Chinna jeeyar swami
-
పద్మభూషణులు.. హైదరాబాద్ నుంచి ఇద్దరికి పురస్కారాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా సిగలో పద్మాలు వికసించాయి. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా తొమ్మిది మందికి పద్మభూషణ్ అవార్డులు ప్రకటించగా.. వీరిలో ఇద్దరు ప్రముఖులు జిల్లాకు చెందిన వారే ఉండటం విశేషం. వీరిలో ఒకరు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీత్రిదండి చినజీయర్‌స్వామి కాగా.. మరొకరు ధ్యాన గురువు కమలేష్ డి. పటేల్(దాజీ). ఆధ్యాత్మిక, సేవాతత్పరుడు ఆధ్యాత్మిక రంగంతో పాటు విద్య, వైద్య, సామాజిక రంగాల్లోనూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చినజీయర్‌స్వామిని పద్మభూషణ్ వరించింది. ఏపీకి చెందిన ఆయన ఇరవై ఏళ్ల క్రితం శంషాబాద్ సమీపంలో శ్రీరామనగరం పేరుతో ఆశ్రమం ఏర్పాటు చేశారు. జీవా గురుకులం, నేత్ర విద్యాలయం, దివ్యసాకేతం వంటి సంస్థలను నెలకొల్పి ఆయా రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నారు. సమతా స్ఫూర్తి కేంద్రంలో 216 అడుగుల ఎత్తైన భారీ సమతా మూర్తి విగ్రహాన్ని నెలకొల్పారు. ఇందులో 108 దివ్య క్షేత్రాలను ఏర్పాటు చేశారు. వికాస తరంగిణి పేరుతో విపత్తుల సమయంలో బాధితులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేత్ర విద్యాలయంలో అంధ విద్యార్థులకు వసతి, చదువు, ఉపాధి అవకాశాలు కల్ఫిస్తున్నారు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లక్షలాది మంది భక్తులు, అభిమానులు ఉన్నారు. చినజీయర్‌కు అవార్డు రావడంపై ఆయన శిష్యులు హర్షం వ్యక్తం చేశారు. ధ్యానగురువు.. ప్రకృతి ప్రేమికుడు గుజరాత్‌కు చెందిన ప్రముఖ ధ్యాన గురువు కమలేశ్ డి. పటేల్‌ను పద్మభూషణ్ అవార్డు వరించింది. ధ్యానం ద్వారా ఆరోగ్యం, ఏకాగ్రతను సాధించాలనే సంకల్పంతో పదేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలానికి చేరుకున్నారు. సుమారు 1,400 ఎకరాల్లో కన్హా శాంతి వనం పేరుతో ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్‌ను నెలకొల్పారు. ఒకేసారి లక్ష మంది కూర్చుని ఏకాంతంగా ధ్యానం చేసే అవకాశం కల్పించారు. ఇక్కడ 160 దేశాలకు చెందిన సుమారు ఐదువేల మంది అభ్యాసికులు ఉన్నారు. ఒకప్పుడు ఎడారిలా ఉన్న ప్రాంతంలో లక్షలాది మొక్కలు నాటి.. పచ్చదనం పరిఢవిల్లేలా చేశారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న అనేక మందికి ధ్యానంతో నయం చేస్తున్నారు. 2025 నాటికి ఇక్కడ 30 బిలియన్ల మొక్కల నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా ఇక్కడ ఏటా వేలాది మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నారు. ధ్యాన గురువుగా ఆయన చేస్తున్న సేవలకు ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్నారు. ఈ క్రమంలో పద్మభూషణ్ రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 1978 గుజరాత్ వర్సిటీలో ఫార్మసీ కోర్సులో డిగ్రీ పూర్తి చేశారు. 1980లో అమెరికాలోని న్యూయార్క్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. కమలేశ్ పటేల్‌కు ఇద్దరు కుమారులు, ముగ్గురు మనవలు ఉన్నారు. చదవండి: ‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. మొత్తం 106 మందికి -
సమ్మక్క– సారలమ్మలను తూలనాడలేదు
తాడేపల్లిరూరల్: ‘‘సమ్మక్క–సారలమ్మ గ్రామ దేవతలేనని అన్నాం. వారిని చిన్నచూపు చూసినట్టు, తూలనాడినట్టు కొందరు ప్రచారం చేస్తున్నారు. అది పొరపాటు. నేను ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఆదివాసీ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలని ఆలోచించిన సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్లం. వారిని చిన్నచూపు చూసే ఆలోచన చేయబోం. కానీ కొందరు స్వార్థ ప్రయోజనాలతో నా వ్యాఖ్యలను వక్రీకరించి విమర్శలు చేస్తున్నారు. అమాయక ప్రజలను రెచ్చగొట్టడం సమాజానికి మంచిది కాదు..’’అని త్రిదండి చినజీయర్ స్వామి స్పష్టం చేశారు. ఆధ్యాత్మికతతో ఉన్నవారు వివాదాలకు తావు ఇవ్వరని, తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేసే వారి జ్ఞానానికే ఈ విషయాన్ని వదిలేస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఏపీలోని తాడేపల్లిలో ఉన్న సీతానగరం విజయకీలాద్రి పర్వతంపై చినజీయర్ స్వామి మీడియాతో మాట్లాడారు. ఆయా అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఈ మధ్య నాపై కొన్ని వివాదాలు వచ్చాయి. కొంతమంది దేవతలను చిన్నచూపు చూసినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏదైనా విన్నప్పుడు ఆ మాటల పూర్వాపరాలు చూడాలి. చిన్న వీడియో చూసి ఒక వ్యక్తి ఇలా అన్నాడని ప్రచారం చేయడం హాస్యాస్పదం. మేం ఆదివాసీ జనాలను ఏదో అన్నట్టుగా, కామెంట్ చేస్తున్నట్టుగా వినపడుతుంది. మేం అటువంటి కామెంట్ చేయం. సమాజ హితంపై కాంక్ష ఉన్నవారైతే.. వచ్చి ఏం జరిగిందనే విషయం తెలుసుకోవాలి, సరైన పద్ధతిలో స్పందించాలి. 20 ఏళ్లకు ముందు మాట్లాడిన వీడియో నుంచి దానిని తీశారు. ఆ రోజున మాట్లాడినప్పుడు సమ్మక్క–సారలమ్మ స్వర్గం నుంచి దిగివచ్చిన వారు కాదు, గ్రామ దేవతలేనని అన్నాం. వారు సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలను ఎదుర్కొని భక్తులచేత పూజలందుకుంటున్నారని చెప్పాం. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా వివాదం ఇప్పుడే తగ్గుతోంది. దీంతో ప్రచారం కోసం దీన్ని చర్చకు తీసుకువస్తున్నట్లు కనపడుతోంది. మాకు ఆస్తులేమీ ఉండవు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక మాకు వ్యక్తిగతఆస్తులేమీ ఉండవు. సేవా కార్యక్రమాలు చేసేప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలా మాంసం తినవద్దని చెప్పిన మాట వాస్తవమే. కొందరు దానిని వక్రీకరించి మాట్లాడటం బాధాకరం. సమాజానికి మంచి చేసేవారితో కలిసేందుకు మేం ఎప్పుడూ సిద్ధమే. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ అనేది మా నినాదం. ఆదివాసుల సంక్షేమానికి వికాస తరంగిణి సంస్థ ద్వారా సేవ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నాం.. మా జీయర్ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మహిళలు మంత్రోచ్ఛారణ చేయకూడదని చాలామంది అభిప్రాయం. కానీ మేం మహిళలను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నాం. జీయర్ ట్రస్ట్ ద్వారా వైద్య పరీక్షలు చేయించి.. మహిళలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తున్నాం. ఇందులో అన్ని మతాలు, కులాలకు చెందిన మహిళలు ఉన్నారు. మేం మెడికల్ క్యాంప్ పెట్టినపుడు సేవ చేయడానికి వచ్చే వైద్యులు కూడా అనేక వర్గాలకు చెందినవారు ఉంటారు. ఆదివాసులను విమర్శించాల్సిన అవసరం మాకు లేదు’’అని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అహోబిల స్వామి, మాజీ ఎంపీ, జీయర్ ట్రస్ట్ సభ్యుడు గోకరాజు గంగరాజు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. మా దగ్గర అందరూ సమానమే.. మేం రాజకీయాలకు దూరం. మా దగ్గర అందరూ సమానమే. రాజకీయాల్లోకి వెళ్లాలన్న కోరిక మాకు ఉండదు. ఎవరితోనూ గ్యాప్ అనేది ఉండదు. వివాదాలు ఉండవు. మేమెప్పుడూ దక్షతతో మంచి కార్యక్రమాలు చేస్తాం. ఎవరినీ మోసం చేయకుండా ఉంటాం. రాబట్టే ధైర్యంగా మాట్లాడగలుగుతాం. వారికి వీరికి దడుస్తూ ఏదో మూలన నక్కి మాట్లాడటం మా చర్రితలో ఎప్పుడూ లేదు. మేం సన్యాసులం.. మా పేరుతో బ్యాంకు ఖాతా కూడా ఉండదు. మేం ఎవరికీ భయపడబోం.. అలాగే ఎవరి వెంటా పడబోం. శుక్రవారం ఏపీలోని తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడుతున్న చినజీయర్ స్వామి. చిత్రంలో అహోబిలస్వామి, నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు -
ఆ స్ఫూర్తిని పంచడమే అసలైన నివాళి
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా/శంషాబాద్: ‘‘సమాజంలో నెలకొన్న వివక్ష, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా వెయ్యేళ్ల క్రితమే విప్లవానికి నాంది పలి కిన గొప్ప గురువు రామానుజాచార్యులు. ఆయన స్ఫూర్తిని చాటేందుకు సమతామూర్తి కేంద్రం దోహ దం చేస్తుంది. పెద్ద పెద్ద వాళ్లందరూ ఇక్కడికి రావ డంలో ముఖ్యోద్దే్దశం రామానుజుల స్ఫూర్తిని పొంద డం, పంచడం కోసమే. ఈ స్ఫూర్తిని సమాజానికి చేరువ చేయడమే రామానుజులకు అందించే నిజ మైన నివాళి’’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సందర్శకులను మంత్రముగ్ధుల ను చేస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న సమతా మూర్తి ప్రపంచపు 8వ వింత అని కొనియాడారు. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్స వాల్లో ఆయన శనివారం పాల్గొన్నారు. సేవ చేయ డమే అత్యున్నత ఆధ్యాత్మిక కార్యక్రమమని, కుల మతాలకు అతీతంగా మానవత్వమే ప్రధానంగా సేవ చేయాలని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రస్తుతం కొన్నివర్గాలు రాజకీయ, వ్యక్తిగత ప్రయో జనాల కోసం కుల, వర్గ వైషమ్యాలను ప్రోత్సహి స్తున్న తరుణంలో రామానుజుల బోధనలు మనకు ప్రేరణ కలిగించాల్సి ఉందని.. అందుకు సమతా మూర్తి కేంద్రం దోహదం చేస్తుందని చెప్పారు. తెలుగువారి గొప్పదనాన్ని, తెలుగు భాషా సంస్కృ తులను ముందు తరాలకు తెలియజేసేలా ఏదైనా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా చినజీయర్ స్వామిని కోరారు. కాగా.. రామానుజు లు ఏది బోధించారో, దాన్ని ఆచరించారని అందుకే గొప్ప గురువు అయ్యారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. శ్రీరామనగరం ఆధ్యాత్మిక కేంద్రం గా, ఒక స్ఫూర్తి కేంద్రంగా, తెలంగాణకు శోభాయ మానంగా నిలబడుతుందని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. పరమేష్టి, వైభవేష్టి హోమాలు.. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం 11వ రోజైన శనివారం ఉదయం అష్టాక్షరి మహామంత్ర జపంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తర్వాత ఇష్టిశాలలో పరమేష్టి, వైభవేష్టి హోమాలు నిర్వహించారు. మధ్యాహ్నం ప్రవచన మండపంలో గోపాలోపాయనం కార్యక్రమాన్ని నిర్వహించారు. జీయర్‌స్వామి గురువైన గోపాలాచార్యుల పేరిట ఇచ్చే గోపాలోపాయన పురస్కరాన్ని తమిళనాడుకు చెందిన మాడభూషి వరదరాజన్‌కు అందజేశారు. సమతామూర్తిని దర్శించుకున్న ప్రముఖులు శనివారం ఉదయం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు, శాంతా బయోటెక్ ఎండీ వరప్రసాదరెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్ పాల్గొన్నారు. సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని, భార్య లక్ష్మీప్రణతి కూడా సమతామూర్తి, దివ్యదేశాలను సందర్శించారు. రేపటి నుంచి సువర్ణమూర్తి దర్శనం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రం శ్రీరామానుజాచార్యుల సువర్ణ మూర్తిని లోకార్పణ చేయనుండటంతో.. సోమవారం నుంచి భక్తులందరినీ దర్శనానికి అనుమతించనున్నారు. జనసంద్రంగా శ్రీరామనగరం రెండో శనివారం సెలవుదినం, దానికి భీష్మ ఏకాదశి తోడు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీరామనగరానికి పోటెత్తారు. దీనితో ప్రధాన విగ్రహం సహా యాగశాలకు వెళ్లే మార్గాలు కిక్కిరిసి పోయాయి. రాత్రి వరకు కూడా భక్తుల రాక కొనసాగింది. ఒక్కరోజే రెండు లక్షల మంది వరకు వచ్చినట్టు అంచనా వేశారు. ఈ ప్రాంతం పునీతం: చిరంజీవి భీష్మ ఏకాదశి రోజున సమతామూర్తిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని సినీ నటుడు చిరంజీవి అన్నారు. శ్రీరామనగరాన్ని వీక్షించాక ఇది ఎంత అద్భుతమో తెలిసిందని, కేవలం ఆరేళ్లలో ఈ దివ్య సంకేతాన్ని నిర్మించడం అమోఘమని కొనియాడారు. చినజీయర్ స్వామి సారథ్యంలో జూపల్లి రామేశ్వరరావు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని చెప్పారు. వెయ్యేళ్ల క్రితం రామానుజులు సర్వమానవ సమానత్వం గురించి ప్రపంచానికి బోధించారని తెలిపారు. సమతామూర్తి దివ్యక్షేత్రం కొన్ని వేల ఏళ్లపాటు వర్ధిల్లుతుందన్నారు. మహారాజులు, చక్రవర్తులే ఇంత పెద్ద ఆలయాలు, విగ్రహాలు నిర్మించగలరని అనుకున్నామని.. సంకల్పం ఉంటే మనమూ సాధ్యం చేయగలమని ఇది నిరూపించిందని చిరంజీవి పేర్కొన్నారు. -
ప్రధాని మోదీకి చినజీయర్ స్వామి ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా.. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని ప్రధాని మోదీని త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వానించారు. శనివారం ఆయనతోపాటు మైహోం గ్రూపు చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నామని, అందులో పాల్గొని 216 అడుగుల భగవద్ రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరారు. భేటీ అనంతరం వివరాలతో ప్రకటన విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న రామానుజుల మహావిగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారని అందులో తెలిపారు. ‘‘శ్రీరామానుజుల దివ్యత్వం ప్రధానికి తెలుసు. ఆయన 70వ స్వాతంత్య్ర వేడుకల్లో ఎర్రకోట బురుజు నుంచి రామానుజుల వైభవాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సంరంభానికి రావాలని, 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించాలని చినజీయర్ స్వామి ఆహ్వానించగా.. ప్రధాని మోదీ అంగీకరించారు. ప్రపంచానికి సమతా సందేశాన్ని అందించే లక్ష్యంతో రామానుజుల మహా విగ్రహాన్ని రూపొందించడం అభినందనీయమంటూ..చినజీయర్ స్వామి సంకల్పాన్ని కొనియాడారు’’ అని వెల్లడించారు. పెద్దలందరికీ ఆహ్వానం ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, కిషన్‌రెడ్డి, నితిన్ గడ్కరీ ఇతర కేంద్రమంత్రులు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లను చినజీయర్ స్వామి స్వయంగా కలిసి మహోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. 1,035 హోమగుండాలతో ప్రత్యేక యాగం ముచ్చింతల్‌లోని దివ్య సాకేతంలో 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరగబోయే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1,035 హోమగుండాలతో ఈ యాగం చేస్తారు. 2 లక్షల కిలోల ఆవునెయ్యితోపాటు ఇతర హోమ ద్రవ్యాలను వినియోగించనున్నారు. చదవండి: 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు చూసి -
‘కొండ’ గుడిలో చండీయాగం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా చెబుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలో అత్యంత ఎత్తుకు గోదావరి జలాలను తరలించే ప్రక్రియను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 29న ప్రారంభిస్తారు. గజ్వేల్ ప్రాంత సాగు, తాగునీటి అవసరాలు తీర్చేలా డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు ప్రారంభ ఏర్పాట్లను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 29న చండీయాగం, సుదర్శన యాగం, గంగమ్మ పూజలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ► 29న ఉదయం 4 గంటలకు ఏకకాలంలో కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం, కొండపోచమ్మసాగర్ పంపుహౌస్ (మర్కూక్) వద్ద సుదర్శన యాగం ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రాజెక్టుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొని, తీర్థ ప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకుంటారు. ► పూజల అనంతరం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. తిరిగి ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి, మర్కూక్‌లో నిర్మించే రైతు వేదికలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ► మర్కూక్‌లోని కొండపోచమ్మసాగర్ పం ప్హౌస్కు చేరుకుని చినజీయర్ స్వామికి స్వాగతం పలికి, సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. ► 11.30 గంటల ప్రాంతంలో పంప్‌హౌస్ స్విచ్చాన్ చేసిన తర్వాత ప్రాజెక్టు డిశ్చార్జి కెనాల్ (నీరు చేరుకునే ప్రాంతం) వద్దకు వచ్చి గోదావరి జలాలకు స్వాగతం పలికి గంగమ్మ పూజలు నిర్వహిస్తారు. పరిమిత సంఖ్యలో ఆహ్వానితులకు మర్కూక్‌లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ‘కొండపోచమ్మ’గా నామకరణం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి నదిపై లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) నుంచి వివిధ దశల ఎత్తిపోతల (లిఫ్టుల) ద్వారా తరలించే నీటిని 618 మీటర్ల ఎత్తునున్న కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌కు తరలిస్తారు. 15 టీఎంసీల నీటి నిల్వ సామ ర్థ్యమున్న కొండపోచమ్మసాగర్ రిజర్వాయ ర్ నుంచి గ్రావిటీ ద్వారా సాగునీరందుతుంది. ఈ ప్రాజెక్టుకు ‘కొండపోచమ్మ’పేరు పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. ఉమ్మడి మెదక్, వరంగల్, నల్లగొండ జిల్లాల సరిహద్దులో కొండపోచమ్మ దేవాల యం ఉంది. దాని సమీపంలోనే కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయం (మల్లన్న గుడి) ఉంది. రెండు దేవాలయాలకు ఎంతో ప్రశస్తి ఉండటంతో నిత్యం భక్తులతో కళకళలాడుతుంటాయి. ఒక గుడికి వచ్చిన భక్తులు మరో గుడికి వెళ్లే సంప్రదాయం ఉంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించే అతిపెద్ద రిజర్వాయర్‌కు మల్లన్నసాగర్ అని, అత్యధిక ఎత్తులో నిర్మించే రిజర్వాయర్‌కు కొండపోచమ్మసాగర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ నామకరణం చేశారు. ఏర్పాట్లను పరిశీలించిన హరీశ్‌రావు సీఎం రాకను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం సాయంత్రం కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ వద్ద మంత్రి హరీశ్‌రావు.. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, సీపీ జోయల్ డేవిస్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు మంత్రి పలుసూచనలు చేశారు. చండీయాగం ఏర్పాట్లను ప్రముఖ వాస్తు ప్లానర్ సుద్ధాల సుధాకర్‌తేజ పరిశీలించారు. చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న సీఎం ‘కొండపోచమ్మ’ప్రారంభానికి రావాలని చినజీయర్‌స్వామికి ఆహ్వానం ముఖ్యమంత్రి బుధవారం రాత్రి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిని దర్శించుకున్నారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలోని దివ్య సాకేతాలయం ఆశ్రమంలో జీయర్‌స్వామిని కేసీఆర్ కలసి ఆశీర్వాదం అందుకున్నారు. ఈ నెల 29న కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి రావాలని జీయర్‌స్వామిని ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జీయర్‌స్వామి మంగళశాసనాలు, ప్రత్యేక కానుకను సీఎంకు అందజేశారు. ఆశ్రమం వద్ద మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్రావు.. కేసీఆర్‌కు స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్‌కుమార్ ఉన్నారు. సీఎం కేసీఆర్‌తో ముచ్చటిస్తున్న చినజీయర్‌స్వామి. చిత్రంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, మైహోం గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వర్రావు -
చినజీయర్ స్వామిని కలిసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
-
చినజీయర్ స్వామిని కలిసిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామిని కలిశారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. చినజీయర్ స్వామి దివ్య ఆశీస్సులు తీసుకుని, కాసేపు మాట్లాడారు. గతంలో కూడా చినజీయర్ స్వామిని వైఎస్ జగన్ కలిశారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
చిన్న జీయర్‌కు తప్పిన పెద్ద ప్రమాదం.. వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామికి పెద్ద ప్రమాదం తప్పింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా ఆయన బుధవారం దిల్‌సుక్‌నగర్ కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో పూజలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కట్టెల పందిరిపైకెక్కి ఆలయ శిఖరానికి ఆయన పూజలు నిర్వహిస్తుండగా.. బరువు తట్టుకోలేక ఆ పందిరి కొంతభాగం ఒక్కసారిగా కూలింది. దీంతో ఆయనతోపాటు ఉన్న ఇతర పూజారులు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యారు. పూజా సామాగ్రి, పళ్లాలు పైనుంచి పడిపోయాయి. అతికష్టం మీద ఈ ప్రమాదం నుంచి చిన్న జీయర్, ఇతర పూజారులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
చిన్న జీయర్‌కు తప్పిన ప్రమాదం
-
రైతు.. దేవుడితో సమానం
► త్రిదండి చినజీయర్‌స్వామి సాక్షి, హైదరాబాద్: రైతు.. దేవుడితో సమానమని, రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతృప్తిగా ఉంటుందని త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం ప్రారంభమైన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎకరాకు రూ.4 వేలు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ప్రశంసించారు. తక్కువ రసాయనాలతో పంటలు పండించే విధానాలపై రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరముందని పేర్కొన్నారు. రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, హైబ్రిడైజేషన్ వల్ల భూమి సమతుల్యత దెబ్బతింటుందని చెప్పారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడంపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. -
216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం
ఢిల్లీ: ప్రముఖ తత్వవేత్త రామానుజాచార్యులు 1000వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతున్నామని త్రిదండి చినజియర్‌స్వామి తెలిపారు. ఇందుకోసం శంషాబాద్‌లో సమతాముక్తి స్పూర్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 216 అడుగుల రామానుజాచార్యుల పంచలోహ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన చినజియర్ స్వామి.. రామానుజాచార్యుల విగ్రహం గురించి వివరించారు. ఈ సందర్భంగా మోదీది ఆదర్శ పాలన అని చినజియర్ స్వామి కితాబిచ్చారు. విదేశాల్లో భారత జెండాను మోదీ రెపరెపలాడిస్తున్నారని, నాడు భారత ప్రజలమని చెప్పుకోవడానికి ఇష్టపడని వారు నేడు భారత ప్రజలమని చెప్పుకుంటున్నారని చినజియర్ స్వామి మోదీ పాలనను కొనియాడారు. -
చిన్న జీయర్ స్వామి రాయని డైరీ
జై శ్రీమన్నారాయణ! చన్నీటి స్నానం చేస్తున్నప్పుడు రోజూ తెల్లవారుజామునే పొగ మంచులో శ్రీమహావిష్ణువు దర్శనం అయ్యేది. ఇవాళ కాలేదు! చలి తగ్గిందా? మంచు తగ్గిందా? మనసులో సంకల్పం తగ్గిందా? ‘కాన్సన్ట్రేట్ చెయ్యలేకపోతున్నాం స్వామీజీ’ అంటూ మఠానికి వస్తుంటారు పిల్లలు. చదువు మీద ధ్యాస కుదరడం లేదని వారి బాధ. ఎలా కుదురుతుంది? వాళ్లేం గురుకులంలో ఉండడం లేదు కదా. వాళ్లేం ఆకులు అలములు తినడం లేదు కదా. వాళ్లేం ప్రకృతి ఆలపించే సంగీతాన్ని వింటూ పెరగడం లేదు కదా. అపార్ట్మెంట్లలో ఒక్క సూర్యకిరణమైనా ఉదయించడానికి దారి ఉంటోందా? తినేందుకు పీజా బర్గర్, వినేందుకు జస్టిన్ బీబర్ తప్ప ఈ తరానికి భూమ్మీద వేరే ఇంట్రెస్టులు ఏవైనా ఉన్నాయా? అక్షరం ఎలా సాక్షాత్కరిస్తుంది మరి?! పెద్దవాళ్లకూ జీవితం మీద ఏవో కంప్లైంట్లు. ‘స్వామీజీ ఈ కొత్త సంవత్సరమైనా దశ తిరుగుతుందా?’ అని ఆశగా అడుగుతుంటారు. లైఫ్‌లో ఉన్నది మొత్తం ఒక్క దక్షిణాయనం, ఒక్క ధనుర్మాసమే అయితే చెప్పొచ్చు.. బతుకులో సంక్రమణం సిద్ధిస్తుంది అని, ఇవిఇవి ఆచరిస్తే ఇవిఇవి సంప్రాప్తిస్తాయి అని. కానీ ఎన్నో రుతువులు, ఎన్నో జీవన క్రతువులు! కొత్త అనగానే ఏదో ఆశ.. అర్ధరాత్రి పన్నెండు దాటిన మరుక్షణం గ్రహగతులు మారబోతున్నాయని! ఆశ మంచిదే. కానీ కాలచక్రంలో ఏదీ కొత్త కాదు. ఏదీ పాత కాదు. మనం ఎప్పుడైతే మొదలు పెట్టామో అదే కొత్త సంవత్సరం. మనం ఎక్కడైతే వదిలేశామో అదే గతించిన సంవత్సరం. మనిషి భ్రమణ పరిభ్రమణాలే కాలచక్రంలోని పరిణామాలు. అంటే చక్రం తిప్పుతున్నదీ, చక్రంలా తిరుగుతున్నదీ మనిషే! ‘స్వామీజీ.. ఈ చలి, మంచు, వేడి, వాన, గాలి మిమ్మల్నీ బాధిస్తాయా?’ - ఇంకో ప్రశ్న. ఎందుకు బాధించవు? స్వామీజీకి, మామూలు హ్యూమన్జీకి తేడా ఉంటుందని ఎందుకు అనుకోవాలి? స్వామీజీ లైఫ్‌లోనూ ఆందోళన ఉంటుంది. అలజడి ఉంటుంది. అశాంతి ఉంటుంది. రేవంత్‌రెడ్డీ ఉంటాడు. కేసీఆర్‌ని జాతిపిత అంటే రేవంత్‌రెడ్డికి కోపం వస్తుంది. ఆ కోపాన్ని శాంతియుతంగా తిప్పికొట్టాలంటే ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చున్నా కూడా రేవంత్‌రెడ్డి అక్కడికీ వచ్చేస్తాడు. ధ్యానం మాని రాజకీయాల్లోకి రమ్మంటాడు! సేవ చేయడానికి రాజకీయ పీఠాలే కావాలా? కొన్నింటిని మనసులోకి రానీయకూడదు. దేహం బయటే వదిలేయాలి. కొందరు విసిరిన మాటల్లోకి మనం చొరబడకూడదు. మౌనంతోనే సమాధానం చెప్పాలి. అప్పుడు సంకల్ప భగ్నం జరగదు. భగ్నం అయిందీ అంటే మనం చూడాలనుకున్నదాన్ని చూడలేం. చేయాలనుకున్నదాన్ని చేయలేం. ఆఖరికి ఆ శ్రీమన్నారాయణుడి దర్శనభాగ్యం కలుగుతున్నా గుర్తించలేక.. చేతులతో దిక్కులను తడుముకుంటూ ఉండిపోతాం. అప్పుడు మామూలు స్నానం ఒక్కటే సరిపోదు. మనసుకూ స్నానం చేయించాలి. - మాధవ్ శింగరాజు