మనోజ్ చంద్ర, శ్వేత
‘‘రామాయణం బేస్ చేసుకుని ఎన్ని కథలు వచ్చినా సుందరకాండ పర్వం అనేది సినీ పరిశ్రమకి కమర్షియల్ ఎలిమెంట్. సుందరకాండలోనే తెలివైన కోతులు, గాల్లో ఎగిరే రకరకాల జంతువులు, అబ్బురపరిచే యుద్ధాలు ఉంటాయి. ఇవన్నీ ప్రేక్షకుల్ని అలరించాయంటే అది తప్పకుండా హాలీవుడ్ చిత్రమే అయి ఉంటుంది. అయితే మా ‘సంజీవని’ తెలుగు సినిమాలో వీటన్నిటినీ చూపించబోతున్నాం’’ అంటున్నారు దర్శకుడు రవి వీడే.
మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేత ప్రధాన పాత్రల్లో రవి వీడే దర్శకత్వంలో జి.నివాస్ నిర్మించిన ‘సంజీవని’ సినిమా వేసవిలో విడుదల కానుంది. రవి వీడే మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ హాలీవుడ్ తెరపై మాత్రమే కనిపించిన అబ్బురపరిచే దృశ్యాల్ని ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాలో చూడబోతున్నాం. హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో కలిసి ఇండియాలో రెండేళ్లు కష్టపడి ‘సంజీవని’ చిత్రం తీశాం. హాలీవుడ్ సినిమా రేంజ్‌లో భారీ గ్రాఫిక్స్‌తో నిర్మించిన మా చిత్రాన్ని శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా మే నెలాఖరున రిలీజ్ చేస్తున్నాం. మా సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్.
Comments
Please login to add a commentAdd a comment