అవును.. పెళ్లిచేసుకోబోతున్నాం: ఆదిత్య | Aditya Narayan Plans to Get Married Shweta Agarwal In 2020 | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది చివర్లో శ్వేతతో నా పెళ్లి: నటుడు

Published Mon, Oct 12 2020 4:10 PM | Last Updated on Mon, Oct 12 2020 4:23 PM

Aditya Narayan Plans to Get Married Shweta Agarwal In 2020 - Sakshi

ముంబై: ప్రముఖ గాయకుడు ఉదిత్‌ నారాయణ్‌ కుమారుడు, నటుడు ఆదిత్య నారాయణ్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు, నటి శ్వేతా అగర్వాల్‌ను మనువాడనున్నాడు. ఈ విషయాన్ని ఆదిత్య నారాయణ్‌ ధ్రువీకరించాడు. పదేళ్ల తమ ప్రేమ బంధాన్ని పెళ్లిపీటలు ఎక్కించేందుకు సర్వం సిద్ధమైందని పేర్కొన్నాడు. ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరులో తమ వివాహం జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. కాగా బాలీవుడ్‌ నటుడిగా, టీవీ షోల హోస్ట్‌గా అందరికీ సుపరిచితమైన ఆదిత్య నారాయణ్‌, శ్వేతతో కలిసి ‘షాపిత్‌’ అనే సినిమాలో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది.(చదవండి: రణ్‌బీర్‌, అలియా వివాహంపై వివరణ)

ఈ విషయం గురించి ఆదిత్య ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘షాపిత్‌ సెట్లో తొలిసారి శ్వేతను కలిశాను. తనతో స్నేహం పెంచుకున్నాను. అయితే తనపట్ల నాకున్న ఆరాధనా భావం ప్రేమే అని తెలుసుకునేందుకు ఎంతో సమయం పట్టలేదు. కానీ శ్వేత మాత్రం.. మనం కేవలం స్నేహితులం మాత్రమే అని నన్ను దూరం పెట్టేది. అప్పటికి మేం వయసులో చిన్నవాళ్లమే. అంతేకాదు కెరీర్‌ కూడా అప్పుడే మొదలైంది. అలాంటి సమయంలో రిస్కు చేయడం ఇష్టంలేకనే తను అలా చేసింది. అన్ని ప్రేమ జంటల్లాగే మేం కూడా పదేళ్ల బంధంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చవిచూశాం. నిజానికి పెళ్లి అనేది కేవలం ఒక తంతు మాత్రమే. నా తల్లిదండ్రులకు కూడా శ్వేత అంటే ఎంతో ఇష్టం. వాళ్ల అంగీకారంతోనే ఈ ఏడాది చివర్లో పెళ్లిచేసుకోబోతున్నాం. నా సోల్‌మేట్‌ జీవిత భాగస్వామి కావడం ఎంతో సంతోషంగా ఉంది’’అంటూ చిరునవ్వులు చిందించాడు.(చదవండి: నువ్వు నా వాడివి.. నా జీవితం నువ్వే నేహా!  )

వాళ్లిద్దరూ నా స్నేహితులు..
ఇక ఇండియన్‌ ఐడల్‌ షో స్క్రిప్టులో భాగంగానే సింగర్‌ నేహా కక్కర్‌తో తన పెళ్లి అంటూ ఓ ఎపిసోడ్‌ను చిత్రీకరించారని, తమ మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని ఆదిత్య చెప్పుకొచ్చాడు. అంతేగాకుండా సోషల్‌ మీడియా వేదికగా తాము ప్రేమలో ఉన్నట్లు బహిర్గతం చేసిన నేహా, ఆమె ప్రియుడు, నటుడు రోహన్‌ప్రీత్‌ సింగ్‌కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాడు. వాళ్లిద్దరూ తనకు మంచి స్నేహితులని, త్వరలోనే వారి పెళ్లి కూడా జరగబోతుందని హర్షం వ్యక్తం చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement