Plasma
-
శతకోటి సూర్యులను తలదన్నే... ప్లాస్మా ప్రవాహాలు
ఇదేమిటో తెలుసా? మన ఊహకు కూడా అందనంత పెద్దదైన బ్లాక్‌హోల్ నుంచి దూసుకొస్తున్న రెండు భారీ ప్లాస్మా ప్రవాహాల్లో (బ్లాక్‌హోల్ జెట్) ఒకటి. ఇప్పటిదాకా గుర్తించిన వాటిలో అత్యంత పెద్దవి ఇవేనట. ఈ ప్రవాహాలు అంతరిక్షంలో ఏకంగా 2.3 కోట్ల కాంతి సంవత్సరాల పొడవున పరుచుకున్నట్టు గుర్తించారు! అంతేగాక ఇవి లక్షలాది కోట్ల సూర్యులను మించిన శక్తిని వెదజల్లుతున్నాయట! దీన్నిబట్టి వాటి ఉద్గమ స్థానమైన రాకాసి కృష్ణబిలం ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. ఈ కృష్ణబిలం భూమికి 750 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అనంతశక్తితో నిండిన కృష్ణబిలాలు తన పరిధిలోకి వచ్చే ఏ వస్తువునైనా లోనికి లాక్కుంటాయన్నది తెలిసిందే. ఎంతటి భారీ నక్షత్రాలైనా వాటి బారినుంచి తప్పించుకోలేవు. వాటిని కబళించే క్రమంలో కొద్దిపాటి ద్రవ్యరాశి ప్లాస్మా ప్రవాహంగా మారి కృష్ణబిలం తాలూకు రెండు అంచుల గుండా అపరిమితమైన వేగంతో బయటికి ఎగజిమ్ముతుంది. వాటిని బ్లాక్‌హోల్ జెట్స్‌గా పిలుస్తారు. ఇవి అనంతమైన ప్రకాశంతో మెరిసిపోవడమే గాక దాదాపుగా కాంతివేగంతో దూసుకెళ్తాయి. ఆ క్రమంలో అంతరిక్షంలో ఇలా కళ్లు చెదిరే దృశ్యాలను ఆవిష్కరిస్తాయి. విశ్వనిర్మాణాన్ని బ్లాక్‌హోల్ జెట్స్ ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి ఈ జంట ప్రవాహాలు ఎంతగానో దోహదపడతాయని సైంటిస్టులు మురిసిపోతున్నారు. వీటికి ముద్దుగా గ్రీకు పురాణాల్లోని మహాకాయుడు పోరి్ఫరియాన్ పేరు పెట్టుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రక్తంతో జుట్టు రాలు సమస్యకు చెక్!
రక్తంతో జుట్టు రాలు సమస్యకు చికిత్స చేస్తారట. దీన్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాప్మా థెరపీ అని అంటారు. ఈ కొత్త చికిత్స విధానాన్ని హార్వర్ మెడికల్ వైద్య బృందం అభివృద్ధి చేసింది. దీని వల్ల బట్టతల, ఆడవాళ్ల జుట్టు రాలు సమస్యను తగ్గించొచ్చిన చెబుతున్నారు. ఇక్కడ వైద్యులు బాధితుల సొంత రక్తంతోనే వారి హెయిర్ గ్రోత్‌ని డెవలప్ అయ్యేలా చేస్తారు. ఇదేంటీ అని ఆశ్చర్యపోకండి!. ఎందుకంటే మన రక్తంలోని ప్లాస్మాలో పుష్కలంగా ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవి హెయిర్‌ని పెరిగేలా చేయగలవట. అందుకని రోగి నుంచి తీసుకున్న రక్తంలోని ప్లాస్మాని తీసుకుని దానిని తలలో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా చేయగానే ఆ ప్రదేశంలోని చర్మం ఆకృతి మెరుగపడి తిరిగి జుట్టు పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. చెప్పాలంటే ఈ చికిత్స హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి వివిధ చికిత్సల కంటే సురక్షితమైనది, సమర్థవంతమైనది. ఈ చికిత్స విధానం గురించి నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ప్రచురితమయ్యింది. ఈ థెరఫీని జుట్టు రాలు సమస్యలను, బట్టతల సమస్యను నివారిస్తుందని అన్నారు. ఈ చికిత్స విధానంలో ప్లాస్మాలోని ప్లేట్లెట్స్ ఇంజెక్షన్ రూపంలో తలపై ఇవ్వడంతో వెంట్రుకల కుదుళ్ల దగ్గర జుట్టు పెరిగేలా వృద్ధికారకాలను ఉత్ఫన్నం చేస్తాయి. తద్వారా వంశపారంపర్యంగా వచ్చే ఆండ్రోజెనెటిక్ అలోపేసియా లేదా బట్టతల, ఆడవారిలో వచ్చే జుట్టురాలు సమస్యను నివారిస్తుంది. జుట్టు బాగా కురుల్లా ఉండాలనుకునేవారు ఈ థెరపీని సంవత్సరానికి మూడు నుంచి నాలుగుసార్లు చేయించుకోవచ్చట. అలాగే రోగి రక్తాన్ని సేకరించేటప్పుడూ గడ్డకట్టకుండా, ప్లేట్లెట్స్ యాక్టివ్‌గా ఉండేలా ప్రత్యేకమైన ట్యూబలో సేకరిస్తారు. ఆ తర్వాత ఎర్ర రక్త కణాలను వేరు చేసి ప్లేట్లెట్లను మాత్రమే తీసుకునేలా మొత్తం రక్తాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తారు. ఇలా వేరు చేసిన ప్లేట్లెట్లను సిరంజి ద్వారా నెత్తిపై చర్మానికి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఐదు నుంచి ఏడు రోజుల్లో గ్రోత్ మొదలవుతుంది. ఎవరెవరూ చేయించుకోవచ్చంటే.. ఈ ప్లాస్మా థెరపీ ఆరోగ్యవంతమైన పెద్దలకు చెయ్యొచ్చు. గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలకు సిఫార్సు చెయ్యరు. అలాగే రక్తస్రావం, ప్లేట్లెట్ పనిచేయకపోవడం లేదా ప్లేట్లెట్ సమస్య ఉన్నా, రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నా ఈ ప్లాస్మా థెరపీని సిఫార్సు చెయ్యరు వైద్యులు. దీన్ని ఇంజెక్ట్ రూపంలో ఇవ్వాలి కాబట్టి ప్రీ హెచ్ఐవీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి చెక్-అప్ తదితరాలను చెక్ చేసి గానీ రక్తాన్ని సేకరించారు సురక్షితమా..? ఈ చికిత్స చాలా సురక్షితమైనదని వైద్యులు ధీమాగా చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రోగులు సొంత రక్తంతోనే ఈ ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. ఈ ప్రక్రియ సమయంలో వైద్యులు సరైన స్టెరిలైజేషన్ నిర్వహించకపోతే మాత్రం రోగికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం బాగా ఉంటుంది. తలపైన ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం కాబట్టి ఆ ప్రాంతమంతా కాస్త నొప్పిగా కూడా ఉండొచ్చు, గానీ అది ఒక్కరోజులోనే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీన్ని ఆరోగ్య నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలని సూచించారు. (చదవండి: 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..!) -
Hyderabad: బ్లడ్ బ్యాంకుల అనుమతులు రద్దు..
సాక్షి, హైదరాబాద్: ఎండలు ముదురుతున్నాయి. విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రాకపోవడంతో రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించడం లేదు. ఫలితంగా నగరంలోని పలు రక్తనిధి కేంద్రాల్లో రక్తపు నిల్వలు నిండుకున్నాయి. దీనిని పలు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు అవకాశంగా తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచి్చన రోగులకు హోల్ బ్లడ్ సహా ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బ్లడ్ బ్యాంకుల పేరుతో భారీగా దండుకుంటున్నారు. ఈ రక్తపిశాచులపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ అధికారులు అప్రమత్తమై..అనుమానం ఉన్న బ్లడ్ బ్యాంకులపై దాడులు నిర్వహించారు. స్వచ్ఛంద సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్న పలు బ్లడ్ బ్యాంకులను గుర్తించి, వాటి లైసెన్సులను రద్దు చేశారు. ఫక్తు వ్యాపారం ప్రస్తుతం గ్రేటర్లో ఐపీఎం సహా 76 ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీఓ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్లడ్ బాం్యకుల నిర్వాహకులు ప్రముఖుల బర్త్‌డేల పేరుతో ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ కంపెనీల్లో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఆపదలో ఉన్న రోగులను కాపాడాలనే ఉద్దేశంతో చాలా మంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వస్తుంటారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రాసెస్ చేసి, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగుల కు అందజేయాల్సి ఉంది. కానీ నగరంలోని పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం రక్తాన్ని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్‌జే కేన్సర్ సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అందజేయాలనే నిబంధన ఉంది. దీనిని నగరంలోని పలు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. కృత్రిమ కొరత సృష్టించి రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు అధిక రక్త్రస్తావంతో బాధపడుతుంటారు. గర్భిణుల ప్రసవాలతో పాటు పలు కీలక సర్జరీల్లోనూ రక్త్రస్తావం అధికంగా ఉంటుంది. ఇలాంటి వారికి తక్షణమే ఆయా గ్రూపుల రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. డెంగీ జ్వరంతో బాధపడే వారికి తెల్లరక్తకణాలు ఎక్కించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో రోగుల బంధువులు నమూనాలు తీసుకుని సమీపంలోని రక్తనిధి కేంద్రాలను ఆశ్రయిస్తుంటారు. రోగుల బంధువుల్లో ఉన్న బలహీనతను అక్రమార్కులు అవకాశంగా తీసుకుంటున్నారు. హోల్ బ్లడ్ సహా ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను ఆయా బ్లడ్ బ్యాంకుల సామర్థ్యానికి మించి నిల్వ చేసి, మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. రక్తపు కొరత పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు సాధారణ తనిఖీల్లో భాగంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఫిబ్రవరి 2న మూసాపేటలోని హీమో సరీ్వసెస్ లాబోరేటరీలో తనిఖీలు నిర్వహించారు. సామర్థ్యానికి మించి నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు ఆర్ రాఘవేంద్రనాయక్ అక్రమంగా ప్లాస్మాను నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శ్రీకర, న్యూలైఫ్ బ్లడ్ బ్యాంకుల నుంచి హోల్ బ్లడ్‌ను సేకరించి, ప్లాస్మాను వేరు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ అక్రమాల్లో భాగస్వామిగా ఉన్న మియాపూర్‌లోని శ్రీకర ఆస్పత్రి బ్లడ్ బ్యాంకు సహా, దారుషిఫాలోని న్యూలైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ బ్యాంకు కూడా ఉంది. ఈ రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
హైదరాబాద్‌లో మెడికల్ మాఫియా.. అక్రమంగా బ్లడ్, ప్లాస్మా అమ్మకం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది. అక్రమంగా బ్లడ్ ,ప్లాస్మా సీరం అమ్ముతూ.. మనుషులు ప్రాణాలతో చెలగాటమడుతోంది. తాజాగా మనుషుల రక్తం, ప్లాస్మా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. నగరంలోని పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేపట్టారు. సికిర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్ఆర్ బ్లడ్ బ్యాంక్‌లో సోదాలు జరిపారు. క్లిమెన్స్, క్లినోవి రీసెర్చ్, నవరీచ్ క్లినిక్, జీ7 ఎనర్జీ, క్యూపీఎస్ బయోసర్వీస్‌లో తనిఖీలు నిర్వహించారు. శిల్ప మెడికల్, జెనీరైస్ క్లినిక్, వింప్టా ల్యాబ్స్‌లోనూ డ్రగ్ అధికారుల దాడులు చేపట్టారు. ముసాపేట బాలాజీనగర్‌లోని హీమో ల్యాబొరేటరీస్‌లో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా బ్లడ్, స్లాస్మా, సీరం నిల్వలను అధికారులు గుర్తించారు. అక్రమంగా హ్యూమన్ ప్లాస్మాలను అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు. సంఘటన స్థలం నుంచి భారీగా ప్లాస్మా యూనిట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్లడ్ బ్యాంకుల ద్వారా సేకరించిన రక్తం నుంచి ప్లాస్మా, సీరం తీసి రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సేకరించిన హ్యూమన్ ప్లాస్మాను బ్లాక్ మార్కెట్లో రూ, వేలకు అమ్ముతున్నట్లు తేలింది. దాదాపు ఎనిమిదేళ్లుగా కేటుగాళ్లు ఈదందా సాగిస్తున్నట్లు సమాచారం. చదవండి: బీజేపీని అడ్డుకునే శక్తి వారికి మాత్రమే ఉంది: కేటీఆర్ వ్యాఖ్యలు -
రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్ ఘటన.. ఆసుపత్రికి షాకిచ్చిన అధికారులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించిన ప్రైవేటు ఆసుపత్రిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రయాగ్‌రాజ్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో డెంగీ రోగికి బత్తాయి జ్యూస్ ఎక్కించడంతో బాధితుడు చనిపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రోగి ప్రాణాలు కోల్పోయాడని, ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో తాజాగా సదరు ఆసుపత్రికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆసుపత్రి భవనాన్ని అనుమతులు లేకుండా నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. శుక్రవారం నాటికి భవనాన్ని ఖాళీ చేయాలని లేదంటే బుల్డోజర్తో కూల్చివేస్తామని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే డెంగ్యూ రోగి చనిపోయిన కేసు ప్రాథమిక విచారణలో అధికారుల నిర్లక్ష్యం బయటపడటంతో గత వారమే ఆసుపత్రిని సీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో రోగులు లేరు. అయితే గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఆసుపత్రి అధికారులు సమాధానం ఇవ్వలేదని తేలింది. ఈ ఏడాది ప్రారంభంలో కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు డెంగ్యూ రోగి మరణం అనంతరం ప్రయాగ్‌రాజ్ పోలీసులు నకిలీ ప్లేట్లెట్స్ సరఫరా చేసే ముఠాను ఛేదించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రయాగ్‌రాజ్ ఎస్పీ శైలేష్ కుమార్ పాండే తెలిపారు. నిందితుల నుంచి కొన్ని నకిలీ ప్లేట్లెట్ పౌచ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చదవండి: ‘ఏయ్ ఐటమ్. ఎక్కడికి వెళ్తున్నవ్’.. పోకిరికి బుద్ధి చెప్పిన కోర్టు In UP's Prayagraj, the development authority has issued demolition notice to the the hospital where a dengue patient died during treatment. Family of the deceased had alleged that the patient was given Mosambi juice in the drip instead of platelets. pic.twitter.com/T5a34EtIyY — Piyush Rai (@Benarasiyaa) October 25, 2022 -
యూపీలో ఘోరం.. డెంగ్యూ రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్.. వీడియో వైరల్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చేసింది. డెంగీతో బాధపడుతున్న రోగికి ప్లాస్మా పేరుతో ఓ బ్లడ్ బ్యాంక్ బత్తాయి జ్యూస్‌ను సరాఫరా చేసిందనే వార్త కలకలం రేపింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యుల నిర్లక్ష్యం అతని ప్రాణాలు తీసిందనేది ఆరోపణ. బ్లడ్ ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించడంతో బాధితుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలను వేదాంక్ సింగ్ అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. బ్లడ్ ప్యాక్‌లో బత్తాయి జ్యూస్ కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ప్రయాగ్‌రాజ్‌లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న గ్లోబల్ ఆసుపత్రిలో స్కామ్ అని ఓ వ్యక్తి చెప్పడం వినిపిస్తోంది. ఆసుపత్రితో సంబంధం ఉన్న వైద్యులు బ్లడ్ ప్లాస్మా అవసరం ఉన్న రోగులకు బత్తాయి జ్యూస్‌ని సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేగాక బత్తాయి జ్యూస్ ఎక్కించడం వల్లే రోగి చనిపోయాడని, దీనిపై ప్రయాగ్‌రాజ్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. प्रयागराज में मानवता शर्मसार हो गयी। एक परिवार ने आरोप लगाया है कि झलवा स्थित ग्लोबल हॉस्पिटल ने डेंगू के मरीज प्रदीप पांडेय को प्लेटलेट्स की जगह मोसम्मी का जूस चढ़ा दिया। मरीज की मौत हो गयी है। इस प्रकरण की जाँच कर त्वरित कार्यवाही करें। @prayagraj_pol @igrangealld pic.twitter.com/nOcnF3JcgP — Vedank Singh (@VedankSingh) October 19, 2022 మరోవైపు స్థానికంగా డెంగ్యూ రోగులకు నకిలీ ప్లాస్మా సరఫరా చేయబడుతుందనే నివేదికలను పరిశీలించడానికి దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్లు ప్రయాగ్‌రాజ్ ఐజీ రాకేష్ సింగ్ అన్నారు. ఫేక్ ప్లాస్మా పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. జ్యూస్ సరఫరా చేయబడిందా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదన్నారు. చదవండి: ప్రభుత్వ ఉపాధ్యాయుడికి బడితెపూజ చేసిన మహిళలు.. వీడియో వైరల్ -
కానిస్టేబుల్ థెరిసా.. రెహానా!
కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలో మహారాష్ట్ర, దేశ ఆర్థిక రాజధాని ముంబై చిగురుటాకుల్లా వణికిపోవడంతో.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, ఆపదలో సాయం అడిగిన ప్రతి ఒక్కరికి సాయమందించి ‘అభినవ మదర్ థెరిసా’ గా గుర్తింపు తెచ్చుకున్నారు ముంబైకి చెందిన పోలీసు కానిస్టేబుల్ రెహానా షేక్. విపత్కర పరిస్థితులో తనని సాయం అడిగిన వారందరికి రెహానా ఆక్సిజన్, ప్లాస్మా, బ్లడ్, బెడ్స్ ఏది కావాంటే అది ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించారు. దీంతో రెహానా భర్త, తన తోటి ఉద్యోగులు, తెలిసిన వారు మదర్ థెరిసాగానేగాక ఆమెను మంచి సామాజిక కార్యకర్తగా పిలుస్తున్నారు. కరోనా సమయంలో మానవత్వం తో వ్యవహరించిన రెహానాను పోలీసు కమిషనర్ ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్తో సత్కరించారు. అంతేగాక అందరు పిలుస్తున్నట్లుగానే మదర్ థెరిసా అవార్డు వరించడం విశేషం. మదర్ థెరిసాగా.. 2000 సంవత్సరంలో ముంబై పోలీసు కానిస్టేబుల్‌గా బాధ్యతలు చేపట్టిన రెహానా మంచి వాలీబాల్ ప్లేయర్, అథ్లెట్ కూడా. 2017లో శ్రీలంకలో జరిగిన పోటీల్లో ఆమె రజత, స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. ఆటలు, డ్యూటీలో చురుకుగా ఉండే రెహానా సామాజిక సేవలోనూ ముందుంటారు. ఈ క్రమంలోనే గతేడాది మే 13న తన కూతురు పదహారో పుట్టినరోజు సందర్భంగా రాజ్‌గఢ్ లోని వాజే తాలుకాలో ఉన్న డయానై సెకండరీ స్కూల్ సందర్శించి అక్కడ చదువుతోన్న విద్యార్థులకు స్వీట్లు పంచారు. ఆ సమయంలో స్కూలు ప్రిన్స్‌పాల్‌తో మాట్లాడిన ఆమె.. స్కూల్లో చదువుతోన్న ఎక్కువమంది విద్యార్థులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారని, వారిలో కొందరికి కనీసం కాళ్లకు వేసుకోవడానికి చెప్పులు కూడా లేవని తెలుసుకున్నారు. దీంతో తన కూతురి పుట్టిన రోజుకోసం ఖర్చు చేద్దామని కేటాయించిన డబ్బులు, ఈద్ కోసం ఖర్చుచేసే మొత్తం డబ్బులను స్కూలు పిల్లలకోసం ఇచ్చేశారు. అంతేగాక యాభై మంది పిల్లలను పదోతరగతి వరకు చదివిస్తానని మాట ఇచ్చారు. కోవిడ్ సమయంలో ఆసుపత్రిలో బెడ్ల ఏర్పాటు, ప్లాస్మా, రక్త దానం, ఆక్సిజన్ సరఫరా చేసి 54 మందిని ఆదుకున్నారు. దీంతో ఆమె మంచి సామాజిక వేత్తగా గుర్తింపు పొందారు. తోటి ఉద్యోగులకుసైతం.. తన తోటి కానిస్టేబుల్ తల్లికి ఇంజెక్షన్ దొరకక ఇబ్బంది పడుతున్నారని తెలిసి.. పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి సంబంధిత ఇంజెక్షన్ ఎక్కడ దొరుకుతుందో తెలిసేంత వరకు కాల్స్ చేసి ఇంజెక్షన్‌ను ఏర్పాటు చేశారు. ఇది తెలిసిన పోలీసు యంత్రాంగంలోని కొంతమంది బ్లడ్, ప్లాస్మా, ఆసుపత్రిలో తమ బంధువులకు బెడ్లు కావాలని అడగడంతో ఆమె బ్లడ్ డోనార్స్ వాట్సాప్ గ్రూపుల్లో చేరి రక్తదాతలకు మెస్సేజులు చేసి కావాల్సిన బ్లడ్‌ను ఏర్పాటు చేశారు. అంతేగాక క్యాన్సర్ రోగులకు అవసరమైన సాయం చేస్తున్నారు. ఉద్యోగంతోపాటు తోటి వారి సమస్యలు తీర్చే రెహానా లాంటి వారు అరుదుగా కనిపిస్తారు. -
ప్లాస్మా ఇస్తే పోలీసులకు సెలవు, నగదు పారితోషికం
సాక్షి, ముంబై: కరోనా రోగులకు అవసరమైన ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వచ్చిన పోలీసులకు ఒక రోజు సెలవు, నగదు పారితోషికంతో గౌరవిస్తామని రైల్వే పోలీసు కమిషనర్ కైసర్ ఖాలీద్ ప్రకటించారు. దీంతో వంద మంది రైల్వే పోలీసులు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వచ్చారు. ప్లాస్మా అవసరమైన కరోనా రోగుల జాబితాను వివిధ ఆస్పత్రులను తెప్పిస్తామని కమిషనర్ వెల్లడించారు. ఆ తరువాత జాబితాను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా వారికి అందజేసే ప్రయత్నం చేస్తామని ఖాలీద్ తెలిపారు. ప్రత్యేక వెబ్సైట్.. బ్రేక్ ది చైన్‌లో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో రైల్వే పోలీసులపై ఇప్పటికే అదనపు భారం పడుతోంది. దూరప్రాంతాలకు వెళ్లే సామాన్య ప్రయాణికులను, కూలీలను, కార్మికులను ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూర్చోబెట్టడం మొదలుకుని ప్లాట్‌ఫారంపై, స్టేషన్ పరిసరిల్లో గస్తీ నిర్వహించే బాధ్యతలు వారిపై ఉన్నాయి. ఇప్పటి వరకు 700 మందికిపైగా రైల్వే పోలీసులు కరోనా బారిన పడ్డారు. అందులో అనేక మంది కరోనా నుంచి కోలుకుని ఎప్పటిలాగా మళ్లీ విధుల్లో చేరారు. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ విజృంభించడంతో అనేక మంది కరోనా రోగులకు ప్లాస్మా అవసరం ఏర్పడింది. ఇదిలా ఉండగా ప్లాస్మా అవసరమైన రోగుల మేసేజ్‌లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఖాలీద్ సంబంధిత రైల్వే అధికారులతో చర్చించారు. ప్లాస్మ దానం చేయడంవల్ల విధులు నిర్వహించే పోలీసులపై ఏమైనా ప్రభావం చూపుతుందా..? తదితర అంశాలపై ఆరా తీశారు. ప్లాస్మా దాతలను, ప్లాస్మా అవసరమైన రోగులను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా 1800120080000 అనే టోల్ ఫ్రీ హెల్ఫ్‌లైన్ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వంద మంది పోలీసులు ముందుకు వచ్చారు. ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో ప్లాస్మాదాతల పేర్లు రిజిస్ట్రేషన్ చేశారు. మరోపక్క తమకు ప్లాస్మా కావాలని 110 మంది కరోనా బాధితులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వంద మంది రైల్వే పోలీసుల ప్లాస్మ సేకరించి అవసరమైన కరోనా రోగులకు వెంటనే అందజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఖాలీద్ తెలిపారు. అయితే మరోవైపు ప్లాస్మా చికిత్సను నిలిపివేయాలని పలువురు వైద్యనిపుణులు ఐసీఎంఆర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఐసీఎంఆర్ తుదినిర్ణయంపైనా ప్లాస్మా దానం ఆధారపడి ఉంది. -
ప్లాస్మాను వదలని అక్రమ రాయుళ్లు
నోయిడా: కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ప్రాణాధార ఔషధాలు, అక్సిజన్ మాత్రమే కాదు. రక్తంలోని ప్లాస్మాను కూడా అక్రమంగా అమ్ముతున్నారు కొందరు కేటుగాళ్లు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో కోవిడ్-19 బాధితులకు ష్లాస్మాను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారు ఒక్కో యూనిట్ రూ.50,000 నుంచి రూ.60,000 చొప్పున బ్లడ్ ప్లాస్మా అమ్ముతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ప్లాస్మా కావాల్సిన వారు సంప్రదించాలని సూచిస్తూ నిందితులు ఫేస్బుక్ ఖాతాలో ఫోన్ నంబర్ సైతం ఇవ్వడం గమనార్హం. నిందితుడు అనిల్ శర్మ తన తల్లికి అవసరమైన ప్లాస్మా కోసం ఓ ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పనిచేసే రోహిత్ రాఠీని గతంలో సంప్రదించాడు. అనంతరం ఇద్దరూ జట్టుకట్టారు. దాతలకు కొన్ని డబ్బులిచ్చి ప్లాస్మా సేకరించి, కరోనా బాధితులకు అధిక ధరలకు విక్రయించి, సొమ్ము చేసుకుంటు న్నారని గ్రేటర్ నోయిడా అదనపు డీసీపీ విశాల్ పాండే తెలిపారు. నిందితుల నుంచి ఒక యూనిట్ ప్లాస్మాతో పాటు రూ.35,000 నగదు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సెక్షన్ 42 (మోసం) కింద, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్. యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాష్త చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య? -
కోవిడ్ బాధితుల కోసం స్నాప్‌డీల్ సంజీవని
ఈ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్ తాజాగా సంజీవని పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా కోవిడ్-19 రోగులను ప్లాస్మా దాతలతో అనుసంధానిస్తారు. రోగులు, దాతలు తమ పేర్లను మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఆధారంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ గ్రూప్, ప్రాంతం, కోవిడ్-19 ఎప్పుడు సోకింది, ఎప్పుడు నెగెటివ్ వచ్చింది వంటి వివరాలను పొందుపర్చాలి. ఈ వివరాల ఆధారంగా స్నాప్‌డీల్ సర్చ్ ఇంజన్ రోగులను, దాతలను కలుపుతుంది. ప్లాస్మా దానంపై అవగాహన పెంచేందుకు సంజీవని నడుం బిగించింది. మహ మ్మారి విస్తృతి నేపథ్యంలో ఫేస్బుక్, గూగుల్, పేటీఎం వంటి సంస్థలు సైతం తమ వంతుగా సాయపడేందుకు డిజిటల్ వేదికగా టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా పేషెంట్స్ కోసం గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్ -
ప్లాస్మా డోనేషన్ చేసేవారి కోసం ఉచితంగా రవాణా సౌకర్యం
-
కోవిడ్ బాధితుడి దాతృత్వం.. మూడుసార్లు ప్లాస్మాదానం..
సాక్షి, కోల్‌సిటీ(కరీంనగర్): గోదావరిఖనికి చెందిన ఉప్పల శ్రీధర్ స్వచ్ఛందంగా మూడుసార్లు ప్లాస్మా దానం చేసి ఆదర్శంగా నిలిచాడు. స్థానిక కృష్ణానగర్‌కు చెందిన శ్రీధర్‌కు గతేడాది మేలో కరోనా సోకింది. వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్లో ఉంటూ మందులు వాడి కోవిడ్‌ను జయించాడు. కరోనా పేషెంట్లకు మనోధైర్యం కల్పించడానికి ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో ‘కరోనా నుంచి కోలుకున్నవారు స్వచ్ఛందంగా ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఇచ్చిన పిలుపు తనను కదిలించిందని శ్రీధర్ తెలిపాడు.’ గతేడాది ఆగస్టు 14న మొదటిసారి హైదరాబాద్‌లో, రెండోసారి గతేడాది అక్టోబర్ 16న కరీంనగర్లో, ఈ ఏడాది గత నెల 23న కరీంనగర్లో కరోనా పేషెంట్లకు ప్లాస్మా దానం చేశాడు. రక్తదానం ఎంత ప్రధానమో, ప్లాస్మా దానం కూడా అంతే ప్రధానమని శ్రీధర్ పేర్కొంటున్నాడు. కోవిడ్‌ను జయించినవారు అపోహలు వీడి ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాడు. -
ఛీ.. ఛీ: ప్లాస్మా కోసం సోషల్ మీడియాలో నంబర్ షేర్ చేస్తే..
ముంబై: మగవారిలో కొందరు మగానుభావులు ఉంటారు. వీరికి సమయం, సందర్భం ఇలాంటి ఏం పట్టవు. ఆడగాలి సోకితే చాలు.. చిత్తకార్తి కుక్కలా మారిపోతారు. అవతలి మనిషి పరిస్థితిని ఏ మాత్రం అర్థం చేసుకోకుండా వారిని వేధింపులకు గురి చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ముంబైలో చోటు చేసుకుంది. ఓ మహిళా కరోనా బారిన పడిన తన కుటుంబ సభ్యుల కోసం ప్లాస్మా, వెంటిలేటర్స్ కావాలి.. దాతలు ఎవరైనా సాయం చేయండని కోరుతూ.. సోషల్ మీడియాలో తన పర్సనల్ మొబైల్ నంబర్ షేర్ చేసింది. ఇంకేముంది.. మహిళ సెల్ నంబర్ దొరికడంతో కొందరు మృగాళ్లు ఆమె పరిస్థితిని అర్థం చేసుకోకుండా.. లైంగిక వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. దాంతో సదరు మహిళ ‘‘సాయం కోసం నంబర్ షేర్ చేసాను.. ఇలాంటి సమయంలో కూడా ఆడవారిని ఏడిపించే ప్రబుద్ధులు.. మెడికల్ ఎమర్జెన్సీలో కూడా కేవలం జననేంద్రియాలతో ఆలోచించే దరిద్రులు ఉంటారని అస్సలు అనుకోలేదు.. ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళలు తమ నంబర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు’’ అంటుంది బాధితురాలు. ఆ వివరాలు.. ముంబైకి చెందిన శస్వతి శివ అనే యువతి కుటుంబ సభ్యులు కోవిడ్ బారిన పడ్డారు. వారి చికిత్సలో భాగంగా ప్లాస్మా, వెంటిలేటర్స్ అవసరం అయ్యాయి. దాంతో తనకు తెలిసిన వారందరికి కాల్ చేసి సాయం చేయమని అడిగింది. కానీ లాభం లేకపోయింది. లేట్ చేసిన కొద్ది కోవిడ్ బారిన పడిన వారికి ప్రమాదం. దాంతో ఆమె తన పరిస్థితిని వివరిస్తూ.. ప్లాస్మా, వెంటిలేటర్స్ కోసం అర్థిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్ చేసింది. దాతలు తనను సంప్రదించేందుకు వీలుగా ఆమె పర్సనల్ సెల్ నంబర్ని షేర్ చేసింది. ఇక మొదలైంది టార్చర్. ఫోన్ మోగిన ప్రతి సారి ఆమె తనకు సాయం లభిస్తుందనే ఉద్దేశంతో ఆశగా కాల్ లిఫ్ట్ చేసేది. కానీ చాలా సార్లు ఆమెకు నిరాశే ఎదురయ్యింది. ఆమెకు కాల్ చేసిన వారు అందరూ మగవారు. వారిలో చాలా మంది ‘‘మీరు ఎక్కడ ఉంటున్నారు’’.. ‘‘మీరు సింగిలా’’.. ‘‘నేను మీకు సాయం చేస్తాను కానీ నాతో డేట్‌కి వస్తారా’’.. ‘‘మీ డీపీ చాలా బాగుంది’’ వంటి చెత్తంతా వాగేవారు. ఇక మరి కొందరు ప్రబుద్ధులు మరో అడుగు ముందుకు వేసి.. వీడియో కాల్ చేయడం.. మార్ఫడ్ ఫోటోలు పంపడం చేశారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆమె ఫోటో కొన్ని అశ్లీల వెబ్సైట్లలో ప్రత్యక్షం అయ్యింది. ఏడుగురు వ్యక్తులు అయితే ఒకరి ఒకరి తర్వాత ఒకరు ఆమెకు వీడియో కాల్ చేస్తూనే ఉన్నారు. జరిగిన సంఘటనలు చూసి ఆమెకు చిరాకెత్తింది. సాయం చేయమని కోరుతూ నంబర్ షేర్ చేస్తే.. ఇతంటి భయానక అనుభవం ఎదురయ్యింది అంటూ వాపోయింది. దాంతో శస్వతి శివ ట్విట్టర్ ద్వారా తన బాధను వెల్లడించారు. తను ఎదర్కొన్న అనుభవాలను చెప్తూ.. ‘‘మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో కూడా చాలా మంది మగవారు కేవలం తమ జననేంద్రియాలతో మాత్రమే ఆలోచిస్తారని.. పరిస్థితితో సంబంధం లేకుండా ఆడవారిని వేధిస్తారని ఈ ఘటనతో నాకు బాగా అర్థం అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ వ్యక్తిగత నంబర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయకండి’’ అంటూ ట్వీట్ చేశారు. I thought it wouldn't get worse, but since this morning, I've received (on whatsapp) 3 dick pics, and 7 men trying to video call me continuously. Even in a medical emergency, men think only with their genitals. Women: NEVER, EVER let your number out in public forums. https://t.co/CAJJKiQmR6 — Shasvathi Siva (@shasvathi) April 16, 2021 చదవండి: ‘మీ కాళ్లు మొక్కుతా.. నా భార్య చనిపోయేలా ఉంది’ -
ప్లాస్మా దానంలో రికార్డు : ఎన్నిసార్లో తెలుసా?
సాక్షి, ముంబై : పుణేకు చెందిన అజయ్ మునోత్ (50) అనే వ్యక్తి ప్లాస్మా దానం చేసి ఏకంగా తొమ్మిది మంది ప్రాణాలు కాపాడాడు. మార్కెటింగ్ కన్సల్టంట్గా కొనసాగుతున్న అజయ్‌కు 2020 జూన్ 28వ తేదీన కరోనా సోకింది. దీంతో పుణే డెక్కన్‌లోని సహ్యాద్రి ఆసుపత్రిలో చికిత్స పొందా రు. ఇలా కరోనా నుంచి విముక్తి పొందిన అనంతరం ఆయన ఆసుపత్రి వర్గాల అభ్యర్థనల మేరకు ఏకంగా తొమ్మిది సార్లు ప్లాస్మా దానం చేసి తొమ్మిది మందికి ప్రాణదానం చేశారు. ముఖ్యంగా కరోనా నుంచి విముక్తి పొందిన ఆయన తొలిసారిగా 2020 ఆగస్టు 26వ తేదీన తన ప్లాస్మాను దానం చేయగా అనంతరం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రెండేసి అనగా మొత్తం నాలుగు సార్లు ప్లాస్మాను దానం చేశాడు. ప్లాస్మా దానం చేయడానికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. రక్త పరీక్షలు చేసి శరీరంలోని యాటిబాడీలను తెలుసుకుంటారు. అయితే ఈ రిపోర్డు రావడానికి సుమారు గంటన్నర సమయం పడుతుంది. అనంతరం సేకరించిన రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేసి మిగిలిన రక్తాన్ని తిరిగి దాత శరీరంలోకి ఎక్కిస్తారు. ఇలా తన సమయాన్ని వెచ్చింది ప్లాస్మా దానంతో తొమ్మిది మందిని కాపాడి మానవత్వాన్ని చాటుకున్న అజయ్‌ను అనేక మంది అభినందనలతో ముంచెత్తుతున్నారు. కొత్త రికార్డు... అజయ్ మునోత్ తొమ్మిది సార్లు దానం చేసి తొమ్మిది మందికి ప్రాణాలు కాపాడి కొత్త రికార్డును సృష్టించారని చెప్పవచ్చని సహ్యాద్రి ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు విభాగ ప్రముఖురాలు డాక్టరు పౌర్ణిమ తెలిపారు. ముఖ్యంగా ఆయన మా ఆసుపత్రిలో ప్లాస్మా దానం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆనందంగా ఉంది నేను చేసిన ప్లాస్మా దానంతో తొమ్మిది మంది కోలుకున్నారని తెలిసి చాలా ఆనంద పడ్డాను. ఇంగ్లాండ్‌లో ఒక వ్యక్తి పది సార్లు, మన దేశంలోనే మరొక వ్యక్తి ఆరుసార్లు ప్లాస్మా దానం చేశారని ఇంటర్నెట్లో చూశాను. అయితే నా రికార్డు కోసం కాకుండా కరోనా బాధితులకు ఉపయోగ పడుతుందనే విషయమే నాకు ఎక్కువగా ఆనందం కలుగచేస్తుంది. -అజయ్ మునోత్ -
ప్లాస్మా దానం.. ప్రాణదానమే
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితులకు అం డగా కోవిడ్ జయించిన వ్యక్తులు నిలవడం అభినందనీయమని తెలంగాణ ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ప్లాస్మా దానం చేయడమంటే కోవిడ్ బాధితులకు ప్రాణదానం చేయడమేనన్నారు. శనివారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లాస్మా దాతలను ఘనంగా సన్మానించారు. అపోలో చైర్ పర్సన్ సంగీతారెడ్డి, సన్‌షైన్ హాస్పిటల్ చైర్మన్ గురువారెడ్డిల చేతుల మీదు గా 50 మంది ప్లాస్మా దాతలకు సన్మానం చేసి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు మాట్లాడుతూ, కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తాను, కరోనా బాధితులకు ప్లాస్మాదానం చేయించడం ద్వారా అండగా నిలవాలని భావించి అసోసియేషన్ ఏర్పాటు చేశానన్నారు. గత రెండు నెలలుగా అసోసియేషన్ నేతృత్వంలో ప్లాస్మా దాతల సమీకరణకు కృషి చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు 800 మంది నుంచి ప్లాస్మా సేకరించి, 1,200 మంది కోవిడ్ బాధితులకు ఇప్పించినట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా గూడూరు చేస్తున్న కృషిని పలువురు ప్లాస్మా దాతలు అభినందించారు. -
కరోనా: పేదలకు అండగా మెగాస్టార్
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. తాజాగా కరోనా బారిన పడిన నిస్సహాయులైన పేద రోగులకు ఉచిత ప్లాస్మాను తన బ్లడ్ బ్యాంకు ద్వారా అందించేందుకు చిరు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. “పచ్చటి జీవితాలపై కర్మశ కరోనా పంజా విసుర్లూ చిన్నాభిన్నం చేస్తోంది. అందులో పేద రోగులు చికిత్స పొందడం గగనమవుతోంది. ఈ పరిస్థితుల్లో పేద రోగుల్ని కరోనా బారి నుంచి కాపాడేందుకు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సమాయత్తమైంది అంటూ ఆ ప్రకటనలో పేర్కొంది. కరోనా సోకి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేస్తే మరికొంతమందికి ఆయుషు పోసీనట్లే అని అందులో వివరించారు. తెల్లరేషన్ కార్డుదారులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్లకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచితంగా ప్లాస్మా సరఫరా చేయనున్నారు. పేదలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు కోరారు. 22 సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి సొంత నిధులు వెచ్చించి 9 లక్షల 27 వేల మంది పేద రోగులకు ఈ బ్లడ్‌బ్యాంక్ ద్వారా ఉచితంగా రక్తాన్ని అందించారని ఈ సందర్భంగా వారు తెలిపారు. పేదవాళ్ళకి అండగా నిలుస్తున్న చిరంజీవిని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ప్లాస్మా కరోనాను ఎదుర్కోవడానికి ఒక బలమైన ఆయుధమని ఇది వరకే పిలుపునిచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడంతో అందరూ ఆయనను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఒక ఖరీదైన వస్తువుగా ఉన్న ప్లాస్మాను పేదలకు అందుబాటులోకి తెస్తున్న చిరంజీవికి చాలా మంది ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ఆచార్య సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. చదవండి: ఎన్నోసార్లు బాలూగారి నుంచి తిట్లు కూడా తిన్నా.. -
మరోసారి ప్లాస్మా దానం చేసిన సంగీత దర్శకుడు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఆయన తనయుడు, గాయకుడు కాలభైరవ మరోసారి ప్లాస్మా దానం చేశారు. కొన్నిరోజుల క్రితం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, కీరవాణి సహా కొందరు కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. అయితే వీరందరూ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. అయితే కరోనా సోకిన రోజే తాము ప్లాస్మా దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు ట్విటర్లో ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం.. కీరవాణి, కాలభైరవ కరోనా వారియర్స్‌గా మారి ప్లాస్మాను దానం చేశారు. (నేను అందుకే ప్లాస్మా ఇవ్వలేదు: రాజమౌళి) తాజాగా ఇప్పుడు రెండోసారి కీరవాణి, కాలభైరవ ప్లాస్మాను దానం చేశారు. ఈ విషయాన్ని కీరవాణి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మా రక్తంలో యాంటీ బాడీస్ ఇప్పటికీ చురుకుగా ఉన్నట్లు తెలిసి.. నేను, నా కొడుకు కిమ్స్ ఆస్పత్రిలో రెండవసారి ప్లాస్మాను దానం చేశాము. ఒకటి కంటే ఎక్కువసార్లు ప్లాస్మా దానం చేయడానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’. అని చెబుతూ ప్లాస్మాను దానం చేస్తున్నప్పుడు తీసిన ఫొటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం కీరవాణి రెండు సినిమాలకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. (ప్లాస్మా దానం చేసిన ఎంఎం కీరవాణి) -
ప్లాస్మా దానం చేస్తా
తెలుగు ఇండస్ట్రీలోనూ కరోనా వ్యాప్తి చెందుతోంది. ఆ మధ్య దర్శకుడు రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు, తేజ వంటి వారు కోవిడ్ బారినపడ్డారు. తాజాగా నటుడు నాగబాబుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ఆయనే తెలిపారు. ఈ విషయం గురించి ఇలా రాసుకొచ్చారాయన. ‘వైరస్ అనేది ప్రతిసారీ మనల్ని బాధకు గురి చేసేది కాదు, ఇతరులకు సహాయం చేసే అవకాశాన్ని కూడా కల్పించేది అవుతుంది. కరోనా పాజిటివ్ అని తేలింది. దీన్ని తట్టుకుని నిలబడి ప్లాస్మా దానం చేయాలనుకుంటున్నాను’ అన్నారు నాగబాబు. -
ప్లాస్మా దానం చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ స్టేట్ కోవీడ్ హాస్పటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ ప్లాస్మా దానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘ప్లాస్మా డొనేట్ చేయడం చాలా సులువు ,రక్తదానం చేసినట్లు ప్లాస్మా చేయవచ్చు. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో 2001లో ఒక చిన్నారికి యాక్సిడెంట్ అయితే రక్తదానం చేశాను. చాలాకాలం తర్వాత ప్లాస్మా డొనేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతం హాస్పిటల్ లో 300 మంది చికిత్స పొందుతున్నారు వారి ప్రాణాలు కాపాడడానికి ప్లాస్మా దానం చేయడానికి కోవిడ్ వారియర్స్ ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు. చదవండి: ప్లాస్మా దానానికి భయపడక్కర్లేదు -
ప్లాస్మా దానానికి భయపడక్కర్లేదు
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మంగళవారం ప్లాస్మా దానం చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన కుమారుడు, యువ సంగీత దర్శకుడు కాల భైరవతో కలిసి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలోని ప్లాస్మా డొనేషన్ వింగ్‌లో ప్లాస్మా దానం చేసినట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ నుంచి కాపాడే ప్లాస్మాపై ఉన్న అపోహలు పోగొడుతూ ప్లాస్మా యోధుల కోసం ఒక పాటను కీరవాణి రచించిన సంగతి తెలిసిందే. ‘‘ప్లాస్మా దానం చేయడం రక్తం దానం చేసినట్లే ఉంది. దానం చేసేందుకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలి’’ అని పిలుపునిచ్చారు కీరవాణి. కీరవాణి తమ్ముడు, అగ్ర దర్శకుడు రాజమౌళి కూడా ఇటీవల కరోనాను జయించి ప్లాస్మా దానం చేసిన విషయం తెలిసిందే. -
నేను అందుకే ప్లాస్మా ఇవ్వలేదు: రాజమౌళి
సాక్షి, హైదరాబాద్: కరోనా నుంచి కోలుకున్న వారు వీలైనంత త్వరగా ప్లాస్మా దానం చేసి ప్రాణాలను కాపాడాలని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విటర్ ద్వారా కోరారు. మన శరీరంలో ఏర్పడిన కరోనా ప్రతి బంధకాలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఈలోపే ప్లాస్మా దానం చేస్తే వేరే వారి ప్రాణాన్ని కాపాడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. తన శరీరంలో యాంటీ బాడీస్ కోసం పరీక్ష చేయించుకోగా ఐజీజీ లెవల్స్ 8.62 ఉన్నాయని, ప్లాస్మా దానం చేయాలంటే 15కన్నా ఎక్కువ ఉండాలని తెలిపారు. పెద్దన్న కీరవాణి, భైరవ మంగళవారం ఉదయం ప్లాస్మా దానం చేశారని జక్కన్న పేర్కొన్నారు. రాజమౌళి ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్లాస్మా దానం చేసిన ఎంఎం కీరవాణి The antibodies that develop stay in our system for a limited period of time only.. I request Everyone who are cured from #Covid19 to come forward and donate. And become a life saver..🙏🏼🙏🏼 — rajamouli ss (@ssrajamouli) September 1, 2020 -
ప్లాస్మా దానం చేసిన ఎంఎం కీరవాణి
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత సంగీత దర్శకుడు, గాయకుడు ఎం.ఎం. కీరవాణి మంగళవారం ప్లాస్మా దానం చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. తన కుమారుడు భైరవతో కలిసి కిమ్స్ ఆసుపత్రిలోని ప్లాస్మా డొనేషన్ వింగ్‌లో ప్లాస్మా దానం చేసినట్లు తెలిపారు. ప్లాస్మా దానం చేయడం రక్తం దానం చేసినట్లే ఉందని, అందులో భయపడవలసిన అవసరం లేదని కీరవాణి పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరు ప్లాస్మాదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న ప్రముఖులు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావడాన్ని నెటిజనులు అభినందిస్తున్నారు. చదవండి: ప్లాస్మాదాతలకు రాజమౌళి ప్రోత్సాహకాలు Just done with voluntary donation of plasma at KIMS along with my son Bhairava. Feeling good. It felt very normal like in a routine blood donation session. No need to fear at all for participating. pic.twitter.com/2WVGNUtCIR — mmkeeravaani (@mmkeeravaani) September 1, 2020 -
కరోనా నియంత్రణ కష్టమేం కాదు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘1918–21 వరకు మూడేళ్ల వ్యవధిలో స్వైన్ ఫ్లూతో ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల (5 కోట్ల) మంది చనిపోయారు. 2010లోనూ అదే జాతికి చెందిన (బలహీనమైన) వైరస్ మన రాష్ట్రంపై దాడి చేసింది. కానీ అప్పటికే మందు అందుబాటులో ఉండటంతో ప్రాణనష్టం అంతగా జరగలేదు. ఇప్పుడు కోవిడ్–19 ప్రపంచంలో మరణ మృదంగం మోగిస్తోంది. కానీ 1918–21 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మన వద్ద మంచి వైద్యం అందుబాటులో ఉంది. ప్రజల్లో అవగాహన, చైతన్యం ఉంది. వైద్యులు సూచించిన మేరకు సలహాలు, సూచనలు పాటిస్తే కరోనాను నియంత్రించడం కష్టమేమీ కాదు. సరైన ఆహారం, కంటి నిండా నిద్ర, వ్యాయామం ఉంటే చాలు’అని షికాగోలోని ఇలినాయి హెల్త్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ ఎల్దండి స్పష్టంచేశారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించిన ఆయన అందులో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కరోనా చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన, శిక్షణ ఇచ్చారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. అనవసర మందులు వాడితే ప్రాణాలకు ముప్పు.. కరోనా పాజిటివ్ అని తేలగానే బాధితులు భయాందోళనకు గురవుతున్నారు. కొందరు ఆస్పత్రుల్లో చేరితే చాలా మంది ఇళ్లలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కరోనాపై ఎలాంటి అవగాహన లేని వైద్యులు చెప్పిన మందులు వాడుతున్నారు. ఇది మంచిది కాదు. అనుభవజ్ఞులైన వైద్యుల సలహాలు, సూచనలతోనే మందులు వాడాలి. పలు ఆస్పత్రుల్లోనయితే వైద్యులు కరోనా రోగులకు యాంటిబయోటిక్స్ ఇస్తున్నారు. ఎక్కువ మోతాదులో యాంటిబయోటిక్స్ ఇస్తే ప్రాణాలు పోతాయి. అసలు కరోనా ఉన్న వారికి ఇవి అనవసరమనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రస్తుతం డెక్సామెతసోన్ మాత్రతోనే వైరస్‌ను కాస్త కట్టడి చేయగలం. అమెరికాలో ఇది నిర్ధారణ అయింది. ఈ మాత్ర మార్కెట్లో రూ.5 లోపే ఉంటుంది. ఇలాంటి నిరూపితమైన మందులు మన దగ్గర వాడటం లేదు. కానీ రూ.32 వేల ఖరీదు చేసే నిరూపితం కాని యాంటి వైరల్ డ్రగ్స్ వాడుతున్నారు. ఈ విషయంలో పలు ఆస్పత్రులు తమ తీరు మార్చుకోవాలి. ఈ వ్యవహారంపై ప్రభుత్వమూ దృష్టి సారించాలి. వైరస్ మళ్లీ మళ్లీ రావొచ్చు.. కరోనా చికిత్స పొందిన వ్యక్తికి మళ్లీ మళ్లీ ఆ వైరస్ సోకవచ్చు. సాధారణంగా వైరస్ సోకిన ఐదారు రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. కొందరికి ఆ లక్షణాలూ ఉండవు. ఒకసారి నిర్ధారణ అయి చికిత్స పొందిన తర్వాత వైరస్ వెళ్లిపోతుంది. అయితే వైరస్ మూలాలు శరీరంలో అలానే ఉంటాయి. సదరు వ్యక్తి సరైన జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ మళ్లీ సోకే ప్రమాదం లేకపోలేదు. ప్రత్యేక ఆహారమనేది లేదు... కరోనా రోగులు మాంసం, చేపలు, గుడ్లు వంటి బలమైన ఆహారం ఎక్కువగా తీసుకోవాలని చాలా మంది అంటుంటే విన్నా. అయితే వైరస్‌ను తట్టుకోగలిగే వ్యాధి నిరోధక శక్తి మన శరీరంలో ముందే ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్ర, వ్యాయామం చేస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మృతదేహం నుంచి వైరస్ సోకదు... కరోనాతో చనిపోయిన వ్యక్తి నుంచి వైరస్ సోకుతుందనే భయంతో మృతుడి కుటుంబీకులు, బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకూ ఇష్టపడటం లేదు. సహజంగా కరోనా వ్యక్తి ఊపిరి తీసుకున్నప్పుడు గాలి ద్వారా లేదా అతని శరీరాన్ని ముట్టుకుంటే వైరస్ ఇతరులకు సోకుతుంది. చనిపోయిన తర్వాత అతను ఊపిరి తీసుకోలేడు, అతన్ని ముట్టుకునే అవకాశం ఉండదు. పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు చేయ వచ్చు. ప్రజలు తరచూ శానిటైజ్డ్ అవుతూ ఉండాలి. సబ్బు, నీళ్లను మించిన శానిటైజర్ ప్రపంచంలో ఏదీ లేదు. మాస్కులు సాధారణ బట్టతో చేసినవే మేలు. అది ఆందోళన కలిగించేదే... కరోనా బాధితుడికి ప్లాస్మా ఎక్కిస్తే ప్రయోజనం ఉంటుందని కొందరు వైద్యులు నమ్ముతున్నారు. ఇది వాస్తవం కాదు. బాధితుడి శరీరంలోకి ప్లాస్మా ఎక్కిస్తే రియాక్షన్ అయ్యే ప్రమాదముంది. ఇక 85 శాతం మందికి వైరస్ సోకినా లక్షణాలు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమే. ఇప్పటి వరకు ఈ వైరస్‌ను తట్టుకోగలిగే, వ్యాధిని నిర్మూలించగలిగే ఎలాంటి వ్యాక్సిన్ ప్రపంచంలో ఎక్కడా లేదు. స్వీయనియంత్రణ, రక్షణతోనే వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోగలం -
సైబరాబాద్ : ప్లాస్మాదానం ప్రచారంలో రాజమౌళి
-
ప్లాస్మాదానం ప్రచారంలో రాజమౌళి
-
ప్లాస్మాదాతలకు రాజమౌళి ప్రోత్సాహకాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో ప్లాస్మాపై అనేక అపోహలుండేవని, వీటిని పోగొట్టేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. వీటికి చిరంజీవి, నాగార్జున, విజయ్ దేవరకొండ, రాజమౌళి, కీరవాణి సహకరించారని పేర్కొన్నారు. కీరవాణి ప్లాస్మా యోధులకోసం ఒక పాట కూడా రూపొందించారని తెలిపారు. మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ప్లాస్మా దానం చేసిన పలువురికి సీపీ సజ్జనార్, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి ప్రోత్సాహకాలు అందించారు. (ప్లాస్మా దానానికి మహా స్పందన) ఈ సందర్భంగా కరోనాను జయించిన రాజమౌళి ప్లాస్మా ఇవ్వటానికి ముందుకు రావటం శుభ పరిణామమని సజ్జనార్ కొనియాడారు. కరోనా సోకితే ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ప్లాస్మా దానానికి అందరూ ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్లాస్మా వివరాలు అన్ని పొందుపరుస్తూ Donateplasma.scsc.in అనే వెబ్‌సైట్‌ను రూపొందించామన్నారు. తమతో కలిసి అనేక స్వచ్చంద సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని, చాలా మంది యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వలంటీర్లుగా పనిచేస్తున్నారని చెప్పారు. (వి విల్ స్టే ఎట్ హోమ్.. వి స్టే సేఫ్) సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్‌రూమ్ నంబర్లు: 90002 57058, 94906 17444, రిజిష్టర్ పోర్టల్ లింక్: Donateplasma.scsc.in -
నిలకడగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం
సాక్షి, చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఆదివారం కాస్త మెరుగుపడిందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్లాస్మా చికిత్సతో ఆరోగ్యం మెరుగుపడినట్లు వెల్లడించారు. మరో 2 రోజులు వెంటిలేటర్‌పై ఉండాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తోందని.. ççస్పృహలోకి వచ్చారని వివరించారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్ కూడా సాయంత్రం మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. తన తండ్రి ఆరోగ్యం కుదుటపడిందని.. అందర్నీ గుర్తు పడుతున్నారని చెప్పారు. తన తల్లి కూడా బుధవారంలోపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని తెలిపారు. బ్రదర్.. నీ కోసం ఎదురు చూస్తున్నాం: కమల్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఆదివారం ట్వీట్ చేశారు. ‘సోదరుడా.. నీ కోసం ఎదురుచూస్తున్నాం. అనేక ఏళ్ల పాటు మీరు నాకు గొంతుకగా ఉన్నారు. నేను మీ స్వరానికి ముఖ చిత్రంగా ఉన్నాను. మీ స్వరం మళ్లీ ప్రతిధ్వనించాలి. త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తారని ఎదురుచూస్తున్నాం’ అంటూ కమల్ ట్వీట్ చేశారు. -
‘కరోనా నివారణకు అందరూ సహకరించాలి’
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజ్ఞప్తి చేశారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ ఈ రోజు మన దేశ స్వాతంత్ర్య సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అనేక అమర వీరులను, స్వాతంత్ర్య సమర యోధులను, దేశ భక్తులను గుర్తు చేసుకునే రోజు ఈరోజు. స్వాతంత్ర్య స్వేచ్ఛా ఫలాలను మనకు అందించిన అమర వీరుల ఆశయాలకు అనుగుణంగా సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావంతో, దేశ పురోగతికి ధృడ నిశ్చయంతో పునరంకితమయ్యే రోజు ఇది. కోవిడ్ -19 మహమ్మారి వలన దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోంటుంది. కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు అపారమైన నష్టాన్నికలిగించింది. సాధారణ జన జీవన విధానానికి భంగం కలిగించింది. అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించి, కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నాను. సాధ్యమైనంతవరకు ఇళ్ళల్లోనే ఉండాలి. అనవసర ప్రయాణాలు మానుకోవాలి. సామాజిక దూరం పాటించడం, సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు కడుక్కోవడం, బహిరంగ ప్రదేశాలలో ఫేస్ మాస్క్ ధరించడం ద్వారా కోవిడ్ పై విజయం సాధించవచ్చు. కోవిడ్ -19 వైరస్ బారి నుండి పూర్తిగా కోలుకున్న వారందరికీ, వారి ప్లాస్మాను దానం చేసి, వైరస్ సంక్రమణతో పోరాడుతున్న రోగులకు సహాయం చేయమని స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కోవిడ్ వైరస్ ను జయించిన వారు ఈ సంక్షోభాన్ని అధిగమించడంలో ప్రభుత్వానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నివారణకు అందరూ సహకరించాలని మరోసారి ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని గవర్నర్ అన్నారు. చదవండి: నూతన హాస్పిటల్‌ను ప్రారంభించిన వైఎస్ జగన్ -
రానున్న రోజుల్లో వారి సంఖ్య రెట్టింపు: నాగార్జున
సాక్షి, హైదరాబాద్: కరోనాను జయించిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాలని ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున పిలుపునిచ్చారు. సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సంయుక్తంగా ప్లాస్మా దానంపై చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎంతో మంది ప్రాణాలు నిలపాలని కోరారు. ఇప్పటివరకు ప్లాస్మా దానం చేసిన వారిని గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో గురువారం సన్మానించారు. (వాల్వ్‌ల్లేని ‘ఎన్–95’లే బెస్ట్) ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ... రానున్న రోజుల్లో ప్లాస్మా దానం చేసే వారి సంఖ్య మరింత రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా బాధితుల ప్రాణాలు రక్షించేందుకు సైబరాబాద్ పోలీసులు ముందుకు రావడం ఆనందంగా ఉందని, ముఖ్యంగా సీపీ సజ్జనార్ చొరవ, కృషి అభినందనీయమని ప్రశంసించారు. అనంతరం సీపీ సజ్జనార్ మాట్లాడుతూ... ప్లాస్మా దానం చేసేవారు దేవుళ్లతో సమానమని కొనియాడారు. ఇప్పటివరకు 388 మంది ప్లాస్మా దానం చేయడం వల్ల 600 మంది ప్రాణాలు నిలపగలిగామని పేర్కొన్నారు. ప్లాస్మా దానం చేయాలనుకునేవారు సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్ నంబర్ 90002 57058, 94906 17440లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల తదితరులు పాల్గొన్నారు. (మాస్క్ ధరించలేదని ఫోన్ లాక్కొని..) -
ప్లాస్మా దానం చేయనున్న మధ్యప్రదేశ్ సీఎం
భోపాల్ : కరోనా నుంచి కోలుకున్న అనంతరం ప్లాస్మా దానం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కోవిడ్-19 పేషెంట్ల చికిత్స కోసం తన ప్లాస్మాను దానం చేయనున్నట్లు శివరాజ్ సింగ్ ఆదివారం తెలిపారు. కాగా జూలై 25న చౌహాన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వెంటనే ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి వైద్యులు పర్యవేక్షణలో చికిత్స పొందారు. అనంతరం 11 రోజుల తర్వాత ఆగష్టు 5న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే హోం క్వారంటైన్లో ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తన బట్టలు తానే ఉతుక్కుంటున్నానని వీడియో ద్వారా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (కరోనా నుంచి కోలుకున్న సీఎం చౌహాన్ ) కాగా రాష్ట్రంలోని కరోనా వ్యాప్తి పరిస్థితిని సమీక్షించిన సీఎం.. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. ‘నేను ఇంతకుముందు కరోనా బారిన పడ్డాను. చికిత్స తర్వాత ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. కరోనా వైరస్‌తో పోరాడటానికి యాంటీబాడీస్ నా శరీరంలో వృద్ధి చెంది ఉంటాయి. కావున నేను త్వరలో ప్లాస్మాను దానం చేస్తాను’ అని పేర్కొన్నారు. అయితే కరోనాను అంతం చేయడంలో శరీరంలోని రోగనిరోధకశక్తి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను సేకరించి కరోనా బారిన పడిన వారికి అందించడం ద్వారా వారు త్వరగా కోలుకోవడానికి దోహదపడుతుంది. ఇక మధ్యప్రదేశ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 39,000 వేలు దాటింది. -
ప్లాస్మా దానానికి మహా స్పందన
సాక్షి, సిటీబ్యూరో: కరోనా బాధితుల ప్రాణాలు నిలిపేందుకు సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సంయుక్తంగా చేపట్టిన ‘ప్లాస్మా డొనేషన్’కు మహా స్పందన వస్తోంది. కరోనా బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వస్తుండడంతో వందలాది మంది ప్రాణాలు కాపాడే అవకాశం దక్కుతోంది. ‘డొనేట్‌ప్లాస్మా.ఎస్సీఎస్సీ.ఇన్’ ఆన్లైన్ పోర్టల్ మొదలైన వారం రోజుల్లోనే వెయ్యి మంది ప్లాస్మా దాతల జాబితాను సైబరాబాద్ పోలీసులు సేకరించారు. ఇప్పటికి రక్తం, ప్లాస్మా ఇచ్చేందుకు చాలా మంది ఈ ఆన్లైన్ పోర్టల్‌లో రిజిష్టర్ చేసుకుంటున్నారు. వారిచ్చిన బ్లడ్ గ్రూప్ ఆధారంగా అవసరార్థులను గుర్తించి ప్లాస్మాను ఇవ్వడానికి మధ్య వారధిగా సైబరాబాద్ పోలీసులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 297 మంది ప్లాస్మా దానం చేసి 450 మందికిపైగా కరోనా రోగుల ప్రాణాలు కాపాడారు. అయితే ఈ సామాజిక ఉద్యమానికి సెలబ్రిటీలు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలంటూ పిలుపునివ్వడంతో మరింతగా దాతలు పెరగొచ్చని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్లాస్మా దాతలు దేవుళ్లతో సమానం... ‘సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్‌కు రక్తం, ప్లాస్మా కావాలంటూ, ఇస్తామంటూ ప్రతిరోజూ ఫోన్‌కాల్స్ ద్వారా అభ్యర్థనలు వస్తున్నాయి. ప్లాస్మా దానం అనేది సామాజిక బాధ్యత. ప్రాణాలు కాపాడుతున్న ప్లాస్మా దాతలు దేవుళ్లతో సమానం. వీరికి సమాజం ఎంతగానో రుణపడి ఉంటుంది. వీరిని చూసి గర్వంగా కూడా ఫీలవుతోంది. 500 ఎంఎల్ ప్లాస్మా ఇద్దరి ప్రాణాలు నిలుపుతుంది. ఇవి వారి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది’అని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. సెలబ్రిటీలు చిరంజీవి, మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ తదితరులు తమ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలంటూ పిలుపునివ్వడం ఆనందించదగ్గ విషయని అన్నారు. సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్‌రూమ్ నంబర్లు: 90002 57058, 94906 17444 రిజిష్టర్ పోర్టల్ లింక్: డొనేట్‌ప్లాస్మా.ఎస్సీఎస్సీ.ఇన్ -
ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి
‘‘కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారు ధైర్యంగా ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయడం వల్ల మరెంతో మంది ప్రాణాలను కాపాడినవాళ్లవుతారు. కాబట్టి ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి’’ అని హీరో మహేశ్ బాబు పిలుపునిచ్చారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన అభిమానులకు, ప్రజలకు ప్లాస్మా దానం చేయాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారాయన. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరికొకరం తోడుగా ఉండటం ఎంతో అవసరం. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్లాస్మా థెరపీ ప్రాణాలను నిలబెట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌గారు ప్లాస్మా డొనేషన్ ప్రాముఖ్యత గురించి ప్రజలందరికీ తెలియజేయడానికి ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నారు. ఆయన కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా అవగాహన తెచ్చుకుని ముందుకొచ్చి ప్లాస్మా దానం చేసినవారందర్నీ అభినందిస్తున్నాను. సాటి మనుషుల ప్రాణాల్ని కాపాడడానికి దోహదపడే ప్లాస్మాను డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా నా బర్త్‌డే సందర్భంగా అభిమానులందరూ ప్లాస్మా డొనేషన్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా డొనేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్లాస్మా డొనేషన్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్‌ను పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తోంది. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి అభినందనలు’’ అని ఆ ప్రకటనలో మహేశ్ బాబు పేర్కొన్నారు. నో ప్లాన్... మహేశ్ బాబు బర్త్‌డేకి మీరేమైనా ప్రత్యేకంగా ప్లాన్ చేశారా? అని ఆయన సతీమణి నమ్రతను అడిగితే –‘‘ఏమీ ప్లాన్ చేయలేదు. ఇంట్లోనే ఉంటాం. మహేశ్‌కి నచ్చిన వంటకాలతో కుటుంబమంతా కలిసి లంచ్ చేస్తాం. ఆ తర్వాత సినిమాలు చూస్తాం. ఇదే బర్త్‌డే స్పెషల్’’ అన్నారు. -
బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు మహేష్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రేపటితో 45వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఆదివారం(అగష్టు 9) ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులంతా ప్లాస్మా దానం చేయాలని కోరారు. అంతేగాక సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్లాస్మా దానంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమంపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ప్లాస్మా దానంతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తూ పోలీస్ శాఖ సమర్థంగా పనిచేస్తోందన్నారు. కరోనా కాలంలో అనుక్షణం ప్రజల భద్రత చూసుకుంటూనే, మరోవైపు ప్లాస్మా దానం గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తున్న సీపీ సజ్జనార్‌ను కృషిని ఆయన కొనియాడారు. (చదవండి: బర్త్‌డే వేడుకలు: అభిమానులకు మహేష్ రిక్వెస్ట్) Cyberabadpolice #DonatePlasmaSaveLives Superstar @urstrulyMahesh's appeal to fans and COVID19 survivors regarding Plasma Donation. @urstrulyMahesh @SCSC_Cyberabad @TelanganaDGP @KTRTRS @hydcitypolice @RachakondaCop @CYBTRAFFIC pic.twitter.com/3oXqO4ngAQ — Cyberabad Police (@cyberabadpolice) August 8, 2020 ప్లాస్మా దానంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు సైబరాబాద్ కమిషనర్ ప్రయత్నిస్తున్న తీరు అభినందనీయన్నారు. తన పుట్టినరోజున అభిమానులంతా కూడా ప్లాస్మా దానంపై అవగాహన కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే అవకాశం ఉన్నవాళ్లు ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన అవసరం చాలా ఉందని మహేష్ బాబు పేర్కొన్నారు. (చదవండి: ‘శభాష్ సైబరాబాద్ పోలీస్.. ఎస్సీఎస్సీ’) -
సైబరాబాద్ కమిషనరేట్‌కు మెగాస్టార్ చిరంజీవి
-
సైబరాబాద్ కమిషనరేట్‌కు మెగాస్టార్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌పై యుద్ధానికి ప్లాస్మా దానం పదునైన ఆయుధంగా మారింది. దీంతో కరోనా బారిన పడి ప్రాణాపాయంతో ఉన్నవారికి ప్లాస్మాను ఇచ్చే దిశగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ముందుకొచ్చి ప్రాణాలు నిలిపిన వారిని ప్లాస్మా యోధాతో సత్కరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్లాస్మా అందించిన ప్రాణాలు కాపాడుతున్న వారిని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. శుక్రవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో "ప్లాస్మాదానం- ప్రాణదానం" ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ప్లాస్మాదాతలను సత్కరించారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేయాలని పిలుపునిచ్చారు. సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. బ్లడ్ డోనేషన్ క్యాంప్‌లో తమతో కలిసి మెగాస్టార్ చిరంజీవి పని చేశారని చెప్పుకొచ్చారు. కోవిడ్ సమయంలోనూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా రక్త దానం చేశారని తెలిపారు. (కోవిడ్ ట్రీట్మెంట్ @ రూ.28 వేలు) ప్లాస్మా దానం చేస్తే మళ్లీ కోవిడ్ వస్తుందనేది అసత్యమేనని, దీనిపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. ప్లాస్మా దానం చేయడం వల్ల మరో కుటుంబాన్ని కాపాడిన వారవుతారని, కాబట్టి కోవిడ్ నుంచి రికవరీ అయిన వారందరు కూడా దీని కోసం ముందుకు రావాలని కోరారు. ఇక కోవిడ్ సమయంలో కేవలం సైబరాబాద్‌లోనే కాకుండా, మారుమూల గ్రామాల్లోకి వెళ్లి తాము భోజనం, వారి నిత్యావసర సరుకులు అందజేశామన్నారు. ఇప్పటికే 400 మందికి ప్లాస్మా ఎక్కించి వారి జీవితాల్లో వెలుగులు నింపగలిగామని తెలిపారు. ప్లాస్మా దానం చేసిన వారిని సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని సజ్జనార్ తెలిపారు. (కోవిడ్‌పై యుద్ధం: సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ సెల్) -
ప్లాస్మాతో ప్రాణం
యోధులూ ముందుకు రండి.. విశ్వనాథ చెన్నప్ప సజ్జనార్.. మొన్నటి వరకూ లాక్డౌన్లో కోవిడ్ నియంత్రణపై పూర్తి సమయాన్ని కేటాయించారు. ప్రస్తుతం కోవిడ్ బారిన పడి ప్రాణాపాయంతో ఉన్నవారికి ప్లాస్మాను ఇచ్చే దిశగా ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి రోజూ తానే స్వయంగా పర్యవేక్షి స్తున్నారు. ముందుకొచ్చి ప్రాణాలు నిలిపిన వారిని ప్లాస్మా యోధాతో సత్కరిస్తున్నారు. తొలుత ప్లాస్మా సేకరణ పోలీస్ నుంచి ప్రారంభించి ప్రస్తుతం ముందుకు వచ్చే అందరితో సేకరిస్తున్నారు. ఈ విషయమై సజ్జనార్ ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ.. కోవిడ్ వైరస్‌ను ఓడించి నిలిచిన వారంతా.. ప్లాస్మా దానం చేసి మరో ప్రాణాన్ని నిలబెట్టాలని, ప్లాస్మా ఇచ్చేవారు 94906 17444నుసంప్రదిస్తే అంతా తామే సమన్వయం చేస్తామన్నారు. సాక్షి, హైదరాబాద్: మనిషి ప్రాణానికి మించింది ప్రపంచంలో ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. సర్వావస్థల్లో, సకల కాలాల్లో అన్నింటికి కంటే ప్రధానమైది అదే. కళ్లెదుటే ఓ నిండు ప్రాణం పోతున్నా.. స్పందించకపోతే మనుషులకు విలువే ఉండదు. అయినా ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఇప్పటి వరకు వైద్యులకే ఉండేది. కానీ ‘డెంగీతో నేనూ మరణం చివరి అంచుల వరకూ వెళ్లివచ్చి ప్రస్తుతం ప్రాణ దాతనయ్యా.. ఇప్పటి వరకు మూడుసార్లు ప్లాస్మాను దానం చేశా.. ఈ జీవితానికి ఇంతకంటే అదృష్టం ఏముంటుంది’ అని 23 ఏళ్ల పి.ఉదయ్‌కిరణ్ గుప్తా సంతృప్తి వ్యక్తం చేస్తే.. మరోవైపు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోవిడ్ వైరస్‌తో వైద్యులు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి చివరి అస్త్రంగా ప్లాస్మాను ప్రయోగించారు. ప్రాణంపై ఆశ వదులుకున్న దశలో ఓ 60 ఏళ్ల వ్యక్తి మళ్లీ రికవరీ అయి వారం రోజుల్లో డిశ్చార్జి అయ్యారు. ఈ తరహాలో గుప్తా పదిహేను రోజుల్లో మూడుసార్లు ప్లాస్మా దానం చేశారు. గుప్తా బాటలో అనేక మందిని నడిపించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్, గాంధీ ఆస్పత్రి, ప్మాస్మా డోనర్స్ అసోసియేషన్లు చేస్తున్న కృషితో ‘మిషన్ ప్లాస్మా క్లబ్’లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. కొత్త జీవితానికి నాంది.. సరైన మందుల్లేని కరోనా వైరస్‌పై వివిధ రకాలుగా యుద్ధం చేస్తున్న వైద్యులకు ప్లాస్మా పదునైన ఆయుధంగా మారింది. ఏ మందు ప్రయోగించినా ఫలితం రాని సమయంలో ప్లాస్మాను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే గాంధీలో 36 మంది వద్ద ప్లాస్మా తీసుకుని 25 మందికి కొత్త లైఫ్ ఇవ్వగా.. సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఏకంగా స్పెషల్ సెల్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 213 మంది దాతల నుంచి ప్లాస్మాను సేకరించి 370 మందికి పునర్జన్మ ప్రసాదించారు. కోవిడ్ వైరస్ బారిన పడి కోలుకున్న వెయ్యి మంది వివరాలు సేకరించిన సైబరాబాద్ పోలీసులు మరో వైపు ప్లాస్మా కావాల్సిన వారి వివరాలను సైతం ప్రత్యేక సెల్లో నమోదు చేసి దాతలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నారు. ప్లాస్మా ఇచ్చేవారు 50 ఏళ్లు లోపువారై ఉండి, పూర్తి ఆరోగ్యంగా ఉండాలన్న నిబంధనతో ముందుకు వస్తున్నవారి సంఖ్య 25 శాతానికి దాటడం లేదు. గడిచిన వారం రోజుల్లో ప్లాస్మా ఇచ్చేందుకు ఎవరికి వారే ముందుకు వస్తున్న తీరు ప్లాస్మా అవసరం ఉన్న కుటుంబాల్లో కొత్త ఆశలు నింపుతోంది. ప్రాణం విలువ తెలిసింది.. అందుకే ‘నాకు డెంగీ వచ్చినప్పుడు ప్లేట్లెట్ దొరకలేదు. ఒక దశలో మరణం చివరి అంచుల వరకు వెళ్లా.. అయినా బతికిపోయా. ప్రాణం విలువ అప్పుడే తెలిసింది. అందుకే మన చేతుల్లో ప్రాణం పోసే శక్తిని అవసరమైన వారికి ఉపయోగిస్తాం. ఇప్పటికే మూడుసార్లు ప్లాస్మా ఇచ్చా.’ – ఉదయ్‌కిరణ్ గుప్తా, ప్లాస్మా దాత, షాద్‌నగర్ -
డాక్టర్.. ప్లాస్మా దాత
నెల్లూరు(అర్బన్): కోవిడ్ నుంచి కోలుకున్న బాధితులు ప్లాస్మా దానం చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుకు స్పందించిన ఓ డాక్టర్ ప్లాస్మా దానం చేసి, జిల్లాలో తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. కరోనా సోకి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానానికి ముందుకు రావాలని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు సూచించారు. సోమవారం నగరంలోని రెడ్‌క్రాస్ కార్యాలయాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డితో కలిసి కలెక్టర్ సందర్శించారు. అక్కడ తొలిసారిగా ప్లాస్మా దానాన్ని చేస్తున్న డాక్టర్ చక్రవర్తితో మాట్లాడారు. కోవిడ్ చికిత్సలో కీలకమైన ప్లాస్మా దానానికి తొలిసారిగా ముందుకు వచ్చిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ చక్రవర్తిని అభినందించారు. అనంతరం రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లోని నాణ్యమైన సేవలను, మిషనరీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో 99 శాతం చికిత్స తీసుకుని కోలుకుని నెగటివ్ రిపోర్టుతో ఇంటికి వెళ్తున్నారన్నారు. తీవ్రమైన కోవిడ్ లక్షణాలున్న వారికి ఆస్పత్రిలో చికిత్స అందించడానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలన్నారు. ప్లాస్మాను ఏడాది పాటు నిల్వ చేయవచ్చని, అవసరమైనప్పుడు ఆ ప్లాస్మాను రోగులకు ఎక్కించి చికిత్స చేయవచ్చన్నారు. ఒకరి ప్లాస్మాతో ఇద్దరి రోగులను కాపాడేందుకు వీలవుతుందన్నారు. ప్లాస్మా దానం చేసే వారికి రూ.5 వేల ప్రోత్సాహక బహుమతిగా ప్రభుత్వం ఇస్తుందన్నారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పి.చంద్రశేఖర్‌రెడ్డి, మేనేజింగ్ కమిటీ సభ్యులు నరసారెడ్డి, సురేష్, బ్లడ్ బ్యాంకు కన్వీనర్ అజయ్‌బాబు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ యశోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
ఓ వ్యక్తి ఇచ్చే ప్లాస్మా ద్వారా ఇద్దరు కోలుకోవచ్చు
రాయదుర్గం: కోవిడ్–19 నుంచి పూర్తిగా కోలుకున్న వారంతా ప్లాస్మా దానం చేయాలని సినీ హీరో నాని పిలుపునిచ్చారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో కమిషనర్ సజ్జనార్ ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్లాస్మా దానం స్వీకరించేందుకు ప్రముఖుల ద్వారా పిలుపు ఇప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సినీహీరో నాని కోవిడ్ నుంచి కోలుకున్న వారికి పిలుపునిచ్చారు. ఇప్పటికే లక్షలాది మందికి కోవిడ్ వచ్చింది, వీరిలో చాలా మందికి తగ్గిపోయిందని, కోలుకున్నవారంతా ప్లాస్మాదానం చేయాలని కోరారు. కోవిడ్ నుంచి కోలుకున్న ఓ వ్యక్తి ఇచ్చే 500 ఎంఎల్ ప్లాస్మా ద్వారా ఇద్దరు కోవిడ్ బాధితులు కోలుకోవడానికి అవకాశం కల్పించినవారవుతారన్నారు. కోవిడ్ బారినపడ్డ వారు కోలుకునేలా చేసేందుకు సైబరాబాద్ కమిషనరేట్ వారు చేపట్టిన కార్యక్రమానికి అందరూ తమవంతు చేయూతనందించాలన్నారు. ప్లాస్మా దానం ద్వారా ఇద్దరి ప్రాణాలు కాపాడితే వచ్చే ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్, శాటిస్ఫ్యాక్షన్ కలుగుతుందన్నారు. అందరూ ముందుకొచ్చి 9490617440 ఫోన్ చేయాలని పిలుపునిచ్చారు. Save a Life by Donating Your Plasma @NameisNani @TelanganaDGP @SCSC_Cyberabad @TelanganaCOPs pic.twitter.com/DssvCOPtyB — Cyberabad Police (@cyberabadpolice) August 3, 2020 -
ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్లాస్మా దాతలతో రక్షాబంధన్‌ను జరుపుకున్నారు. కరోనా నుంచి కోలుకుని, ప్లాస్మా దానం చేసి కోవిడ్ పేషెంట్లు కోలుకోవడానికి సాయం చేసిన 13 మంది ప్లాస్మా దాతలకు గవర్నర్ సోమవారం రాజ్‌భవన్‌లో రాఖీలు, స్వీట్లు అందించారు. రాజ్‌భవన్ దర్బార్ హాల్ లో జరిగిన ఈ ప్రత్యేక సంబురాల్లో భాగంగా గవర్నర్ ప్లాస్మా దాతల దాతృత్వాన్ని, ప్లాస్మా దానం కోసం వారు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. వారు ఇతరులకు స్ఫూర్తి దాతలని తమిళిసై కొనియాడారు. తక్కువ ఖర్చుతో కోవిడ్ చికిత్స.. 13 మంది ప్లాస్మా దాతలు కోవిడ్ బారిన పడినప్పడు ప్రభుత్వ వైద్యశాలల్లోనే, ముఖ్యంగా గాంధీ హాస్పిటల్లోనే చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ ప్రముఖంగా ప్రస్తావించారు. ‘ప్రభుత్వ ఆసుపత్రులు, అక్కడి వైద్యులు కోవిడ్–19 చికిత్సలో గొప్ప సేవలు చేస్తున్నారని’ అభినందించారు. ప్రజలు ఎలాంటి అపోహలకు తావు లేకుండా, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కోవిడ్ చికిత్సను నమ్మకంగా తీసుకోవచ్చని, అక్కడ వైద్యులు, ఇతర సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కోవిడ్–19 బాధితులకు తక్కువ ఖర్చుతో, మానవతా దృక్పథంతో సేవలు అందించాలని, రోగులను, వారి కుటుంబాలను మరింత కుంగదీయకుండా బాధ్యతగా వ్యవహరించాలని గవర్నర్ సూచించారు. ఈ సందర్భంగా ప్లాస్మా దాత లు తమ కరోనా చికిత్స, ప్లాస్మా దానం చేయడానికి వచ్చిన ప్రేరణ, తదితర విషయాలను గవర్నర్‌తో పంచుకున్నారు. గవర్నర్ ఈ దిశ గా చేస్తున్న కృషి తమలో స్ఫూర్తిని నింపాయ ని వివరించారు. గవర్నర్‌తో రాఖీలు, అభినం దనలు అందుకున్న ప్లాస్మా దాతలలో రాష్ట్రం లో మొట్టమొదటి కోవిడ్ పేషెంట్ రాంతేజ గంపాల, నాలుగు సార్లు ప్లాస్మా దానం చేసిన ఐఐటీ ముంబై, గ్రాడ్యుయేట్ బి.నితిన్‌కుమా ర్, రాష్ట్రంలో మొదటి ప్లాస్మా దాత ఎన్నంశెట్టి అఖిల్, సురం శివప్రతాప్, సయ్యద్ ముస్తఫా ఇర్ఫాన్, ఉమర్ ఫరూఖ్, డా. సుమీత్, జె.రా జ్‌కుమార్, పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై పీ రామకృష్ణాగౌడ్, ఎస్. శివానంద్, డా. సాయి సోమసుందర్, డా. రూపదర్శిని ఉన్నారు. ఇందులో మొత్తం ఆరుగురు రెండు సార్లు, అంతకన్నా ఎక్కువసార్లు ప్లాస్మా దానం చేయడం అభినందనీయమని గవర్నర్ ప్రశంసించారు. -
నేను కూడా ప్లాస్మా దానం చేస్తా: కేటీఆర్
సాక్షి, కరీంనగర్, సిరిసిల్లా: టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తాను సైతం ప్లాస్మా డోనేషన్ చేస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేసిన మంత్రి కేటీఆర్, సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రిలో కోవిడ్ వార్డును, ఐదు ప్రత్యేక అంబులెన్స్‌లను ప్రారంభించారు. పంచాయతీ రాజ్ శాఖ ఈఈ, డీఈఈ భవనాలకు శంఖుస్థాపన చేశారు. అనంతరం సర్దాపూర్‌లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ఐసోలేషన్ వార్డును ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా టెస్టులు పెంచుతామని.. పాజిటివ్ వస్తే భయాందోళనకు గురై ఆగమాగం కావద్దని ప్రజలను కోరారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99 శాతం ఉందని.. ఇది 100 శాతం ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. మంత్రులుగా ఉన్న వాళ్లు ప్రజల్లో తిరగాలని.. జనాలకు అవగాహన కల్పించే బాధ్యత తమపైనే ఉందన్నారు. కొందరు చిల్లరమల్లరగా మాట్లాడుతూ రాజకీయం చేయడం మంచిది కాదని కేటీఆర్ హితవు పలికారు. (ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై కేటీఆర్ ఫైర్) కరోనాకు ఎవరూ అతీతం కాదు కష్టకాలంలో కరోనా బాధితులను ఏ విధంగా ఆదుకోవాలనే దాని గురించి ఆలోచించాలని కేటీఆర్ కోరారు. కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 2 కోట్ల 28 లక్షల రూపాయలు సీఎస్ఆర్ నిధుల రూపంలో హాస్పిటల్‌కు రేపు అందిస్తామని తెలిపారు. తన వంతుగా 20 లక్షల రూపాయలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రోజుకు వెయ్యి పరీక్షలు పెంచాలని వైద్యాధికారులుకు సూచించానన్నారు. 32 పడకలతో అగ్రి కల్చర్ కళాశాలలో ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశామని తెలిపారు. మండేపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఐసోలేషన్ కేంద్రాలుగా వియోగిస్తామని తెలిపారు. కరోనా వస్తే ప్రజలంతా సహకరించాలి, వారిని వేలేసినట్లు చూడొద్దని కోరారు. అమిత్ షా, కర్ణాటక, మధ్య ప్రదేశ్ సీఎంలకు కూడా పాజిటివ్ వచ్చింది.. కరోనాకు ఎవరూ అతీతం కాదన్నారు. వెంటిలేటర్లు అవసరాన్ని బట్టి పెంచుతామన్నారు. పారిశుద్ధ్య సిబ్బందికి వేతనాలు పెంచుతామని.. అయితే ఈ నిర్ణయం కేవలం జిల్లా వరకు మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు. (వ్యాక్సిన్ వచ్చే వరకు అదొక్కటే మార్గం) లాక్డౌన్ వల్ల సమస్య పరిష్కారం కాదు ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులోకి వస్తే వేతనం ఎక్కువ ఇచ్చి అయినా తీసుకుంటామన్నారు కేటీఆర్. హోమ్ మినిష్టర్ మహమ్మద్ అలీ, పెద్దలు హనుమంతరావు కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులకు కరోనా వస్తుందని వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం తనను కలిచివేసిందన్నారు. కరోనా కట్టడికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నామని, అనవసర విమర్శలకు పోవద్దని కోరారు. మీడియాలో లోటు పాట్లు చూపాలని.. పాజిటివ్ కథనాలను హై లెట్ చేయాలని కోరారు. ప్రతిపక్షాల సహకరించాలని కోరారు. కరోనా వైరస్‌కు చికిత్స లేదు...నివారణ ఒక్కటే మార్గమన్నారు. లాక్ డౌన్ వల్ల సమస్య పరిష్కారం కాదని కేటీఆర్ తెలిపారు. -
సిరిసిల్లలో కేటీఆర్ సుడిగాలి పర్యటన
-
రియల్ హీరోస్..
సేవచేయాలనే సంకల్పం ఉన్నవారికి హద్దులు అంటూ ఏవీ ఉండవు.ఎక్కడినుంచైనా ఎక్కడికైనా వారు ఆపన్న హస్తాన్ని అందిస్తారు. సమాజసేవ కోసం మేము సైతం అనే వారు ఎందరో ఉన్నారు. కరోనా బారిన పడి కోలుకున్న ఎందరో.. మాకెందుకులే అనే భావనను వీడి కరోనా బారిన పడిన వారి కోసం తమ రక్తాన్ని దానం చేస్తున్నారు. ఇందులో మొదటి వరుసలో నిలుస్తున్నారు పోలీసులు. కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా పోలీసులు ప్రముఖ పాత్ర పోషించారు. లాక్డౌన్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రేయింబవుళ్లు రెడ్‌జోన్ ప్రాంతాల్లో పని చేశారు. ఈ క్రమంలో 300 మందికిపైకి కోవిడ్ బారిన పడ్డారు. అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ బారి నుంచి కోలుకున్న అనంతరం ఎస్పీ సత్యయేసుబాబు స్ఫూర్తిదాయక మాటలతో ప్రభావితమైన 17 మంది సిబ్బంది ప్లాస్మా దానం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణే కాదు.. ప్రజల ప్రాణాలను కాపాడడం కూడా తమ కర్తవ్యంగా భావించిన పోలీసు సిబ్బంది సేవలపై ప్రత్యేక కథనం. అనంతపురం క్రైం: ప్లాస్మా అనేది ఇది మానవ రక్తంలోని ఒక అత్యంత అవసరమైన పదార్థం. రక్తంలో దాదాపు 55 శాతం దాకా ఇది ఉంటుంది. నీరు, లవణాలు, ఎంజైములు, రోగనిరోధక కణాలు, ఇతర ప్రోటీన్లను కలిగి ఉంటుంది. 92% నీటితో కూడి ఉంటుంది, ఇది మానవ శరీరానికి అవసరమైన కణాలు, వివిధ కీలక పదార్థాలను సరఫరా చేసే ఒక కండెక్టర్ లాంటిది. శరీరంలో రక్తాన్ని గడ్డకట్టించడం సహా వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనే గుణం ప్లాస్మాకుంది. శరీరంలోని వివిధ ఇతర క్లిష్టమైన విధులను ఇది నిర్వర్తిస్తూ ఉంటుంది. ప్లాస్మా థెరఫీతో మెరుగైన ఫలితాలు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనడం ఆలస్యమవుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్లాస్మా థెరఫీ వైపు వైద్య నిపుణులు దృష్టి సారించారు. కరోనా వచ్చి కోలుకున్న వ్యక్తుల రక్తం నుంచి సేకరించిన ప్లాస్మాను కరోనా తీవ్రంగా ఉన్న రోగులకు ఇవ్వడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడమే ఇందుకు కారణం. అపోహల కారణంగా రక్తదానం చేసేందుకు ముందుకు రాని ఈ పరిస్థితుల్లో రక్తం నుంచి వేరు చేసిన ప్లాస్మా దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో ఎస్పీ సత్యయేసుబాబు సూచనలతో పోలీస్ సిబ్బంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. వీరంతా కరోనా బారిన పడి కోలుకున్నవారే కావడం గమనార్హం. రక్తదానం చేసిన వారిలో ఆర్ఎస్ఐ, ఇద్దరు ఏఎస్ఐలు, 11 మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు, ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉన్నారు. ఈ అవకాశం అందరికీ రాదు ఇప్పటి వరకు జిల్లాలో 300 మంది పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు. ఇందులో ముగ్గురు చనిపోయారు. కానీ ఎవరూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కోవిడ్ నుంచి కోలుకున్న వారు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో విధుల్లోకి చేరారు. అంతేకాకుండా కోవిడ్ రోగుల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన ప్లాస్మా కోసం తమ రక్తాన్ని దానం చేశారు. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ప్లాస్మా దానం చేసిన వారందరికీ నా తరపున, డీజీపీ సార్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పటి వరకూ కోవిడ్ బారి నుంచి బయటపడిన వారందరూ వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్లాస్మా డొనేట్ చేసే అవకాశం అందరికీ రాదు. అటువంటి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ప్లాస్మా ఇవ్వడం ద్వారా ఎటువంటి నష్టమూ ఉండదు. – బి.సత్యయేసుబాబు, ఎస్పీ -
వ్యాక్సిన్ వచ్చే వరకు అదొక్కటే మార్గం
గచ్చిబౌలి: ప్లాస్మా దాతలకు గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో ఘనంగా సత్కరించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సినీ హీరో విజయ్‌దేవరకొండ, సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఘనంగా సన్మానించారు. సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 126 మంది ప్లాస్మాయోధులు/ ప్లాస్మావారియర్స్(హీరోయిక్ వారియర్స్)ను సత్కరించారు. అనంతరం ప్లాస్మాదాతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. (ప్లాస్మా దాతలకు రూ.5 వేలు) ప్లాస్మా దానంతో ప్రాణదానం ప్లాస్మా దానం చేసి కోవిడ్ బాధితులను రక్షించాల్సిన అవసరం ఉందని సినీహీరో విజయ్ దేవరకొండ అన్నారు. కోవిడ్‌కు వ్యాక్సిన్ వచ్చే వరకు ప్లాస్మా ఒక్కటే పరిష్కారమన్నారు. ప్రస్తుత తరుణంలో ప్లాస్మా దానం ప్రాముఖ్యతపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మాదానం చేయాలని కోరారు. కరోనా కేసుల కంటే ప్లాస్మా దానాల సంఖ్య ఎక్కువగా ఉండా లన్నారు. రక్త, ప్లాస్మాదానంపై సైబరాబాద్ పోలీసులు చేస్తున్న కృíషి ఎనలేనిదన్నారు. –సినీహీరో విజయ్‌దేవరకొండ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ, సీపీ సజ్జనార్ రక్తదానం ప్రేరణతోనే ప్లాస్మా డొనేషన్ డ్రైవ్ సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ రక్తదానం కోసం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ ప్రేరణతోనే ప్లాస్మా డొనేషన్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టామన్నారు. ప్లాస్మాదానం సామాజిక బాధ్యతగా కావాలని, ప్లాస్మా దాతలు ప్రాణదాతలుగా నిలుస్తున్నారన్నారు. వారం రోజుల్లో సైబరాబాద్ పోలీసులు 1000 మంది డేటాబేస్ సేకరించారని, దాతలు, గ్రహీతల రక్తంతో సరిపోలడం అంత సులభం కాదన్నారు. ప్లాస్మా మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసం చేసేవారి వివరాలు తెలిస్తే వెంటనే 9490617444కు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్, ఎస్‌సిఎస్‌సి ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల ప్రసంగించారు. అనంతరం విజయ్‌దేవరకొండ, సజ్జనార్ చేతుల మీదుగా ప్లాస్మాదానం పై రూపొందించిన వాల్‌పేపర్స్, ఆన్లైన్ పోర్టల్ లింక్, ఫోన్ నంబర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏడీసీపీ మానిక్‌రాజ్, ఏడీసీపీ మాదాపూర్ వెంకటే«శ్వర్లు, ఏడీసీపీ క్రైమ్ ఇందిరాన, ట్రాఫిక్ ఫోరమ్ ప్రతినిధి వెంకట్‌టంకశాల తదితరులు పాల్గొన్నారు. –సైబరాబాద్ సీపీ సజ్జనార్ -
85శాతం మంది ఇళ్లలోనే కోలుకుంటున్నారు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులపై ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ శాఖ ప్రకటించింది. కరోనా వైరస్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు దూరం చేయాలని, వైరస్ సోకి ఆస్పత్రులకు వచ్చే వారికి అరగంటలోనే బెడ్లు కేటాయించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సర్వం సిద్ధమైంది. కరోనా సోకిన వారికి ఎక్కడా, ఏ లోటు లేకుండా వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇళ్లలోనే 85 శాతం కేసులు : రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 85 శాతం మంది ఇళ్లలోనే ఉంటూ కోలుకున్నారు. మిగిలిన 15 శాతం ఆస్పత్రుల్లో చేరినా, వారిలో కేవలం 4 శాతం రోగులు మాత్రమే అత్యవసర వైద్య సేవల విభాగం (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 11 శాతం మంది సాధారణ చికిత్సతో డిశ్చార్జ్ అవుతున్నారు. ఆస్పత్రులు–బెడ్లు–వెంటిలేటర్లు : కోవిడ్–19 వైరస్ సోకిన వారి చికిత్స కోసం రాష్ట్ర వ్యాప్తంగా 138 ఆస్పత్రులను గుర్తించారు. అన్ని ఆస్పత్రులలో 4300 ఐసీయూ బెడ్లు ఉండగా, నాన్ ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లు 17,406 ఉన్నాయి. ఇక నాన్ ఐసీయూ, నాన్ ఆక్సిజన్ బెడ్లు 17,364 ఉండగా, కోవిడ్ చికిత్స కోసం గుర్తించిన అన్ని ఆస్పత్రులలో కలిపి మొత్తం 36,778 బెడ్లు ఉన్నాయి. శుక్రవారం నాటి పరిస్థితి చూస్తే, 14,450 బెడ్లు ఆక్యుపెన్సీలో ఉన్నాయి. కరోనా పాజిటివ్ కేసులు : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,31,488 పాజిటివ్ కేసులను గుర్తించగా, వాటిలో 70,466 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వారిలో 14,042 మంది ఆస్పత్రులలో, 18,753 మంది కోవిడ్ కేర్ సెంటర్ల (సీసీసీ)లో ఉండగా, 35,660 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. 3,541 మంది ఆక్సిజన్, వెంటిలేర్ల సహాయంతో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో అత్యధికంగా ఇళ్లలోనే ఉండి నయం అవుతుండగా, ఆస్పత్రులలో చేరిన వారిలో కూడా అత్యల్పం మాత్రమే అత్యవసర విభాగాలలో (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు. బెడ్లు–ఆక్యుపెన్సీ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులలో 36,778 బెడ్లు అందుబాటులో ఉండగా, వాటిలో శుక్రవారం నాటికి కేవలం 45.48 శాతం అంటే.. 14,450 బెడ్లు మాత్రమే ఆక్యుపెన్సీలో ఉన్నాయి. ఆక్సిజన్ పైప్లైన్లు : కోవిడ్ చికిత్సలో కీలకమైన ఆక్సిజన్ సరఫరాకు అవసరమైన పైప్లైన్ల ఏర్పాటుపైనా వైద్య ఆరోగ్య శాఖ దష్టి పెట్టింది. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తికి ముందు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో 3286 ఆక్సిజన్ పైప్లైన్లు అందుబాటులో ఉండగా, ఆ తర్వాత ప్రభుత్వం వాటి సంఖ్యను గణనీయంగా పెంచుతోంది.ఈ ఏడాది జూన్ 3వ తేదీ నాటికి 11,364 కొత్త ఆక్సిజన్ పైప్లైన్లు మంజూరు చేయగా, వాటిలో 10,425 పైప్లైన్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జూలై 29న మరో 7,187 ఆక్సిజన్ పైప్లైన్లను మంజూరు చేశారు.ఆ విధంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో 17,827, పైవేటు ఆస్పత్రులలో 11,084 పైప్లైన్లు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28,911 ఆక్సిజన్ పైప్లైన్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్లాస్మా ఇస్తే రూ.5 వేలు : కోవిడ్ చికిత్సకు అవసరమైన ప్లాస్మా సేకరణపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆ దిశలో ప్రజలను ప్రోత్సహించే విధంగా ప్లాస్మా డొనేట్ చేస్తే రూ.5 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నివారణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని ప్రకటించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్), కర్నూలులోని సర్వ జన ఆస్పత్రి (జీజీహెచ్)లో ప్లాస్మా థెరపీ చికిత్స చేస్తున్నారు. ఆందోళన వద్దు : వీటన్నింటి నేపథ్యంలో కరోనా పాజిటివ్‌ను గుర్తించినా, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని చోట్లా కరోనా చికిత్సకు ఏర్పాటు చేశామని, మరోవైపు బెడ్లు కూడా అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకుంటే, కోవిడ్ మహమ్మారి నుంచి బయట పడవచ్చని, అందువల్ల ప్రజలెవ్వరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ శాఖ వివరించింది. -
ప్లాస్మా దానం చేసేందుకు సిద్దం: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: కరోనాను జయించి ప్లాస్మా దానం చేయడానికి వస్తున్న వారందరికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అనేక మందితో ప్లాస్మా దానం చేయించామన్నారు. ఇలాంటి వారిని స్పూర్తిగా తీసుకుని మరికొంత మంది ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పది రోజుల్లో తాము 160 మందికి ప్లాస్మాదానం చేశామని చెప్పారు. మాదాపూర్, బాలానగర్ ప్రాంతాల్లో అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేశామని వాటిని ప్రజలంతా వినియోగించుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కరోనా రోగులకు కూడా ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. (చదవండి: కరోనా: కోలుకున్న వారు ప్లాస్మా దానం ఇవ్వండి!) ప్లాస్మా దానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు వచ్చిన సినీ హీరో విజయ్ దేరకొండకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల తన స్నేహితుడి తండ్రికి కరోనా రావడంతో ప్లాస్మా అవసరం వచ్చిందని.. అప్పుడే ప్లాస్మా అవసరం తెలుసుకున్నానని విజయ్ చెప్పారు. కరోనా వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరారు. ప్లాస్మా దానం చేయడం ద్వారా చాలా మంది కుటుంబాలకు అండగా ఉన్నవాళ్లమవుతామపని పేర్కొన్నారు. ఒకవేళ తనకు కరోనా వస్తే కరోనాను జయించి ప్లాస్మా దానం చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని సీపీ వ్యాఖ్యానించారు. (చదవండి: ప్లాస్మా దానం చేసిన ఎమ్మెల్యే సుధాకర్) -
ప్లాస్మా దానం చేసిన కానిస్టేబుల్
కర్నూలు: కరోనా బారిన పడి కోలుకున్న కానిస్టేబుల్ పరమేశ్వరుడు గురువారం ప్రభుత్వాసుపత్రిలో ప్లాస్మా దానం చేశారు. ఈయన ప్యాపిలి పోలీసు స్టేషన్లో మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. జూలై 6న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కరోనా నుంచి కోల్కొని డిశ్చార్జ్ అయ్యి జూలై 15 నుంచి హోం ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. ఎస్పీ ఫక్కీరప్ప పిలుపు మేరకు కానిస్టేబుల్ పరమేశ్వరుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వాసుపత్రిలో టెస్టింగ్ చేయించుకుని కరోనా నెగిటివ్ రావడంతో ప్లాస్మా దానం చేశారు. ఈ సందర్భంగా పరమేశ్వరుడును ఎస్పీ ఫక్కీరప్ప తన కార్యాలయానికి పిలిపించి శాలువా కప్పి సన్మానించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కరోనా నుంచి కోల్కొని ప్లాస్మా దానం చేసిన పరమేశ్వరుడు పలువురికి ఆదర్శమని కొనియాడారు. కరోనా నుంచి కోల్కొన్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి, నాన్ కేడర్ ఎస్పీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్మా దానం చేసిన ఎమ్మెల్యే సుధాకర్
సాక్షి, కర్నూలు: ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న కర్నూలు జిల్లా కోడుమూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్లాస్మా దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వచ్చిందని భయపడకూడదని, అలాగని అజాగ్రత్తగా కూడా ఉండకూడదన్నారు. తనకు గత నెల 20న కరోనా వచ్చిందని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ప్లాస్మా దానం వల్ల మరో ముగ్గురు కరోనా బాధితులకు ప్రాణదానం చేయవచ్చన్నారు. (ఆత్మస్థైర్యంతో జయించా) -
ఈఎస్ఐలో ప్లాస్మా బ్యాంకును ప్రారంభించిన గవర్నర్
అమీర్‌పేట: కరోనా లేని రాష్ట్రంగా తెలంగాణను చూడటమే తన లక్ష్యమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శనివారం సనత్‌నగర్ ఈఎస్ ఐ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్లాస్మా బ్యాంకును ఆమె ప్రారంభించి, తొలి ప్లాస్మా దాత సంతోష్‌గౌడ్‌ను అభినందించారు. అనంతరం వార్డులో తిరిగి వైద్యసేవలపై వాకబు చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కరోనా చికిత్స విధానంలో ప్లాస్మా థెరపీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, వైరస్ నుండి కోలుకున్న వారు తమ ప్లాస్మా ను ఇతర రోగులకు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేయడం వల్ల ఎటువంటి భయం అవసరం లేదని పేర్కొన్నారు. వైరస్ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో కరోనా రోగులకు అందుతున్న సేవలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులకు చికిత్స అందించేందుకు వీలుగా రూపొందించిన అత్యాధునిక పీఏపీఆర్ కిట్‌ను ఆసుపత్రిలో ప్రదర్శించారు. వైద్య కళాశాల డీన్‌తో పాటు ఈఎస్ఐసీ రిజిస్ట్రార్ తదితరులు పాల్గొన్నారు. -
కరోనా: కోలుకున్న వారు ప్లాస్మా దానం ఇవ్వండి!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బారినపడి కోలుకున్న వారందరికీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా తీవత్ర పెరుగుతోందని, అనేకమది వైరస్‌తో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారని పేర్కొన్నారు. శనివారం సీపీ మాట్లాడుతూ.. కరోనా వైరస్ రోగ నిరోధకశక్తిపై ప్రభావం చూపుతోందన్నారు. కోవిడ్ బారిన పడి కోలుకున వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్లాస్మా దానం ఇవ్వాలని కోరారు. తమ దగ్గర తీసుకునే 500 మి. లీ ప్లాస్మా ఇద్దరు కరోనా రోగుల ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఇప్పటికే ఎంతో మంది పోలీసులు కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. సైబరాబాద్ పోలీసులు ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వడానికి అంగీకరించారన్నారు. దీంతో ముగ్గురిని కాపాడి వారి కుటుంబాలను ఆదుకున్నామన్నారు. కాగా ఎవరైనా ప్లాస్మా ఇవ్వాలనుకున్నవారు 9490617440 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ సూచించారు. -
ప్లాస్మా దాతలకు అస్సాం శుభవార్త
గువాహటి : ఈశాన్య రాషష్ట్రం అస్సాంలో కరోనా కేసులు అధికమవుతున్నాయి. ప్లాస్మాదాతలు కరువై చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్లాస్మా దానాన్ని ప్రోత్సహించే విధంగా అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ పథకాల్లో ప్లాస్మా దాతలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు గౌహతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వా శర్మమాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడుతున్న ఇద్దరు వ్యక్తులు ఒకే స్కోరు సాధిస్తే మొదటగా ప్లాస్మా దాతకే ప్రాధాన్యత ఇస్తామని, వారికి ఇంటర్వ్యూల్లో రెండు మార్కులు అదనంగా ఇస్తామని మంత్రి ప్రకటించారు. (ప్లాస్మా దాతలకు కర్ణాటక ప్రభుత్వం ఆఫర్) ప్రతీ ప్లాస్మా దాతకు ఓ సర్టిఫికేట్ అందిస్తామని.. తద్వారా భవిష్యత్తులో వారికి మొదటి ప్రాధాన్యం కల్పిస్తామని అన్నారు. ఇతర రాష్ర్టాలనుంచి కూడా రావచ్చని అస్సాం ప్రభుత్వం వారికి స్వాగతం పలుకుందని తెలిపారు. అంతేకాకుండా ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే భరించడంతో పాటు వారిని ప్రత్యేక అతిథిగా చూసుకుంటామని పేర్కొన్నారు. రాష్ర్టంలో అతి త్వరలోనే వర్చువల్ ప్లాస్మా బ్యాంక్ ప్రారంభమవుతుందని సిల్చార్, దిఫు, దిబ్రుగ సహా 6 ప్రాంతాల్లో ప్లాస్మా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. గువాహటిలో ఇప్పటికే ప్లాస్మా బ్యాంక్ ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఇటీవల గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో రోగులకు ప్లాస్మా చికిత్సనందించారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,754కు చేరుకోగా 12,888 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 6,815 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. (సీఎం కార్యాలయం బయట వ్యక్తి ఆందోళన) -
ప్లాస్మా దాతలకు కర్ణాటక ప్రోత్సాహకం
బెంగుళూరు : దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. వ్యాధి తీవ్రమయి ఆరోగ్యం క్షీణించిన వారిలో ప్రయోగాత్మకంగా అందిస్తోన్న ప్లాస్మా థెరపీకి ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే దానికి తగ్గట్లు ప్లాస్మా దాతలు తగినంతగా లభించకపోవడంతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నా అవసరాలకు తగ్గట్లుగా ప్లాస్మా లభించడం లేదు. దీంతో దాతలు ముందుకు రావాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తుతున్నాయి. ప్లాస్మాదాతలు లేక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా క్రమంగా అధికమవుతుంది. ఈ నేపథ్యంలో దాతలను ప్రోత్సహించేలా కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు ప్లాస్మాను దానం చేస్తే 5000 రూపాయలను ప్రోత్సాహకంగా అందిస్తామని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి బి శ్రీరాములు ఓ ప్రకటన విడుదల చేశారు. (‘కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి’) దేశంలో అత్యధిక ప్లాస్మా పద్ధతిని ఉపయోగిస్తున్న రెండవ రాష్ర్టం కర్ణాటక అని మంత్రి అన్నారు. దాదాపు 80 శాతం కరోనా రోగులు ఈ పద్ధతి ద్వారా త్వరగా కోలుకున్నారని తెలిపారు. అయితే ప్రాణదాతలుగా గొప్ప దాతృత్వాన్ని ప్రదర్శించాల్సిన సమయంలో దీన్ని కూడా డబ్బుతో పోల్చడంపై వస్తున్న విమర్శలను మంత్రి కొట్టిపారేశారు. ఇది ఎవరినీ అవమానించడం కాదని కేవలం దాతలను ప్రోత్సహించే ఉద్దేశం మాత్రమేనని అన్నారు. రాష్ర్ట రాజధాని బెంగుళూరులో కరోనా తీవ్రరూపం దాలుస్తుంది. అన్‌లాక్ 1 ప్రారంభ దశలో 600 కన్నా తక్కువ ఉన్న కరోనా కేసుల తీవ్రత ఇప్పడు 22 వేలు దాటింది. దీంతో రాష్ర్ట వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 47,000 దాటింది. గత 24 గంటల్లోనే అత్యధికంగా 3176 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. (బాదేసే బిల్లు) -
ఢిల్లీలో మరో ప్లాస్మా సెంటర్ ప్రారంభం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్-19 రోగుల కోసం రెండో ప్లాస్మా సెంటర్‌ను ప్రారంభించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న లోక్‌నాయక్ హాప్పటల్‌లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, మేం పెట్టిన మొదటి ప్లాస్మా సెంటర్ విజయవంతమైంది. అందుకే రెండో సెంటర్‌ను ఎల్ఎన్జీపీ వద్ద ఈరోజు ప్రారంభించాం అని ట్వీట్ చేశారు. చదవండి: బిడ్డకు కరోనా, తల్లికి మాత్రం నెగెటివ్ ఈ ఆసుపత్రిలో ముగ్గురు ప్లాస్మా స్వీకరణ కోసం ముగ్గురు కౌన్సిలర్లను నియమించారు. వీరు కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్న వారికి ప్లాస్మా థెరపీ గురించి వివరించి, వారిని ప్లాస్మా దానం చేయడానికి ఒప్పిస్తారు. మొదటిసారి ప్రారంభించిన ప్లాస్మాసెంటర్ విజయవంతం కావడంతో రెండో సెంటర్‌ను మంగళవారం ప్రారంభించారు. ఢిల్లీలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 80శాతంగా ఉంది. ఇప్పటి వరకు ఢిల్లీలో 113,740 కరోనా కేసులు నమోదయ్యాయి. చదవండి: కరోనా కట్టడికి 5 ఆయుధాలు: సీఎం After India's first Plasma bank by Delhi Govt Hon'ble CM shri @Arvindkejriwal with Hon'ble Dy CM shri @msisodia visited LNJP hospital to inaugurate the second plasma bank of Delhi. pic.twitter.com/VJBeHIXc2r — AAP (@AamAadmiParty) July 14, 2020 -
‘ప్లాస్మా’తో కోలుకుంటున్నకరోనా బాధితుడు
గాంధీ ఆస్పత్రి: కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్లాస్మా థెరపీ సత్ఫలితాలిస్తోంది. ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితునికి రెండుసార్లు ప్లాస్మా ఎక్కించడంతో కోలుకుంటున్నాడు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆదేశాలతో దాతల నుంచి సేకరించిన ప్లాస్మాను గాంధీ ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో మైనస్ 18 డిగ్రీల సెల్సియస్ ఫ్రీజర్ బాక్సుల్లో భద్రపరిచారు. సుమారు 16 మంది కరోనా బాధితులు ఆక్సిజన్‌పై ఉండగా వారిలో ఆరుగురిని ప్లాస్మా థెరపీ కోసం ఎంపిక చేసి ఐసీఎంఆర్‌కు పంపారు. అక్కడి ఆదేశాలతో ప్లాస్మా థెరపీని ప్రారంభించారు. పాతబస్తీకి చెంది న 44 ఏళ్ల బాధితునికి ఈనెల 14న 200 ఎంఎల్ ప్లాస్మాను ఎక్కించారు. బాధితుడు కోలుకోవడంతో ఈనెల 16న రెండో డోస్‌గా మరో 200 ఎంఎల్ ప్లాస్మాను ఎక్కించారు. ఐసీఎంఆర్ నిబంధన ప్రకారం.. ప్లాస్మా ఎక్కించిన తర్వాత బాధితుడు కోలుకుంటున్న క్రమంలో రెండో డోస్ ఎక్కించాలి. మొదటిడోస్ ప్లాస్మా ఎక్కించినా æ పురోగతి లేకుంటే ఈ రకమైన చికిత్స ఎటువంటి ప్రభావం చూపట్లేదని భావించి రెండో డోస్ ఇవ్వరు. ఈ నేపథ్యంలో బాధితుడు కోలుకుంటున్న క్రమంలోనే రెండో డోస్ ప్లాస్మా ఎక్కించినట్లు తెలిసింది. మరో రెండు రోజుల్లో సదరు బాధితుడు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో మరో ముగ్గురు కరోనా బాధితులకు సరిపడే ప్లాస్మా అందుబాటులో ఉంది. ఐసీఎంఆర్ ఆదేశాలతో మిగిలిన వారికీ సోమవారం నుంచి ప్లాస్మా థెరపీ ప్రారంభించే అవకాశం ఉందని ఓ వైద్యుడు తెలిపారు. ఇప్పటి వరకు నలుగురు దాతల నుంచి ప్లాస్మా సేకరించామని ఆస్పత్రి పాలన యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. -
ప్లాస్మా దానం చేయండి: తబ్లిగీ నేత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేయాలని తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా సాద్ కందల్వీ తన అనుచరులను కోరారు. కరోనాతో పోరాటం చేసేవారికి రక్తంలోని ప్లాస్మా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. తనతోపాటు మర్కజ్ ప్రార్థనలకు హాజరైన కొంతమంది స్వీయ నిర్భందంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా స్వీయ నిర్భందంలో ఉన్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చిందని మౌలానా సాద్ తెలిపారు. ఇక పాజిటివ్‌గా వచ్చిన వారికి కూడా సరైన చికిత్స అందించగా వారు కోలుకున్నారని ఆయన వెల్లడించారు. (తబ్లిగీ నేతపై ఈడీ కేసు) కరోనా నుంచి కోలుకున్నవారు తమవంతు సాయంగా ప్రస్తుతం వైరస్ బారినపడి పోరాడుతున్న వారికి.. రక్తంలోని ప్లాస్మాను దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వచ్చే రంజాన్ మాసంలో ముస్లింలు ఇంటి వద్దనే ఉండి సామాజిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేయాలని కోరారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగి జమాత్‌కు హాజరైన వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మౌలానా ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. (కొత్తగా 1,300 కరోనా కేసులు, 50మంది మృతి) కాగా దేశంలో ఇప్పటివరకూ మొత్తం 19,984 పాటిజివ్ కేసులు నమోదు కాగా, 640 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 15,474 ఉన్నాయి. ఇక 3,870 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. (పరమౌషధం కానున్న ప్లాస్మా!) -
ఫుడ్ ఫ్యాక్ట్స్
కొబ్బరి నీళ్లను అత్యవసర పరిస్థితుల్లో రక్తంలోని ప్లాస్మాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. వంగపండు రంగులో ఉన్న క్యారెట్లే అసలైన క్యారెట్లు. అసలెప్పటికీ పాడవని ఒకే ఒక పదార్థం తేనె. మూడువేల సంవత్సరాల వరకు ఇది నిల్వ ఉంటుంది. పచ్చి వేరుశెనగల్లో కంటే కాస్త దోరగా వేయించిన వాటిలోనే పోషకాలు ఎక్కువగా వుంటాయి. -
రోదసిలోకి ఐదు భూములంత ప్లాస్మా విడుదల..
సూర్యుడి నుంచి ఐదు భూములంత వెడల్పు, ఏడున్నర భూములంత పొడవున ప్లాస్మా అంతరిక్షంలోకి ఎగజిమ్ముతున్న దృశ్యమిది. దీనిని అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ఐరిస్ ఉపగ్రహం మే 9న వీడియో తీసింది. సూర్యుడి నుంచి ప్లాస్మా కణాలు, సౌరగాలులు విడుదలవడాన్ని కరోనల్ మాస్ ఎజెక్షన్(సీఎంఈ) అంటారు. అయితే తాజాగా విడుదలైన ఈ ప్లాస్మాకణాలు గంటకు 15 లక్షల మైళ్ల వేగంతో అంతరిక్షంలోకి ఎగజిమ్మాయట. గతేడాది జూన్‌లో రోదసికి చేరిన ఐరిస్ ఇప్పటిదాకా తీసినవాటిలో ఇదే అత్యంత స్పష్టమైన వీడియోనట. దీని ద్వారా సీఎంఈ గురించి మరిన్ని లోతైన అంశాలు తెలిశాయని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.