రక్తంతో జుట్టు రాలు సమస్యకు చికిత్స చేస్తారట. దీన్ని ప్లేట్‌లెట్ రిచ్ ప్లాప్మా థెరపీ అని అంటారు. ఈ కొత్త చికిత్స విధానాన్ని హార్వర్ మెడికల్ వైద్య బృందం అభివృద్ధి చేసింది. దీని వల్ల బట్టతల, ఆడవాళ్ల జుట్టు రాలు సమస్యను తగ్గించొచ్చిన చెబుతున్నారు. ఇక్కడ వైద్యులు బాధితుల సొంత రక్తంతోనే వారి హెయిర్ గ్రోత్‌ని డెవలప్ అయ్యేలా చేస్తారు. ఇదేంటీ అని ఆశ్చర్యపోకండి!. ఎందుకంటే మన రక్తంలోని ప్లాస్మాలో పుష్కలంగా ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ఇవి హెయిర్‌ని పెరిగేలా చేయగలవట. అందుకని రోగి నుంచి తీసుకున్న రక్తంలోని ప్లాస్మాని తీసుకుని దానిని తలలో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది.
ఇలా చేయగానే ఆ ప్రదేశంలోని చర్మం ఆకృతి మెరుగపడి తిరిగి జుట్టు పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. చెప్పాలంటే ఈ చికిత్స హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి వివిధ చికిత్సల కంటే సురక్షితమైనది, సమర్థవంతమైనది. ఈ చికిత్స విధానం గురించి నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్‌లో ప్రచురితమయ్యింది. ఈ థెరఫీని జుట్టు రాలు సమస్యలను, బట్టతల సమస్యను నివారిస్తుందని అన్నారు. ఈ చికిత్స విధానంలో ప్లాస్మాలోని ప్లేట్‌లెట్స్ ఇంజెక్షన్ రూపంలో తలపై ఇవ్వడంతో వెంట్రుకల కుదుళ్ల దగ్గర జుట్టు పెరిగేలా వృద్ధికారకాలను ఉత్ఫన్నం చేస్తాయి. తద్వారా వంశపారంపర్యంగా వచ్చే ఆండ్రోజెనెటిక్ అలోపేసియా లేదా బట్టతల, ఆడవారిలో వచ్చే జుట్టురాలు సమస్యను నివారిస్తుంది.
జుట్టు బాగా కురుల్లా ఉండాలనుకునేవారు ఈ థెరపీని సంవత్సరానికి మూడు నుంచి నాలుగుసార్లు చేయించుకోవచ్చట. అలాగే రోగి రక్తాన్ని సేకరించేటప్పుడూ గడ్డకట్టకుండా, ప్లేట్‌లెట్స్ యాక్టివ్‌గా ఉండేలా ప్రత్యేకమైన ట్యూబలో సేకరిస్తారు. ఆ తర్వాత ఎర్ర రక్త కణాలను వేరు చేసి ప్లేట్‌లెట్‌లను మాత్రమే తీసుకునేలా మొత్తం రక్తాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తారు. ఇలా వేరు చేసిన ప్లేట్‌లెట్‌లను సిరంజి ద్వారా నెత్తిపై చర్మానికి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఐదు నుంచి ఏడు రోజుల్లో గ్రోత్ మొదలవుతుంది.
ఎవరెవరూ చేయించుకోవచ్చంటే..
ఈ ప్లాస్మా థెరపీ ఆరోగ్యవంతమైన పెద్దలకు చెయ్యొచ్చు. గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలకు సిఫార్సు చెయ్యరు. అలాగే రక్తస్రావం, ప్లేట్‌లెట్ పనిచేయకపోవడం లేదా ప్లేట్‌లెట్ సమస్య ఉన్నా, రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నా ఈ ప్లాస్మా థెరపీని సిఫార్సు చెయ్యరు వైద్యులు. దీన్ని ఇంజెక్ట్ రూపంలో ఇవ్వాలి కాబట్టి ప్రీ హెచ్‌ఐవీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి చెక్-అప్ తదితరాలను చెక్ చేసి గానీ రక్తాన్ని సేకరించారు
సురక్షితమా..?
ఈ చికిత్స చాలా సురక్షితమైనదని వైద్యులు ధీమాగా చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రోగులు సొంత రక్తంతోనే ఈ ట్రీట్‌మెంట్ చేస్తారు కాబట్టి ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. ఈ ప్రక్రియ సమయంలో వైద్యులు సరైన స్టెరిలైజేషన్ నిర్వహించకపోతే మాత్రం రోగికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం బాగా ఉంటుంది. తలపైన ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం కాబట్టి ఆ ప్రాంతమంతా కాస్త నొప్పిగా కూడా ఉండొచ్చు, గానీ అది ఒక్కరోజులోనే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీన్ని ఆరోగ్య నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలని సూచించారు.
(చదవండి: 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment