
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు సోమవారం నాలుగో రోజుకు చేరాయి. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యస్వామి నరసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం బేడామండపంలో వేద పండితులు దివ్యప్రబంధనం పఠించాక, స్వామిని నరసింహావతారంలో ప్రత్యేకంగా అలంకరించి పల్లకీ సేవ నిర్వహిస్తూ మిథిలా స్టేడియంలోని వేదికపై కొలువు తీర్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాగా, అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య మంగళవారం వామనావతారంలో దర్శనమివ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment