Vaikuntha Ekadashi
-
ఆ 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వైకుంఠ ఏకాదశి నుంచి వైకుంఠ ద్వార దర్శనం కల్పించే 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై ఆయన సీవీఎస్వో శ్రీధర్‌తో కలిసి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ విభాగాధిపతులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ...పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతించాలన్నారు. కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులను తిరుమలకు అనుమతించాలన్నారు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ, మొదలగు వారికి విశేష దర్శనాలను ఆ పది రోజులూ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. గోవింద మాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని స్పష్టం చేశారు.వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు చేస్తారని తెలిపారు. అలాగే, తిరుమలలో జనవరిలో జరిగే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు భద్రతా అంశాలపై గురువారం ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తిరుమలలో అధికారులతో సమీక్షించారు. రేపు ’డయల్ యువర్ ఈవో’ టీటీడీ డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం ఈ నెల 28న శనివారం ఉదయం 9–10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగుతుందని టీటీడీ అధికారులు గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్యామలరావుకు ఫోన్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఇందుకుగాను 0877–2263261 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
TTD : శ్రీవాణి, ఎస్ఈడీ టికెట్ల విడుదల తేదీల మార్పు
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్లోకి అనుమతిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు శ్రీవారిని 65,299 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,863 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.75 కోట్లు.మార్చి నెల శ్రీవాణి, ఎస్ఈడీ కోటా విడుదల తేదీలో మార్పుతిరుమల, 2024 డిసెంబర్ 20: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.అలాగే పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబరు 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరుగుతుంది.ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలను మార్పు చేయడమైనది.డిసెంబరు 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.డిసెంబరు 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తారు.ఈ మార్పును గమనించి టీటీడీ వెబ్ సైట్లో https://ttdevasthanams.ap.gov.in/home/dashboardలో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు తెలియజేయడమైనది. -
ఆ పది రోజులు టోకెన్ లేకుంటే దర్శనం లేదు
తిరుమల: తిరుమలలో వచ్చేనెలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సమయంలో టోకెన్ లేని భక్తులను దర్శనానికి అనుమ తించమని టీటీడీ పీఆర్వో విభాగం శని వారం ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి ఆలయంలో వచ్చేనెల వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్య మిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. జనవరి 10 నుంచి 19 వరకు దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్ర మే అనుమతిస్తారు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణశాఖ, ఎన్ ఆర్ఐ మొదలైన వారికి పదిరోజుల పాటు వీఐపీ బ్రేక్, విశేష దర్శనాలు రద్దు. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్లు వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి అనుమతించబడరు. 11 నుంచి 19 తేదీ వరకు అనుమతిస్తారు. 28న డయర్ యువర్ ఈవోటీటీడీ ‘డయల్ యువర్ ఈవో’ డిసెంబరు 28వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్ర మా న్ని వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసా రం చేస్తుంది. భక్తులు తమ సందేహా లను, సూచనలను టీటీడీ ఈఓ శ్యామల రావుకు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు 0877– 2263261 నంబర్లో సంప్రదించాలని టీటీడీ తెలిపింది. -
తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాలు నిన్న వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు 71,488 దర్శించుకున్నారు.19,137 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.17 కోట్లు ఆదాయం వచ్చింది. శ్రీవారి నాలుగు రోజుల్లో 2,72,207 మందికి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. నాలుగు రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం 25.82 కోట్లు. జనవరి 1 వరకు పది రోజులపాటు కొనసాగనున్న వైకుంఠ ద్వార దర్శనాలు -
విశ్వవిరాట్ వైభవం
రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. వేకువ జాము నుంచే ఆలయాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కనులపండువగా జరుగుతోంది.వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెల్లవారుజామున 1:45 గంటలకు ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకున్నాయి. శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. తిరుమల/ద్వారకాతిరుమల/సింహాచలం/అన్నవరం/సాక్షి ప్రతినిధి,విజయనగరం: తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముక్కోటి దేవతలు వెంటరాగా మలయప్ప దివి నుంచి భూ వైకుంఠానికి వేంచేయడంతో సప్తగిరులు పులకించాయి. వైకుంఠం నుంచి వచ్చిన వేంకటేశుడి దర్శనానికి ఉత్తర ద్వారం స్వాగతం పలికింది. శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధన అనంతరం అర్చకులు వైకుంఠ ఏకాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైకుంఠ ద్వారాలను తెరిచి పూజలు చేశారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే ఈ ద్వారాలను తెరుస్తారు. కొన్నేళ్ల నుంచి 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పింస్తున్నారు. సామాన్య భక్తులకు 5.15 గంటలకే సర్వదర్శనాన్ని ప్రారంభించారు. వైభవంగా స్వర్ణరథోత్సవం శ్రీవారి ఆలయంలో స్వర్ణ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగారు. రథోత్సవాన్ని గ్యాలరీల్లోంచి భక్తులు దర్శించి తరించారు. టీటీడీ చైర్మన్ భూమన, ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి చక్రస్నానాన్ని నిర్వహించనున్నారు. ప్రధాన ఆలయాలకు భక్తుల తాకిడి.. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని చిన వెంకన్న ఆలయంలో స్వామి వారు ఉత్తరద్వారాన వెండి గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. 40 వేల మందికి పైగా చినవెంకన్నను దర్శించుకున్నారు. సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శ్రీదేవి, భూదేవి సమేతుడై ఆలయ ఉత్తర రాజగోపురంలో వైకుంఠ వాసుడిగా శేష తల్పంపై వేంజేసి దర్శనమిచ్చారు. స్వామి వారిని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర దర్శించుకున్నారు. కాకినాడ జిల్లా అన్నవరంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అలంకరణలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను 50 వేల మందికిపైగా ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. విశాఖ శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఉత్తర ద్వారం నుంచి తొలి దర్శనం చేసుకున్నారు. విజయనగరం జిల్లాలోని రామతీర్థం సీతారామస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు భారీగా నీలాచలం బోడికొండ చుట్టూ 12 కి.మీ మేర గిరి ప్రదక్షిణ చేశారు. ఉదయం 5 గంటలకు ఉత్తర సీతారామచంద్రస్వామి ఉత్తర రాజగోపురం నుంచి దర్శనమిచ్చారు. ఆలయం వద్ద 10 వేల మందికి అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. -
విశ్వవిరాట్ వైభవం
సాక్షి, తిరుమల/భద్రాచలం/యాదగిరిగుట్ట: తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. వేకువ జాము నుంచే ఆలయాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కనులపండువగా జరుగుతోంది. ఉత్తరద్వారం నుంచి దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పుణ్యక్షేత్రం శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భూలోక వైకుంఠంగా మారింది. శ్రీసీతాలక్ష్మణసమేతుడైన రామచంద్రస్వామి ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనంతో భద్రగిరి పులకించింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, ధూపదీపాల మధ్య వైకుంఠ రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగదభి రాముడు గరుడ వాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్ వాహనంపై ఆసీనులై ఉత్తరద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠనాథుడిగా దర్శనమిచ్చిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంతో పాటు అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట (çపూర్వగిరి) శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామునే ప్రధానాలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ఆచార్యులు సుప్రభాతం, ఆరాధన, బాలభోగం, తిరుప్పావై చేపట్టి అలంకార సేవలు ఏర్పాట్లు చేశారు. ఉదయం శ్రీస్వామి వారు గరుడ వాహనంపై లక్ష్మీనృసింహస్వామి అలంకారంలో వేంచేసి ఆలయ ఉత్తర ద్వారం వద్ద వైకుంఠనాథుడిగా భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం శ్రీస్వామిని విష్ణుమూర్తిగా అలంకరణ చేసి మత్సా్వతారంలో మాడవీధిలో సేవను ఊరేగించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, అనిరు«ద్‌రెడ్డి, అదనపు జిల్లా జడ్జి మారుతీదేవి, సబ్ జడ్జి దశరథరామయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో.. తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైకుంఠం నుంచి వచ్చిన వేంకటేశుడి దర్శనానికి ఉత్తర ద్వారం స్వా గతం పలికింది. అలాగే.. శ్రీవారి ఆలయంలో స్వర్ణ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగారు. రథోత్సవాన్ని గ్యాలరీల్లోంచి భక్తులు దర్శించి తరించారు. -
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
-
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పరిశీలించిన ఈవో
-
స్వర్ణ రథంపై సర్వాంతర్యామి
తిరుమల/మంగళగిరి/సింహాచలం/శ్రీశైలం టెంపుల్/నెల్లిమర్ల: ఇల వైకుంఠం తిరుమలలో సోమవారం వైకుంఠ ఏకాదశి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వర్ణరథంపై సర్వాంతర్యామి అయిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామ స్మరణతో సప్తగిరులు పులకించాయి. శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధన అనంతరం వైకుంఠ ఏకాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సామాన్య భక్తులకు సైతం గంట ముందుగానే ఆరు గంటలకే సర్వదర్శనం ప్రారంభించారు. అలంకార ప్రియుడైన శ్రీనివాసుడి సన్నిధిని అరుదైన పుష్పాలు, ఫలాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పుష్పాలను వినియోగించారు. పది టన్నుల పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ అలంకరణకు వాడారు. ఆలయ మహాగోపురానికి పుష్పాలతో ఏర్పాటు చేసిన విష్ణుమూర్తి, శంఖుచక్రాలు.. నామం బోర్డు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మండపం లోపల శ్రీ మహాలక్ష్మి, దశావతారాలతో పాటు శ్రీమహా విష్ణువు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండపాన్ని సందర్శించిన భక్తులు ఆనంద పరవశులవుతున్నారు. ఆలయం వెలుపల విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన స్వామి వారి నిలువెత్తు విగ్రహాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నిలువెత్తు బంగారాన్ని ర«థంగా మార్చి దేవేరులతో కలిసి కోనేటిరాయుడు ఆలయ తిరువీధుల్లో ఊరేగడాన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు చేరుకున్న అశేష భక్తవాహిని స్వర్ణర«థ వాహనసేవను తిలకించి స్వామి, అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. మహిళా భక్తులు ఉత్సాహంతో స్వర్ణర«థాన్ని లాగారు. నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. నిర్ణీత సమయంలో కేటాయించిన టైమ్స్ స్లాట్ టికెట్లకు దర్శనమవుతుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 53,101 మంది స్వామి వారిని దర్శించుకోగా, 23,843 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.48 కోట్లు సమర్పించారు. నేడు చక్రస్నానం వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని తిరుమలలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి మంగళవారం తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 గంటల మధ్య చక్రస్నాన మహోత్సవం ఏకాంతంగా నిర్వహించనున్నారు. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం పలువురు ప్రముఖులు వైకుంఠ ద్వారంలో శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయ పెద్ద జీయర్, చిన్న జీయర్ స్వామి, తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.రాజా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేష్ కుమార్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారాం, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నంద, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టి.రాజశేఖర్‌రావు, జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ రవీంద్రబాబు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.శ్రీనివాస్, జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్, కర్ణాటక గవర్నర్ తవార్ చంద్ గెహ్లా, తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్, ఉషశ్రీ చరణ్, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, నేతలు సీఎం రమేష్, విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనృసింహస్వామి వారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా సోమవారం ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సామాన్య భక్తుల క్యూలైన్లో వెళ్లి దర్శించుకున్నారు. విశాఖ జిల్లాలోని సింహాచలం క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శ్రీదేవి, భూదేవి సమేతుడై ఆలయ ఉత్తర రాజగోపురంలో వైకుంఠవాసుడిగా శేషతల్పంపై భక్తులకు దర్శనమిచ్చారు. విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, రాష్ట్ర డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్వామిని దర్శించుకున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక ఉత్సవం, రావణ వాహనసేవ వైభవంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో సోమవారం నిర్వహించిన గిరి ప్రదక్షిణతో నీలాచలం గిరులు పులకించాయి. సీతారామలక్ష్మణుల ఉత్సవ మూర్తుల ఊరేగింపులో సుమారు పదివేల మంది భక్తులు పాల్గొని శ్రీరామనామాన్ని స్మరిస్తూ నీలాచలం చుట్టూ ప్రదక్షిణ చేశారు. -
వేంకటేశ్వరాలయంలో సీఎం సతీమణి పూజలు
వేంకటేశ్వర కాలనీ: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సీఎం కేసీఆర్ సతీమణి శోభ సోమవారం శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమెకు వేద ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో లావణ్య, స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి పాల్గొన్నారు. -
కనుల పండువగా ఉత్తర ద్వార దర్శనాలు
భద్రాచలం/యాదగిరిగుట్ట/ధర్మపురి: రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ప్రధానాల యాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు పోటెత్తారు. దక్షిణ అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంతోపాటు యాదాద్రి, ధర్మపురి ల్లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు వేకువ జామునే భక్తులు చేరుకున్నారు. భద్రాచలంలో జగదభి రాముడు గరుడవాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్ వాహనంపై ఆసీనులై ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వగా యాదాద్రిలో లక్ష్మీనృసింహస్వామి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకారంలో వేంచేసి ఆలయ ఉత్తర ద్వారం గుండా వైకుంఠనాథుడిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అలాగే జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయంలోనూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులను అనుగ్రహించారు. భద్రాద్రిలో...: భద్రాచలంలో సోమ వారం తెల్లవారుజామున వైకుంఠ ద్వా ర దర్శనానికి ముందు రుగ్వేద, యజు ర్వేద, సామవేద, అదర్వణ వేదాలను పఠించిన అనంతరం ద్వారదర్శన ప్రాశస్త్యాన్ని వేదపండితులు భక్తులకు వివరించారు. సరిగ్గా 5 గంటలకు ఉత్తర ద్వారాలు తెరుచుకోగా గరుడవాహన రూరుడై విచ్చేసిన శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ని భక్తులు కన్నులారా వీక్షించి తరించారు. ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడి లోని మూలవరులను దర్శించుకున్నారు. యాదాద్రిలో... యాదాద్రిలో వేకువజామునే ప్రధానాలయంలో స్వామి అమ్మవార్లకు అర్చ కులు సుప్రభాతం, ఆరాధన, బాలభోగం, తిరుప్పావై చేపట్టి అలంకార సేవలు చేశారు. సరిగ్గా ఉదయం 6:48 గంటలకు స్వామి వారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారం నుంచి భక్తు లను అనుగ్రహించారు. ఉదయం 6:48 గంట ల నుంచి 7:30 గంటల వరకు స్వామిని దర్శించుకొనేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. అనంతరం ఆలయ తిరువీధుల్లో స్వామిని ఊరేగించారు. ఆ తర్వాత ఆలయంలో అధ్య యనోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం స్వామిని విష్ణుమూర్తిగా అలంకరించి మత్స్య అవతారంలో ఊరేగించారు. యాదాద్రి ప్రధానా లయ ఉద్ఘాటన తర్వాత తొలిసారి జరిగిన ఉత్తర ద్వార దర్శనానికి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పలువులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారు లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా, యాదా ద్రి కొండకు దిగువనున్న తులసీ కాటేజీలో దాతల సహకారంతో రూ. 21 కోట్ల వ్యయంతో నిర్మించిన 240 గదుల సముదాయాన్ని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఇక పాతగుట్ట (çపూర్వగిరి) ఆలయంలో సైతం ఉదయం 6:48 గంటలకు నృసింహుని వైకుంఠద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు. మరోవైపు ధర్మపురిలో ఉదయం 5:55 గంటలకు ఉత్తర ద్వార దర్శనాలను ఆలయ అధికారులు అనుమతించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ సహా పలువురు ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు. -
ఇల్లు నిర్మించుకునేవారికి రూ. 3 లక్షలు..
సాక్షి, సిద్దిపేట: సంక్రాంతి పండుగ తర్వాత సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలి పారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం ఆయన సిద్దిపేట పట్టణంలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి 2 కిలోల స్వర్ణ కిరీటాన్ని స్వామి వారికి కానుకగా సమర్పించారు. మంత్రి హరీశ్‌రావుతోపాటు భక్తులు ఇచ్చిన విరాళాలతో ఈ కిరీటాన్ని రూపొందించారు. అనంతరం ఆయన బస్తీ దవాఖానాను ప్రారంభించి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హరీశ్ మాట్లా డుతూ పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. బస్తీ ప్రజలకు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకే ఈ బస్తీ దవాఖానాను ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర నేతలు పాల్గొన్నారు. -
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు
-
హంసవాహనంలో రామయ్య జల విహారం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రగిరిపై కొలువైన వైకుంఠ రాముడు గోదావరి నదిలో జలవిహారం చేశారు. హంసవాహనంలో సీతాసమేతుడై జలవిహారం చేస్తున్న రామయ్యను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తర లివచ్చారు. వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం తెప్పోత్సవం నిర్వ హించారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభించి తిరుప్పావై సేవాకాలం, మూలవర్లకు అభిషేకం, వేద పారాయణం, ప్రబంధ పాశుర పఠనం.. తదితర కార్యక్రమాలను ఆలయంలో ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం దర్బారు సేవ అనంతరం ప్రత్యేక పల్లకిలో సీతాసమేత రామచంద్రస్వామిని మేళతాళాల నడుమ గోదావరి తీరానికి తీసుకెళ్లారు. అక్కడ హంసాకృతిలో అలంకరించిన పడవలో సీతారాములను వెంచేపు చేసి, ఆగమ శాస్త్ర పద్ధతి లో షోడశోపచార పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు హంస వాహనంలో స్వామివారి జలవిహారం ప్రారంభమైంది. ఒక్కో పరిక్రమణాని కి ఒక్కో రకమైన హారతి ఇస్తూ కనుల విందుగా వేడుకను నిర్వహించారు. రాత్రి 7:01 గంటలకు ఐదు పరిక్రమణాలతో తెప్పోత్సవాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. కా గా, భూలోక వైకుంఠంగా పేరొందిన భద్రాచలంలో సోమవారం శ్రీసీతారామచంద్రస్వామి భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తారు. ఇందుకోసం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
‘ముక్కోటి’కి యాదాద్రి ముస్తాబు
యాదగిరిగుట్ట: వైకుంఠ (ముక్కోటి) ఏకాదశికి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతో పాటు అనుబంధంగా ఉన్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబయ్యాయి. సోమవారం యాదాద్రీశుడు వైకుంఠనాథుడిగా ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రధానాలయం ప్రారంభమయ్యాక తొలి సారిగా వస్తున్న వైకుంఠ ఏకాదశి కావడంతో ఇది చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ప్రధానాలయం పనులు జరుగుతున్న సందర్భంగా బాలాలయంలో తూర్పు ద్వారం గుండానే భక్తులకు శ్రీస్వామి వారు దర్శనం ఇచ్చారు. ఈ సారి ప్రధానాలయంలో ఉత్తర ద్వారం ఏర్పాటు చేయడంతో ఉత్తర రాజగోపురం నుంచి భక్తులకు వైకుంఠనాథుడి దర్శన భాగ్యం కల్పిస్తారు. ప్రధానాలయంలో.. వైకుంఠ ద్వార దర్శనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయంలో రంగురంగుల పుష్పాలు, మామిడి, అరటి తోరణాలు, విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సరిపడా పులిహోర, లడ్డూ మహా ప్రసాదాలను సిద్ధం చేశారు. ప్రధానాలయంలో సోమవారం ఉదయం 6.48 గంటలకు శ్రీస్వామివారు వైకుంఠనాథుడిగా దర్శనం ఇవ్వనున్నారు. ఈ వేడుకల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. పాతగుట్టలో.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడా ఉదయం 6.48 గంటలకు ఉత్తర ద్వారానికి శ్రీస్వామి వారిని వేంచేపు చేయించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. అనంతరం శ్రీస్వామి వారిని ఆలయ ముఖ మండపంలో అధిష్టింపచేసి, క్యూలైన్లలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఉదయమే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున్న ఉత్తరం వైపు భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం, ఆరాధన, తిరుప్పావై నిర్వహించి, అలంకార సేవను ఏర్పాటు చేస్తారు. ఉదయం 6.48 గంటల నుంచి 7 గంటల వరకు వైకుంఠద్వార దర్శనం, ఉదయం 8 నుంచి 9 గంటల వరకు అలంకార దర్శనం కల్పిస్తారు. నేటి నుంచి అధ్యయనోత్సవాలు.. యాదాద్రీశుడి ఆలయంలో సోమవారం నుంచి ఈనెల 6వతేదీ వరకు ఐదు రోజుల పాటు అధ్యయనోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలలో విశేష అలంకార సేవలు నిర్వహిస్తారు. ఐదురోజులపాటు లక్ష్మీ సమేతుడైన నారసింహుడు దశావతారాలతో ఉదయం, సాయంత్రం ప్రత్యేక అలంకరణ సేవల్లో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అధ్యయనోత్సవాలు జరిగే ఐదు రోజుల పాటు భక్తులు నిర్వహించే మొక్కు, శాశ్వత బ్రహ్మోత్సవాలు, నిత్య, శాశ్వత కల్యాణోత్సవాలు, శ్రీసుదర్శన నారసింహ హోమం రద్దు చేశారు. -
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేసిన టీటీడీ
-
Kanipakam: జనవరి 1న కాణిపాకంలో ప్రత్యేక ఏర్పాట్లు
యాదమరి(చిత్తూరు జిల్లా): జనవరి 1, 2 తేదీల్లో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తెలిపారు. స్వామివారి సమావేశపు మందిరంలో చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు అధ్యక్షతన ఆర్డీవో రేణుక, వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సరం, జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనార్థం భక్తులు లక్ష మందికి పైగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. వీఐపీలు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆ వివరాలను ఎమ్మెల్యే బాబు మీడియాకు వెల్లడించారు. వేకువజామున 2 గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పించనున్నామన్నారు. 12 గంటల తర్వాత స్వామికి అభిషేకాలు, అలంకరణ, చందన అలంకరణ, ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ రెండు రోజుల పాటు స్వామివారి అంతరాలయ దర్శనం, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి, చిత్తూరు పీలేరు, మదనపల్లె, పలమనేరు, కుప్పం డిపోల నుంచి ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్య అన్నదానం ఉంటుందని వివరించారు. (క్లిక్ చేయండి: టోకెన్ ఉంటేనే వైకుంఠ ద్వార దర్శనం) -
