हो गयी है। इस प्रकरण की जाँच कर त्वरित कार्यवाही करें। @prayagraj_pol @igrangealld pic.twitter.com/nOcnF3JcgP — Vedank Singh (@VedankSingh) October 19, 2022 ఇక ఘటన దుమారం రేపడంతో.. ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాథక్ స్పందించారు. ఆస్పత్రి నుంచి వైరల్ అయిన వీడియోపై దర్యాప్తు సాగుతోంది. ఇప్పటికే ఆస్పత్రికి సీజ్ వేయమని ఆదేశించాం. మరోవైపు ప్లేట్లెట్ ప్యాకెట్లను పరీక్షల కోసం పంపించాం అని పాథక్ ప్రకటించారు. మరోవైపు ప్లేట్లెట్స్ బ్యాగుల్లో పండ్ల రసాలను నింపి సప్లై చేస్తున్న ముఠాల గురించి కథనాలు వస్తుండడంతో దర్యాప్తు ద్వారా విషయం తెల్చేయాలని యోగి సర్కార్ భావిస్తోంది. ఇదీ చదవండి: భజరంగ్‌దళ్‌లోకి 50 లక్షల కొత్త సభ్యత్వాలు -
Health: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో ఒక్కటే కాదు గుమ్మడి, గోధుమ గడ్డి..
Super Foods To Increase Platelet Count: ప్రస్తుత కాలంలో డెంగ్యూ జ్వరాలు, వైరల్ ఫీవర్ల మూలాన ప్లేట్లెట్ల కౌంట్ విపరీతంగా పడిపోతూ రోగులను, వారి సంబంధీకులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అయితే, ప్లేట్లెట్ల కౌంట్ పడిపోయిన తర్వాత చేయగలిగిందేమీ లేదు, దాతలనుంచి సేకరించిన ప్లేట్లెట్లను రోగులకు ఎక్కించడం మినహా. అలా కాకుండా, మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే రోగ నిరోధకత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోగనిరోధకతను పెంచే ఆహారం ఏమిటో తెలుసుకుందాం. రక్తాన్ని పెంచే క్యారట్.. ప్లేట్లెట్ కౌంట్‌ని కూడా పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్యతో బాధపడేవారు త్వరగా ఉపశమనం పొందారని సర్వేలో తేలింది. క్యారెట్‌ని నేరుగానైనా, సలాడ్ రూపంలోనైనా ఎలా తీసుకున్నా ఫలితం ఉంటుంది. గుమ్మడికాయ.. ఎక్కువగా వంటల్లో ఉపయోగించే గుమ్మడిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అంతేనా.. ఇందులో ప్లేట్లెట్లని పెంచడమే కాదు, వాటి సంఖ్యను అదుపులో ఉంచే లక్షణాలు కూడా ఉన్నాయి. దీన్ని క్రమబద్ధంగా తీసుకోవడం వల్ల కణాల్లో ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. ఇలా ప్రోటీన్ ఉత్పత్తి అవడమంటే ప్లేట్లెట్స్కౌంట్ పెరిగినట్లే. బొప్పాయి బొప్పాయి పండు ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి చాలా మంచిదని తెలుసు. అయితే, కేవలం పండులో మాత్రమే కాదు.. ఈ ఆకుల్లోనూ బోలెడు ఆరోగ్యానికి సంబంధించిన గుణాలున్నాయి. ముఖ్యంగా ఇందులో ఫ్లేవనాయిడ్స్, అల్కాలాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిని తినడం వల్ల 24 గంటల్లోనే ప్లేట్లెట్ పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ ఆకు రుచి మాత్రం కాస్త చేదుగానే ఉంటుంది. కానీ, ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోకతప్పదు. గోధుమగడ్డి.. ఈ మధ్యకాలంలో చాలామందికి ఆరోగ్యంపై పెరిగిన అవగాహన కారణంగా.. గోధుమగడ్డి గురించి అందరూ ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇందులోని ఎన్నో ప్రత్యేక గుణాలు ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి.. ఈ గడ్డిని రసంగా చేసుకుని వడపోసి అందులో కాస్త నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ సులభంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బీ 12 ఫుడ్.. ►పాలు, గుడ్లు, చీజ్‌లో బీ 12 ఎక్కువగా ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ బాగా పెరుగుతుందని తేలింది. ►బీట్ రూట్.. ఎరుపు రంగులో ఉండే బీట్రూట్.. శరీరంలో రక్త శాతాన్ని పెంచుతుంది. దీనిని ఎలా తీసుకున్నా మంచిదే. దీని వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. ►క్యారట్, బీట్రూట్ని కలిపి జ్యూస్ చేసుకుని తాగినా మంచి ఫలితమే ఉంటుంది. విటమిన్ కె ఫుడ్.. విటమిన్ కె ఉన్న ఫుడ్ కూడా ప్లేట్లెట్స్ సంఖ్యని పెంచుతుందని తేలింది. కేల్, గుడ్లు, ఆకుకూరలు, లివర్, మాంసం, క్యాబేజీ తినడం వల్ల కూడా ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. విటమిన్ సి ఫుడ్.. ►ఆరోగ్యానికి విటమిన్ సి చాలా అవసరం. ►విటమిన్ సి ఎక్కువగా ఉన్న నిమ్మ, కమలాఫలం, కివీ, పాలకూర, ఉసిరి, బ్రొకోలీ, టమాట, అడవి ఉసిరి, కాలీఫ్లవర్ తినడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుందని తేలింది. ►ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి కౌంట్‌ని పెంచడంలో ఈ ఆహారపదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ►ప్లేట్లెట్స్ పడిపోయిన వారు సమస్యని పరిష్కరించుకునేందుకు వీటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ►ఒకవేళ తినడం కష్టం అనుకుంటే వీటితో సలాడ్ చేసి భోజనానికి ముందుగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక కమలాఫలాల్ని జ్యూస్‌లా చేసుకోని ►తాగేయొచ్చు. ►ముఖ్య విషయం ఏమిటంటే.. పైన చెప్పిన ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం ప్లేట్లెట్స్ సంఖ్య ఒక్కటే పెరగదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిలో వ్యాధి నిరోధకత ఒకటి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. -
Health Tips: ఇవి తరచూ తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది! అంతేకాదు..
పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, దానిమ్మ పండ్లు, డ్రై ఫ్రూట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం.. పాలకూర, బచ్చలి కూర తింటే ►పాలకూర, బచ్చలికూర లాంటి ఆకు కూరలు మీ కంటి చూపును మెరుగుపరుస్తాయి. ►పాలకూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ►ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలపై పోరాడటంతో ప్రముఖపాత్ర పోషిస్తాయి. ►ఆకుకూరలు.. మాక్యులర్ డీజెనరేషన్, కంటిశుక్లం లాంటి సమస్యల నుంచి రక్షించి కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతాయి. దానిమ్మ ►దానిమ్మ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ►రక్తహీనతతో బాధపడేవారిని దానిమ్మ తినమని సలహా ఇస్తారు. ►ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తికి పెంచుతాయి. ►అంతేనా దానిమ్మని రెగ్యులర్‌గా తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది. ►కాబట్టి ప్లేట్లెట్స్ని పెంచుకునేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. డ్రై ఫ్రూట్స్ ►డ్రై ఫ్రూట్స్... శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. ►దీంతోపాటు కంటిచూపును మెరుగు పర్చి నేత్ర సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. ►వీటి లో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. చదవండి: Antibiotic Overuse: యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా..? పొంచి ఉన్న మరో ముప్పు..! -
ప్లేట్లెట్ థెరపీ కిట్‌కు పేటెంట్.. రెండు తెలుగు రాష్టాల్లో ఇదే తొలిసారి
Guntur Doctor Gets Patent For Plasma Therapy Kit: వైద్య రంగంలో పరిశోధనలు చేస్తూ పలు అవార్డులను సొంతం చేసుకున్న సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సూరత్ అమర్నాథ్కు కేంద్ర ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేసింది. ప్లేట్లెట్ థెరపీలో వినూత్నంగా రూపొందించిన వైద్య పరికరానికి ఈ పేటెంట్ లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వైద్యుడు రూపొందించిన వైద్య పరికరానికి పేటెంట్ లభించడం ఇదే మొదటిసారి. శనివారం గుంటూరు కొత్తపేటలోని డాక్టర్ అమర్ ఆర్థోపెడిక్ హాస్పటల్లో డాక్టర్ సూరత్ అమర్నాథ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదంతో స్ఫూర్తి పొంది ప్లేట్లెట్ థెరపీ పరికరాన్ని రూపొందించినట్టు చెప్పారు. రోగి నుంచి రక్తాన్ని సేకరించి ఆ రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ను వేరు చేసి.. ఆ రోగికి అవసరమైన చోట సిరంజితో ఎక్కించడాన్ని ప్లేట్లెట్ థెరపీ అంటారని, ప్రస్తుతం దీనికి రూ.6 వేల నుంచి రూ.15 వేలు ఖర్చవుతుందన్నారు. అయితే తాను రూపొందించిన ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ పరికరం ఖరీదు కేవలం రూ.2 వేలు మాత్రమేనని డాక్టర్ సూరత్ అమర్నాథ్ వివరించారు. -
ప్రాణాంతక డెంగీ: ప్లేట్లెట్స్ తగ్గేదెప్పుడో తెలుసా.. ఎన్ని ఉండాలి?
గత కొద్దిరోజులుగా డెంగీ వ్యాధి విపరీతంగా విస్తరిస్తోంది. డెంగీ వైరస్ సోకిన కొందరిలో ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా తగ్గిపోతుంటుందన్న విషయం తెలిసిందే. ఇది ప్రాణాలకు అపాయం తెచ్చే పరిస్థితి. ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో రక్తదానం చేసేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. కానీ డెంగీ పెచ్చరిల్లుతున్న ఈ సమయంలో ప్లేట్లెట్లు ఇవ్వడం చాలా మంది ప్రాణాలను కాపాడుతుంది. డెంగీ రోగుల్లో ప్లేట్లెట్ల ఆవశ్యకత, వాటిని ప్రదానం చేయాల్సిన అవసరం తెలిపే కథనమిది. ప్లేట్లెట్స్ తగ్గేదెప్పుడు? అప్లాస్టిక్ అనీమియా, కొన్ని రకాల రక్తపు క్యాన్సర్ల (లుకేమియా)లో, బాగా ముదిరిపోయిన లింఫోమా లాంటి క్యాన్సర్లతో పాటు దానికి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లలో మూలుగ దెబ్బతినే అవకాశలున్నాయి. ఇలాంటి సమయాల్లో తెల్ల రక్త కణాలతో పాటు ప్లేట్లెట్స్ కౌంట్ కూడా పడిపోవచ్చు. అలాగే అనేక వైరల్ జబ్బులతో పాటు ముఖ్యంగా డెంగీలో ప్లేట్లెట్స్ సంఖ్య బాగా తగ్గిపోవచ్చు. ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు బాధితుడికి రక్తస్రావం లేదా దేహంలోనే అంతర్గత రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించకపోతే ప్రాణాలకే ప్రమాదం. చదవండి: భోజనం తర్వాత ప్రతిసారీ టూత్‌పిక్ వాడుతున్నారా? ఎక్కించాల్సిందెప్పుడు? సాధారణంగా ప్లేట్లెట్ల సంఖ్య నాలుగు లక్షల నుంచి 80,000 వరకు పడిపోయినా ఎలాంటి ఆపద రాదు. కానీ అవి 20,000 కంటే తక్కువకు పడిపోయినప్పుడు బాధితుడు ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తాడు. అప్పుడు ఏ చిన్నపాటి గాయమైనా అది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అప్పుడు ప్లేట్‌లెట్స్‌ను ఎక్కించడం అవసరమవుతుంది. చూడ్డానికి రక్తమంతా ఒకే ద్రవంలా (యూనీఫామ్గా) కనిపిస్తుంటుందిగానీ.. అందులో ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మాతో పాటు చాలా ప్రోటీన్లు వంటి అంశాలుంటాయన్నది తెలిసిందే. అందులో ప్లేట్లెట్లు కూడా చాలా కీలకమైనవే. ఇవి గాయాలైనప్పుడు లేదా ఇతరత్రా కొన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో రక్తాన్ని గడ్డకట్టేలా చేసి, రక్తస్రావాన్ని నివారించి ప్రాణాలు కాపాడుతుంటాయి. ఎలా ఎక్కిస్తారు? చదవండి: కోవిడ్ తర్వాత వాకింగ్ బెటరా? జాగింగ్ బెటరా?.. క్యాలరీల ఖర్చు ఎలా? కౌంట్ తక్కువగా ఉన్నవారికి ప్లేట్లెట్స్ ఎక్కించడం (ట్రాన్స్ఫ్యూజన్) రెండు రకాలుగా జరుగుతుంది. అవి... 1. ఆర్.డి.పి. (ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్) 2. ఎస్.డి.పి. (సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్) బ్లడ్‌బ్యాంకుల్లో అనేక మంది దాతలు ఇచ్చిన రక్తాన్ని సేకరిస్తుంటారు. ఇందులోంచి రక్తంలో ఉండే ప్రధానమైన మూడు రకాల అంశాలను వేరుచేస్తారు. అంటే ఎర్రరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను విడదీసి వేటికవి ప్యాక్ చేస్తారు. ఇలా చేయడం వల్ల... రక్తహీనత (అనీమియా) మాత్రమే ఉన్న రోగులకు ఎర్రరక్తకణాలు ఎక్కించడం, ప్లాస్మా మాత్రమే అవసరమైన రోగులకు దాన్ని ఇవ్వడం, ప్లేట్లెట్స్ తగ్గినవారికి అవి మాత్రమే ఇవ్వడం ద్వారా ఒకే యూనిట్ బ్లడ్తో ముగ్గురికి ప్రాణాపాయం తప్పించవచ్చు. ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ : బ్లడ్‌బ్యాంకుల్లో అనేక మంది అనేక మంది దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తుంటారు. అందువల్ల ఏ రక్తం ఎవరిదన్న విషయం తెలియదు. అందుకే ఇలా సేకరించిన ప్లేట్లెట్లను ‘ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్’ (ఆర్డీపీ)గా చెబుతారు. ‘ఆర్డీపీ’ని ఎక్కించినప్పుడు పేషెంట్లో 5,000 వరకు మాత్రమే కౌంట్ పెరుగుతుంది. కానీ సురక్షితమైన స్థాయికి ప్లేట్లెట్లను పెంచాలంటే, కౌంట్ కనీసం 25,000 నుంచి 30,000 ఉండాలి. ఇందుకోసం ‘ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్’ ప్రక్రియలో కనీసం 5 నుంచి 6 యూనిట్ల రక్తం అవసరమవుతుంది. అంటే ఒకరికి అవసరమైన ప్లేట్లెట్లను సేకరించాలంటే కనీసం ఐదారుగురు దాతలు కావాలి. కొందరు రోగుల్లో వారి వ్యాధిని బట్టి నాలుగైదు మార్లు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి రావచ్చు. అంటే పేషెంట్‌కు కావాల్సిన ప్లేట్లెట్స్ అందాలంటే కనీసం 30 మంది దాతలు కావాలి. అంతమంది దాతలు దొరకడం చాలా కష్టం. సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ : వైద్యరంగంలో ఇప్పుడున్న ఆధునిక సాంకేతికత సహాయంతో ఒక్క దాత నుంచే అవసరమైన పరిమాణంలో ప్లేట్లెట్స్ సేకరించవచ్చు. ఇలా చేసేప్పుడు రక్తంలోని ఇతర అంశాలను కాకుండా కేవలం ప్లేట్లెట్స్ మాత్రమే సేకరిస్తారు. ఇలా సేకరించేవాటిని ‘సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్’ (ఎస్డీపీ) అంటారు. ఈ ప్రక్రియలో ఒకే దాత... బాధితుడికి అవసరమైనన్ని అంటే... దాదాపు 30,000 ప్లేట్లెట్ కౌంట్ సమకూరేలా వాటిని దానం చేస్తాడు. దానివల్ల దాతకు ఎలాంటి నష్టమూ ఉండదు. కేవలం నాలుగురోజుల్లోనే దాత రక్తంలోకి అవి తిరిగి భర్తీ అవుతాయి. అంతేకాదు.. మళ్లీ ఎవరికైనా అవసరమైతే.. అదే దాత కేవలం 10 రోజుల తర్వాత మళ్లీ ప్లేట్లెట్స్ దానం చేయవచ్చు. అలాకాకుండా, మొత్తం రక్తదానం చేసినప్పుడు... ఆ రక్తమంతా భర్తీ కావడానికి కనీసం మూడు నెలల వ్యవధి అవసరం. అందుకే ప్లేట్లెట్స్ అవసరమైనప్పుడు దాతలు ఎలాంటి అపోహలకు తావులేకుండా ప్రతి పదిరోజులకోమారు కూడా ప్లేట్‌లెట్స్‌ను నిరభ్యంతరంగా దానం ఇవ్వవచ్చు. పైగా ఇటీవలి కాలంలో ఇది చాలామంది ప్రాణాలు కాపాడుతూ పలువురికి మేలు చేస్తుంది. ఎక్కడ, ఎలా పుడతాయి? ప్లేట్లెట్స్ ఎముక మూలుగ నుంచి పుడతాయి. వీటి జీవిత కాలం కేవలం నాలుగు రోజులు మాత్రమే. సాధారణంగా ఎముక మూలుగలో ఏదైనా సమస్య వస్తే ప్లేట్లెట్స్ ఉత్పత్తి తగ్గుతుంది. రక్తంలో వీటి సంఖ్య తగ్గినప్పుడు రక్తం గడ్డకట్టే మన స్వాభావిక రక్షణ ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. ఎన్ని ఉండాలి? ఆరోగ్యవంతుడైన ఓ వ్యక్తిలో క్యూబిక్ మిల్లీమీటర్ పరిమాణంలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్లెట్స్ ఉండాలి. ఇది నార్మల్ కొలత. వీటి సంఖ్యను ‘సెల్ కౌల్టర్ మెషిన్’ అనే యంత్రం ద్వారా కొలుస్తారు. ప్లేట్లెట్ కౌంట్ కోసం 2 – 3 ఎమ్ఎల్ రక్తాన్ని సేకరిస్తారు. డెంగీవ్యాధిగ్రస్తుల్లో ప్లేట్లెట్ కౌంట్ తెలుసుకోవడం కోసం ప్రతి 24 గంటలకోమారు రక్తపరీక్ష నిర్వహిస్తుండాలి. ఎలా పనిచేస్తాయి? రక్తం గడ్డకట్టే జీవక్రియల్లో ప్లేట్‌లెట్స్‌లోని అనేక ప్రోటీన్లు పాలు పంచుకుంటాయి. వీటిని ‘క్లాటింగ్ ఫ్యాక్టర్స్’ అంటారు. ఇవన్నీ ఒక వలలా ఏర్పడి రక్తం ప్రవహించకుండా ఓ అడ్డుకట్ట వేస్తాయి. గాయం అయ్యాక కేవలం 2, 3 నిమిషాల్లోనే ఈ వల ఓ ఆనకట్టలా ఏర్పడుతుంది.