Shweta
-
గేలి చేసినచోటే గెలిచి చూపిద్దాం!
ఆనందం ఎక్కడ ఉంటుందో ఆత్మస్థైర్యం అక్కడ ఉంటుంది. ఆత్మస్థైర్యం కొలువైన చోట అనేక ద్వారాలు తెరుచుకుంటాయి. విజయానికి సింహద్వారాన్ని చూపిస్తాయి.శారీరక మార్పుల వల్ల లింగమార్పిడికి ముందు, లింగ మార్పిడి తరువాత ఎన్నో అవహేళనలు ఎదుర్కొంది శ్వేతాసుధాకర్. అవమానాలు, కష్టాలలో ఆమె జపించిన మంత్రం... ‘జీవితం ఒక్కటే. బార్న్ 2 విన్. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక కార్యకర్త, రచయిత, మోటివేషనల్ స్పీకర్‌గా ఎంతోమంది ట్రాన్స్జెండర్ల జీవితాలలో వెలుగులు నింపుతోంది చెన్నైకి చెందిన శ్వేతా సుధాకర్.వెయ్యి ఏనుగుల బలంతో రోజు మొదలు కావాలి అంటారు. ఆ మాట విషయం ఎలా ఉన్నా శ్వేతకు రోజు మొదలైందంటే దిగులుగా ఉండేది. ‘ఈరోజు ఎన్ని అవమానాలు పడాలో!’ అనుకునేది. చెన్నైలో పుట్టిన శ్వేత సుధాకర్లోని శారీరక మార్పులు చూసి ‘నీ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉందేమిటి... అలా మాట్లాడుతున్నావేమిటీ’... ఇలా రకరకాలుగా వెక్కిరించేవారు. శారీరకంగా వచ్చిన మార్పులతో కుటుంబాన్ని వదిలి లింగమార్పిడితో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది శ్వేత. ‘చదువును నమ్ముకున్నవారు ఎప్పుడూ జీవితంలో ఓడిపోరు’ తాను విన్న మాట ఆ రోజు పదే పదే గుర్తు వచ్చింది. ఇక అప్పటినుంచి చదువు తన నేస్తం అయింది. ఆత్మీయత పంచే కుటుంబం అయింది. ధైర్యం ఇచ్చే గురువు అయింది. మద్రాస్ యూనివర్సిటీలో ఎం.ఏ. సోషియాలజీ చేసిన శ్వేతాసుధాకర్ ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలనుకోలేదు. ఒక ఉద్యమంలా తనలాంటి వారి కోసం విస్తరించాలనుకుంది. ‘బార్న్ 2 విన్’ అనే స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం చుట్టింది. అయితే చెన్నైలో సంస్థ కార్యాలయం కోసం గదిని అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఒక మానవతావాది సహాయంతో చెన్నైలోని సైదాపేటలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయగలిగింది శ్వేత. (క్రేజీ.. డీజే..)గురుకులం...ఇప్పుడు ఈ కార్యాలయం వందలాది మంది ట్రాన్స్జెండర్లకు రణక్షేత్రం. ‘ఇదిగో... జీవితంలో ఎదురయ్యే సమస్యలతో ఇలా యుద్ధం చేయాలి’ అని నేర్పుతుంది. ‘చింతవద్దు. నువ్వు బతికేమార్గాలు ఎన్నో ఉన్నాయి’ అంటూ ఉపాధి విద్యలను నేర్పే గురుకులం అవుతోంది. లింగమార్పిడి చేసుకున్న వారి హక్కుల కోసం తన గళాన్ని వినిపించడంతో పాటు విద్య, ఉపాధి, లైఫ్‌స్కిల్స్... మొదలైన వాటిలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, టైలరింగ్, కాస్మోటాలజీ, ఫ్యాషన్ డిజైన్కోర్సులతో ఎవరికి వారు తమ సొంత కాళ్లపై నిలబడే విధంగా తీర్చిదిద్దుతుంది శ్వేతా సుధాకర్.ట్రాన్స్ అచీవర్స్ అవార్డ్తమిళనాడుకే పరిమితం కాకుండా దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు విస్తరించింది బార్న్ 2 విన్. శ్రీలంక నుంచి మొదలు యూరప్‌లోని ఎన్నో దేశాల వరకు వివిధ రంగాలలో రాణిస్తున్న ట్రాన్స్జెండర్లను గత పదకొండు సంవత్సరాలుగా ‘ట్రాన్స్ అచీవర్స్’ అవార్డులతో సత్కరిస్తోంది శ్వేత. తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం లాంటి భాషలను అనర్గళంగా మాట్లాడుతూ ‘శ్వేతా టాక్ షో’ పేరుతో ట్రాన్స్ మీడియా యూ ట్యూబ్‌ను నిర్వహిస్తోంది. ‘మిస్ తమిళనాడు ట్రాన్స్ క్వీన్ ప్రొగ్రామ్‌ను గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. ‘బార్న్ 2 విన్ అనేది సంస్థ కాదు. మా కుటుంబం. అది నాకు ఇచ్చిన ధైర్యం ఇంతా అంతా కాదు’ అంటుంది సుప్రియ. నిజానికి ఇది ఆమె మాటే కాదు ‘బార్న్ 2 విన్’ ద్వారా గెలుపు పాఠాలు నేర్చుకున్న ఎందరో విజేతల మాట.మన కోసం మనంకుటుంబాన్ని వదిలి నేను ఎన్నో బాధలు పడ్డాను. ఆ ఒంటరి రోజులలో పుస్తకాలు నా కుటుంబసభ్యులు అయ్యాయి. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఇప్పుడు అదే చదువు ద్వారా ఎంతోమందికి ధైర్యం వచ్చేలా చేస్తున్నాను. ‘నా కోసం ఏదీ లేదు. నా కోసం ఎవరూ లేరు’ అని ఎప్పుడూ అనుకోవద్దు. ఈ విశాల ప్రపంచంలో మన కోసం ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని వెదుక్కోగలగాలి. వాటిని వెదకాలంటే బలం కావాలి. ఆ బలం జీవనోత్సాహం నుంచి వస్తుంది. అందుకే నిరాశానిస్పృహలకు దూరంగా ఉంటూ ఎప్పుడూ సంతోషంగా ఉండేలా ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు ‘బార్న్ 2 విన్’ రూపంలో నాకంటూ ఒక కుటుంబం ఉంది. సామాజిక, రాజకీయ రంగాలలో గుర్తింపు దొరికింది.– శ్వేతా సుధాకర్, బార్న్ 2 విన్–ఫౌండర్అక్షర బలంశ్వేతా సుధాకర్ మంచి వక్త మాత్రమే కాదు రచయిత్రి కూడా. నిండైన భావుకత, చక్కని శైలి ఆమె అక్షరబలం. ‘నన్గై స్వేతాసీ’ పేరుతో హిజ్రాల జీవితాలపై ‘ఇయర్కై ఎలిదియ ఎలుత్తు పిలయ్(ప్రకృతి రాసిన అక్షర దోషం)’, కూందలుం... మీసయుం (శిరోజాలు..మీసాలు), వానం పాత్త తారగయే (ఆకాశం చూసిన తార), తర్కొలై దాహంగల్ (ఆత్మహత్యా దాహం), కల్యాణ కనువుగల్ (పెళ్లి కలలు)... మొదలైన పుస్తకాలను తన ‘నన్గై పబ్లికేషన్స్’ ద్వారా ప్రచురించింది.– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై -
సంచలనం కోసమే ఎంపీపై హత్యాయత్నం
సిద్దిపేటకమాన్: సంచలనం సృష్టించడం కోసమే దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు నిందితుడు తమ ప్రాథమిక విచారణలో అంగీకరించాడని సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత బుధవారం తెలిపారు. ఎంపీపై దాడి ఘటనకు సంబంధించి గ్రామానికి చెందిన నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీపీ తెలిపారు. నిందితుడు వివిధ ఆన్లైన్ చానళ్లలో పనిచేస్తున్నట్లు తెలిసిందని, విలేకరిని అని చెప్పుకుంటూ బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసే వాడన్నారు. ఎంపీపై దాడి చేయాలనే ఉద్దేశంతో వారం రోజుల క్రితం దుబ్బాక మార్కెట్ లో నిందితుడు కత్తిని కొనుగోలు చేశాడన్నారు. ఎంపీ ఏయే గ్రామా ల్లో ప్రచారం చేస్తున్నారనే విషయమై సోషల్ మీడియా ద్వారా సోమవారం సూరంపల్లి గ్రామానికి వస్తున్న ట్లు తెలుసుకున్నాడని చెప్పారు. ఈ క్రమంలో దాడికి పాల్పడినట్లు తెలిపారు. నిందితుడు దాడి చేయడానికి ఎవరైనా ప్రోత్సహించారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా?.. అనే కోణాల్లో విచార ణ జరిపి వివరాలు వెల్లడిస్తామన్నా రు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జి కావడంతో నిందితుడిని అదుపులోకి తీసు కున్నామని, బుధవారం అరెస్ట్ చేసి గజ్వేల్ కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
శ్వేతా నువ్వు లేక ఉండలేకపోతున్నా.. ఈ జీవితం వ్యర్థం
షాద్‌నగర్: ‘మూడు రోజులు అవుతుంది.. శ్వేతా నువ్వు లేక ఉండలేకపోతున్నా.. నువ్వు లేని జీవితం వ్యర్థం.. ఇక చనిపోతున్నా’ అంటూ ఓ భర్త సెల్ఫీ వీడియో తీసుకుంటూ అన్నంలో గుళికల మందు కలుపుకొని తిని బలవన్మరణానికి పాల్పడాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కొండన్నగూడలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కొండన్నగూడ గ్రామానికి చెందిన కందనోళ్ల రాజేష్ (35)కు అదే గ్రామానికి చెందిన శ్వేతతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కొంతకాలంగా షాద్‌నగర్‌లోని రాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. రాజేష్ డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవ జరిగింది. ఈ క్రమంలోనే భార్య శ్వేత పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో.. భార్య తిరిగి రావడం లేదన్న మనస్తాపంతో రాజేష్ శుక్రవారం రాత్రి గుళికల మందు ప్యాకెట్ తీసుకొని కొండన్నగూడ గ్రామ శివారులోని తమ పొలానికి వెళ్లాడు. ‘నీతో గొడవ పడినా అర్ధరాత్రి వచ్చి అయినా నీతో మాట్లాడేవాడిని.. మూడు రోజుల నుంచి ఒంటరిగా ఉన్నా.. ఒంటరిగానే తిరుగుతున్నా.. నా కన్నతల్లికంటే నీవే ఎక్కువ కదా.. నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయావు.. నీవు లేని జీవితం వ్యర్థం.. ఇక చనిపోతున్నా.. నా భార్య నా వల్ల ఇబ్బందులు పడింది.. ఆమెపై కేసులు పెట్టొద్దు.. నా చావుకు నేనే కారణం..’ అంటూ చివరిసారిగా సెల్ఫీ వీడియో తీసుకొన్నాడు. తండ్రి నారాయణగౌడ్ సమాధి వద్ద అన్నంలో గుళికల మందు కలుపుకొని తిని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం అటువైపు వెళ్లిన స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని భోరున విలపించారు. సీఐ ప్రతాప్‌లింగం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శ్వేత మృతి కేసులో కీలక మలుపు..
సాక్షి, విశాఖపట్నం: వివాహిత శ్వేత మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్వేత అనుమానాస్పద మృతిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో శ్వేత పేరెంట్స్ ఆరోపణల మేరకు, సూసైడ్ లెటర్ ఆధారంగా ఆమె.. భర్త, అత్త, మామ, ఆడపడుచు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో వారిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇక, పోలీసులు.. శ్వేత ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. మరోవైపు.. శ్వేత కేసులో పోస్టుమారం రిపోర్టు కీలకంగా మారనుంది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో మరో ఊహించని మలుపు చోటుచేసుకుంది. శ్వేతను ఆమె భర్త మణికంఠ, అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తే, మణికంఠ సోదరి భర్త సత్యం లైంగిక వేధింపులకు గురి చేసినట్లు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆమె తల్లి రమ ఫిర్యాదు చేశారు. ఒకటి రెండు సార్లు శ్వేతను ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మణికంఠ సోదరి భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అత్త, ఆడపడుచులపై వరకట్న వేధింపుల కేసు కట్టి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్వేత మృతదేహాన్ని ఆమె తల్లి, బంధువులకు అప్పగించగా.. కాన్వెంట్ కూడలి సమీపంలోని చావులమదుం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు.. శ్వేత మృతదేహం లభ్యమైన ప్రాంతంలో కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసింది. ఈ కేసులో పోస్టుమార్టం నివేదికతో పాటు ఆమె సెల్‌ఫోన్ కీలకంగా మారింది. ప్రస్తుతం ఆమె కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇలా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వీడియో: ర్యాపిడో బైకర్ వికృత క్రీడ.. మహిళకు చేదు అనుభవం -
సుశాంత్‌ది హత్యే!.. ఇప్పటికైనా న్యాయం చేయండి : సుశాంత్ సోదరి ఆవేదన
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి రెండేళ్లు దాటినా, అతడి మృతికి గల కారణాలు ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక సుశాంత్‌ది ఆత్మహత్య కాదు, హత్యేనంటూ పోస్టుమార్టం చేసిన బృందంలోని రూప్‌కుమార్ షా అనే వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. సుశాంత్ బాడీపై పలు గాయాలు ఉన్నాయని పేర్కొన్న రూప్‌కుమార్.. పోస్టుమార్టం జరిగేటప్పుడు వీడియో రికార్డు చేయకుండా కేవలం ఫోటోలు మాత్రమే తీశారని, పైఅధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు త్వరగా పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేశామని వెల్లడించారు. దీంతో సుశాంత్ మరణంపై మరోసారి అనుమానాలు రేకెత్తుతున్నాయి. తాజాగా ఇదే విషయమై ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ సుశాంత్ సోదరి ట్వీట్ చేసింది. రూప్‌కుమార్ చేసిన వ్యాఖ్యలను స్క్రీన్‌షాట్స్‌లో జోడించి.. సుశాంత్ కేసును సీబీఐ విచారణ జరిపి నిజనిజాలు ఏంటో బయటకు వెల్లడిస్తారని ఎప్పటినుంచో మేం ఎదురుచూస్తున్నాము. సుశాంత్‌కు న్యాయం జరగాలి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కాగా 2020 జూన్14న ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్‌లో సుశాంత్ మరణించిన సంగతి తెలిసిందే. If there is an ounce of truth to this evidence, we urge CBI to really look into it diligently. We have always believed that you guys will do a fair investigation and let us know the truth. Our heart aches to find no closure as yet. 🙏 CBI Make SSRCase TimeBound pic.twitter.com/g58mj2F37q — Shweta Singh Kirti (@shwetasinghkirt) December 26, 2022 We have to make sure safety of RoopKumar Shah is insured. 🙏 CBI Make SSRCase TimeBound @narendramodi @AmitShah #SushantSinghRajput https://t.co/suY8sCuwrU — Shweta Singh Kirti (@shwetasinghkirt) December 26, 2022 -
Goa: కొబ్బరి కల్లు గీసే శ్వేత.. ఏడాదికి మూడున్నర లక్షల ఆదాయం!
గోవాలో లక్షలాది కొబ్బరి చెట్లు ఉన్నాయి. కాని కొబ్బరి కల్లు గీసే కార్మికులు 200 మించి లేరు. ఇతర దేశీయ మత్తు పానీయాలను తయారు చేసుకునే గోవా ప్రజలు కొబ్బరి కల్లును ఇప్పుడు లాభసాటిగా చూస్తున్నారు. అందుకు కారణం శ్వేత. 24 ఏళ్ల ఈ అమ్మాయి గోవాలో ఏకైక కొబ్బరి కల్లు గీత కార్మికురాలు. ఒక కొబ్బరి ఫామ్‌కు మేనేజర్‌గా పని చేస్తూ కొబ్బరి కల్లు గీస్తూ ఆదాయ మార్గాలు సృష్టించి వార్తల్లోకి ఎక్కింది. శ్వేతా గోయంకర్ ఇప్పుడు గోవా కల్లు ఉత్పత్తిని ప్రభావితం చేసి కొన్ని వందల జీవితాల్లో ఉపాధి తేనుంది. ఇంత వరకూ నిర్లక్ష్యం వహిస్తూ వచ్చిన ఒక ప్రధాన ఆదాయ వనరు శ్వేతా వల్ల మబ్బు తొలిగి వెలుతురులోకి వచ్చింది. అంతా రాసి పెట్టినట్టు జరిగింది అంటామే అలాగే జరిగింది. బీటెక్ బదులుగా వ్యవసాయ కోర్సు శ్వేతా గోయంకర్ బీటెక్ చేద్దామనుకుని కోచింగ్ మొదలెట్టింది. కాని ఎందుకో ఆమెకు బి.ఏ అగ్రికల్చర్ కోర్సు చేయాలనిపించింది. సాధారణంగా గోవాలో ఈ కోర్సు చేసేవాళ్లు తక్కువ. కోర్సు పూర్తయ్యాక శ్వేతా బెంగళూరులో ఒక సంస్థలో ఉద్యోగానికి వెళ్లింది. అక్కడ టిష్యూ కల్చర్ గురించి పరిశోధన. ఒక సీడ్ నుంచి వేలాది సీడ్లను ఎలా ఉద్భవించేలా చేయవచ్చో శ్వేతా పరిశోధన చేస్తుంటే హటాత్తుగా లాక్డౌన్ వచ్చి ఉద్యోగం పోయింది. శ్వేత గోవాకు తిరిగి వచ్చి ఒక కొబ్బరితోటలో మేనేజర్ ఉద్యోగానికి కుదిరింది. సరదా ప్రయత్నం లాక్ డౌన్ కాలంలో తోట వ్యవహారాలు చూస్తున్న శ్వేతకు ఒకరోజు కొబ్బరి చెట్టు ఎక్కాలనిపించింది. ఎక్కింది. భయం వేయలేదు. చిటారుకు వెళ్లాక ఆమెకు కొబ్బరి కల్లు తీయడం గుర్తుకొచ్చింది. చదువులో భాగంగా ఆ పని తెలిసిన శ్వేత మరుసటి రోజు కొబ్బరి కల్లు గీత మొదలెట్టింది. తను పని చేస్తున్న తోటలో కల్లు గీయడం ప్రారంభించే సరికి చుట్టుపక్కల వారికి తెలిసి చూడటానికి రావడం మొదలెట్టారు. తాటి కల్లు, ఈత కల్లులాగే కొబ్బరి కల్లు కూడా దేశీయ పానీయం. అందుబాటులో లేక గాని తాగే వారి సంఖ్య తక్కువేం కాదు గోవాలో. ఇప్పుడు శ్వేత వల్ల కొబ్బరి కల్లు పట్ల కుతూహలం మొదలయ్యింది. 200 మంది మాత్రమే గోవాలో కొబ్బరి చెట్లు లక్షల్లో ఉంటే కొబ్బరి కల్లు గీసే కార్మికుల సంఖ్య కేవలం 200 ఉంది. ప్రభుత్వం, ఉద్యానవన శాఖలు ఈ విషయంలో ఏమీ చేయలేక చేతులు ఎత్తేశాయి. కారణం చెట్టెక్కడంలో ఉన్న రిస్కు, ఆదాయం అంతంత మాత్రమే ఉండటం. ‘కాని కొబ్బరి కల్లు మీద సంవత్సరానికి ఎంత లేదన్నా ఒక్కో మనిషి మూడున్నర లక్షల ఆదాయం గడించవచ్చు’ అని శ్వేత అందరికీ తెలియచేసింది. కేరళ నుంచి తెప్పించిన పరికరంతో సులభంగా చెట్టు ఎక్కి కాయను దించడమే కాదు, కల్లు ఎలా గీయవచ్చో శ్వేత ట్రైనింగ్ ఇస్తోంది. ఇటీవలే 60 మంది కొబ్బరి రైతులకు ఆమె కల్లు గీయడం నేర్పించింది. ఈ విషయమై అందరూ శ్వేతను విపరీతంగా మెచ్చుకుంటున్నారు. కల్లు గీస్తున్న ఏకైక గోవా అమ్మాయి శ్వేత. ఈ సంఖ్య పెరగాలని అందరూ ఈ ఉపాధిని పొందాలని కోరుకుంటోంది శ్వేత. చదవండి: Jhansi Reddy: మనలోని సమర్థతకు మనమే కేరాఫ్ అడ్రస్.. -
#Shweta.. ఇప్పుడంతా ఇదే ట్రెండ్ గురూ!
సోషల్ మీడియాపై లుక్కేస్తే గురువారం అంతా ఓ పేరుతో కూడిన హ్యష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఎవరనుకొని వెంటనే ట్విటర్ పిట్టలో వెతికితే మీరు గుర్తు పట్టలేకపోవచ్చు ఎందుకంటే ఆ పేరు ఏ ప్రముఖ హీరోదో లేక రాజకీయ వేత్తదో, క్రికెటరో అనుకుంటే పప్పులో కాలేసినట్లో.. ఆమె ఎవరికి పరిచయం లేని శ్వేతా అనే అమ్మాయి. అవును.. ప్రస్తుతం #Shweta ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది. ఏ విషయం గురించి మాట్లాడిన ముందు ఈ హ్యష్‌ట్యాగ్ తగిలించే మ్యాటర్ చెబుతున్నారు నెటిజన్లు. ఇంతకీ అసలు ఎందుకు శ్వేతా ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.? ఆ పేరు వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా.. అసలు దీని సంగతేంటి ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ హ్యాష్‌ట్యాగ్ మీద క్లిక్ చేస్తే ఓ ఆడియో క్లిప్ వైరల్ అయినట్లు దర్శనమిస్తుంది. 111 మంది ఉన్న జూమ్‌లో ఆన్లైన్ క్లాస్ జరుగుతున్నప్పుడు శ్వేతా అనే అమ్మాయి తన ఫ్రెండ్‌తో జరిగిన సంభాషణలను స్నేహితులకు పూస గుచ్చినట్లు వివరిస్తూ ఉంటుంది. అయితే పాపం శ్వేతా అనుకోకుండా తన మైక్రోఫోన్‌ను మ్యూట్ చేయడం మరిచిపోయి.. దానికి బదులుగా స్పీకర్‌ను మ్యూట్ చేసినట్లు ఈ ఆడియో క్లిప్‌లో వినిపిస్తుంది. దీంతో ఇంటి గుట్టు బజారులో పెట్టినట్లు ఆమె తన ఫ్రెండ్ సీక్రెట్స్ అన్ని క్లాస్ మొత్తానికి చెప్పేస్తుంది. శ్వేతా ఈ వీడియోలో తన స్నేహితుడు తన రహస్యాలన్నింటినీ ఎలా పంచుకున్నాడో వివరంగా చెబుతుంది. లైంగిక వాంఛ కలిగిన తన గర్ల్ ఫ్రెండ్‌ను ఎన్నిసార్లు ఔటింగ్‌కు తీసుకెళ్ళాడో చెప్పాడని.. అతను ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తున్నాడని.. ఆ అమ్మాయి మాత్రం అతడిని ఉపయోగించుకుంటోందని శ్వేతా అంటుంది. ” నాకు కూడా తెలియదు. అతను ఆమెను చాలా పిచ్చిగా ప్రేమిస్తున్నాడు, అయితే ఆమె ఓ సెక్స్ బానిస… అతడు ఎట్రాక్షన్ వల్ల ఆమెకు ఆకర్షితుడయ్యాడు. సెక్స్ కూడా చేశాడు.” అని శ్వేతా తెలుపుతుంది. ఓ వైపు శ్వేతా చెబుతుంటే ఆన్లైన్ జూమ్ క్లాసులో ఉన్న మిగతా క్లాస్మేట్స్ ఈ అంశంపై శ్వేతాని ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమెకు వినబడదు. ఎందుకంటే ఆమె తన స్పీకర్ ఆఫ్ చేసి ఉంటుంది. ఇక ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు వరుస మీమ్స్‌తో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. దీనితో శ్వేతా ఓవర్‌నైట్‌లోనే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. మరి ఆ మీమ్స్‌పై మీరు కూడా ఓ కన్నేయండి. చదవండి: మలాలను చంపేస్తాం.. సంచలన హెచ్చరిక! 111 participants on the zoom call listening to #Shweta pic.twitter.com/mLj1qH6XAt — thegauravsharma (@Gaurav_3129) February 18, 2021 111 participants on the zoom call listening to #Shweta pic.twitter.com/mLj1qH6XAt — thegauravsharma (@Gaurav_3129) February 18, 2021 111 participants on the zoom call listening to #Shweta pic.twitter.com/mLj1qH6XAt — thegauravsharma (@Gaurav_3129) February 18, 2021 Just because of one #Shweta now all boys will feel unsecure while sharing their feelings to a girl bestie. pic.twitter.com/SJwRXKFQnh — saurabh sagar (@s11saurabh) February 18, 2021 #Shweta when asked to keep something secret. pic.twitter.com/dh6KXgEwuJ — Billi'Am Shakespeare (@Billiam_Shake) February 18, 2021 #Shweta discussing about a sex addicted girl pic.twitter.com/7VlQC8W7bU — Varsha saandilyae (@saandilyae) February 18, 2021 After watching #Shweta on twitter trending Me to YouTube: pic.twitter.com/XzdhM7DX67 — Middle Class Boi (@Navodayavala) February 18, 2021 -
‘నేను స్త్రీలోలుడిని అని భయపడింది’
ముంబై: ‘‘మా అమ్మ చొరవ తీసుకున్నందు వల్లే శ్వేత నాతో మాట్లాడింది. నాతో కలిసి భోజనం చేసింది. మొదట్లో నన్ను అపార్థం చేసుకున్నా.. ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకుంది. నాతో జీవితం పంచుకోవడానికి ఓకే చెప్పినందుకు తనకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటా’’ అంటూ కాబోయే భార్యపై ప్రేమను చాటుకున్నాడు ఆదిత్య నారాయణ్. ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడిగానే గాకుండా నటుడు, సింగర్, హోస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు ఆదిత్య. మొదటి సినిమా షాపిత్ షూటింగ్ సమయంలో సహనటి శ్వేత అగర్వాల్‌తో ప్రేమలో పడిన అతడు, త్వరలోనే ఆమెను పెళ్లాడబోతున్నాడు. ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరులో తమ వివాహం జరుగబోతున్నట్లు ఆదిత్య ఇటీవల స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇరు వర్గాల పెద్దల అంగీకారంతోనే తాము వైవాహిక బంధంలో అడుగుపెట్టబోతున్నట్లు పేర్కొన్నాడు.(చదవండి: ఈ ఏడాది చివర్లో శ్వేతతో నా పెళ్లి: నటుడు) ఈ నేపథ్యంలో ప్రేమ ప్రయాణంలో జరిగిన సంఘటనల గురించి ఆదిత్య మాట్లాడుతూ.. ‘‘ నిజానికి దాన్ని ఫస్ట్‌డేట్ అనాలో వద్దో కూడా తెలియదు. షాపిత్ సెట్లో శ్వేతతో మాట కలిపాను. ఆ తర్వాత నాతో పాటు లంచ్‌కు రమ్మని పిలిచాను. కానీ అప్పటికే నాకున్న బ్యాడ్ ఇమేజ్, స్త్రీలోలుడు అనే దుష్ప్రచారం కారణంగా శ్వేత నాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. దూరందూరంగానే ఉంది. అప్పుడు మా అమ్మ వచ్చి, తన దగ్గరకు వెళ్లి మాట్లాడింది. ‘‘ఇద్దరూ కలిసి సినిమాలో నటిస్తున్నారు.. కలిసి భోజనం చేయడం తప్పేమీ కాదు’’అని చెప్పింది. (త్వరలో పెళ్లి.. రూ.18 వేలే ఉన్నాయి) దాంతో శ్వేత మనసు కాస్త మెత్తబడింది. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఓ రెస్టారెంటుకు వెళ్లి భోజనం చేశాం. అలా మా మధ్య మొదలై, ప్రేమకు దారితీసింది. నేనే ముందు ప్రపోజ్ చేశాను. కానీ తను చాలా భయపడింది. ఆ తర్వాత మెల్లగా నా కుటుంబ సభ్యులతో పరిచయమైన తర్వాత నా గురించి పూర్తిగా తెలుసుకుంది. నేనొక ఫ్యామిలీ మ్యాన్ అనే విషయం అర్థమైన తర్వాత పెళ్లికి అంగీకరించింది. నేను అమ్మాయిల వెంట తిరిగే పోకిరి అని ఎవరో చెప్పారట. తన భయంలో కూడా అర్థం ఉందిగా. ఇప్పుడు మా మధ్య ఎలాంటి రహస్యాలు, భయాలు లేవు’’అని చెప్పుకొచ్చాడు. -
సుశాంత్ సోదరి శ్వేత ఆకస్మిక నిర్ణయం
సాక్షి, ముంబై: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోదరుడు సుశాంత్ మరణం తరువాత సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ వస్తున్న ఆమె సడన్ గా సోషల్ మీడియా నుంచి నిష్క్రమించారు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను బుధవారం తొలగించారు. జస్టిస్ ఫర్ సుశాంత్ అంటూ పోరాడుతున్న శ్వేతా తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. సుశాంత్ తమను వీడి నేటితో (అక్టోబర్14) నాలుగు నెలల అయిన సందర్భంగా "నిజమైన ప్రేరణ" అంటూ ఒక వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. ఇంతలోనే ఆమె తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అయితే ఫేస్ బుక్ అకౌంట్ మాత్రం యాక్టివ్ గానే ఉంది. మరోవైపు సుశాంత్ అనుమానాస్పద మరణం కేసులో రాబ్తా డైరెక్టర్ దినేష్ విజన్ కార్యాలయం, ఇంటిపైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం దాడులు చేసింది. మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తులో భాగంగా దినేష్ విజన్‌తో సంబంధం ఉన్న నాలుగు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. 2016 లో రాబ్తా మూవీకిగాను సుశాంత్‌కు చేసిన చెల్లింపులపై దర్యాప్తు చేస్తోంది. -
అవును.. పెళ్లిచేసుకోబోతున్నాం: ఆదిత్య
ముంబై: ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు, నటుడు ఆదిత్య నారాయణ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు, నటి శ్వేతా అగర్వాల్‌ను మనువాడనున్నాడు. ఈ విషయాన్ని ఆదిత్య నారాయణ్ ధ్రువీకరించాడు. పదేళ్ల తమ ప్రేమ బంధాన్ని పెళ్లిపీటలు ఎక్కించేందుకు సర్వం సిద్ధమైందని పేర్కొన్నాడు. ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరులో తమ వివాహం జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. కాగా బాలీవుడ్ నటుడిగా, టీవీ షోల హోస్ట్‌గా అందరికీ సుపరిచితమైన ఆదిత్య నారాయణ్, శ్వేతతో కలిసి ‘షాపిత్’ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది.(చదవండి: రణ్‌బీర్, అలియా వివాహంపై వివరణ) ఈ విషయం గురించి ఆదిత్య ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘షాపిత్ సెట్లో తొలిసారి శ్వేతను కలిశాను. తనతో స్నేహం పెంచుకున్నాను. అయితే తనపట్ల నాకున్న ఆరాధనా భావం ప్రేమే అని తెలుసుకునేందుకు ఎంతో సమయం పట్టలేదు. కానీ శ్వేత మాత్రం.. మనం కేవలం స్నేహితులం మాత్రమే అని నన్ను దూరం పెట్టేది. అప్పటికి మేం వయసులో చిన్నవాళ్లమే. అంతేకాదు కెరీర్ కూడా అప్పుడే మొదలైంది. అలాంటి సమయంలో రిస్కు చేయడం ఇష్టంలేకనే తను అలా చేసింది. అన్ని ప్రేమ జంటల్లాగే మేం కూడా పదేళ్ల బంధంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చవిచూశాం. నిజానికి పెళ్లి అనేది కేవలం ఒక తంతు మాత్రమే. నా తల్లిదండ్రులకు కూడా శ్వేత అంటే ఎంతో ఇష్టం. వాళ్ల అంగీకారంతోనే ఈ ఏడాది చివర్లో పెళ్లిచేసుకోబోతున్నాం. నా సోల్‌మేట్ జీవిత భాగస్వామి కావడం ఎంతో సంతోషంగా ఉంది’’అంటూ చిరునవ్వులు చిందించాడు.(చదవండి: నువ్వు నా వాడివి.. నా జీవితం నువ్వే నేహా! ) వాళ్లిద్దరూ నా స్నేహితులు.. ఇక ఇండియన్ ఐడల్ షో స్క్రిప్టులో భాగంగానే సింగర్ నేహా కక్కర్తో తన పెళ్లి అంటూ ఓ ఎపిసోడ్‌ను చిత్రీకరించారని, తమ మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని ఆదిత్య చెప్పుకొచ్చాడు. అంతేగాకుండా సోషల్ మీడియా వేదికగా తాము ప్రేమలో ఉన్నట్లు బహిర్గతం చేసిన నేహా, ఆమె ప్రియుడు, నటుడు రోహన్‌ప్రీత్ సింగ్‌కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాడు. వాళ్లిద్దరూ తనకు మంచి స్నేహితులని, త్వరలోనే వారి పెళ్లి కూడా జరగబోతుందని హర్షం వ్యక్తం చేశాడు. -
ఆడవాళ్లను అలుసుగా చూడకూడదు
కార్తీక్ రెడ్డి, నేనే శేఖర్, స్వాతి, శ్వేత, ఆయేషా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అమ్మాయంటే అలుసా?’. నేనే శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవులూరి భాస్కర్ రెడ్డి సమర్పణలో వై. బ్రహ్మ శేఖర్, వై. లిఖితా చౌదరి నిర్మించారు. ఈ నెల 16న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నేనే శేఖర్ మాట్లాడుతూ – ‘‘ఆడవాళ్లను అలుసుగా చూడకూడదు. వారికి గౌరవం ఇవ్వాలి అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. చాలా సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా చేశాను. ఆ అనుభవంతో ఈ సినిమా తెరకెక్కించాను’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: వినీష్ గౌడ్, కో ప్రొడ్యూసర్: ఎన్. మాధవరెడ్డి. -
90 రోజులైంది..ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ!
సాక్షి,ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాలమరణం కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. అనుమానాస్పద పరిస్థితుల్లో ఈ లోకాన్ని వీడి మూడు నెలలు కావస్తున్నా అతని జ్ఞాపకాలు మాత్రం ప్రతీక్షణం సుశాంత్ తోబుట్టువులను వెన్నాడుతున్నాయి. అనుక్షణం భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ తన సోదరుడు తమను వీడి 90 రోజులైన సందర్భంగా ఒక కొత్త పాటను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సుశాంత్ భౌతికంగా దూరమై 90 రోజులు అయింది. మన జీవితాల్లో సుశాంత్ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే. ఉనికిని గౌరవించే సూచికంగా ఈ పాట అంకితం అని శ్వేతా సింగ్ కీర్తి పోస్ట్ చేశారు. జోష్-ఏ-జహాన్ పేరుతో దీన్ని విడుదల చేశారు. సుశాంత్ తమతో గడిపిన మధుర క్షణాలు, ఇతర మరపురాని, ఉద్వేగభరిత క్షణాలు, వ్యాయామం చేస్తున్న వీడియో క్లిప్‌ల మేళవింపుతో ఈ వీడియోను రూపొందించారు. ఈ పాటకు ఆదిత్య చక్రవర్తి సాహిత్యాన్నిఅందించగా, శుభంసుందరం స్వరపర్చారు. నీల్ ఘోష్, అర్పిత చక్రవర్తి ఆలపించారు. అంతకుముందు సుశాంత్ కలలో ఒకటైన చెట్లను నాటడంపై స్పందించిన అభిమానులు మొక్కలు నాటుతున్న వీడియోను శ్వేతా షేర్ చేశారు. ప్లాంట్స్ ఫర్ ఎస్ఎస్ఆర్ పేరుతో మొక్కలు నాటాలని కోరారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా చెట్లను నాటడంతో ఫాన్స్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాగా జూన్ 14న సుశాంత్ తన ముంబై ఇంటిలో ఉరివేసుకుని చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సుశాంత్ మరణానికి స్నేహితురాలు రియా చక్రవర్తి కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత ఈ కేసులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎంట్రీ మొదలు రోజుకో పరిణామంతో అనేక మలుపులు తిరుగుతూ చివరికి రాజకీయ సెగలు రేపింది. మాదక ద్రవ్యాల కోణం వెలుగు చూడటంతో ఎన్సీబీ రియాను, ఆమె సోదరుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram It has been 90 Days Bhai left his physical body. This song is dedicated to honor and celebrate his ever-felt presence in our lives🙏❤️🙏. #Justice4SSRIsGlobalDemand. https://youtu.be/6w3gQ5ubiqo A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Sep 13, 2020 at 9:35pm PDT -
దేవుడు మావైపే ఉన్నాడు: సుశాంత్ సోదరి
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో చోటుచేసుకున్న అనేక పరిణామాల తర్వాత నేడు మధ్యాహ్నం రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాన్ని సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ స్వాగతించారు. దేవుడు తమతోనే ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఈమేరకు మంగళవారం ట్వీట్ చేశారు. ఆమె అభిప్రాయాన్ని బలపరుస్తూ సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే 'అవును, అక్కా' అని రాసుకొచ్చారు. (చదవండి: రియా.. రియా.. అంటూ అడ్డగించారు!) కాగా సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందంటూ అతని తండ్రి రియా చక్రవర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పట్నా పోలీసులు కేసు నమోదు చేయగా ఎన్నో ట్విస్టుల తర్వాత ఆ కేసు సీబీఐ చెంతకు చేరింది. ఈ విషయంలో మొదటి నుంచి అంకిత.. సుశాంత్ కుటుంబానికి తన మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ఇదిలా వుండగా సుశాంత్ మృతికి సంబంధించిన మాదకద్రవ్యాల కేసులో నటి రియా ఎన్సీబీ అధికారుల ఎదుట సోమవారం విచారణకు హాజరయ్యారు. సుమారు 8 గంటలపాటు విచారించారు. ఈ సందర్భంగా రియా బాలీవుడ్‌కు చెందిన 18 నుంచి 19 మంది డ్రగ్స్ తీసుకుంటున్నారని వెల్లడించడంతో సినీ పరిశ్రమలో కలకలం మొదలైంది. (చదవండి: 8 గంటలు ప్రశ్నల వర్షం) -
అమ్మాయంటే అలుసా దిశకు అంకితం
‘‘స్టార్ హీరోలు, దర్శకుల దగ్గర ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశాను. తొలిసారి నిర్మాతగా మారి సినిమా తీశాను. అనుకోని ఇబ్బందుల వల్ల సినిమా ఆగిపోతే నా భార్యకు తెలియకుండా ఇల్లు అమ్మేసి సినిమా పూర్తి చేశాను’’ అన్నారు నేనే శేఖర్. ఆయన హీరోగా, దర్శక–నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘అమ్మాయంటే అలుసా?’. కార్తీక్ రెడ్డి, స్వాతి, శ్వేత, ఆర్తి ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల చేశారు.‘‘ప్రస్తుత సమాజానికి ఎటువంటి కథ అయితే బావుంటుందో తెలిసినవాడు శేఖర్’’ అన్నారు నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్. ‘‘ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత రామసత్యనారాయణ. ‘‘ఈ సినిమాను దిశకు అంకితం చేస్తున్నా’’ అన్నారు నేనే శేఖర్. -
మహిళా రైతు ‘శ్వేతా’నందం!
ప్రొఫెషనల్ డిగ్రీ చేసినా మేకల పెంపకం చేపట్టారు శ్వేత. ఎన్.ఐ.ఎఫ్.టి.లో ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. పెళ్లయ్యాక బెంగళూరులో నివాసం. భర్త ఆఫీసుకు వెళ్లాక ఇంటి వద్ద ఖాళీగా గడుపుతూ ఉండేది. భర్తతో విహారయాత్రకు వెళ్లినప్పుడు ఒక మేకల పెంపక క్షేత్రాన్ని చూసి ముచ్చటపడింది. అంతే.. చిన్న జీవాలు పెంచే మహిళా రైతుగా మారిపోయింది. విశేషమేమిటంటే.. భర్తకు నచ్చజెప్పి డెహ్రాడూన్ దగ్గర్లోని రాణిపోక్రి గ్రామానికి మకాం మార్చి మరీ.. మేకల పెంపకం చేపట్టింది. ఆన్లైన్ అమ్మకాలతో ఏటా రూ. 25 లక్షల టర్నోవర్ చేస్తోంది! హేట్సాఫ్ శ్వేతా!! -
మరో లోకంలో విహరిస్తారు
‘‘సంజీవని’ విజువల్స్ చూశా. రెండు సంవత్సరాలుగా యంగ్ బ్యాచ్ చాలా కష్టపడి మంచి అవుట్‌పుట్ సాధించారు. టైటిల్ ‘సంజీవని’ అని పెట్టడంలోనే వీరంతా సక్సెస్ సాధించేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ అన్నారు. మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేత ముఖ్య తారలుగా రవి వీడే దర్శకత్వంలో జి.నివాస్ నిర్మించిన చిత్రం ‘సంజీవని’. శ్రవణ్ స్వరపరచిన ఈ సినిమా పాటలను విజయేంద్ర ప్రసాద్ రిలీజ్ చేశారు. రవి వీడే మాట్లాడుతూ –‘‘ఫస్ట్ టైమ్ భారత దేశంలో హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో కలిసి రెండేళ్లు కష్టపడి తెరకెక్కించిన చిత్రం ‘సంజీవని’. తెలుగులో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడి హాలీవుడ్ రేంజ్లో భారీ గ్రాఫిక్స్‌తో నిర్మించాం. మా సినిమాకి వచ్చిన ప్రేక్షకులు మరో లోకంలో విహరిస్తారని గ్యారంటీగా చెప్పగలను. జూన్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకడు కె.యం.రాధాకృష్ణ, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ మామిడి హరికృష్ణ, ఆల్ ఇండియా రేడియో సీనియర్ ఎనౌన్సర్ శ్రీలక్ష్మీ ఐనంపూడి, లక్ష్మీ పిక్చర్స్ అధినేత బాపిరాజు పాల్గొన్నారు. -
హాలీవుడ్ రేంజ్లో...
‘‘రామాయణం బేస్ చేసుకుని ఎన్ని కథలు వచ్చినా సుందరకాండ పర్వం అనేది సినీ పరిశ్రమకి కమర్షియల్ ఎలిమెంట్. సుందరకాండలోనే తెలివైన కోతులు, గాల్లో ఎగిరే రకరకాల జంతువులు, అబ్బురపరిచే యుద్ధాలు ఉంటాయి. ఇవన్నీ ప్రేక్షకుల్ని అలరించాయంటే అది తప్పకుండా హాలీవుడ్ చిత్రమే అయి ఉంటుంది. అయితే మా ‘సంజీవని’ తెలుగు సినిమాలో వీటన్నిటినీ చూపించబోతున్నాం’’ అంటున్నారు దర్శకుడు రవి వీడే. మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేత ప్రధాన పాత్రల్లో రవి వీడే దర్శకత్వంలో జి.నివాస్ నిర్మించిన ‘సంజీవని’ సినిమా వేసవిలో విడుదల కానుంది. రవి వీడే మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ హాలీవుడ్ తెరపై మాత్రమే కనిపించిన అబ్బురపరిచే దృశ్యాల్ని ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాలో చూడబోతున్నాం. హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో కలిసి ఇండియాలో రెండేళ్లు కష్టపడి ‘సంజీవని’ చిత్రం తీశాం. హాలీవుడ్ సినిమా రేంజ్లో భారీ గ్రాఫిక్స్‌తో నిర్మించిన మా చిత్రాన్ని శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా మే నెలాఖరున రిలీజ్ చేస్తున్నాం. మా సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్. -
ఈ క్షణమే
అనురాగ్‌ని హీరోగా పరిచయం చేస్తూ సాయిదేవ రామన్ దర్శకత్వంలో ‘ఈ క్షణమే’ సినిమా తెరకెక్కుతోంది. శ్వేత కథానాయిక. జనని క్రియేషన్స్ పతాకంపై పోకూరి లక్ష్మణాచారీ నిర్మిస్తోన్న ఈ సినిమా హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ క్లాప్ ఇవ్వగా, జడ్జి రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ‘‘మా బ్యానర్లో ‘ఈ క్షణమే’ తొలి చిత్రం. సాయిదేవ్ కథే మా సినిమాకి ప్రధాన బలం. అన్నివర్గాలను అలరించే అంశాలతో రూపొందుతోంది. అనురాగ్‌కు మంచి ఇంట్రడక్షన్ సినిమా అవుతుంది’’ అని నిర్మాత పోకూరి లక్ష్మణాచారీ అన్నారు. ‘‘సింగిల్ సిట్టింగ్‌లో ఈ కథ ఓకే అయింది. జనని బ్యానర్లో ఓ మంచి సినిమాగా ‘ఈ క్షణమే’ నిలుస్తుంది’’ అన్నారు సాయిదేవ రామన్. ‘‘కథ బాగుంది. పది రోజుల్లో షూటింగ్ మొదలుపెడతాం. నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని అనురాగ్ అన్నారు. శ్వేత, నటుడు సంపూర్ణేష్ బాబు, మైత్రి హాస్పిటల్ అధినేత డా.ప్రకాష్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్, పాటలు: అనంత్ శ్రీరామ్, మాటలు: హేమంత్ కార్తీక్. -
పల్లెటూరి గోపాలుడు
విజయ్, శ్వేతా జంటగా కృష్ణ దర్శకత్వంలో వాసు నిర్మిస్తున్న ‘రారా వేణుగోపాల’ సినిమా సోమవారం ప్రారంభమైంది.ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే భాస్కరరావు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ క్లాప్ ఇచ్చారు. మరో నిర్మాత సాయివెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘జూన్ రెండో వారంలో గోదావరి జిల్లాల్లో చిత్రీకరణ ప్రారంభిస్తాం. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ప్రేమకథా చిత్రమిది’’ అన్నారు దర్శకుడు కృష్ణ. ‘‘మంచి చిత్రాలు నిర్మించాలనే సంకల్పంతో శరవణ క్రియేషన్స్ సంస్థను స్థాపించి, తొలి ప్రయత్నంగా ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత వాసు. ఈ చిత్రానికి కథ: కీర్తీ చౌదరి, సంగీతం: జోస్యభట్ల, సమర్పణ: భూమానంద. -
సమాజానికి సందేశం
‘ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని అరికట్టాలంటే ఏం చేయాలి?’ అనే సందేశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘మరో దృశ్యం’. గౌతమ్, శ్వేత జంటగా కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఆర్ఎమ్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘‘సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేశాం’’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: కట్ల రాజేంద్రప్రసాద్. -
ప్రేమించి.. పెళ్లికి నిరాకరించిన యువకుడి అరెస్ట్
సంగెం : మూడేళ్లుగా ప్రేమిస్తున్నట్లు చెప్పి, వెంటపడి ఆమెను శారీకంగా లోబరుచుకుని.. తీరా ఇప్పుడు పెళ్లికి నిరాకరించిన ప్రియుడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై అడ్డూరి ప్రవీణ్‌కుమార్ తెలి పారు. మండలంలోని తీగరాజుపల్లి గ్రామానికి చెందిన మోడెం కుమారస్వామి, పుష్ప మ్మ దంపతుల కూతురు శ్వేత(20)కు గవిచర్ల గ్రామానికి చెందిన గుండు సంపత్, లక్ష్మీ దం పతుల కుమారుడు రాంబాబు(22) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్వేత ఇంటర్ వరకు చదవి వరంగల్ నగరంలో ఓ బ్యూటి పార్లల్లో పని చేస్తున్నది. రాంబాబు నగరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. నిత్యం వరంగల్ న గరానికి బస్సులో వచ్చివెళుతున్న క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇన్నాళ్లు పెళ్లి చేసుకుంటానని న మ్మించిన రాంబాబు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని కోరితే అందుకు నిరాకరించాడు. దీంతో శ్వేత తన బంధువులతో కలిసి నెల 5న గవిచర్లలో రాంబాబు ఇంటి ఎదుట బంధువులతో కలిసి బైఠాయించి మౌనపోరాటానికి దిగింది. తన కూతురుకు న్యాయం చేయాలని కోరు తూ శ్వేత తల్లి పుష్పమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడు రాం బాబును సోమవారం ఆరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై వెల్లడించారు. -
ముదిరిన భద్రాచలం ‘పంచాయితీ’
భద్రాచలం : భద్రాచలం మేజర్ పంచాయతీ వివాదాల సుడిగుండ ంలో చిక్కుకుంది. ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలతో పంచాయతీలోని అడ్డగోలు పనులు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దీన్ని ధ్రువీకరిస్తూ సర్పంచ్ భూక్యా శ్వేత సైతం ఈవో, సిబ్బందిపై తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులకు తెలియకుండానే ఇంటి పర్మిషన్లు ఇస్తూ లక్షలు గడిస్తున్నారని ఆరోపించారు. బిల్ కలెక్టర్లు ఇష్టానుసారంగా దొంగ రశీదులు జారీ చేస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారని పేర్కొన్నారు. ఇంటిపన్నుల వసూలు చేస్తూ సొంతానికి వాడుకుంటున్నారని, ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శి బాధ్యాతాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలు సొంతానికి వాడుకుంటున్నారనే విషయాన్ని డివిజన ల్ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. పంచాయతీ వర్క ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. పంచాయతీలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలను తాను ఎక్కడ బయట పెడతాననే భయంతోనే కార్యదర్శి, డీఎల్పీఓ, సిబ్బంది ఏకమై వార్డు మెంబర్లను రెచ్చగొట్టి తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని విమర్శించారు. పంచాయతీ పరిధిలో సెల్‌టవర్స్ ఏర్పాటుకు తీర్మానం లేకుండా, పాలకవర్గానికి చెప్పకుండా కార్యదర్శి ఒక్కరే లక్షలాది రూపాయలు తీసుకొని అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. పంచాయతీ అధికారులంతా ఏకమై గిరిజన మహిళ అయిన తనను పరిపాలన చేయనివ్వకుండా చెక్ పవర్ రద్దు చేయించే కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు పంచాయతీరాజ్ కమిషనర్‌ను కలవనున్నట్లు తెలిపారు. దేనికైనా రెడీ..: శ్రీమన్నారాయణ, ఈఓ సర్పంచ్ శ్వేత చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవం. డబ్బులు తీసుకుంటున్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ. తీర్మానాల మేరకే సెల్‌టవర్లకు పర్మిషన్లు ఇచ్చాం. కొన్ని పనులను కట్టడి చేస్తున్నందుకే ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. -
ప్రేమల్లో తేడా!
‘‘ ‘ప్రేమిస్తే పోయే కాలం’. ఈ టైటిల్ విన్నవాళ్లందరూ ‘ఇదేం టైటిల్.. విచిత్రంగా ఉందే’ అనుకున్నారు. అదే ఈ చిత్రానికి మంచి ప్రచారాస్త్రం అయ్యింది’’ అన్నారు నిర్మాత డి.ఇ రాజు. ప్రవీణ్‌కుమార్, శ్వేత జంటగా జి. రవిచంద్ర దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘ప్రేమిస్తే పోయె కాలం’. రమణేశ్వరి సమర్పణలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘తల్లిదండ్రులు, తోడబుట్టినవాళ్ల ప్రేమ గురించి పెద్దగా ఎవరూ చెప్పుకోరు. అదే ఎవరైనా ప్రేమలో పడితే దాని గురించి వాడిగా వేడిగా చర్చించుకుంటారు. ఆ ప్రేమలకు, ఈ ప్రేమకు గల తేడా ఏంటి? అనే కథతో ఈ సినిమా తీశాం’’ అన్నారు. -
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
భార్య, కొడుకును హత్య చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య గచ్చిబౌలిలో దారుణం ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగం.. లక్షకు పైగా జీతం.. ఇంతకన్నా ఏం కావాలి? లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవి తాన్ని అర్ధాంతరంగా ముగించాడు. కుటుంబ కలహాల కారణంగా కట్టుకున్న భార్యను, కన్న కొడుకును కడతేర్చి తానూ ఉరివేసుకున్నాడు. బుధవారం వెలుగు చూసిన ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌కు చెందిన మనీష్ సాహు (35) మూడేళ్ల కిందట నగరానికి వచ్చాడు. మాదాపూర్‌లోని ఇమోమెంటస్ కంపెనీలో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. మాదాపూర్‌లోనే మై హోమ్ నవద్వీప్ వరుణ బ్లాక్‌లోని ఫ్లాట్ నెం 108లో భార్య శ్వేత సాహు (32), కొడుకు యశ్ (5)తో కలసి అద్దెకుంటున్నాడు. శ్వేత గృహిణి కాగా, యశ్ మెరిడియన్ స్కూల్లో నర్సరీ చదువుతున్నాడు. ఈనెల 19న ఆఫీస్‌కు వెళ్లి వచ్చిన మనీష్ శుక్రవారం నుంచి ఆఫీస్‌కు వెళ్లలేదు. బుధవారం ప్రాజెక్ట్ డెలివరీ ఉండటంతో కంపెనీ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ శ్రీరామ్.. మనీష్ నివాసానికి వచ్చి చూడగా డోర్ వెనక నుంచి గడియపెట్టి ఉంది. కిటికీ తలుపులు తెరచి చూడగా తీవ్ర దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ నిర్వాహకులకు విషయం చెప్పారు. వారు వచ్చి కిటికీలోంచి చూడగా మనీష్ కిటికీకి వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా శ్వేత, కొడుకు యశ్‌లు మంచంపై నిర్జీవంగా పడిఉన్నారు. మనీష్ నైలాన్ తాడుతో కిటికీకి ఉరివేసుకున్నాడు. ముగ్గురి శరీర భాగాలు ఉబ్బిపోయి ఉండడంతో నాలుగు రోజుల క్రితమే చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. భార్య శ్వేత రెండుచేతుల మణికట్టుపై పదునైన కత్తితో కోయగా తీవ్ర రక్తస్రావమైనట్టుగా ఉంది. కొడుకు యశ్ తలకు, ముక్కు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. దిండుతో ముఖాన్ని అదిమిపెట్టి కొడుకును హతమార్చినట్లు తెలుస్తుంది. వారిద్దరు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తాను రెండు చేతుల మణికట్టుపై కోసుకున్న మనీష్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు తెలిపారు. మనీష్, శ్వేత కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఠాణాకీడ్చిందని..?: రెండు నెలల నుంచి దంపతుల మధ్య ఏదో ఒక విషయుంపై గొడవలు జరుగుతున్నారుు. భర్త తనను వేధిస్తున్నాడని శ్వేత మాదాపూర్ పోలీసులను ఆశ్రరుుంచింది. దీనిపై స్పందించిన పోలీసులు ఇద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ చేసి పంపించారు. తనను పోలీసు స్టేషన్ కీడ్చిందని భార్యపై మరింత కక్ష పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడా అనే సందేహాలు కలుగుతున్నాయి.