నరసింహావతారంలో భద్రాద్రి రాముడు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు సోమవారం నాలుగో రోజుకు చేరాయి. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యస్వామి నరసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం బేడామండపంలో వేద పండితులు దివ్యప్రబంధనం పఠించాక, స్వామిని నరసింహావతారంలో ప్రత్యేకంగా అలంకరించి పల్లకీ సేవ నిర్వహిస్తూ మిథిలా స్టేడియంలోని వేదికపై కొలువు తీర్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాగా, అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య మంగళవారం వామనావతారంలో దర్శనమివ్వనున్నారు. -
27న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 6–10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహిస్తారు. ఆనందనిలయం, బంగారువాకిలి, శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. ఈ సమయంలో మూలవిరాట్టును వస్త్రంతో కప్పుతారు. శుద్ధి అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్య కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం భక్తులను సర్వ దర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా మంగళవారం బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. సోమవారం సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ తెలిపింది. శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ శ్రీవారిని ఆదివారం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఇందిరేష్, జస్టిస్ నరేంద్ర ప్రసాద్, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధాకిషన్ అగర్వాల్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాసరావు, బీఎస్ఎఫ్ డీజీ పంకజ్ కుమార్ సింగ్, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 24 గంటలు తిరుమలలో 14 క్యూ కంపార్ట్మెంట్లు నిండాయి.సర్వ దర్శన టోకెన్లు లేని వారికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు పడుతోంది. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో చాలా దుకాణాలు మూతపడ్డాయి. -
తిరుమల: 44 నిమిషాల్లోనే 2.20 లక్షల టికెట్లు ఖాళీ
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ప్రత్యేక ప్రవేశ, వైకుంఠ ద్వార దర్శన టికెట్లను శనివారం ఆన్లైన్లో విడుదల చేసింది. జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు 2 లక్షల 20వేల టిక్లెను అందుబాటులో ఉంచారు. టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే దర్శన టికెట్లను కొనుగోలు చేయాలని భక్తులకు సూచించింది. జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న ద్వాదశి పురష్కరించుకొని పది రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేశారు. 44 నిమిషాల్లోనే.. వైకుంఠ ద్వార దర్శన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో విడుదలైన 44 నిమిషాల్లోనే టికెట్లు అయిపోయాయి. 10 రోజులకు గానూ 2.20 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. చదవండి: (ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే మన టీకాల సత్తా ఎంత?) -
అదిగో భద్రాద్రి.. ఇదిగో యాదాద్రి
భద్రాచలం/యాదగిరిగుట్ట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో గురువారం వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛరణలు, ధూపదీపాల నడుమ జే గంటలు మార్మోగుతుండగా జగదభి రాముడు గరుడవాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్ వాహనంపై ఆసీనులై ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు. భద్రాద్రిలో ధూపదీపాల నడుమ ఉత్తర ద్వారం తెరుస్తున్న అర్చకులు, వేద పండితులు ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ శివాజీ తదితరులు పాల్గొన్నారు. కాగా, కోవిడ్ నిబంధనల కారణంగా భక్తులకు ప్రవేశం కల్పించకపోవడంతో పలువురు బారికేడ్ల ఆవలి నుంచే రామచంద్రస్వామి ని దర్శించుకున్నారు. ఇటు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోనూ గురువారం ముక్కోటి ఏకాదశి వేడుకలుఘనంగా జరిగాయి. బాలాలయంలో ఆచార్యులు సుప్రభాతం, ఆరాధన, బాలభోగం, తిరుప్పావై చేపట్టి అలంకార సేవలు ఏర్పాట్లు చేశారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు గరుడవాహనంపై బాలాలయంలోని తూర్పుద్వారం గుండా వైకుంఠ ద్వార దర్శనం ఇచ్చారు. పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో సైతం శ్రీస్వామివారిని ఉత్తర ద్వారం గుండా భక్తులకు వైకుంఠదర్శనం కల్పించారు. సాయంత్రం శ్రీస్వామిని విష్ణుమూర్తిగా అలంకరించి మత్సా్యవతారంలో సేవను ఊరేగించారు. వేడుకల్లో ఈవో గీతారెడ్డి, అను వంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి పాల్గొన్నారు. -
‘టిప్పు సుల్తాన్ పిలిస్తే పలికిన... రంగనాథుడు!’
సాక్షి, మద్దికెర (కర్నూలు): మండల పరిధిలోని పెరవలి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీరంగనాథుడు పిలిస్తే పలికే దేవుడిగా నిత్యం పూజలందు కుంటున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు ఒకరోజు మాత్రమే మహా విష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటా రు. అయితే పెరవలి శ్రీరంగనాథుడు సతీసమేతంగా 365 రోజులు ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భాగ్యం ఈ ఆలయ ప్రత్యేకత. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే వైకుంఠంలోని శ్రీమహావిష్ణువును దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందని ప్రతీతి. ఈ నెల 13 తేదీ గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం చేసుకోనున్నారు భక్తులు. అదేవిధంగా సాయంత్రం 5:30 గంటలకు గరుఢ వాహనంపై స్వామివారు శ్రీదేవి, భూదేవి సతీసమేతంగా గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ మల్లికార్జున, దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఆలయ చరిత్ర : స్వతహా వైకుంఠ ద్వారం కలిగిన ఈ ఆలయంలో రంగనాథస్వామి, శ్రీదేవి, భూదేవి సతీసమేతుడై పూజలందుకుంటూ నిత్యం ఉత్తరద్వార దర్శన మిస్తున్నారు. స్వామివారు ద్వాదశ అళ్వారులతో వెలిసిన వైష్ణవ క్షేత్రం. తపమాచరించిన రుషుల దర్శనార్థం శ్రీ మన్నారాయణుడే కపిల మహర్షి అవతారమెత్తి ఇచ్చట సాల గ్రామం ఇచ్చట ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తదుపరి విజయనగరరాజులు హరిహరరాయలు, బుక్కరాయలు క్రీ.శ. 1336–37 సంవత్సరంలో దేవాలయం నిర్మించడంతోపాటు ఆలయ నిర్వహణకు వెయ్యి ఎకరాల మాన్యం ఏర్పాటు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు : ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి ఏటా ఫల్గుణ శుద్ధ ద్వాదశి నుంచి బహుళ సప్తమి వరకు బ్రహోత్సవాలు జరుగుతాయి. కర్ణాటకలోని శ్రీరంగ పట్టణం రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్న టిప్పు సుల్తాన్ దండయాత్రలు చేసుకుంటూ ఒకరోజు ఇక్కడి వచ్చారని నానుడి. ఆలయాన్ని ధ్వంసం చేయబోయిన టిప్పు సుల్తాన్‌కు స్వామివారు శక్తిమంతుడని ప్రజలు చెప్పారట. ఈ మేరకు స్వామివారిని పరీక్షించేందుకు ఆయన శ్రీరంగనాథా అని పిలువగా ఓయ్ అంటూ పలికారని నానుడి. దీంతో టిప్పు సుల్తాన్ స్వామివారిని దర్శించుకుని తన అశ్వం ఎంతవరకు పరిగెడితే అంతవరకు స్వామివారికి భూమి ఇచ్చాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. -
Vaikuntha Ekadashi: ఉత్తర ద్వార దర్శనం లేదు
సాక్షి, నల్లకుంట (హైదరాబాద్): ఈ నెల 13న (గురువారం) ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ముక్కోటి ఏకాదశి రోజున న్యూ నల్లకుంటలోని సీతారామాంజనేయ సరస్వతీదేవి ఆలయంలో ఉత్తరద్వార దర్శనం ఉండదని ఆలయ ఈవో శ్రీధర్ తెలిపారు. స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు చేయించాలనుకునే భక్తులు ఆలయ గుమస్తా వద్ద టికెట్టు తీసుకుంటే వారు భక్తుల గోత్ర నామాలపై పూజలు నిర్వహిస్తారని ఈవో తెలిపారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆలయాల్లో తీర్థ, ప్రసాద వితరణ కూడా నిషేధమని చెప్పారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తులు కూర్చోవడానికి కూడా అనుమతి లేదని తెలిపారు. వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు భక్తులు సహకరించాలని సూచించారు. భక్తులకు అనుమతి లేదు.. జగద్గిరిగుట్ట: రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో జగద్గిరిగుట్టలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 13న వైకుంఠ ఏకాదశి, 14న గోదాదేవి కల్యాణం నేపథ్యంలో భక్తులకు దర్శనములు నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఆదేశానుసారం శాస్త్రోయుక్తంగా కేవలం వేద పండితులు, సిబ్బంది సమక్షంలో అంతరంగికంగా వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: కరోనా థర్డ్ వేవ్.. వైరస్ పడగలో వీఐపీలు -
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లకు బారులు
-
శ్రీవారి సన్నిధిలో రెండు రాష్ట్రాల మంత్రులు
సాక్షి, తిరుమల : వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవాలయాలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉత్తర ద్వారం (వైకుంఠ ద్వారం) గుండా శ్రీమన్నారాయణుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రముఖులు తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. వైకుంఠ ద్వారం గుండా వేల సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మరెంతో మంది భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారిలో.. తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత మాలోత్ ఉన్నారు. (చదవండి : నేడు తిరుమలలో వైకుంఠ ఏకాదశి) ఆంధ్రప్రదేశ్ మంత్రులు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవంతి శ్రీనివాస్, పుష్ప శ్రీవాణి, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్లు సుబ్బరామిరెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి, కనుమూరి బాపిరాజు, పుట్టా సుధాకర్ యాదవ్, ఏపీ సీఎస్ నీలం సాహ్ని, గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ ప్రముఖులు.. రాజేంద్ర ప్రసాద్, సునీల్, సుమలత, కమెడియన్ సప్తగిరి తిరుపతి వెంకన్న దర్శనం చేసుకున్నారు. కాగా, శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా రెండు రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే విషయంలో ఎలాంటి మార్పూ లేదని, అమల్లో ఉన్న సంప్రదాయాన్నే కొనసాగిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి.. అనంతరం అధ్యయనోత్సవాలు.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహ్మస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బాలాలయంలో వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారo) గుండా యాదగిరీశుడు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ఆశీస్సులు తీసుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో యాదాద్రికి చేరుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వైకుంఠద్వార దర్శనం అనంతరం యాదాద్రి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో యాదిగిరికి చేరుకున్నారు. నేటి నుంచి ఆరు రోజులపాటు అధ్యయనోత్సవాలు కొనసాగుతాయి. స్వర్ణాలంకార శోభిత గరుడ వాహనంపై స్వామివారు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం, సాయంత్రం ఆరు రోజులపాటు వివిధ అలంకరణల్లో స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారని ఆలయ అధికారులు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలో.. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని జిల్లాలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేవుని కడప వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించేకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. జిల్లాలోని వేంపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. జమ్మలమడుగు నారపుర వేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు. తూర్పుగోదావరిలో.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. జిల్లాలోని రాజమండ్రి వేణుగోపాలస్వామి ఆలయం తెల్లవారుజాము నుంచే భక్తులతో నిండిపోయింది. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని భక్తులు తరించారు. పిఠాపురం పంచ మాధవ దివ్య క్షేత్రం శ్రీకుంతీ మాధవ స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు. పశ్చిమగోదావరిలో.. జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళ్లకూరు వెంకటేశ్వరస్వామిని వైకుంఠ ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు. విశాఖలో.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచల అప్పన్న స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున్న చేరుకుంటున్నారు. సింహాద్రి నాథుని ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు. పాడేరు ఎమ్మెల్యే కొత్తగుల్లి భాగ్యలక్ష్మి స్వామివారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో అప్పన్న స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారని తెలిపారు. సూర్యాపేటలో.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ముఖ ద్వారంగా ఉన్న జిల్లాలోని మునగాల మండలం బరఖాత్ గూడెంలో శ్రీవెంకటస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీలక్ష్మీ నృసింహ స్వామిని వైకుంఠ ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు. నల్గొండలో.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా.. నార్కట్ పల్లి మండలం శ్రీ వారిజల వేణుగోపాల స్వామి వారి ఆలయం భక్తులు బారులు తీరారు. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి గుట్టపై భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకున్నారు.