Sanjeevani
-
ఆపదలో చేయూత.. క్రౌడ్ ఫండింగ్
శాంతి, ఏకాంబరం దంపతులు (పేరు మార్చాం) తొలి కాన్పులో పుత్రుడు అని తెలియగానే పొంగిపోయారు. బాబును చూస్తూ భవిష్యత్తుపై ఎన్నో కలలుగన్నారు. చిన్నారి మూడేళ్ల వయసుకొచ్చేసరికి కదల్లేని స్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ చిన్నారుల ఆస్పత్రిలో చూపించారు. స్పైనల్ మసు్క్యలర్ అట్రోఫీ(ఎస్ఎంఏ)తో బాధపడుతున్నట్టు తేలింది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే విదేశాల నుంచి ‘జోల్జెన్స్మా’ అనే ఇంజెక్షన్‌ను తీసుకొచ్చి ఇవ్వాలి. ఇందుకు సుమారు రూ.16 కోట్లు అవుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ సమయంలో బాబు తల్లిదండ్రులకు ‘ఇంపాక్ట్ గురూ’ ప్లాట్‌ఫామ్ సంజీవనిగా కనిపించింది. చిన్నారి ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తూ విరాళాలకు (ఫండ్ రైజింగ్) పిలుపునిచ్చారు. మూడున్నర నెలల్లో 65,000 మంది దాతల ఉదారంతో ఊహించనిది సాధ్యమైంది. విదేశాల నుంచి సదరు ఇంజెక్షన్‌ను తీసుకొచ్చి ఇవ్వడంతో బాబు కోలుకున్నాడు. వేణు నెట్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో ఓ బాలిక లివర్ సమస్యతో బాధపడుతుందన్న ‘కెట్టో’ ప్రకటన కనిపించింది. అది క్లిక్ చేయగా, ఆ సమస్య నుంచి బయటపడేందుకు రూ.30 లక్షలు అవుతుందని, దాతలు దయతలిస్తేనే తన కుమార్తె బయటపడుతుందంటూ చిన్నారి తల్లి ఆవేదనతో చెబుతున్న మాటలకు వేణు చలించిపోయాడు. కానీ, కాలేయ చికిత్సకు భారీ మొత్తాన్ని పేర్కొనడంపై అతడిలో అనుమానం కలిగింది. సదరు ప్రకటన నిజమేనా..? అంత ఖర్చు అవుతుందా..? ప్రభుత్వాలు ఎందుకు సాయం చేయవు? ఆస్పత్రులు అయినా బాధితుల విషయంలో కొంత లాభాపేక్ష తగ్గించుకుని చికిత్సలకు ముందుకు రావచ్చుగా..? ఇలాంటి ప్రశ్నలు మెదిలాయి. చివరికి తన సందేహాలన్నీ పక్కన పెట్టేసి రూ.500 అప్పటికప్పుడు డొనేట్ చేశాడు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచి్చనా, తమ వల్ల ఏమవుతుంది? అంటూ కుదేలు అయిపోవాల్సిన పని లేదని శాంతి దంపతుల కథనం ధైర్యాన్నిస్తోంది. ఆరోగ్య పరంగా ఎంత కష్టం వచి్చనా, దాతల నుంచి విరాళాలు తెచ్చి పెట్టేందుకు నేడు ఎన్నో వేదికలు పనిచేస్తున్నాయి. వేలాది మంది బాధితుల కుటుంబాల్లో సంతోషానికి దారి చూపిస్తున్నాయి. అదే సమయంలో ఇలాంటి బాధితులకు సాయం చేశామనే సంతృప్తి దాతలకు లభిస్తోంది. కాకపోతే విరాళం ఇచ్చే ముందు కాస్తంత విచారించి, కథనం నిజమైనదేనని నిర్ధారించుకోవడం ద్వారా తమ దానం నిష్ఫలం కాకుండా చూసుకోవచ్చు. మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే.. వీటి సాయం పొందడమే కాకుండా, వీటి ద్వారా నలుగురికీ తోచినంత సాయం చేయడానికి అవకాశం లభిస్తుంది. మనోళ్లకు దాన గుణం ఎక్కువే.. 2021 వరల్డ్ గివింగ్ ఇండెక్స్ ప్రకారం దానంలో భారత్ 14వ స్థానంలో ఉంది. అపరిచితులకు మన దేశంలో 61 శాతం మంది సాయం చేస్తున్నారు. కాకపోతే విశ్వసనీయత విషయంలో ఉండే సందేహాలు ఈ దాతృత్వాన్ని మరింత విస్తరించకుండా అడ్డుకుంటున్నాయని చెప్పుకో వచ్చు. బాధితులకు, దాతలకు మధ్య వేదికగా నిలిచే విశ్వసనీయ సంస్థలు వస్తున్న కొద్దీ, క్రౌడ్ ఫండింగ్ మరింత పరిడవిల్లుతూనే ఉంటుంది. మరింత మంది బాధితులకు చేయూత లభిస్తుంది. నిధుల సమీకరణ ఇలా..? ► చికిత్సలకు దాతల సాయం అవసరమైన వారు క్రౌండ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లను (ఇంపాక్ట్‌గురూ, మిలాప్, కెట్టో మొదలైనవి) సంప్రదించాలి. ► పాన్, ఆధార్, మెడికల్ డాక్యుమెంట్లు సమర్పించాలి. ► వీటిని క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ధ్రువీకరించుకుంటుంది. తగిన విచారణ అనంతరం బాధితుల కథనం నిజమేనని నిర్ధారించుకున్న తర్వాత వారి తరఫున నిధుల సమీకరణ పేజీని అవి సిద్ధం చేస్తాయి. ► ఇక ఇక్కడి నుంచి నిధుల సమీకరణ మొదలవుతుంది. సాయం అవసరమైన వారు ఈ పేజీ లింక్‌ను తమ నెట్‌వర్క్‌లో షేర్ చేసుకోవాలి. తమ వంతు ప్రచారం కలి్పంచుకోవాలి. అలాగే, ప్లాట్‌ఫామ్‌లు సైతం ప్రచారానికి తమ వంతు సాయం అందిస్తాయి. ► సమీకరించే విరాళంలో ఎక్కువ మొత్తాన్ని కమీషన్ రూపంలో మినహాయించుకునేందుకు సమ్మతి తెలియజేస్తే, వారి తరఫున క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు సైతం విస్తృత ప్రచారాన్ని చేపడతాయి. ► బాధితులు ఎదుర్కొంటున్న సమస్య, వైద్యులు చెబుతున్న వెర్షన్, చికిత్సకు ఎంత ఖర్చవుతుంది? తదితర వివరాలన్నీ ఈ పేజీలో ఉంటాయి. దాతలు విరాళం చెల్లించేందుకు పేమెంట్ లింక్‌లు కూడా అక్కడ కనిపిస్తాయి. ► కనీసం 300–350 అంతకంటే ఎక్కువ విరాళాలనే అనుమతిస్తున్నాయి. ► దాతలు చేసే చెల్లింపులన్నీ కూడా ప్రత్యేక ఖాతాలో జమ అవుతాయి. ► కావాల్సిన మొత్తం వచి్చనా.. లేదంటే గడువు ముగిసినా లేదంటే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి అకాలంగా మరణించినా నిధుల సమీకరణ ముగిసిపోతుంది. ► అనంతరం ఈ మొత్తం నుంచి కమీషన్ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని హాస్పిటల్/బాధితులకు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు చెల్లిస్తాయి. ఇలా చేసే ముందు హాస్పిటల్ బిల్లులను చెక్ చేస్తాయి. ► విరాళం ఇచి్చన వారికి ఎప్పటికప్పుడు మెయిల్ ద్వారా బాధితుల తాజా ఆరోగ్య పరిస్థితిపై వివరాలను ఇవి అప్డేట్ చేస్తుంటాయి. విశ్వసించడం ఎలా..? సాయం అవసరమైన వారికి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు మార్గాన్ని చూపిస్తున్నాయి. మరి విరాళం ఇచ్చే వారు ఈ కథనాలను విశ్వసించేది ఎలా..? ఈ సందేహం చాలా మందికి వస్తుంది. మన దేశంలో విరాళాలకు సంబంధించి భౌతిక వేదికలే ఎక్కువ. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల సేవలు ఇటీవలి కాలంలోనే వెలుగులోకి వచ్చాయి. ఇంటర్నెట్ విస్తరణ ఇందుకు వీలు కలి్పంచిందని చెప్పుకోవాలి. ఆన్లైన్ ప్రపంచంలో అన్నింటినీ నమ్మలేం. సైబర్ మోసాలు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో, అన్నీ విచారించుకున్న తర్వాతే విరాళం ఇవ్వడం సురక్షితంగా ఉంటుంది. కోటక్ ఆల్టర్నేటివ్ అస్సెట్ మేనేజర్స్ సీఈవో (ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ) లక్ష్మీ అయ్యర్ దీనిపై తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘నాకు రిఫరల్ ద్వారా వచ్చే వాటికే నేను దానం చేస్తాను. ఈ విషయంలో నా మార్గం చాలా స్పష్టం. సులభంగా డబ్బులు సంపాదించే మోసగాళ్లకు కొదవ లేదు’’అన్నది లక్ష్మీ అయ్యర్ అభిప్రాయంగా ఉంది. సన్సేరా ఇంజనీరింగ్ జాయింట్ ఎండీ ఎఫ్ఆర్ సింఘ్వి ఈ విషయంలో సందేహాలు వ్యక్తం చేశారు. ‘‘చాలా వరకు విరాళాలు కోరుతున్న ఆన్లైన్ కేసులు వైద్య పరమైనవే ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో అవి పేర్కొనే చికిత్సల వ్యయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. నాకు ఒక ఆస్పత్రితో అనుబంధం ఉంది. కనుక చికిత్సల వ్యయాల గురించి తెలుసుకోగలను’’అని పేర్కొన్నారు. ఇలాంటిదే ఒక విరాళం కేసులో చికిత్సకు రూ.18–24 లక్షలు ఖర్చువుతుందన్న కొటేషన్ కనిపించగా, దీనిపై విచారించగా, తెలిసిన హాస్పిటల్లో రూ.5–6 లక్షలకే చేస్తున్నట్టు విని ఆశ్చర్యపోయినట్టు సింఘ్వి తెలిపారు. నిజానికి కొన్ని కేసుల్లో భారీ అంచనాలు పేర్కొంటున్న ఉదంతాలు లేకపోలేదు. హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న బాధితుల తరఫున నిధుల సమీకరణ కార్యక్రమాలు నడిపించే కొందరు మోసగాళ్ల ఉదంతాలు సైతం లోగడ వెలుగు చూశాయి. అలా అని కష్టాల్లో ఉన్న బాధితులకు విరాళాలు ఆగకూడదు కదా..? ముందస్తు పరిశీలన క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు చికిత్సల వ్యయాలను ముందుగానే నిర్ధారించుకుంటామని చెబుతున్నాయి. హాస్పిటల్ వ్యయ అంచనాలను, చారిత్రక గణాంకాలు, బీమా థర్డ్ పార్టీ అగ్రిగేటర్ సంస్థల డేటా ఆధారంగా పోల్చి చూస్తామని ఇంపాక్ట్‌గురూ సీఈవో జైన్ తెలిపారు. తమ ప్యానల్ డాక్టర్లతోనూ దీనిపై నిర్ధారించుకుంటామని చెప్పారు. నిధుల సమీకరణ నిజమైన కారణాలతో చేసినప్పటికీ, తర్వాత ఆ నిధులు దురి్వనియోగం కాకుండా ఉండేందుకు కూడా ఇవి చర్యలు తీసుకుంటున్నాయి. ‘‘ఇంపాక్ట్ గురూ వేదికగా సమీకరించే నిధుల్లో 80 శాతానికి పైగా నేరుగా హాస్పిటల్స్‌కు బదిలీ చేస్తున్నాం. ఈ హాస్పిటల్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ జాబితాలోనివే’’అని జైన్ తెలిపారు. తమ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ చేసే వైద్య పరమైన కేసుల్లో విరాళాలను హాస్పిటల్ బ్యాంక్ ఖాతా ద్వారానే తీసుకోగలరని కెట్టో అంటోంది. ► బాధితుల కేవైసీ పత్రాలను ముందుగా ఇవి నిర్ధారించుకుంటాయి. ► వైద్య పరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకుని వాటిని తనిఖీ చేస్తాయి. ► తమ ప్యానెల్ వైద్యులతో మాట్లాడి నిర్ధారణకు వస్తాయి. ► అవసరమైతే క్షేత్రస్థాయిలో హాస్పిటల్‌కు తమ ఉద్యోగిని పంపించి వాస్తవమా, కాదా అన్నది నిర్ధారించుకుంటాయి. ప్రచార మార్గం.. ఇంపాక్ట్ గురూ, కెట్టో, మిలాప్ ఇవన్నీ ప్రముఖ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు. ఆన్లైన్ ప్రకటనలు, సామాజిక మాధ్యమాల ద్వారా బాధితుల తరఫున విరాళాల సమీకరణకు ఇవి ప్రచారం కలి్పస్తుంటాయి ఇంటర్నెట్ బ్రౌజ్ చేసే సమయంలో వైద్య చికిత్సల కోసం సాయం కోరుతూ ఈ సంస్థలకు సంబంధించి ప్రకటనలు కనిపిస్తుంటాయి. వీటిని క్లిక్ చేసి చూశారంటే, తర్వాత కూడా అలాంటి ప్రకటనలే మళ్లీ మళ్లీ కనిపిస్తుంటాయి. ప్రకటనల్లో బాధితుల కథనానికి ఆధారంగా వైద్యులు జారీ చేసిన లెటర్, టెస్ట్ రిపోర్ట్‌లను ఉంచుతున్నాయి. సామాజిక మాధ్యమాలతోపాటు, బాధితులు సైతం తమకు తెలిసిన వారికి ఈ లింక్‌లు పంపి సాయం కోరవచ్చు. ఒక్కసారి కావాల్సిన నిధులు లభించగానే, ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ముగుస్తుంది. ఈ సంస్థలు విరాళం ఇచి్చన వ్యక్తులను నెలవారీ స్కీమ్‌లతో ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి నెలా తోచినంత దానం ఇచ్చే విధంగా స్కీమ్‌లు తీసుకొచ్చాయి. విరాళాలకు సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు కల్పిస్తున్నాయి. బాధితుల అనుభవాలు.. లాహిరి సోదరికి బ్రెయిన్ టీబీ నిర్ధారణ కావడంతో 2019 డిసెంబర్లో నిధుల సమీకరణ కోసం మిలాప్ సంస్థను సంప్రదించారు. మిలాప్ ఆమె అభ్యర్థనకు చక్కగా స్పందించింది. ఫొటోగ్రాఫ్‌లు, డాక్యుమెంట్లు అడిగారు. అవన్నీ ఇవ్వడంతో, వాటి ఆధారంగా ఒక ప్రచార ప్రకటనను మిలాప్ రూపొందించింది. తెలిసిన వారి సాయంతో దీనికి మంచి ప్రచారం కలి్పంచుకోవాలని మిలాప్ సూచించింది. తాము ఆ ప్రచారాన్ని చేపట్టబోమని, బాధితులే సొంతంగా నిర్వహించడం వల్ల మరింత విశ్వసనీయత ఉంటుందనే సూచన వచ్చింది. దీంతో లాహిరి తనకు తెలిసిన వారికి షేర్ చేశారు. అలా రూ.45,000 విరాళాలు వచ్చాయి. ఇందులో మిలాప్ తన కమీషన్‌గా రూ.5,000 మినహాయించుకుని, రూ.40,000ను లాహిరి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చెల్లించింది. కానీ, మిలాప్ ద్వారా చేసిన ప్రచారం లాహిరి బంధు మిత్రులకు తెలిసిపోవడంతో, వారి నుంచి ఆమెకు మరో రూ.12 లక్షలు విరాళాల రూపంలో నేరుగా వచ్చాయి. మిలాప్ రూపొందించిన ప్రచారమే లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదని లాహిరి అనుభవం చెబుతోంది. దురదృష్టవశాత్తూ లాహిరి సోదరి బ్రెయిన్ టీబీతో 2020 ఫిబ్రవరిలో మరణించారు. విజయం ఎంత? మీరా అనే వ్యక్తి సైతం, తన భర్త సర్జరీ కోసం కెట్టో ద్వారా నిధుల సమీకరణ చేయగా, మంచి ఆదరణే లభించింది. కెట్టో రిప్రజెంటేటివ్ ఎప్పటికప్పుడు ఆమెతో సంపద్రింపులు చేస్తూ సహకారం అందించడంతో, సర్జరీకి కావాల్సిన మొత్తం 48 గంటల్లోనే సమకూరింది. దేశ, విదేశాల్లోని స్నేహితులు, కుటుంబ సభ్యులు విరాళం ఇచ్చేందుకు సముఖంగా ఉన్నారని తెలిసినా, అందుకు వీలుగా కెట్టో ప్లాట్‌ఫామ్ సాయాన్ని ఆమె తీసుకున్నారు. ఎక్కడ ఉన్నా కెట్టో ద్వారా విరాళం పంపడం సులభమని భావించి అలా చేసినట్టు చెప్పారు. అయితే, అందరికీ ఇదే తరహా అనుభవం లభిస్తుందా..? ప్రతి ఫండ్ రైజింగ్ విజయవంతం అవుతుందా? అంటే నూరు శాతం అవును అని చెప్పలేం. ఇదంతా తమకున్న పరిచయాలు, ఎంపిక చేసుకున్న ప్లాట్‌ఫామ్, రూపొందించిన ప్రకటన, ప్లాట్‌ఫామ్ నుంచి ప్రచారం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ‘‘కొన్నేళ్ల క్రితం మేము సాయం కోసం ఇంపాక్ట్ గురూ ప్లాట్‌ఫామ్‌ను సంప్రదించాం. ఇంపాక్ట్ గురూ దాతల నెట్వర్క్ సాయంతో నిధులు సమకూర్చుతారని అనుకున్నాం. కానీ, ఇంపాక్ట్ గురూ అలా చేయలేదు. ప్రచార కార్యక్రమం పేజీని రూపొందించి, ఆ లింక్‌ను తమ పరిచయస్తులతో పంచుకోవాలని సూచించింది’’అని ఓ వ్యక్తి అనుభవం చెబుతోంది. తమ ప్లాట్‌ఫామ్‌పై వేలాది ప్రచార కార్యక్రమాలు నమోదవుతున్నందున.. ప్రతీ ఒక్క ప్రచారాన్ని తామే సొంతంగా చేపట్టడం సాధ్యం కాదని ఇంపాక్ట్ గురూ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పీయూష్ జైన్ స్పష్టం చేశారు. దాతల కమ్యూనిటీ నుంచి మంచి స్పందన వస్తుందనుకుంటే, తాము తప్పకుండా ప్రమోట్ చేస్తుంటామని చెప్పారు. కొంచెం కమీషన్.. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ లు మొత్తం విరాళం నుంచి నిరీ్ణత మొత్తాన్ని కమీషన్/చార్జీ కింద మినహాయించుకుంటున్నాయి. ఇది ఒక్కో సంస్థలో ఒక్కో విధంగా ఉంటుంది. ‘‘అంతర్జాతీయంగా చూస్తే ప్రతీ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ఎంతో కొంత స్వల్ప ఫీజును వసూలు చేస్తున్నాయి. తమ కార్యకలాపాలు నిర్విరామంగా కొనసాగేందుకే ఇలా చేస్తున్నాయి. టెక్నాలజీ సదుపాయాలు, సిబ్బంది, నిధుల సమీకరణ, ముందస్తు విచారణలకు సంబంధించి వ్యయాలు అవుతాయి. మేము నిలదొక్కుకున్నప్పుడే మా లక్ష్యాన్ని (ఫండ్ రైజింగ్) సాధించగలం’’ అని పీయూష్ జైన్ తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని ప్రీమియం సేవలను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇంపాక్ట్ గురూ అయితే 0 శాతం, 5 శాతం, 8 శాతం ఇలా మూడ్ స్కీమ్‌ల కింద ఈ సేవలను ఆఫర్ చేస్తోంది. మోసాలుంటాయ్.. జాగ్రత్త అవగాహన, జాగ్రత్తలు లేకపోతే ఆన్లైన్ మోసాల బారిన పడే రిస్క్ ఉంటుంది. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విరాళాలు కోరినా లేక విరాళం ఇచ్చినా సరే.. ఆ తర్వాత ఫోన్ కాల్ లేదా వాట్సాప్ మెస్సేజ్ లేదా మెయిల్ రావచ్చు. కష్టంలో ఉన్న బాధితులకు సంబంధించి అందులో సాయం కోరొచ్చు. లేదంటే అప్పటికే విరాళం ఇచ్చిన కేసుకు సంబంధించి అప్డేట్ అంటూ మోసగాళ్లు మెయిల్ పంపించొచ్చు. ఒక్కసారి విరాళం ఇస్తే, ఆ తర్వాత నుంచి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇతర బాధితులకు సంబంధించిన వివరాలను మెయిల్స్, వాట్సాప్ మెస్సేజ్‌లు, కాల్స్ రూపంలో మార్కెటింగ్ చేస్తుంటాయి. ఇదంతా ఇబ్బందికరంగా అనిపించొచ్చు. చాలా మంది సాయం చేయాలని భావిస్తుంటారని, బాధితుల వివరాలను వారు మెయిల్ లేదా వాట్సాప్ సందేశాలు, కాల్స్ రూపంలో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని జైన్ తెలిపారు. ఇవి వద్దనుకునే వారు అన్‌సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలని సూచించారు. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు అన్నీ కూడా సురక్షిత చెల్లింపుల సాధనాలనే వినియోగిస్తున్నాయి. కానీ, వీటి పేరుతో సైబర్ నేరస్థులు ఆకర్షించే కథనాలు, మోసపూరిత పేమెంట్ లింక్‌లు పంపించి, బ్యాంక్ ఖాతాలో బ్యాలన్స్ మొత్తాన్ని ఊడ్చేసే ప్రమాదం లేకపోలేదు. అందుకే విరాళం ఇచ్చే ముందు సంబంధిత సంస్థల యూఆర్ఎల్ను జాగ్రత్తగా గమనించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఈ-సంజీవని సేవలలో దేశంలోనే అగ్రగామిగా ఏపీ
సాక్షి, విజయవాడ: ఈ-సంజీవని సేవలలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కోవిడ్ కమాండ్ కంట్రోల్ ప్రత్యేకాధికారి ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్‌లో భాగంగా ఏపీలో ఈ-సంజీవని టెలీకన్సల్టేషన్ ఏర్పాటయ్యిందన్నారు. 13 జిల్లాల్లోని వైద్యకళాశాల్లో 13 టెలీమెడిసిన్ హబ్‌ల ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి టెలిమెడిసిన్ హబ్‌లో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, ముగ్గురు స్పెషలిస్టులు సేవలందిస్తున్నారన్నారు. 1145 పీహెచ్‌సీలు, 2914 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లకు అనుసంధానం చేశామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పేషెంట్లకు ప్రిస్క్రిప్షన్లు, వైద్యులు సూచించిన మందులు పేషెంట్ల ఇంటికే పంపిణీ వంటి సేవలు అందించామన్నారు. 20,13,248 మందికి టెలిమెడిసిన్ కన్సల్టేషన్ సేవలందించి దేశంలోనే టాప్‌లో ఏపీ నిలిచిందని ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. -
కోవిడ్ బాధితుల కోసం స్నాప్‌డీల్ సంజీవని
ఈ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్ తాజాగా సంజీవని పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా కోవిడ్-19 రోగులను ప్లాస్మా దాతలతో అనుసంధానిస్తారు. రోగులు, దాతలు తమ పేర్లను మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఆధారంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ గ్రూప్, ప్రాంతం, కోవిడ్-19 ఎప్పుడు సోకింది, ఎప్పుడు నెగెటివ్ వచ్చింది వంటి వివరాలను పొందుపర్చాలి. ఈ వివరాల ఆధారంగా స్నాప్‌డీల్ సర్చ్ ఇంజన్ రోగులను, దాతలను కలుపుతుంది. ప్లాస్మా దానంపై అవగాహన పెంచేందుకు సంజీవని నడుం బిగించింది. మహ మ్మారి విస్తృతి నేపథ్యంలో ఫేస్బుక్, గూగుల్, పేటీఎం వంటి సంస్థలు సైతం తమ వంతుగా సాయపడేందుకు డిజిటల్ వేదికగా టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా పేషెంట్స్ కోసం గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్ -
ఐదు నిమిషాల్లో పరీక్ష.. ఆ వెంటనే ఫలితం
సాక్షి, అమలాపురం: కరోనా పాజిటివ్.. ఈ పదం వింటేనే చాలామందిలో వణుకు మొదలవుతుంది. అలాంటిది పరీక్షకు శాంపిల్స్ ఇచ్చాక ఫలితాల కోసం రెండు మూడు రోజుల నిరీక్షణంటే.. క్షణమొక యుగంగా గడుస్తూ.. ప్రాణభీతి వెంటాడుతుంటే.. అమ్మో.. భరించలేరు. ఏదైనా జరగొచ్చు.. చివరికి ప్రాణం కూడా తీసుకోవచ్చు. రోజులు ఇలా గడుస్తుండగా వచ్చింది సంజీవిని. ఆలోచించి పెట్టినా.. కాకతాళీయంగా పెట్టినా ‘సంజీవిని’ ఎందరి ప్రాణాలనో నిలబెడుతోంది. ఇలా శాంపిల్స్ ఇస్తే పావుగంటలో ఫలితం చెప్పేస్తోంది. దీంతో ప్రజలు సైతం అధిక సంఖ్యలో ‘సంజీవిని’ సంచార ల్యాబ్‌కు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. ర్యాపిడ్ యాంటీ టెస్ట్ కిట్లను బస్సుల ద్వారా మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకురావడంతో నిన్నటి వరకూ పదుల లెక్కలో తేలుతున్న పాజిటివ్ కేసులు నేడు వందల సంఖ్యలో బయటపడుతున్నాయి. అయితే వేగవంతమైన ఈ పరీక్షలు, ఫలితాల వల్ల పెరుగుతున్న రోగులను ఒకేసారి ఆస్పత్రులకు తీసుకువెళ్లి అత్యవసర వైద్యం అందించడం కొంచెం కష్టతరమవుతోంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం జిల్లాకు వచ్చిన మూడు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌ల బస్సుల్లో ర్యాపిడ్ టెస్ట్‌లను తాత్కాలికంగా రెండు రోజుల పాటు నిలిపివేశారు. ఈ బస్సుల ద్వారా ర్యాపిడ్ టెస్ట్‌లను సోమవారం నుంచి తిరిగి మొదలు పెట్టనున్నారు. మొబైల్ ల్యాబ్ టెస్టింగ్ బస్సు వెలుపల పరీక్షల కోసం నిలబడ్డ అనుమానితులు బస్సుల్లో ర్యాపిడ్ టెస్ట్‌లు సాగేదిలా రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్ట్‌లు వేగిరం చేసేందుకు ఆరీ్టసీకి చెందిన ఇంద్ర హైటెక్ బస్సులను కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్‌లకు అనుగుణంగా ప్రత్యేక డిజైన్ ద్వారా మార్పులు చేపట్టింది. ఒక్కో బస్సు లోపల దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వెచ్చించి ఒకేసారి పది మందికి ర్యాపిడ్ టెస్ట్‌లు చేసేలా రూపకల్పన చేశారు. బస్సులో పూర్తి ఏసీ సౌకర్యంతో పాటు పది కౌంటర్లు ఉంటాయి. బస్సు అద్దాలకు మనిషి చేయి దూరేంత రంధ్రం ఏర్పాటు చేశారు. బస్సులోని ఒక్కో కౌంటర్ వద్ద ఒక డాక్టర్, ఒక టెక్నీíÙయన్ ఉంటారు. బస్సు బయట అద్దాలకు ఏర్పాటు చేసిన రంధ్రాల ద్వారా పరీక్ష చేయించుకునే వ్యక్తి తల ఎత్తుకు అందేలా ర్యాంప్‌ల ఏర్పాటుచేశారు. కౌంటర్ల వద్ద ఉన్న డాక్టర్లు బస్సు బయట ఉన్న వ్యక్తి ముక్కులోంచి పరికరం పంపించి శాంపిల్స్ సేకరిస్తారు. అలా తీసిన శాంపిల్‌ను అక్కడికక్కడే ర్యాపిడ్ యాంటీజెన్ కిట్‌తో పరీక్షిస్తారు. ఈ ప్రక్రియ అంతా 15 నిమిషాల్లో పూర్తవుతుంది. బస్సులో ఉన్న పది కౌంటర్ల నుంచి ఒకేసారి పది పరీక్షలు, ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఆ బస్సు ద్వారా రోజుకు వెయ్యి వరకూ పరీక్షలు చేసే సామర్ధ్యంతో కూడిన సాంకేతిక సౌకర్యాలు కల్పించారు. తక్కువ సమయంలో ఎక్కువ పరీక్షలు చేసి ఫలితాలు ఇస్తుండడంతో జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం డివిజన్లకు కేటాయించిన మూడు ముబైల్ ర్యాపిడ్ టెస్టింగ్ ల్యాబ్‌లకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే దాకా ఈ బస్సుల ద్వారా గత మూడు రోజుల్లో వేలాది టెస్ట్‌లు చేశారు. దీంతో రోజుకు వందకు మించి లేదా వంద లోపు ఉండే పాజటివ్ కేసుల సంఖ్యం ఈ బస్సులు వచ్చాక వందల్లోకి పెరిగింది. (కొత్తగా 38,902 కేసులు, 543 మంది మృతి) సంజీవినిలో పరీక్షలు చేయించుకునేందుకు అమలాపురం టీటీడీ కళ్యాణ మండపం వద్ద వేచి ఉన్న ప్రజలు (ఫైల్) 2000 పరీక్షల్లో 120 పాజిటివ్ అమలాపురం డివిజన్‌కు సంబంధించిన మొబైల్ కోవిడ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ ల్యాబ్ బస్సు ద్వారా మూడు రోజుల్లో దాదాపు 2000 పరీక్షలు చేయగా వాటిలో 120 వరకూ పాజిటివ్ వచ్చాయి. ఈ మొబైల్ ర్యాపిడ్ టెస్టింగ్ వల్ల పరీక్షలు, వాటి ఫలితాలు అత్యంత వేగంగా ఉంటాయి. ఈ టెస్ట్‌లో పాజిటివ్ వస్తే అదే చివరి ప్రామాణికంగా ఆ రోగికి వైద్య పక్రియ మొదలు పెడతారు. అదే పరీక్ష చేయించుకున్న వ్యక్తికి నెగెటివ్ వచ్చి కొన్ని వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే ఆ టెస్ట్ పూర్తి నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ టెస్ట్‌కు పంపిస్తున్నాం. – డాక్టర్ సీహెచ్ పుష్కరరరావు, అడిషనల్ డీఎం అండ్ హెచ్‌వో, అమలాపురం -
హాలీవుడ్ స్థాయిలో ఉందంటున్నారు
మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేతా వర్మ, అమోఘ్ దేశపతి, మోహన్, నితిన్నాశ్, తనూజ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘సంజీవని’. రవి వీడే దర్శకత్వంలో జి.నివాస్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. దర్శకుడు రవి వీడే మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ హాలీవుడ్ తెరపై మాత్రమే కనిపించిన అబ్బురపరిచే దృశ్యాల్ని ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాలో చూపించాం. సినిమా చూసినవారంతా హాలీవుడ్ స్థాయిలో తీశారని అభినందిస్తుండటం సంతోషంగా ఉంది. 87 థియేటర్లలో విడుదలైన మా సినిమా ప్రస్తుతం 100కి పైగా థియేటర్లలో ఆడుతోంది. థియేటర్ల పెంపే మా విజయానికి నిదర్శనం. మా చిత్రం ఓపెనింగ్ ఎపిసోడ్‌ని ప్రేక్షకుల కోసం యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను మా సినిమా అలరిస్తోంది. మూడు రోజుల్లో 1.25కోట్ల రూపాయలు వసూలు చేసింది. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు నిర్మాత నివాస్. -
చిన్న సినిమాకు రాజమౌళి సాయం
దర్శకధీరుడు రాజమౌళి చిన్న సినిమాలకు తనవంతు సాయం అంధించేందుకు ఎప్పుడూ ముందుంటారు. అదే బాటలో సంజీవని సినిమా ట్రైలర్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు జక్కన్న. ఓ సాహసయాత్రకు బయలు దేరిన కొంతమంది యువత ఎలాంటి పరిస్థితులును ఎదుర్కొన్నారు అన్నదే ఈ సినిమా కథ. గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాకు రవి వీడే దర్శకత్వం వహించారు. అనురాగ్ దేవ్, మనోజ్ చంద్ర, తనూజ నాయుడు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను నివాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై జీ శ్రీనివాన్ నిర్మిస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో ఈ స్థాయి గ్రాఫిక్స్ తో సినిమాను తెరకెక్కించిన చిత్రయూనిట్‌ను రాజమౌళి ప్రశంసించారు. The clean visuals with an interesting storyline and notable graphics make #Sanjeevani praiseworthy. Achieving this output with restricted budget is truly commendable. Wishing the entire team all the best. https://t.co/pT3UkXthBB — rajamouli ss (@ssrajamouli) 22 May 2018 -
మరో లోకంలో విహరిస్తారు
‘‘సంజీవని’ విజువల్స్ చూశా. రెండు సంవత్సరాలుగా యంగ్ బ్యాచ్ చాలా కష్టపడి మంచి అవుట్‌పుట్ సాధించారు. టైటిల్ ‘సంజీవని’ అని పెట్టడంలోనే వీరంతా సక్సెస్ సాధించేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ అన్నారు. మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేత ముఖ్య తారలుగా రవి వీడే దర్శకత్వంలో జి.నివాస్ నిర్మించిన చిత్రం ‘సంజీవని’. శ్రవణ్ స్వరపరచిన ఈ సినిమా పాటలను విజయేంద్ర ప్రసాద్ రిలీజ్ చేశారు. రవి వీడే మాట్లాడుతూ –‘‘ఫస్ట్ టైమ్ భారత దేశంలో హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో కలిసి రెండేళ్లు కష్టపడి తెరకెక్కించిన చిత్రం ‘సంజీవని’. తెలుగులో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడి హాలీవుడ్ రేంజ్లో భారీ గ్రాఫిక్స్‌తో నిర్మించాం. మా సినిమాకి వచ్చిన ప్రేక్షకులు మరో లోకంలో విహరిస్తారని గ్యారంటీగా చెప్పగలను. జూన్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకడు కె.యం.రాధాకృష్ణ, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ మామిడి హరికృష్ణ, ఆల్ ఇండియా రేడియో సీనియర్ ఎనౌన్సర్ శ్రీలక్ష్మీ ఐనంపూడి, లక్ష్మీ పిక్చర్స్ అధినేత బాపిరాజు పాల్గొన్నారు. -
హాలీవుడ్ రేంజ్లో...
‘‘రామాయణం బేస్ చేసుకుని ఎన్ని కథలు వచ్చినా సుందరకాండ పర్వం అనేది సినీ పరిశ్రమకి కమర్షియల్ ఎలిమెంట్. సుందరకాండలోనే తెలివైన కోతులు, గాల్లో ఎగిరే రకరకాల జంతువులు, అబ్బురపరిచే యుద్ధాలు ఉంటాయి. ఇవన్నీ ప్రేక్షకుల్ని అలరించాయంటే అది తప్పకుండా హాలీవుడ్ చిత్రమే అయి ఉంటుంది. అయితే మా ‘సంజీవని’ తెలుగు సినిమాలో వీటన్నిటినీ చూపించబోతున్నాం’’ అంటున్నారు దర్శకుడు రవి వీడే. మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేత ప్రధాన పాత్రల్లో రవి వీడే దర్శకత్వంలో జి.నివాస్ నిర్మించిన ‘సంజీవని’ సినిమా వేసవిలో విడుదల కానుంది. రవి వీడే మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ హాలీవుడ్ తెరపై మాత్రమే కనిపించిన అబ్బురపరిచే దృశ్యాల్ని ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాలో చూడబోతున్నాం. హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో కలిసి ఇండియాలో రెండేళ్లు కష్టపడి ‘సంజీవని’ చిత్రం తీశాం. హాలీవుడ్ సినిమా రేంజ్లో భారీ గ్రాఫిక్స్‌తో నిర్మించిన మా చిత్రాన్ని శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా మే నెలాఖరున రిలీజ్ చేస్తున్నాం. మా సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్. -
అథ్లెట్ సంజీవని జాదవ్‌కు కాంస్యం
ఆసియా క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు కాంస్య పతకాలు లభించాయి. చైనాలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల 8 కిలోమీటర్ల రేసులో భారత అథ్లెట్ సంజీవని జాదవ్ మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రకు చెందిన 20 ఏళ్ల సంజీవని 28 నిమిషాల 19 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకం దక్కించుకుంది. టీమ్ విభాగంలో సంజీవని, స్వాతి, జుమా ఖాతున్, లలితా బబర్‌లతో కూడిన భారత బృందం కాంస్యం సాధించింది. -
పేద విద్యార్థులకు ‘సంజీవని‘ చేయూత
అనంతపురం సెంట్రల్ : పేద విద్యార్థులకు సంజీవని రక్తదాతల సంస్థ చేయూతనిచ్చింది. కలెక్టరేట్‌కు ఎదురుగా ఉన్న అనంతసాగర్ కాలనీలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పలకలు, నోట్‌బుక్స్, పెన్నులు తదితర వస్తువులను సంస్థ నిర్వాహకులు రమణారెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీకి సీసీగా పనిచేస్తున్న మురళీమోహన్ కుమారుడు నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ నాగSసరోజినిదేవీ, త్రివేణి, కానిస్టేబుల్స్ కిరణ్, సత్యనారాయణ, శివ, సాయి పాల్గొన్నారు. -
ఆ రహస్యం కోసం...
ప్రపంచంలో ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలుంటాయి. వాటికి జవాబులు అంత సులువుగా దొరకవు. కొంత మంది ఫ్రెండ్స్ ఓ రహస్యాన్ని చేధించే క్రమంలో ప్రమాదంలో పడతారు. దాన్నుంచి ఎలా బయట పడ్డారనే కథాంశంతో ఎడ్వెంచరెస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘సంజీవని’. మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, తనూజ ముఖ్యపాత్రల్లో రవి వీడె దర్శకత్వంలో జి.నివాస్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘‘రోహటాంగ్, మనాలి తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యం ఉన్న చిత్రం ఇది. ఆగస్టులో విడుదల చేయనున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్.కె, విజువల్ ఎఫెక్ట్స్: వెక్టార్ ఎఫ్ఎక్స్, యానిమేషన్ సూపర్వైజర్: దేవి. -
భిన్నమైన సంజీవని
‘‘ఈ కథతో సినిమా చేయగలరా లేదా అని చాలామంది మొదటినుంచీ సందేహాలు వ్యక్తం చేశారు. కానీ మేం డెడికేషన్‌తో ఈ సినిమాను పూర్తి చేశాం. రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే సినిమా ఇది ’’ అని దర్శకుడు రవి వీడే అన్నారు. అనురాగ్, తనూజ, మనోజ్ ప్రధాన పాత్రల్లో నివాస్ క్రియేషన్స్ పతాకంపై జి.నివాస్ నిర్మించిన ‘సంజీవని’ టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. రాజ్ కందుకూరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సంగీత దర్శకుడు శ్రవణ్ కె.కె. తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సుజీత్ పాలడుగు. -
మీరులేక.. మమ్మలి పట్టించుకోక...
అయ్యా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు. నేను మీ మానసపుత్రికను. నాకు 2008లో ‘108’ అని నామకరణం చేసింది మీరే. అత్యవసర పరిస్థితిలో ఉన్న వారు ‘108’అనే నంబర్‌కు డయల్ చేస్తే, అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ వాహనాన్ని క్షణాల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. మండలాల విస్తీర్ణం, గ్రామాలు, జనాభా తదితర ఆంశాలను పరిగణలోకి తీసుకుని అంబులెన్స్‌లను కేటాయించారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్, గ్లూకోజ్ బాటిళ్లు, ప్రథమ చికిత్స సామగ్రి, మందులు, తదితర సౌకర్యాలను సమకూర్చారు. అంబులెన్స్ వాహనాన్ని వేగంగా నడపడానికి మంచి శిక్షణ పొందిన వారిని పైలట్లుగా నియమించారు. ప్రథమ చికిత్స అందించడానికి శిక్షణ పొందిన వారిని టెక్నీషియన్లుగా నియమించారు. మీరు ఉన్నప్పుడు... మీరు బతికి ఉన్నప్పుడు 108 అంబులెన్స్‌లకు ఎలాంటి అవసరం ఉన్నా నిధులు వెంటనే కేటాయించారు. మీరు నన్ను ప్రవేశపెట్టిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్నవారు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, మరే ఇతర ప్రమాదాల్లో ఉన్నవారి పరిస్థితి విషమించక ముందే వారిని సకాలంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి బతికి బట్టకట్టేలా చేశారు. పెద్ద పెద్ద కార్లు, ఇతర వాహనాలు ఉన్నవారు వాటిని ఎలా సంరక్షించుకుంటారో మీరు మా అంబులెన్స్ వాహనాలను అలాగే చూసుకున్నారు. 108కి ఎలాంటి ఇబ్బంది, సమస్య లేకుండా కష్టం, నష్టం జరగకుండా మమ్మల్ని కన్నబిడ్డల వలే చూసుకున్నారు. మీరు చేసిన ఈ మంచి పనితో మాకు ‘సంజీవని’ అని పేరును ప్రజలు పెట్టారు. గర్భిణులు ప్రసవ వేదనతో ఉంటే వారిని సురక్షితంగా అంబులెన్స్లలోనే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. అంబులెన్స్‌లు వచ్చిన తర్వాత పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆస్పత్రులకు అద్దె వాహనాలు, అద్దె అంబులెన్స్‌లను ఉపయోగించుకునే అవసరం లేకుండా చేశారు. మీ మరణంతో మాకు కష్టాలు చాలు... అయితే మీ మరణంతో రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. మీరు ఎంతో సహృదయంతో ప్రవేశపెట్టిన వైద్య సేవలను మీ తర్వాత రోశయ్య, కిరణ్ సర్కార్లు తొక్కి పడేశాయి. అంబులెన్స్‌లకు వినియోగిస్తున్న వాహనాలు 3 లక్షల కిలోమీటర్లు దాటితే వాటిని మార్చి కొత్త వాహనాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐదేళ్ల కింద మీరు ఇచ్చిన వాహనాలే అనేకం ఉన్నాయి. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏడాదికి ఒకసారి వాహనాలను మార్చివేస్తున్నారు. మార్కెట్లో కొత్త మోడళ్లు వస్తే నిన్న, మొన్న కొన్న వాహనాలను మార్చివేసిన ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. అయితే నేను ఆపదలో ఉన్నవారిని చికిత్స అందిస్తూ తరలిస్తాను. ఆపదలో ఉన్న వారికి అండగా ఉండే నాకు సుస్తి చేస్తే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. వాహనాల లైఫ్ టైం అయిపోయినా మరమ్మతులు చేస్తూ వినియోగిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు వాహనాలను మార్చడానికి నిధులు ఉంటాయి. కాని అపర సంజీవనిగా పేరుపొందిన అంబులెన్స్‌లను మార్చడానికి ఎవరికి దయరాదు. వాహనం పాతబడటంతో మరమ్మతులు చేసినా ప్రయోజనం లేదు. మేమే బాగుంటే మహబూబ్ బతికేవాడేమో... మొన్న మోర్తాడ్ మండలం తడపాకల్ వద్ద చెట్టుపై నుంచి కిందపడిన మహబూబ్‌ను ఆస్పత్రికి తరలించడానికి నేను అక్కడికి వెళ్లాను. అయితే నా డోర్ తెరుచుకోలేదు. చాలాసేపు మా అంబులెన్స్ సిబ్బంది కష్టపడి డోర్ తెరిచారు. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించే సమయంలో మళ్లీ డోర్ ఊడిపోయింది. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించడానికి నేను చాలా కష్టపడ్డాను. కాని విధి వక్రీకరించింది. క్షతగాత్రుడిని సకాలంలో నేను ఆస్పత్రికి తీసుకువెళ్లి ఉంటే బతికి బట్టకట్టేవాడేమో? నా నిర్లక్ష్యం ఇందులో లేకపోయినా.. ప్రభుత్వం నన్ను మార్చక పోవడం మాత్రం నిజం. మీరే బతికి ఉంటే పరిస్థితి ఇలాగే ఉండేదా? మమ్మల్ని మార్చేవారు కాదా? మమ్మల్ని మార్చి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేవారు. మీరులేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అందుకే మీరు మన్నించాలని మనస్పూర్థితో కోరుకుంటూ.... ఇట్లు మీ మానసపుత్రిక ‘108’ అంబులెన్స్