చిన్న సినిమాకు రాజమౌళి సాయం | Rajamouli praises Sanjeevani Movie Team | Sakshi
Sakshi News home page

Published Tue, May 22 2018 12:04 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

Rajamouli praises Sanjeevani Movie Team - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి చిన్న సినిమాలకు తనవంతు సాయం అంధించేందుకు ఎప్పుడూ ముందుంటారు. అదే బాటలో సంజీవని సినిమా ట్రైలర్‌ను తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేశారు జక్కన్న. ఓ సాహసయాత్రకు బయలు దేరిన కొంతమంది యువత ఎలాంటి పరిస్థితులును ఎదుర్కొన్నారు అన్నదే ఈ సినిమా కథ. గ్రాఫిక్స్‌ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాకు రవి వీడే దర్శకత్వం వహించారు.

అనురాగ్‌ దేవ్‌, మనోజ్‌ చంద్ర, తనూజ నాయుడు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను నివాస్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై జీ శ్రీనివాన్‌ నిర్మిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌ లో ఈ స్థాయి గ్రాఫిక్స్‌ తో సినిమాను తెరకెక్కించిన చిత్రయూనిట్‌ను రాజమౌళి ప్రశంసించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement