
సాధారణంగా సినీ సెలెబ్రెటీలను అభిమానించేవారు ఎక్కువగా ఉంటారు. నటీనటులతో పాటు సింగర్స్‌ని కూడా అమితంగా ఇష్టపడేవారు ఉంటారు. కొంతమంది గాయకుల లైవ్ ఫర్ఫార్మెన్స్‌ని చూసేందుకు జనం ఎక్కువ ఆసక్తి చూపుతారు. అలాంటి వారిలో ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ కొడుకు ఆదిత్య నారాయణ కూడా ఒకరు. తండ్రికి ఉన్న గుర్తింపు చేత ఆదిత్యకు పేరొచ్చింది. అతను మ్యూజిక్‌కాన్సెర్ట్ ఏర్పాటు చేస్తే జనాలు ఎక్కువగానే వెళ్తుంటారు. అయితే తనకోసం వచ్చిన అభిమానులతో ఆదిత్య మాత్రం తరచు గొడవపడుతుంటాడు. తాజాగా ఛత్తీస్‌గడ్‌లో ఆయన నిర్వహించిన గాన కచేరీ వచ్చిన ఓ అభిమానితో ఆదిత్య దురుసుగా ప్రవర్తించాడు. వీడియో తీస్తున్న ఫ్యాన్ ఫోన్‌ని లాక్కొనే దూరంగా పడేశాడు.
తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లోని రుంగ్తా కాలేజీలో ఆదిత్య కచేరీ నిర్వహించారు. ఫ్యాన్స్‌తో పాటు సంగీత ప్రియులు పెద్ద ఎత్తున ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు. ఈవెంట్‌లో భాగంగా ఆదిత్య.. షారుఖ్ నటించిన ‘డాన్’ మూవీలోని ‘ఆజ్ కీ రాజ్’ సాంగ్‌ని ఆలపించడం ప్రారంభించారు. పాట పాడుతూ అభిమానుల మధ్యలోకి వచ్చారు.
ఈ సందర్భంగా ఓ అభిమాని తన మొబైల్‌లో ఆదిత్య పాటను రికార్డు చేస్తూ కనిపించాడు.. వెంటనే ఆదిత్య వచ్చి చేతిలో ఉన్న మైక్‌తో అతన్ని కొట్టి..ఫోన్ లాక్కొని దూరంగా విసిరివేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆదిత్య ప్రవర్తించిన తీరును నెటిజన్స్ తప్పుపడుతున్నారు. ‘అతను చేసిన తప్పేంటి?..ఓ అభిమానితో ఇలానే ప్రవర్తిస్తారా?’, ఇప్పటికీ తండ్రి పేరుతో బతుకుతున్న ఆదిత్యకు అంత పొగరు ఎందుకు? ’ అని కామెంట్ చేస్తున్నారు.
What is this #adityanarayan 🥲 pic.twitter.com/Gqy7fRo3F6
— Bollywood World (@bwoodworld) February 11, 2024
Comments
Please login to add a commentAdd a comment