
ఈ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్ తాజాగా సంజీవని పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా కోవిడ్-19 రోగులను ప్లాస్మా దాతలతో అనుసంధానిస్తారు. రోగులు, దాతలు తమ పేర్లను మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఆధారంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ గ్రూప్, ప్రాంతం, కోవిడ్-19 ఎప్పుడు సోకింది, ఎప్పుడు నెగెటివ్ వచ్చింది వంటి వివరాలను పొందుపర్చాలి. ఈ వివరాల ఆధారంగా స్నాప్‌డీల్ సర్చ్ ఇంజన్ రోగులను, దాతలను కలుపుతుంది. ప్లాస్మా దానంపై అవగాహన పెంచేందుకు సంజీవని నడుం బిగించింది. మహ మ్మారి విస్తృతి నేపథ్యంలో ఫేస్‌బుక్, గూగుల్, పేటీఎం వంటి సంస్థలు సైతం తమ వంతుగా సాయపడేందుకు డిజిటల్ వేదికగా టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment