ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మంగళవారం ప్లాస్మా దానం చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన కుమారుడు, యువ సంగీత దర్శకుడు కాల భైరవతో కలిసి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలోని ప్లాస్మా డొనేషన్ వింగ్‌లో ప్లాస్మా దానం చేసినట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ నుంచి కాపాడే ప్లాస్మాపై ఉన్న అపోహలు పోగొడుతూ ప్లాస్మా యోధుల కోసం ఒక పాటను కీరవాణి రచించిన సంగతి తెలిసిందే. ‘‘ప్లాస్మా దానం చేయడం రక్తం దానం చేసినట్లే ఉంది. దానం చేసేందుకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలి’’ అని పిలుపునిచ్చారు కీరవాణి. కీరవాణి తమ్ముడు, అగ్ర దర్శకుడు రాజమౌళి కూడా ఇటీవల కరోనాను జయించి ప్లాస్మా దానం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment