SS Rajamouli Tweet Over RRR Movie Trailer Huge Response - Sakshi
Sakshi News home page

SS Rajamouli- RRR Trailer: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ రెస్పాన్స్.. ట్వీట్‌ రూపంలో రాజమౌళి మనసులో మాట!

Published Fri, Dec 10 2021 7:12 PM | Last Updated on Fri, Dec 10 2021 8:22 PM

Ss Rajamouli Tweet Over Rrr Trailer Huge Response - Sakshi

దర్శకుధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ చిత్రం పేరుకే పాన్‌ ఇండియా చిత్రమైన జక్కన్న మేకింగ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ యాక్టింగ్‌... ఈ చిత్రానికి గ్లోబల్‌ వైడ్‌ గుర్తింపునే తీసుకొచ్చింది. షూటింగ్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్‌తో ఆర్‌ఆర్‌ఆర్‌ టీం కూడా బీజీ బిజీగా గుడుపుతోంది. అందులో భాగంగానే ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ట్రైలర్‌లో.. జక్కన్న మార్క్‌ డైరక్షన్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటన, కీరవాణీ మ్యూజిక్‌.. ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. ఇప్పటికే నెట్టింట ఈ ట్రైలర్‌ రికార్డ్‌లను బద్దలు కొట్టుకుంటూ వెళ్తోంది. దీంతో జక్కన్న ట్రైలర్‌కి వస్తున్న రెస్మాన్స్‌కి చూసి ఓ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఎక్కడ చూసిన ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ మానియానే కనిపిస్తోంది. అయితే ట్రైల‌ర్‌కి న‌లుమూల‌ల నుండి వ‌స్తున్న రెస్పాన్స్ చూసి రాజ‌మౌళి ఉబ్బిత‌బ్బిబ‌వుతున్నారు.

ఇన్నాళ్లు ప‌డ్డ క‌ష్టాన్ని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర యూనిటల్‌ మరిచిపోతోంది. తాజాగా ఆయ‌న త‌న ట్వీటర్‌ ద్వారా స్పందిస్తూ.. ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ కి అన్ని చోట్ల‌ నుంచి వస్తున్న రెస్పాన్స్ పట్ల మాటలు రావడం లేదు. ఇంకేమి చెప్పలేను, మా టీమ్ అంతా చాలా ఆనందంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి అలియా భట్, హాలీవుడ్‌ తార ఒలివియా మోరిస్‌లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

చదవండి: Jr NTR: ఆయన లేకపోతే అంతా జీరోలా అనిపిస్తోందంటూ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement