గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ | Tollywood Top Director Chief Guest as Ram Charan Game Changer Trailer release | Sakshi
Sakshi News home page

Game Changer Movie: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. ట్రైలర్ డేట్, టైమ్ ఫిక్స్

Published Wed, Jan 1 2025 8:01 PM | Last Updated on Wed, Jan 1 2025 8:03 PM

Tollywood Top Director Chief Guest as Ram Charan Game Changer Trailer release

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ  ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలకు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ డేట్‌, ముహుర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ట్రైలర్‌ జనవరి 1న విడుదల చేస్తామని ఇటీవల విజయవాడలో దిల్‌ రాజు ప్రకటించారు. కానీ ఒక రోజు ఆలస్యంగా రెండో తేదీకి మారింది. హైదరాబాద్‌లోనే గేమ్ ఛేంజర్ ‍ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నారు. అయితే మెగా ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌లో దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆయన చేతుల మీదుగానే గేమ్ ఛేంజర్‌ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. గురువారం సాయంత్రం 05:04 గంటలకు గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ విడుదల కానుంది.

(ఇది చదవండి: గేమ్ ఛేంజర్‌ కటౌట్‌ వరల్డ్ రికార్డ్‌.. ట్రైలర్‌ డేట్‌ ప్రకటించిన దిల్‌ రాజు)

256 అడుగుల రామ్ చరణ్ కటౌట్..

ఇటీవల ఏపీలో రామ్ చరణ్ భారీ కటౌట్‌ను ఫ్యాన్స్‌ ఏర్పాటు చేశారు. విజయవాడలో దాదాపు 256 అడుగులతో ఏర్పాటు చేసిన కటౌట్‌ను నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. ఈ భారీ కటౌట్‌కు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఈ సందర్భంగా దిల్‌ రాజుకు అవార్డ్‌ను అందజేశారు. కాగా.. రామ్‌ చరణ్‌ యువశక్తి ఆధ్వర్యంలో బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో ఈ కటౌట్‌ను సిద్ధం చేశారు. ఈ భారీ కటౌట్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కింది.

కాగా.. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా ‍‍అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలో కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement