
RRR Movie Trailer All Time Records in Youtube: దర్శకు ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రూపొందుస్తున్న ఈమూవీ ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రోడక్షన్ పునులతో పాటు మూవీ ప్రమోషన్స్‌తో ఆర్‌ఆర్‌ఆర్ టీం బీజీగా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న(డిసెంబర్ 9) ట్రైలర్‌ను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయగా సోషల్ మీడియాలో దీనికి విశేష స్పందన వస్తోంది.
చదవండి: బిగ్‌బాస్‌పై యాంకర్ రవి తల్లి షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ మానియానే కనిపిస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతోట్రైలర్ ఆద్యంతం అదరహో అనేలా ట్రైలర్‌ను మలిచారు. దీంతో ఈ ట్రైలర్ సామాన్యులే కాదు సెలబ్రెటీలను సైతం వీపరితంగా ఆకట్టుకుంటోంది. దీనిపై సెలబ్రెటీలంతా తమ స్పందనను తెలుపుతున్నారు. ఇక యూట్యూబ్ అయితే ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది.
చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్’ ట్రైలర్‌పై ఆసక్తిగా స్పందించిన మహేశ్ బాబు
గురువారం విడుదల చేసిన ఈ ట్రైలర్‌కు 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 55 పైగా మిలియన్ల వ్యూస్ 2.576 మిలియన్ల లైకులతో రికార్డు బ్రేక్ చేసింది. ఇక భాషల పరంగా చూస్తే తెలుగులో ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్‌కు 21.45 మిలిన్ల వ్యూస్ రాగా.. 1.243 మిలియన్ల లైక్స్ వచ్చాయి. హిందీలో.. 23 పైగా మిలియన్ల వ్యూస్, 805 వేల వ్యూస్; తమిళం: 3.3 మిలియన్ల వ్యూస్, 206 వేల లైక్స్; కన్నడ: 5.5మిలియన్ల వ్యూస్, 141వేల లైక్స్; మలయాళం: 2.5 మిలియన్ల వ్యూస్, 180 వేల లైక్స్ వచ్చాయి. ఇప్పటికీ వాటి సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment