
రోదసిలోకి ఐదు భూములంత ప్లాస్మా విడుదల..
సూర్యుడి నుంచి ఐదు భూములంత వెడల్పు, ఏడున్నర భూములంత పొడవున ప్లాస్మా అంతరిక్షంలోకి ఎగజిమ్ముతున్న దృశ్యమిది.
సూర్యుడి నుంచి ఐదు భూములంత వెడల్పు, ఏడున్నర భూములంత పొడవున ప్లాస్మా అంతరిక్షంలోకి ఎగజిమ్ముతున్న దృశ్యమిది. దీనిని అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ఐరిస్ ఉపగ్రహం మే 9న వీడియో తీసింది. సూర్యుడి నుంచి ప్లాస్మా కణాలు, సౌరగాలులు విడుదలవడాన్ని కరోనల్ మాస్ ఎజెక్షన్(సీఎంఈ) అంటారు. అయితే తాజాగా విడుదలైన ఈ ప్లాస్మాకణాలు గంటకు 15 లక్షల మైళ్ల వేగంతో అంతరిక్షంలోకి ఎగజిమ్మాయట. గతేడాది జూన్‌లో రోదసికి చేరిన ఐరిస్ ఇప్పటిదాకా తీసినవాటిలో ఇదే అత్యంత స్పష్టమైన వీడియోనట. దీని ద్వారా సీఎంఈ గురించి మరిన్ని లోతైన అంశాలు తెలిశాయని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.