ఈ క్షణమే | EE kshaname Movie Opening | Sakshi
Sakshi News home page

ఈ క్షణమే

Published Sun, Feb 25 2018 12:21 AM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

EE kshaname Movie Opening  - Sakshi

అనురాగ్‌, శ్వేత

అనురాగ్‌ని హీరోగా పరిచయం చేస్తూ సాయిదేవ రామన్‌ దర్శకత్వంలో ‘ఈ క్షణమే’ సినిమా తెరకెక్కుతోంది. శ్వేత కథానాయిక. జనని క్రియేషన్స్‌ పతాకంపై పోకూరి లక్ష్మణాచారీ నిర్మిస్తోన్న ఈ సినిమా హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు  బి.గోపాల్‌ క్లాప్‌ ఇవ్వగా, జడ్జి రామారావు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ‘‘మా బ్యానర్‌లో ‘ఈ క్షణమే’ తొలి చిత్రం. సాయిదేవ్‌ కథే మా సినిమాకి ప్రధాన బలం. అన్నివర్గాలను అలరించే అంశాలతో రూపొందుతోంది.

అనురాగ్‌కు మంచి ఇంట్రడక్షన్‌ సినిమా అవుతుంది’’ అని నిర్మాత పోకూరి లక్ష్మణాచారీ అన్నారు. ‘‘సింగిల్‌ సిట్టింగ్‌లో ఈ కథ ఓకే అయింది. జనని బ్యానర్‌లో ఓ మంచి సినిమాగా ‘ఈ క్షణమే’ నిలుస్తుంది’’ అన్నారు సాయిదేవ రామన్‌. ‘‘కథ బాగుంది. పది రోజుల్లో షూటింగ్‌ మొదలుపెడతాం. నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని అనురాగ్‌ అన్నారు. శ్వేత, నటుడు సంపూర్ణేష్‌ బాబు, మైత్రి హాస్పిటల్‌ అధినేత డా.ప్రకాష్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్, పాటలు: అనంత్‌ శ్రీరామ్, మాటలు: హేమంత్‌ కార్తీక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement