ట్రైలర్‌ విడుదలపై క్లారిటీ ఇచ్చిన జక్కన్న, విడుదల తేదీ ప్రకటన | SS Rajamouli Announced RRR Movie Trailer Releasing On December 9th | Sakshi
Sakshi News home page

RRR Movie: ట్రైలర్‌ విడుదలపై క్లారిటీ ఇచ్చిన జక్కన్న

Published Sat, Dec 4 2021 6:49 PM | Last Updated on Sat, Dec 4 2021 6:49 PM

SS Rajamouli Announced RRR Movie Trailer Releasing On December 9th - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలో దర్శక ధీరుడు తెరక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రుధిరం రణం)’. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదలకు సిద్దమౌవోతోంది. ఈ క్రమంలో పొస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో పాటు ప్రమోషన్‌ కార్యక్రమాలతో మూవీ టీం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 3న ట్రైలర్‌ విడుదల కావల్సిన ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

ఇక ట్రైలర్‌ విడుదల ఎప్పుడనేది క్లారిటీ లేక ఫ్యాన్స్‌ అంతా నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో నేడు(డిసెంబర్‌ 4) ట్రైలర్‌ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చాడు జక్కన. ఆయన ట్వీట్‌ చేస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ను డిసెంబర్‌ 9న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. కాగా ఈ మూవీలో బాలీవుడ్‌ భామ అలియా భట్‌, ఇంగ్లీష్‌ బ్యూటీ ఒలివియా కథానాయికలు కాగా.. బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ అజయ్‌ దేవగన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ గ్లింప్స్‌ విడుదల కాగా దీనికి సోషల్‌ మీడియాలో విశేష స్పందన లభించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement