SS Rajamouli Announced RRR Movie Trailer Release Date - Sakshi
Sakshi News home page

RRR Movie: బిగ్‌ బ్లాస్ట్‌...ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Mon, Nov 29 2021 6:12 PM | Last Updated on Mon, Nov 29 2021 6:19 PM

SS Rajamouli Announced RRR Movie Trailer Release Date - Sakshi

RRR Movie Trailer Release Date Announced: దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌'. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌లు హీరోలుగా నటించిన ఈ మూవీ జనవరి7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్‌3న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటిస్తారు. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ప్రమోషన్స్‌ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. కాగా ఈ సినిమాలో  అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా తారక్‌ కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ భామా.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement