భద్రాద్రిలో హీరో సంపూ, డీఐజీ పూజలు
భద్రాచలం: శ్రీసీతారామచంద్ర స్వామి వారిని వరంగల్ రేంజ్ డీఐజీ టి.ప్రభాకర్ రావు దంపతులు శుక్రవారం దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కలియతిరిగారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సినీ హీరో సంపూర్ణేష్‌బాబు దేవస్థానానికి వచ్చి అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ లక్ష్మీతాయారమ్మ వారిని, ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.