sampurnesbabu
-
ఈ క్షణమే
అనురాగ్‌ని హీరోగా పరిచయం చేస్తూ సాయిదేవ రామన్ దర్శకత్వంలో ‘ఈ క్షణమే’ సినిమా తెరకెక్కుతోంది. శ్వేత కథానాయిక. జనని క్రియేషన్స్ పతాకంపై పోకూరి లక్ష్మణాచారీ నిర్మిస్తోన్న ఈ సినిమా హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ క్లాప్ ఇవ్వగా, జడ్జి రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ‘‘మా బ్యానర్లో ‘ఈ క్షణమే’ తొలి చిత్రం. సాయిదేవ్ కథే మా సినిమాకి ప్రధాన బలం. అన్నివర్గాలను అలరించే అంశాలతో రూపొందుతోంది. అనురాగ్‌కు మంచి ఇంట్రడక్షన్ సినిమా అవుతుంది’’ అని నిర్మాత పోకూరి లక్ష్మణాచారీ అన్నారు. ‘‘సింగిల్ సిట్టింగ్‌లో ఈ కథ ఓకే అయింది. జనని బ్యానర్లో ఓ మంచి సినిమాగా ‘ఈ క్షణమే’ నిలుస్తుంది’’ అన్నారు సాయిదేవ రామన్. ‘‘కథ బాగుంది. పది రోజుల్లో షూటింగ్ మొదలుపెడతాం. నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని అనురాగ్ అన్నారు. శ్వేత, నటుడు సంపూర్ణేష్ బాబు, మైత్రి హాస్పిటల్ అధినేత డా.ప్రకాష్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్, పాటలు: అనంత్ శ్రీరామ్, మాటలు: హేమంత్ కార్తీక్. -
సంపూర్ణేశ్‌బాబు గుర్తొచ్చాడు
శోభన్ కృష్ణ, ఝాన్సీ జంటగా రూపొందిన చిత్రం ‘సోగ్గాడే.. శోభన్‌కృష్ణ’. జింకా హరిబాబు దర్శకత్వంలో శ్రీశ్రీ నాగలక్ష్మి ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాగీర్ ఉమాపతి గౌడ్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘మంచి కుటుంబ కథాచిత్రమిది. హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. శోభన్‌కృష్ణ చక్కని నటన కనబరిచాడు. తన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది.’’ అన్నారు. ‘‘ఈ చిత్రం టైలర్ చూసిన తర్వాత నాకు సంపూర్ణేశ్ బాబు గుర్తొచ్చారు. ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసే చిత్రం ఇది. తప్పకుండా హిట్ అయి టీమ్‌కి మంచి పేరు తీసుకొస్తుంది’’ అన్నారు నటి కవిత. శోభన్ కృష్ణ, ఝాన్సీ, జింకా హరిబాబు, రాగీర్ ఉమాపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
భద్రాద్రిలో హీరో సంపూ, డీఐజీ పూజలు
భద్రాచలం: శ్రీసీతారామచంద్ర స్వామి వారిని వరంగల్ రేంజ్ డీఐజీ టి.ప్రభాకర్ రావు దంపతులు శుక్రవారం దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కలియతిరిగారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సినీ హీరో సంపూర్ణేష్‌బాబు దేవస్థానానికి వచ్చి అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ లక్ష్మీతాయారమ్మ వారిని, ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. -
సందడి చేసిన ‘సంపూ'
‘హృదయ కాలేయం’ హీరో సంపూర్ణేష్‌బాబు (సంపూ) గురువారం దొమ్మేరులో సందడి చేశారు. అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న బందిపోటు సినిమా షూటింగ్ మూడోరోజు కొనసాగింది. గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికలకు సంబందించి సన్నివేశాలను అల్లరి నరేష్, పోసాని కృష్ణమురళితో పాటు పలువురు జూనియర్ ఆర్టిస్ట్‌లపై దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ చిత్రీకరించారు. గ్రామ చావిడి వద్ద సంపూర్ణేష్ బాబుపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సహాయ నటుడు చాగల్లు సూరిబాబుతో పాటు పలువురు స్థానిక కళాకారులు నటించారు. శుక్రవారం నుంచి కొవ్వూరులో షూటింగ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాత ఆర్యన్ రాజేష్ తెలిపారు. - దొమ్మేరు (కొవ్వూరు రూరల్) నాతో నటించేందుకు ఏ హీరోయిన్ ఒప్పుకోలేదు సంపూర్ణేష్‌బాబు దొమ్మేరు (కొవ్వూరు రూరల్): హృదయకాలేయం సినిమాలో తన పక్కన నటించేందుకు ఏ హీరోయిన్ ఒప్పుకోలేదని సినీహీరో సంపూర్ణేష్‌బాబు తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమ చిత్రంలో నటించేందుకు ముందుకురాలేదన్నారు. ఈవీవీ బ్యానర్లో పూర్తిస్థాయి నటుడిగా అవకాశం రావడం ఆనందంగా ఉందని సంపూ చెప్పారు. బందిపోటు చిత్రంలో నటించేందుకు కొవ్వూరు మండలం దొమ్మేరు వచ్చిన ఆయనతో ఇంటర్వ్యూ. మీ స్వగ్రామం ఏది మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం మెట్టపల్లి. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. అల్లరి నరేష్‌తో నటించడం ఎలా ఉంది. అల్లరి నరేష్‌తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. హృదయకాలేయం సినిమాకు మీరే నిర్మాత అని టాక్.. నిజానికి నేనే నిర్మాతగా తీద్దామనుకున్నా. అయితే స్టీవెన్ శంకర్ అనే మిత్రుడు నిర్మాతగా చిత్రాన్ని నిర్మించాం. హృదయకాలేయం నిర్మాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. సినిమా ప్రారంభించడానికి ముందు మూడు నెలల వరకు నాతో నటించేందుకు ఏ హీరోయిన్ ఒప్పుకోలేదు. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా నా సినిమాలో నటించడానికి ముందుకు రాలేదు. ఎవరూ రాకపోతే మగవారికి ఆడవారి వేషాలు వేసి సినిమా పూర్తిచేద్దామని నిర్ణయించాం. అయితే మా అదృష్టం వల్ల కావ్యకుమారి, ఈషికా సింగ్‌లు హీరోయిన్లుగా నటించేందుకు అంగీకరించారు. ధైర్యంతో కొత్త ప్రయోగం చేశాం. జనం ఆదరించారు. అమెరికా నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సినీపరిశ్రమకు వచ్చారట లేదండీ. నాకు మొదటి నుంచి సినిమాలంటే ఇష్టం. సినీపరిశ్రమలోనే కొనసాగుతున్నాను. తొలిసారిగా మహాత్మా చిత్రంలో డెరైక్టర్ కృష్ణవంశీ చిన్నపాత్ర ద్వారా నటించడానికి అవకాశం ఇచ్చారు. మీ తదుపరి చిత్రం కొబ్బరిమట్ట సినిమాలో హీరోగా నటిస్తున్నా. స్టీవెన్ శంకర్ నిర్మాత. ఆగష్టు 25న ప్రారంభంకానుంది. త్రిపాత్రాభినయం చేస్తున్నా. ఏడుగురు హీరోయిన్లు నటిస్తున్నారు.