పల్లెటూరి గోపాలుడు | rara gopala film shooting start | Sakshi
Sakshi News home page

పల్లెటూరి గోపాలుడు

Published Tue, May 23 2017 2:04 AM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

పల్లెటూరి గోపాలుడు

పల్లెటూరి గోపాలుడు

విజయ్, శ్వేతా జంటగా కృష్ణ దర్శకత్వంలో వాసు నిర్మిస్తున్న ‘రారా వేణుగోపాల’ సినిమా సోమవారం ప్రారంభమైంది.ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే భాస్కరరావు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌ క్లాప్‌ ఇచ్చారు.

మరో నిర్మాత సాయివెంకట్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘జూన్‌ రెండో వారంలో గోదావరి జిల్లాల్లో చిత్రీకరణ ప్రారంభిస్తాం. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ప్రేమకథా చిత్రమిది’’ అన్నారు దర్శకుడు కృష్ణ. ‘‘మంచి చిత్రాలు నిర్మించాలనే సంకల్పంతో శరవణ క్రియేషన్స్‌ సంస్థను స్థాపించి, తొలి ప్రయత్నంగా ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత వాసు. ఈ చిత్రానికి కథ: కీర్తీ చౌదరి, సంగీతం: జోస్యభట్ల, సమర్పణ: భూమానంద.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement