216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం | chinna jeeyar swami meet pm narendra modi about ramanuja 1000 birth anniversary | Sakshi
Sakshi News home page

216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం

Published Sun, Jul 17 2016 5:33 PM | Last Updated on Wed, Aug 15 2018 6:22 PM

216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం - Sakshi

216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం

ఢిల్లీ: ప్రముఖ తత్వవేత్త రామానుజాచార్యులు 1000వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతున్నామని త్రిదండి చినజియర్స్వామి తెలిపారు. ఇందుకోసం శంషాబాద్లో సమతాముక్తి స్పూర్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 216 అడుగుల రామానుజాచార్యుల పంచలోహ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన చినజియర్ స్వామి.. రామానుజాచార్యుల విగ్రహం గురించి వివరించారు.

ఈ సందర్భంగా మోదీది ఆదర్శ పాలన అని చినజియర్ స్వామి కితాబిచ్చారు. విదేశాల్లో భారత జెండాను మోదీ రెపరెపలాడిస్తున్నారని, నాడు భారత ప్రజలమని చెప్పుకోవడానికి ఇష్టపడని వారు నేడు భారత ప్రజలమని చెప్పుకుంటున్నారని చినజియర్ స్వామి మోదీ పాలనను కొనియాడారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement