సాక్షి, తిరుమల: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) సందర్బంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు దేవాలయాలకు చేరుకున్నారు. తిరుమల(Tirumala), యాదాద్రి(Yadadri), భద్రాద్రి, ద్వారకా తిరుమలలో భక్తులు రద్దీ కిటకిటలాడుతున్నారు. మరోవైపు.. తిరుమలకు వీఐపీలు క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమలలో గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 4:30 గంటలకు దర్శనం ప్రారంభమైంది. మొదట వీఐపీలకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనానికి వీఐపీలు పొటెత్తారు.
శ్రీవారిని దర్శించుకున్న వారిలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, హోం మినిస్టర్ అనిత, మంత్రులు కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, సవిత, సంధ్యారాణి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ సీఎం రమేష్
తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి దామోదర రాజనర్సింహ, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి మల్లా రెడ్డి, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
సినీ నటులు బండ్ల గణేష్, రాజేంద్రప్రసాద్, సప్తగిరి,యోగా గురువు రాందేవ్ బాబా, చాముండేశ్వరి నాథ్, బ్యాడ్మింటన్ పుల్లెల గోపీచంద్ సహా పలువురు శ్రీవారిని దర్శించుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెంలో కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాముల వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు. ఉత్తర ద్వార దర్శనం తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.
ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్నను దర్శించుకుంటున్నారు భక్తులు. దర్శనం కోసం గోవింద స్వాములకు, గ్రామస్తులకు మరో ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనం, రూ.100, రూ.200, రూ.500 టికెట్లకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
#WATCH | Tirumala, Andhra Pradesh: Sri Venkateswara Temple decked up on the occasion of Vaikuntha Ekadashi Festival. pic.twitter.com/34yJSzq324
— ANI (@ANI) January 9, 2025
Comments
Please login to add a commentAdd a comment