చిన్న జీయర్‌కు తప్పిన పెద్ద ప్రమాదం.. వైరల్‌ వీడియో | A major tragedy was averted at Ashtalaxmi Temple | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 20 2018 12:18 PM | Last Updated on Thu, Dec 20 2018 12:57 PM

A major tragedy was averted at Ashtalaxmi Temple - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామికి పెద్ద ప్రమాదం తప్పింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా ఆయన బుధవారం దిల్‌సుక్‌నగర్‌ కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో పూజలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కట్టెల పందిరిపైకెక్కి ఆలయ శిఖరానికి ఆయన పూజలు నిర్వహిస్తుండగా..  బరువు తట్టుకోలేక ఆ పందిరి కొంతభాగం ఒక్కసారిగా కూలింది. దీంతో ఆయనతోపాటు ఉన్న ఇతర పూజారులు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యారు. పూజా సామాగ్రి, పళ్లాలు పైనుంచి పడిపోయాయి. అతికష్టం మీద ఈ ప్రమాదం నుంచి చిన్న జీయర్‌, ఇతర పూజారులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement