సాక్షి, హైదరాబాద్: కరోనా నుంచి కోలుకున్న వారు వీలైనంత త్వరగా ప్లాస్మా దానం చేసి ప్రాణాలను కాపాడాలని దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ట్విటర్ ద్వారా కోరారు. మన శరీరంలో ఏర్పడిన కరోనా ప్రతి బంధకాలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఈలోపే ప్లాస్మా దానం చేస్తే వేరే వారి ప్రాణాన్ని కాపాడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. తన శరీరంలో యాంటీ బాడీస్ కోసం పరీక్ష చేయించుకోగా ఐజీజీ లెవల్స్ 8.62 ఉన్నాయని, ప్లాస్మా దానం చేయాలంటే 15కన్నా ఎక్కువ ఉండాలని తెలిపారు. పెద్దన్న కీరవాణి, భైరవ మంగళవారం ఉదయం ప్లాస్మా దానం చేశారని జక్కన్న పేర్కొన్నారు. రాజమౌళి ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: ప్లాస్మా దానం చేసిన ఎంఎం కీరవాణి
The antibodies that develop stay in our system for a limited period of time only..
— rajamouli ss (@ssrajamouli) September 1, 2020
I request Everyone who are cured from #Covid19 to come forward and donate.
And become a life saver..🙏🏼🙏🏼
Comments
Please login to add a commentAdd a comment